బెంగళూరు: ఐటీఎఫ్ మహిళల ఓపెన్ టోర్నీలో భారత అమ్మాయి, నాలుగో సీడ్ అంకితా రైనా ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో అంకిత 6–1, 6–1 స్కోరుతో భారత్‌కే చెందిన రుతుజ భోస్లేపై ఘనవిజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన టాప్ సీడ్ బ్రెండా ఫ్రుహ్‌విర్టోవాతో తలపడుతుంది. సెమీస్‌లో 15 ఏళ్ల ఫ్రుహ్‌విర్టోవా 7–6 (7/2), 6–2 తేడాతో దలీలా జకుపోవిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఐటీఎఫ్ మహిళల వరల్డ్ టెన్నిస్ టూర్‌లో భాగంగా ఈ టోర్నమెంట్ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment