
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–2, 6–1తో ప్రతిభ (భారత్)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణకే చెందిన టోర్నీ నాలుగో సీడ్ యడ్లపలిప్రాంజల, సౌజన్య బవిశెట్టి... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రాచపూడి ప్రత్యూష క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రాంజల 6–3, 6–3తో యువరాణి బెనర్జీ (భారత్)పై, సౌజన్య 6–2, 6–2తో సోహా సాదిఖ్ (భారత్)పై, ప్రత్యూష 2–6, 6–2, 6–4తో జగ్మీత్ కౌర్ (భారత్)పై గెలిచారు. అయితే మరో తెలంగాణ ప్లేయర్ సామ సాత్వికకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 4–6, 6–2, 2–6తో క్వాలిఫయర్ ఆకాంక్ష దిలీప్ (భారత్) చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment