Billa Ranga
-
‘‘ఛలో.. మీ, మా పదేళ్ల పాలనపై చర్చిద్దాం’’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో ప్రజలకు నిరాశే మిగిలిందని కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏదో కొత్త హామీలు అన్నట్లు మాట్లాడారని.. మోదీ చేసిన మోసానికి కిషన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులపైనా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఏర్పాటును అవమానించిన మోదీతో సభ నిర్వహించడం అనైతికం. వివేక్, కొండ విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, రాజ్ గోపాల్ రెడ్డి అందుకే రాలేదు అనే చర్చ నడుస్తోంది. మోదీ పర్యటన ఖర్చు కూడా పాలమూరుకు ఇవ్వలేదు. కుటుంబ దోపిడీ(బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి..) గురించి మోదీ ఎందుకు మాట్లాడలేదు?. దీంతో.. బీఆర్ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు మోదీ తెలంగాణ పర్యటన.. అని రేవంత్ అన్నారు. 👊కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఇద్దరు ఏకమైన చేస్తున్న పర్యటనలు ఇవి. కేటీఆర్ ,హరీష్ రావు బిల్లా రంగాల్లా తిరుగుతున్నారు. 2004,2009 కాంగ్రెస్ మ్యానిఫెస్టో తో నేను వస్తా. 2014,18 మ్యానిఫెస్టోలతో చర్చలకు వస్తారా? రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్కు సవాల్ విసిరారు టీపీసీసీ చీఫ్. 👊2004నుంచి 2014 వరకు దేశంలో కాంగ్రెస్ ఎన్నో రాష్ట్రాలలో అధికారంలో ఉన్నా..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసింది. కానీ, ఈ బిల్లా రంగాలు(కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశిస్తూ..) కాంగ్రెస్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, మైనారిటీ రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్. 2004 నుంచి 2014 వరకు ఇచ్చిన ఆరు హామీలను వైఎస్సార్ అమలు చేసి చూపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఈ పథకాలను అమలు చేసి చూపాం. 👊రాష్ట్రాల ఆదాయం, ప్రజల అవసరాలనుబట్టి పథకాలు ఉంటాయి. కానీ, ఈ బిల్లా రంగాలకు రాజ్యాంగం విలువ తెలియదు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేని బిల్లా రంగాలు... ఇతర రాష్ట్రాల్లో అమలు చేయాలని మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరికీ సూటిగా సవాల్ విసురుతున్నా. మా పదేళ్ల పాలన.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?. మీరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినా మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరు. 👊కాంగ్రెస్ లో బహునాయకత్వం ఉంటే తప్పేంటి?. బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు ఇస్తే తప్పేముంది?. అయినా రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో సీఎం లు మారారా?. మాట ఇస్తే అమలు చేసే పార్టీ కాంగ్రెస్.. ఆనాడు అమలు చేశాం. ఇప్పుడూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదు. 👊తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మదు.. క్షమించదు. కర్ణాటక ప్రభుత్వం వసూళ్లపై కేటీఆర్ కి అనుమానం ఉంటే విచారణకి లెటర్ రాస్తే దాన్ని ఆమోదించి విచారణ చేయించాలని నేను కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వసూళ్లపై విచారణ జరిపించాలని లెటర్ రాస్తాను. ఆమోదించి విచారణ జరిపిస్తారా? అని నిలదీశారు రేవంత్. అలాగే.. ఓట్ల కోసమే కేటీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నాడంటూ విమర్శించారు రేవంత్. 👊కాంగ్రెస్ వేవ్ ను ఆపడం ఎవరి తరం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్కా. భయం తో ఉచిత సిలిండర్లు ,సన్న బియ్యం రేషన్ , రైతు లకు పెన్షన్ లాంటి హామీ లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. బీఆర్ఎస్ పనైపోయింది ,ప్రభుత్వం లో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరు. టిక్కెట్ ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాతే ఉంటుంది. టిక్కెట్ ల ప్రకటన నాటి కి చాలా మంది బీజేపీ, బీఆర్ఎస్ నేతల చేరిక ఉంటుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ లు మా పార్టీ లోకి వస్తున్నారంటేనే మా బలం ఏంటో అర్దం అవుతుంది. బీఆర్ఎస్ కు 25 సీట్లు దాటే ఛాన్స్ లేదు. 👊రాష్ట్రంలో 19% ఓట్లు అన్ డిసైడ్ లో ఉన్నాయి..ఇందులో మెజారిటీ ఓటు షేర్ మాకే వస్తుంది. సౌత్ ,నార్త్ ఓట్ పల్స్ కు చాలా తేడా ఉంటుంది. సౌత్ లో ఇండివీజువల్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ లో బీసీ ఆశావాహుల కోసం పీసీసీ గా నేను కొట్లాడుతా. సర్వే లో ఓసి, బీసీ కి ఈక్వల్ వస్తే..బీసీ కే టిక్కెట్ ఇస్తాం. తమ కు ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీ లు అడగడం లో తప్పులేదు. మేము కూడా బీఆర్ఎస్ బీసీ లకు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ ఇస్తాం. -
తేజ్, మనోజ్.. 'బిల్లా-రంగా'!
మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్‌కింగ్ మోహన్ బాబు కలిసి నటించిన బిల్లా రంగా సినిమా త్వరలోనే రీమేక్ కానుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. గురువారం హీరో సాయి ధరమ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్భంగా అప్పటి సూపర్‌హిట్ `బిల్లా రంగా` పోస్టర్‌ను సాయి ధరమ్‌తేజ్ ట్విటర్‌కి ట్యాగ్ చేశారు. 'బిల్లారంగా విడుదలై నేటికి 38 సంవత్సరాలు పూర్తయింంది, ఈరోజే నీ పుట్టినరోజు కావడం విశేషం.. అంటే ఈ రకంగా మనకు ఏదో హింట్ ఇస్తున్నట్లుంది బాబాయ్.. ఇది చేయడానికి నేను రెడీ.. నువ్వు రెడీనా 'అంటూ మనోజ్ ట్వీట్ చేశాడు. (అల్లుడికి చిరు బర్త్‌డే విషెస్.. ఆనందంలో హీరో! ) దీంతో మరికొన్ని రోజుల్లోనే బిల్లారంగా రీమేక్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ గురువారం 34వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తేజ్‌కు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. (మనోజ్ బర్త్‌డే.. వలస కూలీలకు సాయం) Happy Birthday babai @IamSaiDharamTej 🎂 and coincidentally, the biggest blockbuster multi starrer of that time #BillaRanga completed 38 years 😍 I think this says something to us babai 😜 Nenu ready... Nuvvu ready ah? 🤗❤️ pic.twitter.com/iQQJGhYwfg — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) October 15, 2020 -
బిల్లా-రంగా ఏం చేశారు?
రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న ఓ ఇద్దరు యువకుల జీవితాలు ఓ సంఘటన వల్ల ఎలా మలుపు తిరిగాయనే కథాంశంతో తమిళంతో తెరకెక్కిన చిత్రం ‘కేడీ బిల్లా-కిలాడీ రంగా’. ఈ చిత్రాన్ని అదే పేరుతో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. విమల్, శివకార్తీకేయన్, రెజీనా, బింధుమాధవి ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. ‘‘ ‘గోలీసోడా’, ‘మెరీనా’ లాంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ ఈ సినిమా కూడా చాలా బాగా తీశారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం ఈ చిత్రానికి హైలైట్. త్వరలో అనువాద కార్యక్రమాలు మొదలుపెడతాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: విజయ్. -
బిల్లా రంగ మూవీ ప్రెస్ మీట్
-
నవ్వించే బిల్లా రంగా
వెంకట్రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశిరెడ్డి సుధీర్‌రెడ్డి నిర్మించారు. ఎంతోమందిని హీరోలుగా తీర్చిదిద్దిన వైజాగ్ సత్యానంద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. రెండుగంటలపాటు నిరవధికంగా ఎంటర్టైన్ చేస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకున్నారు. తమిళంలో సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ నారాయణ్ తెలుగులో పాటలు స్వరపరచిన తొలి చిత్రం ఇది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నట్లుగానే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. -
‘బిల్లా-రంగా’ పాటలు
వెంకట్ రాహుల్, ప్రదీప్ బెంటో, రిషిక ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. వంశీ బోయిన, అరవింద్ వన్నాల, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియోసీడీని ఆవిష్కరించి, వైజాగ్ సత్యానంద్‌కి అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ -‘‘పవన్‌కల్యాణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటశిక్షణను అందించిన గురువు సత్యానంద్. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి వెండితెరపై కనిపించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. మంచి టీమ్‌తో ఈ సినిమా చేశామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం తన శిష్యుడు మహేంద్ర చక్రవర్తి అని సత్యానంద్ తెలిపారు. భీమినేని, దాము, రమేష్ పుప్పాల, ప్రిన్స్, నవీన్‌చంద్ర, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.