Venkat Rahul
-
‘అర్జున’ రేసులో రాహుల్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ పేరును ఈ ఏడాది కేంద్ర క్రీడా పురస్కారం ‘అర్జున’ కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) నామినేట్ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన 23 ఏళ్ల రాహుల్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అంతకుముందు 2015, 2017లలో కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు గెలిచాడు. 2015 ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రాహుల్... 2014 యూత్ ఒలింపిక్స్ క్రీడల్లో రజతం... 2013 ఆసియా యూత్ క్రీడల్లో స్వర్ణం... 2013 ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు. మీరాబాయి, పూనమ్ పేర్లను కూడా... రాహుల్‌తోపాటు మీరాబాయి చాను (మణిపూర్), పూనమ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) పేర్లను ఐడబ్ల్యూఎల్ఎఫ్ కేంద్ర క్రీడా శాఖకు ప్రతిపాదించింది. అయితే మీరాబాయి ఇప్పటికే దేశ అత్యున్నత క్రీడాపురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ను 2018లోనే అందుకుంది. వాస్తవానికి ‘ఖేల్‌రత్న’ కోసం ఎవరినైనా నామినేట్ చేయాలంటే ముందుగానే వారికి ‘అర్జున’ వచ్చి ఉండాలి. కానీ 2017లో మీరాబాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గి విశ్వవిజేతగా నిలువడంతో ఆమె ఘనతకు గుర్తింపుగా కేంద్ర క్రీడాశాఖ నేరుగా ‘ఖేల్‌రత్న’ను అందజేసింది. ఇప్పటికే తాను అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్‌రత్న’ అందుకున్నా ‘అర్జున’ అవార్డు ప్రత్యేకత వేరుగా ఉంటుందని మీరాబాయి వ్యాఖ్యానించింది. పూనమ్ యాదవ్ 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. 2015లో సతీశ్ శివలింగం అర్జున అవార్డు పొందాక మరే వెయిట్‌లిఫ్టర్‌కు ‘అర్జున’ లభించలేదు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వెయిట్‌లిఫ్టర్ రాహుల్
విజయవాడ స్పోర్ట్స్: కామన్వెల్త్ గేమ్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాడు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆగిరిపల్లి క్యాంపు వద్ద రాహుల్ తన తండ్రి మధుతో పాటు కలిశాడు. రాహుల్‌కు ఆర్థిక సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాహుల్‌కు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి లక్ష రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్టుపురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ గోల్డ్‌కోస్ట్ (ఆస్ట్రేలియా) వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. -
స్వర్ణ విజేత రాహుల్‌కు పవన్ నజరానా
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రూ.10 లక్షల నజరానాను ప్రకటించారు. శనివారం వెంకట్ రాహుల్ పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు జనసేన ఓప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాహుల్‌ను, క్రీడల వైపు ప్రోత్సహించిన అతని తండ్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం అందరికి తెలిసేలా బాపట్ల పట్టణంలో జనసేన తరపున ఈనెల 30న భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేదికపైనే రాహుల్ తండ్రిని మధును సైతం సన్మానిస్తామని ఆయన పేర్కొన్నారు. గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
మెరిసిన తెల్ల‘బంగారం’
గజ్వేల్‌లో పత్తి క్వింటాలుకు ధర రూ.5,550 గజ్వేల్: తెల్ల‘బంగారం’ మెరి సింది. ఈ సీజన్ కు సంబం ధించి రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో సోమ వారం పత్తి క్వింటాలుకు రూ.5,550 పలికింది. ఈ విషయాన్ని స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్ రాహుల్ తెలిపారు. ఈ మార్కెట్ యార్డు పరిధిలో ఇప్పటి వరకు 1.6 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి. గజ్వేల్ మార్కెట్ యార్డులో సీజన్ ఆరంభం నుంచే రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలికింది. తాజాగా రూ.5,550కు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. -
వెంకట్@ఐఏఎస్
పేదకుటుంబం నుంచి ఎంపికైన జిల్లావాసి పోచమ్మమైదాన్ : ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు చదువులో రాణించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. హన్మకొండ గుడిబండల్‌కు చెందిన నరసింహ స్వామి కుమారుడు రాహుల్ వెంకట్ ఇటీవల విడుదలైన సివిల్స్ పలితాల్లో 386వ ర్యాంక్ సాధిం చాడు. శుక్రవారం జరిగిన ఐఏఎస్ ఎంపికలో రాహుల్ వెంకట్ ఎంపికయ్యాడు. హన్మకొండ రెడ్డి కాలనీలోని సేయింట థామస్ గ్రామర్ హై స్కూల్లో పదో తర గతి వరకు చదివాడు. విజయవాడలోని నలంద కళాశాలలో, కూకట్పల్లి జెన్టీయూలో బీటెక్ సీఎస్ఈ చేశాడు. ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ పూర్తి చేశారు. స్టాక్ మార్కెట్లో క్లస్టర్ హెడ్‌గా దాదాపు మూడున్నర సంవత్సరాలు చేశాడు. సివిల్స్ లక్ష్యంతో జాబ్ రిజైన్ చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ నాల్గవ అటెంట్‌లో 386వ ర్యాంక్‌ను సాధించారు. గతేడాది సివిల్స్‌లో ఎంపికై ఇంటర్వ్యూలో మిస్సయ్యడు. సివిల్స్‌లో అంథ్రోపాలజీని ఎంపిక చేసుకున్నాడు. ఎంపిక కావడానికి అమ్మే కారణం రాహుల్ వెంకట్‌ను ‘సాక్షి’ ఫోన్లో పలకరించగా.. సివిల్స్‌లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మనాన్నలు చాలా ప్రోత్సహించేవారు అని అన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి అమ్మ కీలకం అని చెప్పారు. -
రియో ఒలింపిక్స్‌కు రాహుల్ ఎంపిక
బాపట్ల : వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 85 కిలోల విభాగంలో స్వర్ణపతకాల వేటలో ఉన్న రాహుల్‌ను ఒలింపిక్స్ ఎంపిక చేయటంతోపాటు, ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పంజాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. రాహుల్ ఎంపిక కావటంతో ఆయన స్వగ్రామైన బాపట్ల మండలం స్టువర్టుపురంలో సందడి వాతావరణం నెలకొంది. రాహుల్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ముప్పలనేని శేషగిరిరావు, ప్రిన్సిపాల్ శారానివేదిత అభినందనలు తెలిపారు. రాహుల్ తల్లిదండ్రులు మధు, నీలిమా తన బిడ్డ ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణపతకాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు. -
సత్తా చాటుతున్నాడు!
వెయిట్ లిప్టింగ్లో జాతీయంగా, అంతర్జాతీ యంగా సత్తా చాటుతున్నాడు మన తెలుగింటి కుర్రాడు రాగాల వెంకట్ రాహుల్. గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ చైనాలో జరిగిన యూత్ ఒలంపిక్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. రాహుల్ నాన్న మధు కూడా ఒకప్పుడు వెయిట్‌లిఫ్టరే. సరియైన సహకారం, ప్రోత్సాహం లేక మధు తన కలలను నిజం చేసుకోలేకపోయారు. అందుకే వెయిట్ లిఫ్టింగ్ విషయంలో అన్నీ తానై కొడుకును ప్రోత్సహించారు. ఏపి స్పోర్ట్స్ స్కూల్లో చేర్పించారు. ఎస్.ఎ.సింగ్, మాణిక్యాలరావులు రాహుల్‌ను టాప్ క్లాస్ లిఫ్టర్‌గా తీర్చిదిద్దారు. 2008లో 56 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలను, అదే సంవత్సరం పాటియాలాలో మూడు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. ‘‘అతనిది సహజమైన ప్రతిభ’’ అని కోచ్ ఎస్ ఎ సింగ్ రాహుల్‌ను ప్రశంసించారు. 2016 రియో ఒలంపిక్స్‌లో రాహుల్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని సింగ్ నమ్మకంగా చెబుతున్నారు. ఆయన నమ్మకం నిజం కావాలని ఆశిద్దాం. -
బిల్లా రంగ మూవీ ప్రెస్ మీట్
-
ఊరు బాగు కోసం...
తమ ఊరు బాగు కోసం శ్రమించిన కొందరు యువకుల కథతో రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. వెంకట్ రాహుల్, ప్రదీప్, రిషిక, చరణ్‌దీప్ కాంబినేషన్లో ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో అరవింద్ వన్నాల, వంశీ బోయిన, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ సినిమా నిర్మించారు. వచ్చేవారం ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. ఇందులో తన పాత్ర భిన్నంగా ఉంటుందని వెంకట్ రాహుల్ చెప్పారు. ఈ సినిమాలో పొలిటికల్ సెటైర్‌తో పాటు కామెడీ కూడా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. -
రాహుల్ ‘పసిడి సిక్సర్’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సత్తా చాటుకున్నాడు. మలేసియాలోని పెనాంగ్‌లో జరిగిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రాహుల్ ఏకంగా ఆరు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో రాహుల్ యూత్, జూనియర్ విభాగాల్లో బరిలోకి దిగాడు. యూత్ 77 కేజీ విభాగంలో రాహుల్ స్నాచ్‌లో 140 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 161 కేజీలు బరువు ఎత్తాడు. మొత్తంగా 301 కేజీలతో ఈ అంశంలోనూ అగ్రస్థానంలో నిలిచి మూడు స్వర్ణాలు సాధించాడు. యూత్ కేటగిరిలో రాహుల్ నమోదు చేసిన ప్రదర్శనను జూనియర్ కేటగిరిలోనూ పరిగణనలోకి తీసుకోవడంతో అతనికి ఈ విభాగంలోనూ మరో మూడు స్వర్ణాలు ఖాయమయ్యాయి. దాంతో రాహుల్ ఖాతాలో మొత్తం ఆరు పసిడి పతకాలు చేరాయి. సీనియర్ పురుషుల 77 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన శివలింగం సతీశ్ కుమార్ మూడు పసిడి పతకాలను సాధించాడు. ఓవరాల్‌గా ఈ పోటీల్లో భారత లిఫ్టర్లు 47 స్వర్ణాలు, 28 రజతాలు, 12 కాంస్యాలతో కలిపి మొత్తం 87 పతకాలను సాధించారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన రాహుల్ గత ఆగస్టులో చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో... మూడు స్వర్ణ పతకాలను నెగ్గాడు. అంతకుముందు మేలో దోహాలో జరిగిన ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు... ఏప్రిల్‌లో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలను సాధించాడు. -
‘బిల్లా-రంగా’ పాటలు
వెంకట్ రాహుల్, ప్రదీప్ బెంటో, రిషిక ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘బిల్లా-రంగా’. ప్రదీప్ మాడుగుల దర్శకుడు. వంశీ బోయిన, అరవింద్ వన్నాల, కాశీరెడ్డి సుధీర్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. సంతోష్ నారాయణన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియోసీడీని ఆవిష్కరించి, వైజాగ్ సత్యానంద్‌కి అందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ -‘‘పవన్‌కల్యాణ్, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్లకు నటశిక్షణను అందించిన గురువు సత్యానంద్. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి వెండితెరపై కనిపించనుండటం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. మంచి టీమ్‌తో ఈ సినిమా చేశామని నిర్మాతలు చెప్పారు. ఈ సినిమాలో తాను నటించడానికి కారణం తన శిష్యుడు మహేంద్ర చక్రవర్తి అని సత్యానంద్ తెలిపారు. భీమినేని, దాము, రమేష్ పుప్పాల, ప్రిన్స్, నవీన్‌చంద్ర, రఘు కుంచె తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీనియర్ విభాగంలోనూ రాణిస్తా!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ యూత్, జూనియర్ స్థాయిలో సాధించిన విజయాలు సంతృప్తినిచ్చాయని, ఇకపై సీనియర్ విభాగంలోనూ రాణించేందుకు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ అన్నాడు. ఏపీ స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల రాహుల్, ఇటీవల పలు అంతర్జాతీయ టోర్నీల్లో సత్తా చాటాడు. గత రెండు నెలల కాలంలో ఆసియా యూత్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్, ఆసియా ఇంటర్ క్లబ్లో 1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు నెగ్గాడు. అంతర్జాతీయ స్థాయి సీనియర్ విభాగంలో రాణించేందుకు స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కనీసం మరో 5 కిలోలు అదనంగా బరువు ఎత్తాల్సి ఉంటుందని, అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నానని రాహుల్ చెప్పాడు. తాను పాల్గొనే అన్ని టోర్నీలలో 77 కేజీల విభాగంలో అతను పోటీ పడుతున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో పతకమే లక్ష్యంగా పాటియాలలోని ఎన్ఐఎస్లో రాహుల్ శిక్షణ పొందుతున్నాడు. ‘ప్రస్తుతం నేను స్నాచ్‌లో 145 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 175 కిలోల వరకు బరువు ఎత్తగలుగుతున్నాను. మరో 5 కిలోలు కలిపి 150, 180 చేస్తే సీనియర్‌లోనూ నేను పతకం గెలుచుకునే అవకాశం ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్లో కాంస్య పతక విజేత ప్రదర్శనకంటే కూడా ఇది మెరుగైన ప్రదర్శన’ అని అతను వివరించాడు. ‘శాప్’ ఎండీ అభినందన వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుస విజయాలు సాధిస్తున్న ఏపీ ఆటగాడు ఆర్వీ రాహుల్‌ను మంగళవారం ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేనేజింగ్ డెరైక్టర్ రాహుల్ బొజ్జా అభినందించారు. అతను భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాహుల్‌తో పాటు అతని తల్లిదండ్రులు, ఏపీ వెయిట్ లిఫ్టింగ్ సంఘం కార్యదర్శి వెంకట్రామయ్య, ఏపీ స్పోర్ట్స్ స్కూల్ ప్రత్యేక అధికారి నర్సయ్య, కోచ్‌లు మాణిక్యాల రావు, సింగ్ కూడా ఉన్నారు. -
310 కేజీలు ఎత్తిన ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్
రెండేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ మరోసారి మెరిశాడు. ఆటల్లో అగ్రగామిగా ఉన్న చైనా నేలపై ఈ యువ తార పసిడి కాంతులు విరజిమ్మాడు. తన అద్భుత ప్రదర్శనతో ఆసియా యూత్ క్రీడల్లో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకాన్ని చేర్చాడు. నాన్జింగ్ (చైనా): అంచనాలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఆసియా యూత్ క్రీడల్లో అదరగొట్టాడు. బుధవారం జరిగిన పురుషుల 77 కేజీల విభాగంలో రాహుల్ మొత్తం 310 కేజీలు బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)పై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నిషేధం కొనసాగుతున్న కారణంగా ఈ క్రీడల్లో భారత క్రీడాకారులు ఇండిపెండెంట్ ఒలింపిక్ అథ్లెట్స్ (ఐఓఏ) పేరుతో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన 16 ఏళ్ల రాహుల్ స్నాచ్‌లో 142 కేజీలు... క్లీన్ అండ్ జెర్క్‌లో 168 కేజీల బరువెత్తాడు. మొత్తం 310 కేజీలతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ మూడు అంశాల్లోనూ రాహుల్ ‘టాప్’లో ఉండటం విశేషం. లూ జింగ్యూ (చైనా, 285 కేజీలు) రజతం సాధించగా... పిచెట్ మనీశ్రీ (థాయ్‌లాండ్, 280 కేజీలు) కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఆద్యంతం ఆధిపత్యం... పురుషుల 77 కేజీల విభాగంలో మొత్తం 11 మంది వెయిట్‌లిఫ్టర్లు బరిలోకి దిగారు. స్నాచ్లోని తొలి ప్రయత్నంలో రాహుల్ 132 కేజీలు.... రెండోసారి 137 కేజీలు... మూడోసారి 142 కేజీలు ఎత్తాడు. క్లీన్ అండ్ జెర్క్‌లో ఈ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్ (ఏపీఎస్ఎస్) విద్యార్థి తొలుత 158 కేజీలు... రెండోసారి 164 కేజీలు... మూడోసారి 168 కేజీలు ఎత్తాడు. అన్ని ప్రయత్నాల్లోనూ మిగతా 10 మంది వెయిట్‌లిఫ్టర్లు రాహుల్ ఎత్తిన బరువుకు సమీపంలోకి రాకపోవడం గమనార్హం. షూటర్ షైంకీ నాగర్‌కు రజతం మరోవైపు ఈ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. షూటింగ్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో షైంకీ నాగర్ రజతం పతకం సాధించాడు. అతను .2 పాయింట్ల తేడాతో స్వర్ణ పతకాన్ని కోల్పోయాడు. షైంకీ 195.3 పాయింట్లు స్కోరు చేయగా... ‘పసిడి’ నెగ్గిన చైనా షూటర్ వూ జియావు 195.5 పాయింట్లు స్కోరు చేశాడు. రిఫత్ గిర్ఫనోవ్ (ఉజ్బెకిస్థాన్-174.7 పాయింట్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈనెల 24న ముగియనున్న ఆసియా యూత్ క్రీడల్లో ఇప్పటివరకు భారత్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో తొమ్మిదో స్థానంలో ఉంది.