soujanya
-
మార్కులు కొట్టి... ‘మార్కెట్’ పట్టి...
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అనుకోకుండా లభించిన అవకాశాన్ని ఓ మహిళ సద్వినియోగం చేసుకున్నారు. అడిగిన ప్రశ్నలకు మెప్పించేలా సమాధానం ఇచ్చారు. ఏకంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకున్నారు. మార్కెట్ కమిటీ పదవికి ప్రశ్నలేంటి? జవాబులేంటి? చైర్ పర్సన్‌ను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది కదా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయా? అలాంటి సందేహాలు నిజమే..అలాగే ప్రశ్నలకు సరైన జవాబులివ్వడం ద్వారా చైర్ పర్సన్ పదవికి ఎంపికైంది కూడా వాస్తవమే. కామారెడ్డి జిల్లాలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఈ వినూత్న ప్రయోగం చేశారు. మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎంపికకు మౌఖిక పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఎక్కువ మార్కులు వచ్చిన యువతిని పదవికి ఎంపిక చేశారు. ప్రశ్నపత్రం రూపొందించి.. పరీక్ష నిర్వహించి.. సాధారణంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేరు ను అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యేనో లేదా ఆ పార్టీ ముఖ్య నాయకులో ప్రభుత్వానికి ప్రతిపాదించి నామినేట్ చేయిస్తారు. కానీ లక్ష్మీకాంతారావు ఇందుకు భిన్నంగా ఈ పదవికి మౌఖిక పరీక్ష నిర్వహిస్తామని, అందులో ఎక్కువ మార్కులు సాధించిన వారినే చైర్మన్‌గా నియమిస్తామని ప్రకటించారు. దీనికి మార్కెట్ కమిటీ పరిధిలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ మండలాల నాయకులు కూడా సరే అన్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన ఈ పదవికి నిర్వహించిన మౌఖిక పరీక్షకు స్థానిక నేతల కుటుంబాలకు చెందిన 15 మంది మహిళలు సిద్ధమయ్యారు. దీంతో ఎమ్మెల్యే స్థానిక పార్టీ నేతలతో కలిసి ఓ ప్రశ్నపత్రం రూపొందించారు. మార్కెట్ కమిటీల విధులు, బాధ్యతలు, అభివృద్ధికి సంబంధించిన 15 ప్రశ్నలను పొందుపరిచారు. సెప్టెంబర్ 29న నిర్వహించిన ఈ పరీక్షకు ఆ 15 మందీ హాజరయ్యారు. వీరిలో జుక్కల్ మండలం పెద్ద ఎడ్గి గ్రామానికి చెందిన అయిల్వార్ సౌజన్య అత్యధిక మార్కులు సాధించారు. దీంతో ఆమె పేరును ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వానికి పంపించారు. ఆ మేరకు ప్రభుత్వం తాజాగా సౌజన్యను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 ప్రశ్నలకు 12 సరైన జవాబులిచ్చిన సౌజన్య సౌజన్య ఎంఎస్సీ బీఈడీ చదివారు. పరీక్షలో 15 ప్రశ్నలకు గాను 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ పరీక్షకు ఆయా మండలాలకు చెందిన పూజా సందే, నమేవార్ పద్మ, జి.పార్వతి, వాగ్మారే ప్రియాంక, నమేవార్ అనిత, వాగ్మారే సోని, సంగీత తుకారాం, గైక్వాడ్ రాజాబాయి, కర్మల్కార్ సంగీత, అర్పిత అంజనీకర్, ఎడికే రాంబాయితో పాటు మరో ముగ్గురు హాజరయ్యారని సమాచారం. కాగా రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును, చైర్ పర్సన్‌గా నియమితులైన అయిల్వార్ సౌజన్యను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, నాయకులు మంత్రిని కలిశారు. ప్రతి ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రయతి్నస్తే రైతులకు మరింత మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం: సీఎం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్‌గా సౌజన్య ఎంపిక కావడంపై సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయం.. పదవుల ఎంపికలో నయా దృక్పథం..ప్రజా పాలనకు తిరుగులేని సాక్ష్యం..ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మన ఆడబిడ్డ సౌజన్య మద్నూర్ మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయం. తొలిసారిగా ఇంటర్వ్యూ పద్ధతిలో, ప్రతిభకు ప్రాధాన్యం ఇస్తూ, మహిళల చదువుకు.. ఆత్మస్థైర్యానికి ప్రోత్సాహమిచ్చేలా జరిగిన ఈ ఎంపిక రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టించింది..’అని సీఎం పేర్కొన్నారు. పారదర్శక విధానంలో ఈ పదవికి సౌజన్యను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, సహచర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు. -
భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త..
కరీంనగర్: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై సిరిసిల్లలో కేసు నమోదైంది. సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన దండబోయిన సౌజన్యకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠల్‌నగర్‌కు చెందిన దండబోయిన శ్రీకాంత్‌తో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి జరిగిన పదిహేను రోజునుంచి రూ.5లక్షలు అదనపు ఇవ్వాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. లేకుంటే చంపుతానని బెదిరించారు. ఈ క్రమంలో కిరోసిన్ పోసే ప్రయత్నం చేశాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, శ్రీకాంత్‌ను రిమాండ్ చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. ఇవి చదవండి: షాక్ కొట్టిన కంచె! యువకుడికి.. -
ఒక్క పాట తో కోటి సినిమాలో ఛాన్స్
-
‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ పై బాలీవుడ్ మ్యూజిక్ ఐకాన్స్ ప్రశంసలు
ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్ అవుతోన్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’కు విశేష ఆదరణ లభిస్తోంది. షో లో ప్రస్తుతం ఉన్న టాప్ 11 కంటెస్టెంట్స్ తమ మధురగానంతో ప్రేక్షకుల మదిని దోచుకుంటున్నారు. సామన్య ప్రేక్షుకులే కాక ఎంతో మంది సినీ సంగీత ప్రముఖులు వీరి గానానికి మంత్రముగ్ధులవుతున్నారు. పోటీలో భాగంగా నిర్వహించిన గాలా విత్ బాలా ఎపిసోడ్ లో సౌజన్య భాగవతుల అనే కంటెస్టెంట్ ఆలపించిన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలోని 'ఎంకిమీడ నా జతవిడి...' మంచి స్పందన లభించింది. ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఈ పాట విని.. దీని ఒరిజినల్ వెర్షన్ పాడిన శ్రేయా ఘోషల్‌కు ఇది వినిపిస్తానని మాట ఇచ్చారు. తాజాగా ఈ సాంగ్ చూసిన శ్రేయా ఓ వీడియోను పంపించారు. దీన్ని స్టేజిపై తమన్ చూపించి సౌజన్యకు సర్ప్రైజ్ ఇచ్చారు. సాంగ్ విన్న ప్రముఖ నేపధ్య గాయని శ్రేయాఘోషల్ సంతోషం వ్యక్తం చేశారు. సౌజన్య గాత్రం అత్యంత మధురంగా ఉందంటూ కితాబిచ్చారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సంగీతకారులు విశాల్ దద్లాని మరియు హిమేష్ రేషిమియా షో కు వస్తున్న ఆదరణను ప్రశంసించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం ప్రతి శక్ర, శని వారాల్లో రెండు ఎపిసోడ్లుగా రాత్రి 7 గంటల నుంచి ఆహాలో ప్రసారం అవుతుంది. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
రవీంద్రభారతి : దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సౌజన్య నృత్యరూపకం (ఫొటోలు)
-
ITF Tennis Tourney: క్వార్టర్స్‌లో రష్మిక, సౌజన్య
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–2, 6–1తో ప్రతిభ (భారత్)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణకే చెందిన టోర్నీ నాలుగో సీడ్ యడ్లపలిప్రాంజల, సౌజన్య బవిశెట్టి... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రాచపూడి ప్రత్యూష క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రాంజల 6–3, 6–3తో యువరాణి బెనర్జీ (భారత్)పై, సౌజన్య 6–2, 6–2తో సోహా సాదిఖ్ (భారత్)పై, ప్రత్యూష 2–6, 6–2, 6–4తో జగ్మీత్ కౌర్ (భారత్)పై గెలిచారు. అయితే మరో తెలంగాణ ప్లేయర్ సామ సాత్వికకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 4–6, 6–2, 2–6తో క్వాలిఫయర్ ఆకాంక్ష దిలీప్ (భారత్) చేతిలో ఓడింది. -
నటి సౌజన్యది ఆత్మహత్యే.. పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Kannada Tv Actress Soujanya Death By Suicide: నటి సౌజన్యది ఆత్మహత్యగా వైద్యుల నివేదికలో వెల్లడైంది. గతనెల 30న ఆమె అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించింది. దీంతో ఆమె తండ్రి తన కుమార్తెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె స్నేహితుడు వివేక్‌ను విచారించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తేలడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. చదవండి: కన్నడ హాస్యనటుడు మృతి.. ప్రముఖుల సంతాపం -
యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్‌పై ఆరోపణలు
శివాజీనగర్ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్‌లపై కుంబళగోడు పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువనటి ఆత్మహత్య -
చిత్రసీమలో మరో విషాదం.. యువనటి ఆత్మహత్య
Soujanya Kannada Actress Death: చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ టీవీ సీరియల్ నటి సౌజన్య(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటి సౌజన్య బెంగుళూరులోని కుంబల్‌గోడులో తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె రూమ్‌లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. అందులో తన ఆత్మహత్యకు తానే మాత్రమే కారణమని పేర్కొంది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి క్షమాపణ కూడా కోరారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాని నోట్లో పేర్కొంది. సౌజన్య కొన్ని టెలివిజన్ సీరియల్స్‌తోపాటు పలు సినిమాలలో కూడా నటించారు. 25 ఏళ్ల సౌజన్య మరణ వార్త విని ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సౌజన్య మృతిపట్ల పలువురు టీవీ, సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. -
పెళ్లిలో చిరు నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ డైరెక్టర్ని గుర్తు పట్టారా?
పై ఫోటోలో పెళ్లి కూతురు పక్కన కూర్చొని చిరు నవ్వులు చిందిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీని గుర్తుపట్టారా? అబ్బే.. చాలా కష్టమండి అంటారా? సరే అయితే మీ మీకోసం ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. టాలీవుడ్లో ఆయనో స్టార్ డైరెక్టర్. మాటల మాంత్రికుడు. తేలికైన పదాలతో, చాలా అర్థవంతమైన సంభాషణలు చెప్పడం ఆయన స్పెషాలిటీ. గుర్తొచ్చిందా? డౌట్ పడకండి.. మీరనుకున్నట్లుగా ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసే. ఈ ఫోటోలో త్రివిక్రమ్ కొంచెం బొద్దుగా ఉండటంతో వెంటనే గుర్తు పట్టడం కష్టమే. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ మీకు త్రివిక్రమ్ పెళ్లి స్టోరీ తెలుసా? ఆయన పెళ్లి కూడా సినిమా మాదిరే జరిగింది. అక్కని చూడడానికి వెళ్లి చెల్లిని పెళ్లి చేసుకొని వచ్చాడు మన మాటల మాంత్రికుడు. ప్రముఖ గేయరచయిత సిరివెన్నల సీతారామశాస్త్రి సోదరుడి కూతురే సౌజన్య. మొదట సౌజన్య అక్కని చూడడానికి వెళ్లాడట త్రివిక్రమ్. అయితే అక్కడ అక్క పక్కన ఉన్న సౌజన్యని చూసి తొలి చూపుకే ప్రేమలో పడిపోయాడట. వెంటనే తన మనసులోని మాటను సౌజన్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. అయితే సౌజన్య అక్క పెళ్లి అయిన తరువాత మీ పెళ్లి చేస్తామని వారి తల్లిదండ్రులు కండిషన్ పెట్టారట. దీనికి త్రివిక్రమ్ ఒప్పుకొని ఆమె పెళ్లయిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేశ్‌బాబుతో ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్ధరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ సాధించగా.. రాబోయే సినిమాపై ఇప్పటి నుంచే అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. చదవండి: మీనాక్షి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా? మా మధ్య చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి! -
ఫైనల్లో సౌజన్య జంట
న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సౌజన్య బవిశెట్టి డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సౌజన్య–ప్రార్థన తొంబారే (భారత్) జోడీ 7–6 (9/7), 3–6, 10–8తో యువరాణి బెనర్జీ–వైదేహి చౌదరీ (భారత్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో పియా లవ్రిచ్ (స్లొవేనియా)–అడ్రియెన్ నాగీ (హంగేరి)లతో సౌజన్య–ప్రార్థన తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. హుమేరా 4–6, 6–4, 3–6తో జీల్ దేశాయ్ (భారత్) చేతిలో ఓడిపోయింది. -
ఆన్లైన్ సరిగమలు
జూబ్లీహిల్స్: ఆమెకు సంగీతమంటే ప్రాణం. ఐదేళ్ల వయసులోనే సరిగమలు నేర్చుకోండం ప్రారంభించి సింగీంలో డిప్లొమా చేశారు. మరోపక్క బదుకుదెరువు కోసం ఇంజినీరింగ్ చదివారు. అయితే, మనసు మాత్రం సంగీతమే ప్రపంచమని చెప్పడంతో అటువైపుఅడుగులు వేశారు. ఆమె ‘మునుకుట్ల సౌజన్య’. ఈమె చదివింది ఇంజినీరింగ్ అయినా అటువైపు వెళ్లకుండా తిరుపతి పద్మావతి మహిళా విశ్యవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. శాస్త్రీయ సంగీతమే ప్రాణంగా భావిస్తూ ఆన్లైన్ వేదికగా ఉచితంగా సంగీత పాఠాలు చెబుతున్నారు. సౌజన్య పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వివాహం అనంతరం బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో ఆమె ఇక్కడి ఆలయాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు భర్త ఉద్యోగరీత్యా జర్మనీ వెళ్లడంతో ఆమె కూడా వెంట వెళ్లారు. అయినప్పటికీ పరాయి దేశం వెళ్లినా సంగీత మూలాలు, ఇక్కడి వారిని మరిచిపోకుండా ఆన్లైన్ వేదికగా సంగీత పాఠాలు చెబుతున్నారు. ‘శ్రీవారి సేవాస్ఫూర్తి’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కర్ణాటకసంగీతంపై వరుసగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకించి అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు పాడుతూ, వాటి అర్థాలను వివరిస్తూ సౌజన్య చేస్తున్న వీడియోలకు వీక్షకుల నుంచి అద్భుత ఆదరణ లభిస్తోంది. మాతృభూమికి దూరంగా ఉన్నా కళలపై ఉన్న ప్రేమతో ఇంత చేయగలుగుతున్నానని ఆమె సంతోషంగా చెబుతున్నారు. -
ప్రేమను అంగీకరించలేదని స్క్రూ డ్రైవర్‌తో దాడి
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంగా యువతిని తన నుంచి దూరం చేస్తున్నారన్న ఆవేశంతో ఓ యువకుడు మహిళతో పాటు అడ్డు వచ్చిన ఆమె కూతురిపై దాడి చేయడమే కాకుండా ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి(31) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 10లోని స్రవంతి నగర్లో ఇద్దరు స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన సౌజన్య(26) తన తల్లి సుజాతతో కలిసి ఇదే ప్రాంతంలో అద్దెకుంటున్నది. శ్రీనివాస్‌రెడ్డి, సౌజన్య ఇద్దరూ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. కొంత కాలంగా శ్రీనివాస్‌రెడ్డి ప్రేమ పేరుతో సౌజన్య వెంటపడుతున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్ళి చేసుకుంటానని ఆమెను వేధింపులకు గురి చేయసాగాడు. ఆమె ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నది. ఆగ్రహం పట్టలేని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుందామని పథకం ప్రకారం తన వెంట ఓ స్క్రూ డ్రైవర్ జేబులో పెట్టుకొని శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సౌజన్య ఇంటికి వెళ్ళాడు. అప్పటికి జాబ్ నుంచి సౌజన్య ఇంకా తిరిగి రాలేదు. ఆ సమయంలోనే శ్రీనివాస్‌రెడ్డి ఆమె తల్లి సుజాతతో తమ ప్రేమ విషయం చెప్పి అడ్డు రావద్దంటూ హెచ్చరించాడు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వు... ప్లీజ్.. అంటూ సుజాత వేడుకుంది. తండ్రి లేని నా కూతురిని ఆగం చేయవద్దంటూ కాళ్ళావేళ్ళాపడింది. వినిపించుకోని శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రేమకు అడ్డు వస్తుందన్న ఆగ్రహంతో తనతో పాటు తెచ్చుకున్న స్క్రూ డ్రైవర్‌తో సుజాతపై దాడి చేశాడు. సరిగ్గా అదే సమయంలో సౌజన్య ఇంటికి వచ్చి రక్తం కారుతున్న తల్లిని, దాడికి పాల్పడుతున్న శ్రీనివాస్‌రెడ్డిని చూసి భయంతో వణికిపోయింది. మరోసారి తల్లిని పొడిచేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుంది. దీంతో ఆమెకు కూడా గాయాలయ్యాయి. ఓ వైపు తల్లి రక్తం కారుతూ కిందపడిపోగా గాయాలతో సౌజన్య కూడా అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. వెంటనే వెళ్ళి చికిత్స నిమిత్తం మ్యాక్స్ క్యూర్‌ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు సేకరించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. నిందితుడి కోసం ఇంటికి వెళ్ళగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన కోసం గాలింపు చేపట్టారు. దాడి చేసిన అనంతరం నిందితుడు నేరుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్ళి సమీపంలోని రైలుపట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ ఎస్ఐ సుధీర్‌రెడ్డి నిందితుడి కాల్‌డేటా తీసుకొని అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా అది నిందితుడి సోదరుడిగా తేలింది. విషయం చెప్పగా తన సోదరుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు.జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
తొలి రౌండ్లో సౌజన్య ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారుల పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో సౌజన్య భవిశెట్టి, సాయి సంహిత చామర్తి మొదటి రౌండ్లోనే ఓడిపోయారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సౌజన్య 5–7, 3–6తో పైజె హైరియాన్ (న్యూజిలాండ్) చేతిలో, సాయి సంహిత 4–6, 1–6తో మూడో సీడ్ వలేరియా స్ట్రాకోవా (ఉక్రెయిన్) చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతర మ్యాచ్‌ల్లో వైదేహి చౌదరి (భారత్) 3–6, 3–6తో మిహేలా జకోవిచ్ (సెర్బియా) చేతిలో, మహెక్ జైన్ (భారత్) 4–6, 4–6తో ఫత్మా నభాని (ఒమన్) చేతిలో ఓడటంతో ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. మరోవైపు డబుల్స్ విభాగంలోనూ తెలంగాణ క్రీడాకారులకు కలిసి రాలేదు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సామ సాత్విక–సాయి సంహిత (భారత్) ద్వయం 2–6, 3–6తో సోఫియా షపటవా (జార్జియా)–ఎమిలీ (బ్రిటన్) జోడీ చేతిలో ఓడిపోయి తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. -
పసికందుతో సౌజన్యారెడ్డి కుటుంబీకుల రాస్తారోకో
బోయినపల్లి(చొప్పదండి): కట్నం వేధింపులతో సౌజన్యారెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. తన రెండునెలల పసికందుతో ఆమె బంధువులు మండలంలోని మల్లాపూర్‌లో బీటీ రోడ్డుపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. వేములవాడరూరల్ సీఐ డి.రఘుచందర్ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విరమించారు. అనంతరం శవంతో యథావిధిగా ఆమె భర్త ఇంటి ఎదుట బైఠాయించారు. వర్షం కురుస్తున్నా న్యాయంకోసం రెండునెలల పసికందుతో రోడ్డుపై రాస్తారోకో చేయడం చూపరులకు కన్నీరు తెప్పించింది. వివరాల్లోకి వెళ్తే రాజేందర్‌రెడ్డి వేధింపులతో గతనెల 24న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్న సౌజన్యారెడ్డి చికిత్స పొందుతూ ఈనెల 6న మృతి చెందిన విషయం తెలిసిందే. రెండునెలల బాబుకు న్యాయం చేయాలని ఆమె బంధువులు రాజేందర్‌రెడ్డి ఇంటి ఎదుట రెండురోజులుగా ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఒక సందర్భంలో సౌజన్యారెడ్డి శవాన్ని భర్త ఇంటివద్ద ఖననం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నట్లు తెలిసింది. పోలీసుల బందోబస్తు సౌజన్యారెడ్డి శవంతో ఆమె బంధువులు రెండురోజులుగా మల్లాపూర్‌లో ఆందోళన చేస్తుండడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సీఐ, ఎస్సై ఎన్.వెంకటక్రిష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ప్రియుడితో పెళ్లి జరిపించండి ..
