బుక్కరాయసముద్రం : మండలంలోని వడియంపేటలో ఉన్న శిరిడిసాయి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని సౌజన్య ఈసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 433 ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచిందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. విద్యార్థిని కళాశాలలో డిప్లమో కోర్సు చదువుతోందన్నారు. సందర్భంగా విద్యార్థినిని కళాశాల న్యూ మేనేజ్‌మెంట్, ఈసీఈ విభాగం అధిపతి మహేష్ అభినందించారు.