rishika
-
వారి బంధం భార్యాభర్తల్లాంటిది: మంచు విష్ణు
‘‘ఇండస్ట్రీలో ఓ యాక్టర్‌కి, మేకప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి మేకప్‌మేన్ చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సులభం కాదు.. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ‘మాధవే మధుసూదనా’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విష్ణు మంచు రిలీజ్ చేశారు. బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ–‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. మోహన్‌బాబుగారు సింగపూర్‌లో ఉండటం వల్ల ఆయన స్థానంలో విష్ణుని పంపించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
పాట చాలా బాగుంది
తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మాధవే మధుసూదన’. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘హోయ్.. అలాంటి అందం ఇలాంటి నేల మీద ఎలాగు పుట్టినాదో. ఏమో ఏమిటో...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో నాగచైతన్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా బాగుంది. తేజ్‌కు కంగ్రాట్స్. మంచి ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించాలి. చంద్ర అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. వికాస్ బాడిస స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. -
ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కుమారుడు విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 17న థాయ్‌లాండ్‌లో పెళ్లి జరగగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి దంపతులు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి, మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ మంత్రు లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్, ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీవీ కృష్ణారెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి, డాక్టర్ విజయానంద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వ«ధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస) -
సెమీఫైనల్లో రిషిక
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రిషిక, నిధి సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిధి 7-5, 6-0 తేడాతో శ్వేతా రాణాపై గెలుపొందింది. మరో తెలుగమ్మాయి కాల్వ భువన 3-6, 1-6 తేడాతో రిషిక సుంకర చేతిలో ఓటమిపాలైంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రార్థన తొంబరే 6-0, 6-2తో అమృత ముఖర్జీపై, పల్హా నటాషా 2-6, 6-3, 7-5 తేడాతో ఈతీ మెహతాపై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. -
ఊరు బాగు కోసం...
తమ ఊరు బాగు కోసం శ్రమించిన కొందరు యువకుల కథతో రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. వెంకట్ రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ కాంబినేషన్లో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించారు. వచ్చేవారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందని వెంకట్ రాహుల్ చెప్పారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. -
నవ్వించే బిల్లా రంగా
వెంకట్రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశిరెడ్డి సుధీర్‌రెడ్డి నిర్మించారు. ఎంతోమందిని హీరోలుగా తీర్చిదిద్దిన వైజాగ్ సత్యానంద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. రెండుగంటలపాటు నిరవధికంగా ఎంటర్టైన్ చేస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకున్నారు. తమిళంలో సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ నారాయణ్ తెలుగులో పాటలు స్వరపరచిన తొలి చిత్రం ఇది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నట్లుగానే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
‘బిల్లా-రంగా’ పాటలు
వెంకట్ రాహుల్, ప్రదీప్ బెంటో, రిషిక ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. వంశీ బోయిన, అరవింద్ వన్నాల, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియోసీడీని ఆవిష్కరించి, వైజాగ్ సత్యానంద్‌కి అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ -‘‘పవన్‌కల్యాణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటశిక్షణను అందించిన గురువు సత్యానంద్. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి వెండితెరపై కనిపించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. మంచి టీమ్‌తో ఈ సినిమా చేశామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం తన శిష్యుడు మహేంద్ర చక్రవర్తి అని సత్యానంద్ తెలిపారు. భీమినేని, దాము, రమేష్ పుప్పాల, ప్రిన్స్, నవీన్‌చంద్ర, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
నాకైతే నచ్చింది
శ్రీబాలాజీ, కృష్ణ, రఘు ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘నాకైతే నచ్చింది’. త్రినాథ్ కోసూరి దర్శకుడు. ఎ.పి. రాధాకృష్ణ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. డిసెంబర్ 8న పాటలను విడుదల చేసి, అదే నెలలో సినిమాను విడుదల చేస్తామని కార్యనిర్వాహక నిర్మాత బి.ఆర్.రాజు తెలిపారు. మైండ్‌గేమ్ నేపథ్యంలో సాగే కథ ఇదని నిర్మాత చెప్పారు. సోని చరిష్టా, రిషిక, సిరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ: సాగ, మాటలు: చందు, సికిందర్, కెమెరా: పి.ఆర్.కె.రాజు, ఎడిటింగ్: నందమూరి హరి.