కొమరాడ: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. మాయమాటలతో లొంగదీసుకున్నాడు.. పెళ్లి అనేసరికి కనిపించకుండా పోయాడు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ గ్రామానికి చెందిన కాగిన సౌజన్య (22) పార్వతీపురంలో ఉన్న రాహుల్ రడీమేడ్ దుకాణంలో పనిచేసేది. అదే దుకాణంలో మండలంలోని ఎగువ గంగురేగువలసకు చెందిన యామిని కృపారావు కూడా పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చివరకు ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన కృపారావు ప్రియురాలు సౌజన్యను లొంగదీసుకుని గంగురేగువలసలో ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం కూడా చేశాడు. సౌజన్య పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఇల్లు కడుతున్నామని, పూర్తవగానే పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. పెళ్లికోసం సౌజన్య ఇటీవల ఎక్కువ ఒత్తిడి చేయడంతో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కృపారావు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితురాలు అతని తల్లిని నిలదీయగా, మొదట్లో ఎటో పనిమీద వెళ్లాడని చెప్పిన ఆమె కొద్ది రోజుల కిందట ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది. దీంతోతాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు తన ప్రియుడ్ని తనకు అప్పగించాలని కోరుతూ అతని ఇంటిముందు నిరసన చేపట్టింది. -
రెండో రౌండ్లో సౌజన్య, ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ముందంజ వేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన సౌజన్య భవిశెట్టి, ప్రాంజల యడ్లపల్లి సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు... డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సౌజన్య (భారత్) 6–1, 6–0తో దీక్ష మంజు ప్రసాద్ (భారత్)పై గెలుపొందగా... మూడో సీడ్ ప్రాంజల 6–3, 6–3తో యుబ్రాని బెనర్జీ (భారత్)ను ఓడించింది. డబుల్స్ తొలిరౌండ్లో సౌజన్య–రిషిక సుంకర (భారత్) ద్వయం 7–5, 6–2తో అద్రిజ బిశ్వాస్–ఆర్తి మునియన్ (భారత్) జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ప్రాంజల (భారత్)–ఎమిలీ వెబ్లీ స్మిత్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–2, 6–0తో నిత్య రాజ్–సౌమ్య (భారత్) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో నిధి చిలుముల (తెలంగాణ) 2–6, 4–6తో ఐదోసీడ్ ఫ్రేయ క్రిస్టీ (గ్రేట్ బ్రిటన్) చేతిలో, రిషిక సుంకర 6–7 (10/12), 0–6తో నుడిడా లాంగ్నమ్ (థాయ్‌లాండ్) చేతిలో, భువన కాల్వ (తెలంగాణ) 5–7, 4–6తో తెరీజా మిహలికోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో నిధి చిలుముల–స్నేహాదేవి రెడ్డి (భారత్) జంట 7–6 (7/5), 7–5తో మోనికా రాబిన్సన్ (అమెరికా)–జో వెన్ స్కాండలిస్ (భారత్) జోడీపై గెలుపొందింది. -
పెళ్లైన మూడు నెలలకే..
‘సంతోషం తప్ప బాధ ఎలాంటిదో తెలియదు. మా అమ్మ కష్టపడి అలా పెంచింది. తర్వాత ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. అమ్మకంటే ఎక్కువగా చూసుకున్నాను. అవతలి నుంచి ఇసుమంత ప్రేమ దొరకలేదు. దూరంగా పెడుతూ వేధించడం మొదలుపెట్టింది. సర్దుకుపోదామనుకున్నా. చివరకు నన్ను ఎంతగానో ప్రేమించే మా అమ్మపై చేయిచేసుకునేంత వరకు వెళ్లా. అయినా, ఆమెలో మార్పు రాలేదు. తర్వాత ఆమె మా ఇంట్లోని సంతోషాన్ని తీసుకెళ్లేందుకొచ్చిందని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నన్ను తమ్ముడిలో చూసుకోండి అమ్మా..నాన్నా’ అంటూ సెల్ఫోన్లో వాయిస్ రికార్డు చేసి తమ్ముడికి పంపి రైలు కింద పడి తనువు చాలించాడు గోనెగండ్లకు చెందిన వినయ్‌కుమార్. కర్నూలు/గోనెగండ్ల/ పత్తికొండ రూరల్/: కర్నూలు శివారులోని కార్బైడ్ ఫ్యాక్టరీ మెయిన్‌గేట్ వద్ద సోమవారం రాత్రి వినయ్‌కుమార్ (24) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. గోనెగండ్ల పట్టణానికి చెందిన సుబ్రమణ్యంశెట్టి , విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. వినయ్‌కుమార్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో తమ్ముడు వంశీకృష్ణతో కలసి పత్తికొండలోని సాయిబాబా గుడి దగ్గర కిరాణం అంగడి నిర్వహిస్తున్నాడు. మేనమామ సొంతూరైన వెల్దుర్తిలో సౌజన్య అనే అమ్మాయిని ప్రేమించి నవంబర్ 1న పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే మరొక యువకుడితో ఆమె ప్రేమలో పడటంతో వినయ్‌కుమార్‌కు దూరంగా ఉంటోంది. పెళ్లి అయినప్పటినుంచి కూడా కాపురం చేయకపోగా విడాకులు కావాలని భర్తతో గొడవ పడేది. 20 రోజుల క్రితం ఇదే విషయంలో ఘర్షణపడి పుట్టింటికి చేరుకుంది. సోమవారం ఉదయం వినయ్‌కుమార్‌కు.. అత్త అమృతవల్లి ఫోన్ చేసి సౌజన్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కర్నూలు ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపింది. వెంటనే తమ్ముడు వంశీతో కలసి వచ్చి గాయత్రి ఎస్టేట్‌లోని ఆసుపత్రిలో భార్యను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. ఈ సమయంలో కూడా వారి మధ్య సంసార విషయమై గొడవ జరిగింది. సాయంత్రం తల్లితో కలసి సౌజన్య వెల్దుర్తికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపం చెందిన వినయ్‌కుమార్ మద్దూర్‌నగర్‌లో పని ఉంది.. చూసుకుని వస్తానంటూ తమ్ముడికి చెప్పి కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లాడు. అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కీమెన్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ప్రమాదంలో చేతులు, కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. షర్ట్ జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. శోకసంద్రంలో తల్లిదండ్రులు వినయకుమార్ మరణ వార్త తెలియగానే తల్లిదండ్రులు, తమ్ముడు శోక సంద్రంలో మునిగిపోయారు. పెళ్లైన దంపతులు సుఖసంతోషాలతో ఉంటారనుకుంటే ఇలా జరిగిందం టూ వారు రోదిస్తున్న తీరు స్థానికుల ను కంటతడి పెట్టించింది. తర్వాత మృతదేహాన్ని గోనెగండ్లకు తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. అన్న ఆత్మహత్యకు వదిన, ఆమె కుటుంబసభ్యులే కారణమని వంశీ తెలిపారు. -
ఈసెట్ ఫలితాల్లో విద్యార్థిని ప్రతిభ
బుక్కరాయసముద్రం : మండలంలోని వడియంపేటలో ఉన్న శిరిడిసాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సౌజన్య ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 433 ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. విద్యార్థిని కళాశాలలో డిప్లమో కోర్సు చదువుతోందన్నారు. సందర్భంగా విద్యార్థినిని కళాశాల న్యూ మేనేజ్మెంట్, ఈసీఈ విభాగం అధిపతి మహేష్ అభినందించారు. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ధర్మవరం రూరల్: మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని వడ్డే సౌజన్య (18) ఉరేసుకొని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు సౌజన్య పట్టణంలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తల్లి లీలావతి ఉదయమే కూలి పనులకు వెళ్లగా తండ్రి వెంకటరాముడు సంత సరుకులు తెచ్చేందుకు పట్టణానికి వెళ్లాడు. ఇదే సమయంలోనే సౌజన్య కళాశాలకు బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే ఏమి జరిగిందేమోగానీ ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యా¯ŒSకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కుమార్తె ఫ్యా¯ŒSకు వేలాడుతూ కనిపించింది. రూరల్ ఎస్ఐ యతేంద్ర, ఏఎస్ఐ నాగప్ప వెళ్లి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఐటీఎఫ్ టోర్నీ విజేత సౌజన్య
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సొంతం చేసుకుంది. పుణేలో శనివారం జరిగిన ఫైనల్లో సౌజన్య 7-5, 6-2తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఎడంచేతి వాటం క్రీడాకారిణి సౌజన్య ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. ఈ టోర్నీ మొత్తంలో సౌజన్య తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 22 ఏళ్ల సౌజన్యకిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 2013లో షర్మ్ ఎల్ షేక్ (ఈజిప్టు), 2014లో ఔరంగాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలలో సౌజన్య విజేతగా నిలిచింది. -
సౌజన్య జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సాధించింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకరతో కలసి సౌజన్య విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్వేతా రాణా (ఢిల్లీ)-ఇతీ మెహతా (గుజరాత్) జోడీపై విజయం సాధించింది. అండర్-18 బాలికల డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని-తనీషా కశ్యప్ (అస్సాం) జంట 6-1, 7-6 (7/5)తో సభ్యత నిహ్లాని (ఢిల్లీ)-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో హుమేరా అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి షేక్ హుమేరా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో హుమేరా 4-6, 6-3, 6-2తో హైదరాబాద్‌కే చెందిన యెద్దుల సారుు దేదీప్యపై కష్టపడి గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో ఆకాంక్ష భాన్ (గుజరాత్)తో హుమేరా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ఆకాంక్ష 6-2, 6-1తో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు లలిత దేవరకొండను ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల 4-6, 3-6తో ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-3, 6-1తో కునాల్ ఆనంద్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఫైనల్లో సిద్ధార్థ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్)తో విష్ణు ఆడతాడు. -
సంతానం కోసం వెళితే దారుణం..
-
సంతానం కోసం వెళితే దారుణం..
చైతన్యపురి: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ ప్రాణంపైకి తెచ్చింది... సంతానం కోసం శస్త్ర చికిత్స చేసిన వైద్యుల పుణ్యమా అని ఆమె వెంటిలేటర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. చైతన్యపురి ఠాణా పరిధిలో ఈ ఘటన జరి గింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి భర్త కథనం ప్రకారం... నల్ల గొండ జిల్లా చౌటుప్పల్‌లో సాయిజ్యోతి ఆసుపత్రి డాక్టర్ సుమన్ కల్యాణ్‌కు 2007లో సాయిజ్యోతి (36) తో పెళ్లైంది. ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు సాయిజ్యోతి చూసుకుంటోంది. వీరికి సంతానం కలగకపోవడంతో నాగోలు చౌరస్తాలోని సృజన సంతాన సాఫల్య కేంద్రం వైద్యులు సౌజన్య, రాణి, శ్రీశైలేష్ విఠల్‌లను సంప్రదించారు. చిన్నపాటి శస్త్ర చికిత్స చేస్తే సంతానం కలుగుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఈనెల 12వ తేదీ సాయంత్రం సాయిజ్యోతి, సుమన్్ దంపతులు సృజన ఆసుపత్రికి వెళ్లారు. ఆపరేషన్ కు ముందు వైద్యు లు స్వప్న, శ్రీకాంత్‌లు సాయిజ్యోతికి అనస్థీషియా (మత్తు) ఇచ్చారు. శస్త్ర చికిత్స ప్రారంభించిన వైద్యులు సాయిజ్యోతి పరిస్థితి విషమించినట్టు గుర్తించారు. అదే రోజు రాత్రి ఓమ్నీ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు తమ వల్ల కాదని చెప్పడంతో 13వ తేదీన ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్ రావడంతో సాయిజ్యోతి పరిస్థితి విషమంగా మారడం తో వెంటిలేటర్ అమర్చారు. రెండు వారాలుగా చికిత్స చేస్తున్నా.. ఆమె ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో భర్త సుమన్ కల్యాణ్ చైతన్యపురి పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి వైద్యులు సృజన, శ్రీ శైలేష్ విఠల్, రాణి, అనస్థీషియా వైద్యులు స్వప్న, శ్రీకాంత్‌ల నిర్లక్ష్యం వల్లే తన భార్య ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణంపైకి వచ్చిందని సుమన్ కల్యాన్ సోమవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. నడుచుకుంటూ వెళ్లిన తన భార్యను స్పృహలేని స్థితిలో మరో ఆసుపత్రికి తరలించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకరికి ఇలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామన్నారు. కాగా దీనిపై ఆసుపత్రి వైద్యులను వివరణ కోరేందుకు ప్రయ త్నించగా వారు అందుబాటులోకి రాలేదు. -
కోర్టు ప్రాంగణంలోనే..బ్లేడ్‌తో భార్య గొంతు కోసిన భర్త
♦ దాడి తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు ♦ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న భార్య హైదరాబాద్: కోర్టు ప్రాంగణంలోనే బ్లేడ్‌తో భార్య గొంతు కోసి పారిపోయాడు ఓ భర్త! రక్తసిక్తమై పడిపోయిన ఆమెను కోర్టు సిబ్బంది, పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం ఆమె మృత్యువుతో పోరాడుతోంది. సోమవారం హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి కోర్టు ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది. లంగర్‌హౌజ్‌కు చెందిన సౌజన్యకు పాతబస్తీ చత్రినాక ప్రాంతానికి చెందిన నాగేందర్‌తో 8 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. చెడు అలవాట్లకు బానిసైన నాగేందర్ జులాయిగా తిరుగుతూ ఇంటి వద్దే ఉండేవాడు. వివాహం అనంతరం ఆర్నెళ్ల పాటు సాఫీగా సాగిన వీరి జీవితంలో తర్వాత గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం నాగేందర్ వేధించాడు. ఎన్నోసార్లు పంచాయితీ పెట్టి పెద్దలతో చెప్పించినా మారలేదు. దీంతో సౌజన్య 2012లో చత్రినాక పోలీస్ స్టేషన్లో గృహహింస చట్టం కింద భర్తపై కేసు పెట్టింది. అయినా భర్తలో మార్పు రాకపోవడంతో తన కొడుకును లంగర్‌హౌజ్ వెళ్లిపోయింది. నాగేందర్ అక్కడికి కూడా వెళ్లి వేధించడంతో ఆమె లంగర్‌హౌజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఉప్పర్‌పల్లి కోర్టులో కేసు నడుస్తోంది. ప్రతినెల మాదిరే నాగేందర్ సోమవారం కూడా కోర్టుకు హాజరయ్యాడు. సౌజన్యకు ప్రతినెల రూ.2 వేలు చెల్లించాలని కోర్టు గతంలోనే తెలిపింది. కానీ కొన్ని నెలలు గా నాగేందర్ చెల్లించడం లేదు. సోమవారం ఇద్దరూ కోర్టు లోపలికి వెళ్లారు. విచారణ తర్వాత సౌజన్య బయటకి రావడంతో నాగేందర్ అప్పటికే తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆమెపై దాడి చేశాడు. గొంతుపై కోయడంతో సౌజన్య కుప్పకూలిపోయింది. పోలీసులు, కోర్టు సిబ్బంది వెంటనే గమనించి ఆస్పత్రికి తరలించారు. దాడి తర్వాత నాగేందర్ అక్కడ్నుంచి పారిపోయి అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. విషయం తెలియడంతో సౌజన్య తల్లి మాధవి, సోదరి చైతన్య ఆసుపత్రికి వచ్చారు. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం, అనుమానంతో తమ కూతురును నాగేందర్, ఆయన కుటుంబీకులు వేధించేవారని చెప్పారు. -
కోర్టు ఆవరణలో దారుణం
రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టులో సోమవారం దారుణం చోటు చేసుకుంది. తనపై కేసు పెట్టిన భార్యపై భర్త దాడి చేసి కత్తితో గొంతు కోశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నాగేందర్ పై సౌజన్య 498 కేసు పెట్టింది. కేసు విచారణ వాయిదా కోసం ఇరువురూ ఈ రోజున కోర్టుకు రాగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పెళ్లి ఖర్చులు సీఎం సహాయ నిధికి..
షోలాపూర్, న్యూస్‌లైన్: అతనొక రాజకీయ నాయకుడు.. అందులోనూ కుమార్తె వివాహం.. ఇక పెళ్లి ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు.. ఆగండాగండి.. మీరు ఊహిస్తున్నట్లు ఆయన తన కుమార్తె పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించలేదు.. కేవలం నిశ్చితార్థం ఖర్చులోనే పెళ్లి జరిగిందనిపించేశాడు.. అయినా అతడిని ఎవరూ తిట్టుకోలేదు.. పిసినారి అని అనలేదు.. ఎందుకో తెలుసా.. పెళ్లికోసం ఖర్చు పెట్టాల్సిన సొమ్మును అతడు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశాడు.. అదీ అక్కడి విశేషం..! వివరాల్లోకి వెళితే.. బాలాసాహెబ్ మోరే మరాఠ్వాడాలోని అకుల్కోట్ పంచాయితీ సమితి ప్రతిపక్ష నేత. ఆయన తన కుమార్తె సౌజన్యకు చంద్రకాంత్ క్షీరసాగర్తో వివాహం నిశ్చయించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోనే నిశ్చితార్థం పెట్టుకున్నారు. జనవరి 29వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. సాధారణంగా నిశ్చితార్థం, వివాహం ఇలా రెండు వేడుకలకూ అదే బంధువులను ఆహ్వానిస్తారు. దీంతో రెండుసార్లు వేడుకల కోసం ఖర్చుపెట్టే సొమ్ములో కొంత పొదుపు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని మోరే సంకల్పించగా, వరుడి తరఫు వారు సైతం అంగీకరించారు. దీంతో పెళ్లి సమయంలో వేడుకలను రద్దుచేయాలని నిశ్చయించారు. ఆ రోజు ఖర్చు రూ.లక్షా వెయ్యి రూపాయలుగా తేలడంతో సదరు మొత్తాన్ని నిశ్చితార్థం సమయంలోనే చెక్కు రూపంలో స్థానిక తహశీల్దార్‌కు అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా బాలాసాహెబ్ మోరే మాట్లాడుతూ.. ప్రస్తుతం తీవ్ర క్షామంతో అల్లాడుతున్న మరాఠ్వాడాను ఆదుకునేందుకు తమ వంతు సాయంగా ఈ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి అందజేశామన్నారు. వృథా ఖర్చులు తగ్గించుకుని, ఆ సొమ్మును కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు అందజేయాలనే సంకల్పంతోనే ఈ పనికి పూనుకున్నామని చెప్పారు. -
కలెక్టర్ కావాలనుకుని.. కటకటాల్లోకి
ఇద్దరూ ఉన్నత విద్యావంతులు. కలసి చదువుకున్నారు. కలెక్టర్ కావాలని కలలు కన్నారు. ఆశయం నెరవేరకపోయినా మంచి ఉద్యోగాల్లోనే స్థిరపడ్డారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని ఆశించారు. ఐతే మూడు నెలల క్రితం జరిగిన ఓ బలవంతపు పెళ్లి.. వీరిద్దరితో పాటు మరొకరి జీవితాన్ని చిన్నాభిన్నం చేయగా, మరొక నిండు ప్రాణం బలైంది. ప్రియుడి సహకారంతో భర్త (ఆర్టీసీ ఉద్యోగి) గొంతుకోసి దారుణంగా హతమార్చిన సంఘటనలో అరెస్టయిన సౌజన్య కేసులో వెలుగు చూసిన విస్తుగొలిపే విషయాలవి. వివేకం కోల్పోయి హంతకులుగా మారిన సంఘటన ఇది. కలెక్టర్ కావాలనుకున్న ప్రేమికులిద్దరూ చివరకు కటకటాలపాలయ్యారు. బీఎస్సీ బయోటెక్నాలజీ చదివిన సౌజన్య కలెక్టర్ కావాలనే ఆశయంతో శిక్షణ తీసుకుంది. ఆమె ఆశయం నెరవేరకపోయినా ఉన్నత ఉద్యోగంలోనే స్థిరపడింది. నెలకు 50 వేల రూపాయిలు సంపాదిస్తోంది. తన స్నేహితుడు, ప్రియుడు జైదీప్‌ను పెళ్లి చేసుకోవాలన్నది ఆమె కోరిక. ఐతే వారిద్దరి జీవితాలను ఓ సంఘటన ఊహించని మలుపులు తిప్పింది. ఆర్టీసీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన వెంకటేశ్వరరావు (27)కు నాచారం ప్రాంతానికి చెందిన సౌజన్య అక్క లతతో పెద్దలు మే 29న పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ సరిగ్గా ఒక్కరోజు ముందు లత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. అప్పటికే పెళ్లి పత్రికలు వెళ్లిపోయాయి. తెల్లారితే పెళ్లి.. లత ఆచూకీ లేదు. పెళ్లి ఆగిపోతే తన తండ్రి గుండె పగిలి చనిపోతాడనే భయంతోనే సౌజన్య ఇష్టం లేకున్నా వెంకటేశ్వరరావుతో అదే ముహూర్తానికి బలవంతపు పెళ్లికి అంగీకరించింది. బెంగళూరులోని అసెంచర్ సాఫ్ట్వేర్ కంపెనీలో సౌజన్య ఇంజనీర్‌గా పనిచేస్తోంది. పెళ్లయిన తర్వాత సౌజన్య తన పేరును లతగానే చెప్పుకుంది. అయితే పెళ్లికూతురు మారిన విషయం వెంకటేశ్వరరావుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు గానీ తెలియదు. పెద్దలు బలవంతం చేయడంతో వెంకటేశ్వరరావును సౌజన్య పెళ్లయితే చేసుకుంది కానీ సౌజన్య మనసు మాత్రం తన కంపెనీలోనే పనిచేసే ప్రియుడు జైదీప్ (24)పైనే ఉంది. ఎలాగైనా వెంకటేశ్వరరావును వదులుకుని జైదీప్ వద్దకు వెళ్లాలని సౌజన్య కలలు కంది. ఈ క్రమంలోనే హత్యకు పథకం పన్నింది. ఘటనకు మూడు రోజుల ముందు ‘నా భర్త వెంకటేశ్వరరావు హత్యకు గురైనట్లు శుభవార్త త్వరలోనే వింటావు’ అని జైదీప్‌కు వాయిస్ ఎస్ఎమ్ఎస్ను సౌజన్య పంపింది. పథకంలో భాగంగానే ఈ నెల 14న సంఘీ దేవాలయానికి బైక్‌పై దంపతులు వెళ్లి వస్తుండగా దారిలో జైదీప్, అతని స్నేహితుడు రాజ్‌కుమార్ అడ్డగించి వెంకటేశ్వరరావు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. భార్య అతని కాళ్లు గట్టిగా పట్టుకోగా, రాజ్‌కుమార్ అతని చేతులు బలంగా పట్టుకున్నాడు. పదునైన కత్తితో జైదీప్ అతని గొంతు కోశాడు. కేసును తప్పుదారి పట్టించేందుకు తనపై కూడా దుండగులు దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని సౌజన్య పోలీసులను నమ్మించింది. సౌజన్య సెల్‌ఫోన్ కాల్‌లిస్టు ద్వారా జైదీప్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు లోతుగా విచారించారు. హత్యకు ఉపయోగించిన కత్తి, బంగారు ఆభరణాలు, సౌజన్య సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించడంలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు కీలక పాత్ర పోషించారని ఎల్బీనగర్ డీసీపీ రవివర్మ పేర్కొన్నారు.