పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ | Bigg Boss 7 Pradeep Antony Wedding With Girlfriend Pooja | Sakshi
Sakshi News home page

Pradeep Anthony: జూన్‌లో నిశ్చితార్థం.. ఇప్పుడు పెళ్లి

Nov 7 2024 1:04 PM | Updated on Nov 7 2024 1:28 PM

Bigg Boss 7 Pradeep Antony Wedding With Girlfriend Pooja

గతేడాది బిగ్‌బాస్ 7 తమిళ సీజన్‌లో పాల్గొన‍్న ప్రదీప్ ఆంటోని వివాదానికి కారణమయ్యాడు. తనతో పాటు హౌసులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రెడ్ కార్డ్ జారీ చేసి, షో నుంచి అర్థాంతరంగా బయటకు పంపేశారు. ఈ సీజన్‌లో తిరిగి పాల్గొంటాడని అన్నారు. కానీ అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడు.

(ఇదీ చదవండి:'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా)

గత కొన్నాళ్లుగా పూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ప్రదీప్ ఆంటోని.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారం (నవంబర్ 7) క్రిస్టియన్ పద్ధతిలో పూజని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ సురేశ్ చక్రవర్తి  పోస్ట్ చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. డాడా, అరువి, వాళ్ తదితర సినిమాలు చేసిన ప్రదీప్ ఆంటోని.. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు.

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో మాత్రం ఈసారి కమల్ హాసన్ తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా వచ్చాడు. దాదాపు 70 రోజులు అయిపోయినా సరే తెలుగు సీజన్‌ అంతంత మాత్రంగానే సాగుతోంది. తమిళంలో పర్లేదనిపించేలా నడుస్తోంది.

(ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement