
మాట్లాడుతున్న సౌజన్య
కొమరాడ: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. మాయమాటలతో లొంగదీసుకున్నాడు.. పెళ్లి అనేసరికి కనిపించకుండా పోయాడు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ప్రియుడు ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ గ్రామానికి చెందిన కాగిన సౌజన్య (22) పార్వతీపురంలో ఉన్న రాహుల్ రడీమేడ్ దుకాణంలో పనిచేసేది. అదే దుకాణంలో మండలంలోని ఎగువ గంగురేగువలసకు చెందిన యామిని కృపారావు కూడా పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం చివరకు ప్రేమకు దారితీసింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన కృపారావు ప్రియురాలు సౌజన్యను లొంగదీసుకుని గంగురేగువలసలో ఒకే ఇంటిలో ఉంటూ సహజీవనం కూడా చేశాడు. సౌజన్య పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా ఇల్లు కడుతున్నామని, పూర్తవగానే పెళ్లి చేసుకుందామని నమ్మబలికాడు. పెళ్లికోసం సౌజన్య ఇటీవల ఎక్కువ ఒత్తిడి చేయడంతో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి కృపారావు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితురాలు అతని తల్లిని నిలదీయగా, మొదట్లో ఎటో పనిమీద వెళ్లాడని చెప్పిన ఆమె కొద్ది రోజుల కిందట ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది. దీంతోతాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు తన ప్రియుడ్ని తనకు అప్పగించాలని కోరుతూ అతని ఇంటిముందు నిరసన చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment