ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రిషిక, నిధి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిధి 7-5, 6-0 తేడాతో శ్వేతా రాణాపై గెలుపొందింది.
మరో తెలుగమ్మాయి కాల్వ భువన 3-6, 1-6 తేడాతో రిషిక సుంకర చేతిలో ఓటమిపాలైంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రార్థన తొంబరే 6-0, 6-2తో అమృత ముఖర్జీపై, పల్హా నటాషా 2-6, 6-3, 7-5 తేడాతో ఈతీ మెహతాపై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు.
సెమీఫైనల్లో రిషిక
Published Fri, May 9 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM
Advertisement
Advertisement