‘బిల్లా-రంగా’ పాటలు | Billa Ranga movie Audio Launched | Sakshi
Sakshi News home page

‘బిల్లా-రంగా’ పాటలు

Published Sat, Nov 23 2013 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM

‘బిల్లా-రంగా’ పాటలు

‘బిల్లా-రంగా’ పాటలు

వెంకట్ రాహుల్, ప్రదీప్ బెంటో, రిషిక ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. వంశీ బోయిన, అరవింద్ వన్నాల, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియోసీడీని ఆవిష్కరించి, వైజాగ్ సత్యానంద్‌కి అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ -‘‘పవన్‌కల్యాణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటశిక్షణను అందించిన గురువు సత్యానంద్. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి వెండితెరపై కనిపించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. మంచి టీమ్‌తో ఈ సినిమా చేశామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం తన శిష్యుడు మహేంద్ర చక్రవర్తి అని సత్యానంద్ తెలిపారు. భీమినేని, దాము, రమేష్ పుప్పాల, ప్రిన్స్, నవీన్‌చంద్ర, రఘు కుంచె  తదితరులు  ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement