జూబ్లీహిల్స్: ఆమెకు సంగీతమంటే ప్రాణం. ఐదేళ్ల వయసులోనే సరిగమలు నేర్చుకోండం ప్రారంభించి సింగీంలో డిప్లొమా చేశారు. మరోపక్క బదుకుదెరువు కోసం ఇంజినీరింగ్ చదివారు. అయితే, మనసు మాత్రం సంగీతమే ప్రపంచమని చెప్పడంతో అటువైపుఅడుగులు వేశారు. ఆమె ‘మునుకుట్ల సౌజన్య’. ఈమె చదివింది ఇంజినీరింగ్ అయినా అటువైపు వెళ్లకుండా తిరుపతి పద్మావతి మహిళా విశ్యవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశారు. శాస్త్రీయ సంగీతమే ప్రాణంగా భావిస్తూ ఆన్‌లైన్ వేదికగా ఉచితంగా సంగీత పాఠాలు చెబుతున్నారు.
సౌజన్య పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుట్టిపెరిగారు. అక్కడే ఇంజినీరింగ్ పూర్తి చేశారు. వివాహం అనంతరం బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో ఆమె ఇక్కడి ఆలయాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక వేడుకల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు భర్త ఉద్యోగరీత్యా జర్మనీ వెళ్లడంతో ఆమె కూడా వెంట వెళ్లారు. అయినప్పటికీ పరాయి దేశం వెళ్లినా సంగీత మూలాలు, ఇక్కడి వారిని మరిచిపోకుండా ఆన్‌లైన్ వేదికగా సంగీత పాఠాలు చెబుతున్నారు. ‘శ్రీవారి సేవాస్ఫూర్తి’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి కర్ణాటకసంగీతంపై వరుసగా వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకించి అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు పాడుతూ, వాటి అర్థాలను వివరిస్తూ సౌజన్య చేస్తున్న వీడియోలకు వీక్షకుల నుంచి అద్భుత ఆదరణ లభిస్తోంది. మాతృభూమికి దూరంగా ఉన్నా కళలపై ఉన్న ప్రేమతో ఇంత చేయగలుగుతున్నానని ఆమె సంతోషంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment