నవ్వించే బిల్లా రంగా
నవ్వించే బిల్లా రంగా
Published Thu, Feb 13 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
వెంకట్‌రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశిరెడ్డి సుధీర్‌రెడ్డి నిర్మించారు. ఎంతోమందిని హీరోలుగా తీర్చిదిద్దిన వైజాగ్ సత్యానంద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ప్రేక్షకులను హాయిగా నవ్వించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. రెండుగంటలపాటు నిరవధికంగా ఎంటర్‌టైన్ చేస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా మెచ్చుకున్నారు. తమిళంలో సంగీతదర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ నారాయణ్ తెలుగులో పాటలు స్వరపరచిన తొలి చిత్రం ఇది. పాటలకు మంచి స్పందన లభిస్తున్నట్లుగానే సినిమా కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
Advertisement
Advertisement