ITF womens tennis tournment
-
ITF Womens Open: ఫైనల్లో అంకితా రైనా
బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నీలో భారత అమ్మాయి, నాలుగో సీడ్ అంకితా రైనా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అంకిత 6–1, 6–1 స్కోరుతో భారత్‌కే చెందిన రుతుజ భోస్లేపై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్కు చెందిన టాప్ సీడ్ బ్రెండా ఫ్రుహ్విర్టోవాతో తలపడుతుంది. సెమీస్‌లో 15 ఏళ్ల ఫ్రుహ్విర్టోవా 7–6 (7/2), 6–2 తేడాతో దలీలా జకుపోవిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్లో భాగంగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది. -
ITF Women's Tourney 2023: పోరాడి ఓడిన సహజ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. బెంగళూరులో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సహజ 6–7 (8/10), 3–6తో డయానా మర్సిన్కెవిచా (లాతి్వయా) చేతిలో ఓడిపోయింది. గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్ అంకితా రైనా 6–3, 6–0తో వన్షిత (భారత్)పై నెగ్గి రెండో రౌండ్‌కు చేరింది. -
రష్మిక జోడీ ఓటమి.. అంకిత జోడీ క్వార్టర్స్‌కు
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సహజ యామలపల్లిలకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–వైదేహి (భారత్) ద్వయం 6–7 (5/7), 7–5, 5–10తో హెసీ అమండైన్ (ఫ్రాన్స్)–దాలియా జకుపోవిచ్ (స్లొవేనియా) జోడీ చేతిలో... సహజ–సోహా సాదిక్ (భారత్) ద్వయం 4–6, 6–7 (3/7)తో ఎలీనా టియోడోరా (రొమేనియా)–డయానా మర్సిన్‌కెవికా (లాత్వియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. రెండో సీడ్ అంకిత రైనా–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 5–7, 6–3, 10–6తో షర్మదా బాలు (భారత్)–సారా రెబెకా (జర్మనీ) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
ITF Tennis Tourney: క్వార్టర్స్‌లో రష్మిక, సౌజన్య
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–2, 6–1తో ప్రతిభ (భారత్)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణకే చెందిన టోర్నీ నాలుగో సీడ్ యడ్లపలిప్రాంజల, సౌజన్య బవిశెట్టి... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రాచపూడి ప్రత్యూష క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రాంజల 6–3, 6–3తో యువరాణి బెనర్జీ (భారత్)పై, సౌజన్య 6–2, 6–2తో సోహా సాదిఖ్ (భారత్)పై, ప్రత్యూష 2–6, 6–2, 6–4తో జగ్మీత్ కౌర్ (భారత్)పై గెలిచారు. అయితే మరో తెలంగాణ ప్లేయర్ సామ సాత్వికకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 4–6, 6–2, 2–6తో క్వాలిఫయర్ ఆకాంక్ష దిలీప్ (భారత్) చేతిలో ఓడింది. -
సెమీఫైనల్లో రిషిక
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రిషిక, నిధి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిధి 7-5, 6-0 తేడాతో శ్వేతా రాణాపై గెలుపొందింది. మరో తెలుగమ్మాయి కాల్వ భువన 3-6, 1-6 తేడాతో రిషిక సుంకర చేతిలో ఓటమిపాలైంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రార్థన తొంబరే 6-0, 6-2తో అమృత ముఖర్జీపై, పల్హా నటాషా 2-6, 6-3, 7-5 తేడాతో ఈతీ మెహతాపై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు.