పేదకుటుంబం నుంచి ఎంపికైన జిల్లావాసి
పోచమ్మమైదాన్ : ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు చదువులో రాణించి ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. హన్మకొండ గుడిబండల్‌కు చెందిన నరసింహ స్వామి కుమారుడు రాహుల్ వెంకట్ ఇటీవల విడుదలైన సివిల్స్ పలితాల్లో 386వ ర్యాంక్ సాధిం చాడు. శుక్రవారం జరిగిన ఐఏఎస్ ఎంపికలో రాహుల్ వెంకట్ ఎంపికయ్యాడు. హన్మకొండ రెడ్డి కాలనీలోని సేయింట థామస్ గ్రామర్ హై స్కూల్‌లో పదో తర గతి వరకు చదివాడు. విజయవాడలోని నలంద కళాశాలలో, కూకట్‌పల్లి జెన్‌టీయూలో బీటెక్ సీఎస్‌ఈ చేశాడు. ఇండియన్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. స్టాక్ మార్కెట్‌లో క్లస్టర్ హెడ్‌గా దాదాపు మూడున్నర సంవత్సరాలు చేశాడు. సివిల్స్ లక్ష్యంతో జాబ్ రిజైన్ చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. సివిల్స్ నాల్గవ అటెంట్‌లో 386వ ర్యాంక్‌ను సాధించారు. గతేడాది సివిల్స్‌లో ఎంపికై ఇంటర్వ్యూలో మిస్సయ్యడు. సివిల్స్‌లో అంథ్రోపాలజీని ఎంపిక చేసుకున్నాడు.
ఎంపిక కావడానికి అమ్మే కారణం
రాహుల్ వెంకట్‌ను ‘సాక్షి’ ఫోన్‌లో పలకరించగా.. సివిల్స్‌లో ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా అమ్మనాన్నలు చాలా ప్రోత్సహించేవారు అని అన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావడానికి అమ్మ కీలకం అని చెప్పారు.
వెంకట్@ఐఏఎస్
Published Sat, Aug 15 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement
Advertisement