
స్వర్ణ విజేత రాహుల్‌తో పవన్ కల్యాణ్
సాక్షి, హైదరాబాద్ : కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిప్టింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రూ.10 లక్షల నజరానాను ప్రకటించారు. శనివారం వెంకట్ రాహుల్ పవన్ కల్యాణ్‌ను ఆయన నివాసంలో కలిసినట్లు జనసేన ఓప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రాహుల్‌ను, క్రీడల వైపు ప్రోత్సహించిన అతని తండ్రిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ విజయం అందరికి తెలిసేలా బాపట్ల పట్టణంలో జనసేన తరపున ఈనెల 30న భారీ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేదికపైనే రాహుల్ తండ్రిని మధును సైతం సన్మానిస్తామని ఆయన పేర్కొన్నారు.
గోల్డ్‌కోస్ట్ వేదికగా జరిగిన కామెన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా స్టువర్ట్‌పురం ప్రాంతానికి చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151+క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి పసిడిని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment