
కరీంనగర్: భార్యపై హత్యాయత్నం చేసిన భర్తపై సిరిసిల్లలో కేసు నమోదైంది. సీఐ ఉపేందర్ వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరుకు చెందిన దండబోయిన సౌజన్యకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠల్‌నగర్‌కు చెందిన దండబోయిన శ్రీకాంత్‌తో గతేడాది వివాహం జరిగింది. పెళ్లి జరిగిన పదిహేను రోజునుంచి రూ.5లక్షలు అదనపు ఇవ్వాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. లేకుంటే చంపుతానని బెదిరించారు. ఈ క్రమంలో కిరోసిన్ పోసే ప్రయత్నం చేశాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, శ్రీకాంత్‌ను రిమాండ్ చేసినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment