civils results
-
Parvathy Gopakumar: ఒంటి చేత్తో విజయం
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి గోపకుమార్ సివిల్స్ 2023లో 282వ ర్యాంక్ సాధించడానికి ఒంటి చేత్తో పోరాడింది. ‘మీరు సంతోషంగా ఉంటేనే సరిగ్గా చదవగలరు’ అంటున్న పార్వతి సమస్యలను జయించగల చిరునవ్వును సొంతం చేసుకుంది. పార్వతి గోపకుమార్ సంతోషంగా ఉంది. ఆమెకు కలెక్టర్ కావాలని ఉంది. సివిల్స్ 2023 ఫలితాలలో 282 ర్యాంక్ సాధించింది. కాని ఆ ర్యాంక్‌కు ఐ.ఏ.ఎస్. రాకపోవచ్చు. కాని దివ్యాంగ కోటాలో చూసినప్పుడు ఆమెది టాప్ ర్యాంక్. కనుక రావచ్చు.‘మాది అలెప్పి. బెంగళూరు నేషనల్ లా స్కూల్లో చదువుకున్నాను. ఆ సమయంలో అలెప్పి కలెక్టరేట్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో నాటి కలెక్టర్ ఎస్.సుహాస్ పనిచేసే విధానం, కలెక్టర్ స్థానంలో ఉంటే ప్రజలకు చేయదగ్గ సేవ చూసి నాక్కూడా ఐ.ఏ.ఎస్. కావాలనిపించింది. ఆ విషయం తెలిశాక కలెక్టరేట్లో అందరూ నన్ను అందుకు కష్టపడమని ్రపోత్సహించారు. 2022లో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు ప్రిలిమ్స్ దాటలేకపోయాను. ఒక సంవత్సరం విరామం ఇచ్చి 2023లో రెండోసారి రాశాక ఈ ర్యాంక్ తెచ్చుకున్నాను’ అని తెలిపింది పార్వతి. ఇప్పుడు ఆమె వయసు 26 సంవత్సరాలు. 7వ తరగతిలో ప్రమాదం2010లో పార్వతి ఏడవ తరగతిలో ఉండగా కారు ప్రమాదంలో ఆమె కుడిచేయి మోచేతి వరకు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వయసులో అలాంటి నష్టం ఎవరికైనా పెద్ద దెబ్బగా ఉంటుంది. అయితే తండ్రి గోపకుమార్, తల్లి శ్రీకళ ఇచ్చిన ధైర్యంతో వెంటనే ఎడమ చేత్తో రాయడం ్రపాక్టీసు చేసింది పార్వతి. ఆ తర్వాత మూడు నెలల్లో వచ్చిన పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకు సిలికాన్, ΄్లాస్టిక్లతో చేసిన కృత్రిమ హస్తాన్ని అమర్చుకుంది.‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ΄్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.మహిళా దివ్యాంగుల కోసంఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోందామె. -
AP: సీఐ తిట్టాడని రాజీనామా.. కట్ చేస్తే సివిల్స్ ర్యాంకర్‌గా ఉదయ్..
తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినప్పటికీ పట్టుదలతో ఓ యువకుడు సివిల్స్ ర్యాంకు సాధించాడు. తన కోసం నానమ్మ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకుంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించుకునేందుకు ఎంతో కృషి చేశాడు. తన లక్ష్యసాధనలో సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించాడు. అతనే ప్రకాశం జిల్లాకు చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించారు. ఐదేళ్ల వయసులో తల్లి జయమ్మ మృతి చెందారు. తండ్రి శ్రీనివాసులురెడ్డి భరోసా, నానమ్మ రమణమ్మ బాధ్యతలు చూశారు. ఉదయ్ ఇంటర్ చదువుతున్న సమయంలో తండ్రి శ్రీనివాసులు చనిపోయారు. తండ్రి అకాల మరణంతో ఉదయ్, తన సోదరుడు ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో వారికి నానమ్మ కొండంత అండగా నిలిచారు. నానమ్మ రమణమ్మ అప్పటి నుంచి ఇద్దరు మనవళ్ల చదువు కోసం కష్టపడ్డారు. దీంతో, 2013లో ఉదయ్ మొదట కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పటికీ ఆత్మవిశ్వాసం సడలకుండా నాలుగోసారి ఉత్తమ ర్యాంకు సాధించారు. అయితే, తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేయడానికి, సివిల్స్ ప్రేపర్ అవడానికి గల కారణాలను ఉదయ్ వెల్లడించారు. Telugu Police Constable resigns police job after humiliation, cracks UPSC "CI humiliated me in front of 60 policemen. I resigned from the job the same day and started preparing for UPSC Civil Services." - Uday Krishna Reddy (780th rank in 2023 UPSC Civil Services) Uday Krishna… pic.twitter.com/J9AB5diasa — Sudhakar Udumula (@sudhakarudumula) April 17, 2024 కాగా, తాను కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఒక సీఐ తనను అకారణంగా 60 మంది పోలీసుల ముందు తిట్టారని చెప్పుకొచ్చారు. తన తప్పు లేకున్నా అలా తిట్టడంతో అదే రోజున ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. దీంతో, అప్పటి నుంచి సివిల్స్‌కు ప్రిపేర్ అయినట్టు స్పష్టం చేశారు. ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదవినట్టు చెప్పారు. ఐఆర్ఎస్ వస్తుందని.. ఆ జాబ్‌లో చేరి ఐఏఎస్ సాధించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఆ సమయంలో సీఐ చేసిన అవమానమే సివిల్స్ సాధించేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. -
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
-
సివిల్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: సివిల్స్‌లో ర్యాంకు సాధించడం దేశంలో చాలామంది కల. ఇందులో ఈసారీ తెలుగు విద్యార్థులు సత్తా చాటి తమ లక్ష్యాన్ని అందుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లే ఉన్నారు. నందాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధిస్తే, కేఎన్ చందన జాహ్నవి 50, మెరుగు కౌశిక్ 82వ ర్యాంకు సాధించారు. మొత్తం ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 36 మంది ఉన్నారు. అలాగే, ఇతర కేంద్ర సర్వీసులకు 20 మందికిపైగా ఎంపికయ్యారు. మొత్తమ్మీద కేంద్ర సర్వీసులకు 56 మందికిపైగా తెలుగు తేజాలు ఎంపికవడం విశేషం. అఖిల భారత సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్– 2023 కోసం గత ఏడాది మే 28న ప్రిలిమ్స్ నిర్వహించింది. ప్రిలిమినరీలో అర్హత పొందిన వారికి గత నవంబర్‌లో మెయిన్స్ పరీక్ష నిర్వహించగా, ఈ పరీక్ష ఫలితాలను డిసెంబర్ 8న వెల్లడించారు. మెయిన్స్‌లోనూ అర్హత పొందిన వారికి జనవరి 2, ఏప్రిల్ 9 మధ్య వ్యక్తిగత ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తంగా పొందిన మార్కుల ఆధారంగా ర్యాంకులను యూపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. ఆలిండియా టాపర్‌గా లక్నోకు చెందిన ఆదిత్య శ్రీవాత్సవ నిలవగా, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రదాన్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించారు. 2022 సివిల్స్‌లోనూ తెలుగు విద్యార్థి ఉమాహారతి మూడో స్థానం పొందడం విశేషం. 1,016 మంది ఎంపిక సివిల్స్–2023 కోసం యూపీఎస్సీ 1,016 మందిని ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి 115, ఓబీసీ నుంచి 303, ఎస్సీల నుంచి 165, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్ సర్వీసులకు 180 మంది, ఐఎఫ్ఎస్కు 37 మంది, ఐపీఎస్‌కు 200 మంది ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్–ఏ కేటగిరీకి 613 మంది, గ్రూప్ బీ సర్వీసెస్‌కు 113 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు పొందిన మార్కులను 15 రోజుల్లో తమ వెబ్సైట్లో ఉంచుతామని ప్రకటించింది. విజేతలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు రాష్ట్రాల విజేతలకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ నుంచి ఈసారి 50 మందికి పైగా ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్య రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహేష్ భగవత్ కృషి ఫలించింది సివిల్స్ పరీక్షల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ గైడెన్స్ మంచి ఫలితాలను ఇచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా శిక్షణ పొందుతున్న వారితో ప్రత్యక్షంగా, ఇతర రాష్ట్రాల వారితో ఆన్లైన్ ద్వారా ఆయన ఇచ్చిన సూచనలతో 200 మందికి పైగా ర్యాంకులు సాధించారు. అందులో తెలంగాణ నుంచి అనన్య రెడ్డి సహా జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న వారు కూడా ఉన్నారు. సివిల్స్ ప్రిపేరయ్యే వారికి వ్యక్తిత్వ వికాసం, పరీక్ష సమయాల్లో ఒత్తిడి, సమయ పాలన, ఇంటర్వ్యూలో వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాలపై మహేష్ భగవత్ సూచనలు చేశారు. -
UPSC: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో 1,016 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రధాన్‌కు రెండో ర్యాంకు, దోనూరి అనన్యరెడ్డికి మూడో ర్యాంకు దక్కింది. ఇక ఈ యూపీఎస్సీ ఫలితాల్లో వరంగల్‌కు చెందిన ఇద్దరు సెలక్ట్ అయ్యారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ర్యాంకుల పంట పండింది. మొత్తం 1,016 మంది ఎంపికయితే.. అందులో తెలుగు అభ్యర్థులు కనీసం 50కి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దోనూరు అనన్యారెడ్డికి మూడో ర్యాంకు అన్షుల్ భట్ 22వ ర్యాంకు నందల సాయి కిరణ్‌కు 27 ర్యాంకు మెరుగు కౌశిక్‌కు 82వ ర్యాంకు పింకిస్ ధీరజ్ రెడ్డి 173 ర్యాంకు అక్షయ్ దీపక్ 196 ర్యాంకు భానుశ్రీ 198 ర్యాంకు ప్రదీప్ రెడ్డి 382 ర్యాంకు వెంకటేష్ 467 ర్యాంకు హరిప్రసాద్ రాజు 475వ ర్యాంకు పూల ధనుష్ 480 ర్యాంకు కె. శ్రీనివాసులు 526 ర్యాంకు సాయితేజ 558 ర్యాంకు కిరణ్ సాయింపు 568 ర్యాంకు మర్రిపాటి నాగభరత్ 580 ర్యాంకు పీ. భార్గవ్ 590 ర్యాంకు అర్పిత 639 ర్యాంకు ఐశ్వర్య నీలిశ్యామల 649 ర్యాంకు సాక్షి కుమార్ 679 ర్యాంకు రాజ్‌కుమార్ చౌహన్ 703 ర్యాంకు జి.శ్వేత 711 ర్యాంకు ధనుంజయ్ కుమార్ 810 ర్యాంకు లక్ష్మీ భానోతు 828 ర్యాంకు ఆదా సందీప్ కుమార్ 830 ర్యాంకు జె.రాహుల్ 873 ర్యాంకు హనిత వేములపాటి 887 ర్యాంకు కె.శశికాంత్ 891 ర్యాంకు కెసారపు మీనా 899 ర్యాంకు రావూరి సాయి అలేఖ్య 938 ర్యాంకు గోపద నవ్యశ్రీ 995 ర్యాంకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి IAS వచ్చే అవకాశం ఉంది. కిరణ్‌కు IPS లేదా IRS రావొచ్చు. అనిల్ కుమార్‌కు IRS వచ్చే అవకాశం ఉంది. (సయింపు కిరణ్) గతేడాది మే 28వ తేదీన యూపీఎస్పీ ప్రిలిమ్స్ పరీక్ష జరిగాయి. ప్రిలిమ్స్ పరీక్షల అనంతరం మేయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో జరిగాయి. మేయిన్స్ పరీక్షల ఫలితాలను డిసెంబర్ ఎనిమిదో తేదీన విడుదల చేశారు. అనంతరం జనవరి రెండో తేదీ నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇంటర్వ్యూలు జరిగాయి. నేడు తుది ఫలితాలు వెలువడ్డాయి. UPSC has announced the final results of the Civil Services Examination. Congratulations to all achievers who have cleared this prestigious milestone! Your hard work and dedication have paid off.#Upsc_final_result#UPSC2024 #upsc#upsc2023 pic.twitter.com/jkj3sCPoSD — आदर्श यादव(Adarsh Yadav) (@AdarshY59491482) April 16, 2024 -
Hyderabad: సివిల్స్ విజేతల సరికొత్త ఫ్యాక్టరీ!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సివిల్ సర్వీసెస్..దేశంలో కోట్లాది మంది యువత మదిలో మెదిలే అత్యున్నత ఉద్యోగం. అన్ని పరీక్షల కంటే అత్యంత క్లిష్టంగా, అనేక వడపోతలతో సాగే ఈ ప్రక్రియ గురించి వింటేనే..వామ్మో మనకెలా సాధ్యం..? అని అన్పిస్తుంది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, ఐడీఈఎస్.. ఇలా 24 అఖిల భారత సర్వీసులకు ఎంపికయ్యేందుకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల కోసం ఒకప్పుడు ఢిల్లీకి వెళ్లి మరీ సన్నద్ధులైన తెలుగు రాష్ట్రాల వారిని పరిశీలిస్తే ఫెయిల్యూర్ స్టోరీలే ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ప్రాంతం క్రమంగా పట్టు బిగిస్తోంది..ర్యాంకుల సాధనలో సక్సెస్ అవుతోంది. 2021–2022 సివిల్స్ ఫలితాలే అందుకు నిదర్శనం అని నిపుణులు అంటున్నారు. తాజాగా ర్యాంకులు సాధించినవారిలో 46 మంది ఇక్కడివారే కావటం కొత్త చరిత్రగా పేర్కొంటున్నారు. హైదరాబాద్ సివిల్స్ విజేతల ఫ్యాక్టరీగా రూపుదిద్దుకున్న ఫలితమే గడిచిన నాలుగేళ్లుగా తెలుగింటి బిడ్డల జైత్రయాత్ర అని చెబుతున్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో ఎప్పుడూ టాప్‌లో ఉండే ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాల సరసన ఇప్పుడు తెలంగాణ కూడా చేరుతోంది. అమెరికా, ఐటీలొద్దంటూ.. ఇంజనీరింగ్, మెడికల్ ఇతర ప్రొఫెషనల్ చదువుల అనంతరం ఉన్నత ఉద్యోగం, అమెరికా లేదా ఇండియాలో ఐటీ ఉద్యోగాల్లో చేరేందుకు ఉత్సాహం చూపే ప్రతిభావంతుల్లో ఎక్కువమంది దృష్టి ఇప్పుడు సివిల్స్ వైపు మళ్లుతోంది. సమాజం నుంచి తీసుకున్న దాంట్లో కొంతైనా సేవా రూపంలో తిరిగి సమాజానికి ఇవ్వాలనే లక్ష్యంతో కొందరు సివిల్స్ వైపు అడుగులేస్తున్నారు. ఢిల్లీ ఐఐటీలో గోల్డ్‌మెడల్ సాధించిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అజ్మీరా సంకేత్ జపాన్‌లో మంచి ప్యాకేజీతో ఉన్నత ఉద్యోగం సంపాదించాడు. అయితే తన స్నేహితుడు కట్టా రవితేజ సివిల్స్‌కు ఎంపికై సమాజానికి చేస్తున్న సేవ, అందులోని సంతృప్తిని గమనించి తానూ సివిల్స్ రాసి 35వ ర్యాంకు సాధించాడు. తనకు మిత్రుడు రవితేజ రోల్‌మోడల్ అని సంకేత్ సాక్షికి చెప్పారు. అవగాహన పెరిగింది గతంలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు? వారి విధులు ఎలా ఉంటాయి? సమాజంలో వారు తీసుకొచ్చే మార్పు ఎలా ఉంటుందనే అంశాలపై పెద్దగా అవగాహన ఉండేది కాదు. చాలామందికి డాక్టర్లు, ఇంజనీర్లే ఎక్కువ అనే భావన ఉండేది. మరోవైపు సివిల్స్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు చాలావరకు ఢిల్లీ కేంద్రంగానే ఉండేవి. దీంతో ఢిల్లీతో ఎక్కువ అనుసంధానమై ఉండే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ ఎంపిక అయ్యేవారు. అయితే ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. సివిల్స్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈజీగా తెలిసిపోతోంది. హైదరాబాద్ కేంద్రంగానూ మంచి కోచింగ్ సెంటర్లు వచ్చాయి. అలాగే అఖిల భారత సర్వీసులకు సంబంధించిన అవగాహన పెరిగింది. ఫలితంగా మనవారు ఇప్పుడు సివిల్స్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. విజయం సాధిస్తున్నారు. – దురిశెట్టి అనుదీప్ (సివిల్స్–2017 ఆలిండియా టాపర్, మెట్పల్లి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా), (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్) ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించొచ్చు నాన్న వెంకటేశ్వర్లు పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. నేను బీటెక్‌లో ఉన్నప్పుడే మా కలెక్టర్ అలా అన్నారు. ఎస్పీ ఇలా అన్నారు అంటూ వారి గురించి గొప్పగా చెబుతుండేవారు. అప్పుడే నేనూ నిర్ణయించుకున్నా కలెక్టర్ కావాలని. అందుకోసం ఐదేళ్లు కష్టపడ్డా. కుటుంబసభ్యులు అందించిన సహకారంతో చివరకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించా. నాలా అందరికీ ఫ్యామిలీ సపోర్ట్ దొరికితే రాష్ట్రం నుంచి అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు వస్తారు. – ఉమా హారతి, సివిల్స్ 3వ ర్యాంకర్ నాలాంటి వాళ్లకు సాయం చేయాలని.. నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ నన్ను, అన్న, చెల్లెల్ని చదివించింది. మా కోసం ఆమెపడే కష్టం ఎప్పుడూ కళ్ల ముందే ఉండేది. అందుకే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఇంటర్ వరకు చదివా. ఐఐటీ చెన్నైలో సీటు వచ్చినప్పుడు కనీస ఫీజు సరే అక్కడికి వెళ్లేందుకు, ఇతర ఖర్చులకు కూడా డబ్బుల్లేవు. అయితే కొందరు దాతలు ముందుకొచ్చి సహాయం చేయడంతో ఐఐటీ çపూర్తి చేశా. ఆపై ఓఎన్జీసీలో ఉన్నత ఉద్యోగం సంపాదించా. కానీ ఏదో వెలితిగా అనిపించేంది. నేను కూడా కొంత మందికి సహాయం చేయాలంటే మరింత ఉన్నత స్థితిలో ఉండాలనుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి రెండవ ప్రయత్నంలోనే సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించా. – డొంగ్రి రేవయ్య, ఆసిఫాబాద్ జిల్లా ఇప్పుడు అన్నీ హైదరాబాద్‌లోనే.. ఒకప్పుడు సివిల్స్ రాయాలంటే ఢిల్లీ వెళ్లాలి. అక్కడ ఉండి కోచింగ్ తీసుకోవాలి. అక్కడి వాతావరణం, ఆహారం, భాష అన్నీ మనకు కొత్తగా అనిపించేవి. దాంతో ఎక్కువగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల వారే సివిల్స్‌లో రాణించేవారు. కానీ ఇప్పుడు అన్నింటికీ హైదరాబాద్ అడ్డా అయ్యింది. నిపుణుల కొరత లేదు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అమెరికా లాంటి దేశాలపై మోజు తగ్గించుకుని మరీ సివిల్స్ వైపు వస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎంపికవుతుండటంతో, ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుని విజేతలవుతున్నారు. – ఎం.బాలలత, సివిల్స్ ట్రైనర్ మాధోపట్టి..సివిల్స్ విజేతల పుట్టినిల్లు! యూపీ రాజధాని లక్నోకు 300 కి.మీ. దూరంలో ఉన్న మాధోపట్టి గ్రామంలో మొత్తం 75 ఇళ్లు. అందులో సివిల్స్ సాధించిన వారు ఏకంగా నలభై మంది ఉండటం అబ్బురపరిచే విషయం. ఇక్కడ ఉపాధికి సరిపోయే భూమి లేక అందరూ ఉన్నత చదువులనే ఆ«ధారం చేసుకున్నారు. ఇలా 1952లో డాక్టర్ ఇందుప్రకాష్ తొలిసారి యూపీఎస్సీ పరీక్షల్లో రెండో ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్న ఆయన నలుగురు సోదరులు ఐఏఎస్ ను సాధించారు. అందులో వినయ్‌సింగ్, ఛత్రçసల్సింగ్లు బిహార్, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. ఇలా మాధోపట్టి మేధావులకు నిలయంగా మారింది. పురుషులతో పాటు మహిళలు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికయ్యారు. అలా మాధోపట్టి ఐఏఎస్‌ల ఫ్యాక్టరీగా మారింది. -
పట్టుదల ఉంటే.. కోచింగ్ అక్కర్లే
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ‘ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పేద, ధనిక తేడాలేదు. ప్రతిభ ఉన్న ఎవరైనా కల నెరవేర్చుకోవచ్చు. ఏ పోటీపరీక్షకైనా ఆన్లైన్లో బోలెడు కంటెంట్, మెటీరియల్ ఉంది. ప్రణాళిక, పట్టుదల ఉంటే కోచింగ్ అక్కర్లేదు. దినపత్రికలు చదవాలి. నోట్స్ తయారు చేసుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి.’ అని సివిల్స్ విజేత సాయికృష్ణ అన్నారు. కరీంనగర్‌కు తొలిసారిగా వచ్చిన ఆయన శనివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. లక్ష్యసాధనకు ఏడేళ్ల తపస్సు సివిల్స్ నా చిన్ననాటి కల. దాని కోసం ఏడేళ్లు తపస్సు చేశా. నేను పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. సివిల్స్‌లో 94వ ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. నాలుగో తరగతిలో ఉన్నప్పుడు జిల్లాకు కలెక్టర్‌గా సుమితా డావ్రా వచ్చారు. ఆమె గురించి అందరూ గొప్పగా చెబుతుంటే విని స్ఫూర్తి పొందాను. కరీంనగర్‌పై ఆమె రాసిన ‘పూర్ బట్ స్పిరిటెడ్ కరీంనగర్’ పుస్తకం నాకు ప్రేరణనిచి్చంది. ఆన్లైన్లో మెటీరియల్ ఎక్కువే.. ఇంటర్నెట్లో అన్ని పరీక్షల మెటీరియల్ దొరుకుతుంది.ఆ మెటీరియల్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంగ్లిష్ వస్తేనే సివిల్స్ సాధిస్తామనే అపోహను వీడాలి. మన మాతృభాషలో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇంటర్వ్యూ సైతం మాతృభాషలోనే నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకోవాలనే అపోహ, ఇంగ్లిష్ రాదనే భయం వీడితే ఎవరైన సివిల్స్ సాధించవచ్చు. కుటుంబమే పెద్ద అండ సివిల్స్ ప్రిపరేషన్లో కుటుంబ ం అండగా నిలిచింది. నాన్న, మామయ్యలు, అత్తయ్యలు ఎనిమిది మంది వరకు ప్రభుత్వ టీచర్లే.వారి ద్వారా స్ఫూర్తి పొందేవా డిని. 2015లో క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వస్తే చేరకున్నా ఎవరూ ఏమీ అనలేదు.ఇంటికే పేపర్ వస్తుండడంతో చిన్నప్పటి నుంచే దినపత్రికలు చదవడం అలవాటుగా మారింది. ఈ అలవాటు సివిల్స్‌కు ఎంతో ఉపయోగపడింది. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నా.. వరంగల్ ఎన్ఐటీలో 2015లో బీటెక్ పూర్తయ్యింది. ఢిల్లీకి వెళ్లి సివిల్స్ కోచింగ్ తీసుకున్న. సొంతంగా నోట్స్ త యారు చేసుకున్న. 2017 సివిల్స్‌లో 728వ ర్యా ంకుతో ఐసీఎల్ఎస్ వచ్చింది. నా లక్ష్యం ఐఏఎస్ కావడంతో మళ్లీ ప్రిపేర్ అయ్యాను. రోజుకు 5 నుంచి 7 గంటలు చదివాను. ఈ క్రమంలో మా సీనియర్ తక్కల్లపల్లి యశ్వంత్‌రావు ఇచ్చిన సలహాలు చాలా ఉపయోగపడ్డాయి. సోషల్ మీడియాకు దూరం సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను. కంటెంట్ కోసమే ఆన్లైన్లో సెర్చ్ చేశాను. లక్ష్య సాధనకు అవసరమైన సమాచారం కోసమే యూ ట్యూబ్, గూగుల్‌లో సెర్చ్ చేశాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. అప్పుడప్పుడు సినిమాలు కూడా చూశాను. కానీ పరిమితంగానే చూశాను. ఈ కాలం తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశలోనే ఐఏఎస్, ఐఐటీ కోర్సులు అంటూ నేర్పిస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికరమే. పాఠశాల, ఇంటర్ స్థాయిలో ఐఐటీ, ఐఏఎస్ కోచింగ్‌లు ఇప్పించడం సరికాదు. ప్రతీ విద్యార్థి తనకంటూ ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. అది తెలుసుకొని అటువైపు వెళ్తే సక్సెస్ అవుతారు. అయితే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ తెలుసుకోవడం ప్రతీ విద్యార్థికి అవసరమే. ఏ పోటీ పరీక్షలోనైన కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉంటేనే రాణించగలుగుతారు. తన కలనే మా కల సాయి చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెరిగాడు. అందుకోసం నిరంతరం శ్రమించాడు. తన కలను మా కలగానే అనుకుని అన్ని విధాలా సహకరించాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అతను అడిగినవన్నీ సమకూర్చాం. 2017లోనే ఐసీఎల్ఎస్ వచ్చినా సంతృప్తి చెందలేదు. తన స్వప్నం సాకారం కోసం రాత్రింబవళ్లు శ్రమించాడు. చివరికి సాధించాడు. – ఆవుల లక్ష్మయ్య ప్రైవేటు ఉద్యోగాన్ని వదులుకున్నాడు 2015లోనే నా కుమారుడు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్టయ్యాడు. తల్లిదండ్రులుగా మేమెంతో ఆనందపడ్డాం. ఆకర్షణీయమైన ప్యాకేజీ చేతికి అందినా పక్కనబెట్టాడు. తన కలల వైపు అడుగులేశాడు. చివరికి నా కొడుకు తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ రోజు ఇంకా సంతోషిస్తున్నాం. – ఆవుల సునీత -
ఈ ర్యాంకుకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు...
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : మొదటి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా ప్రయత్నం ఆపలేదు. ఆత్మవిశ్వాసం సడలలేదు. అదే విశ్వాసంతో, సాధించాలనే పట్టుదలతో మూడో ప్రయత్నం కొనసాగించి, సివిల్స్‌లో 315 ర్యాంకు సాధించింది. ఆమె మరెవరో కాదు. నగరానికి చెందిన నౌపడ ఆశ్రిత. విశాఖపట్నంలో సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆశ్రిత ప్రాథమిక విద్యాభ్యాసం నగరంలోని రైల్వేన్యూకాలనీలో ఉన్న హరగోపాల్ స్కూల్లో జరిగింది. అనంతరం నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చదివింది. తరువాత ఆదిత్య డిగ్రీ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది. 2019లో ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. అక్కడి నుంచి సివిల్స్ ర్యాంక్ సాధన వరకు తన ప్రయాణాన్ని సాక్షికి ఆశ్రిత తెలిపింది. ఆమె మాటల్లోనే.. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నపుడే సోషల్ వర్క్ పట్ల ఆసక్తి పెరిగింది. సివిల్స్ కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లా. కోవిడ్ కారణంగా కోచింగ్ మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్నా. ఇంటి దగ్గరే చదివి, రెండు సార్లు సివిల్స్ రాశాను. కానీ ప్రిలిమ్స్ కూడా అర్హత సాధించలేకపోయా. ఈసారి పట్టుదల పెరిగింది. మరోసారి రాసేందుకు కోచింగ్ తీసుకున్నా. 2022లో సివిల్స్ మూడో అటెంప్ట్ చేశా. తాజాగా విడుదలైన ఫలితాల్లో 315వ ర్యాంకు వచ్చింది. ఈ ర్యాంకుకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్‌కు ఎంపిక కానని తెలుసు. అందుకే మరోసారి ర్యాంకు మెరుగుగైన ర్యాంకు కోసం 28న జరిగే ప్రిలిమ్స్‌కు హాజరుకానున్నట్టు ఆశ్రిత పేర్కొంది. తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లి గృహిణి. తల్లితండ్రుల ప్రోత్సాహం, పక్కా ప్రణాళిక, అధ్యాపకులు శిక్షణ తననీ స్థాయికి తీసుకొచ్చాయని తెలిపింది. -
మధ్య తరగతి కుటుంబంలో మెరిసిన విద్యాకుసుమం
బోధన్‌టౌన్(బోధన్) : మంచి చదువు చదివి ఉన్నత హోదాలో ఉండాలని చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన మాటలతోనే తాను స్ఫూర్తి పొంది కలెక్టర్ కావాలని సంకల్పించానని సివిల్స్ ఆలిండియా 200 ర్యాంకర్ కంటం మహేశ్‌కుమార్ తెలిపారు. నాన్నే తనకు మంచి మోటివేటర్ అన్నారు. బోధన్ పట్టణానికి చెందిన కంటం రాములు, యాదమ్మల మొదటి సంతానం మహేశ్‌కు మార్. వీరిది మధ్య తరగతి కుటుంబం. రాములు విద్యుత్ శాఖలో సీనియర్ లైన్‌మన్‌గా వేల్పూర్‌లో విధులు నిర్వహిస్తుండగా, యాదమ్మ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెల్త్ సూర్ వైజర్‌గా పని చేస్తున్నారు. తన ఐఏఎస్ ప్రిపరేషన్‌కు అమ్మనాన్నలతో పాటు భార్య సౌమ్య తన సహకారాన్ని అందించారని చెబుతు న్నారు. సివిల్స్‌లో ర్యాంకుతో తనకు ఫారెన్ సర్వీసెస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్‌లలో ఏదోఒకటి వస్తుందని అనుకుంటున్నట్లు తెలిపారు. అనాథ పిల్లలకు ఇవ్వమనే వాడు చిన్న నాటి నుంచి చదువులో చురుకుగా ఉండేవాడు. నవోదయలో సీటు సాధించడం ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని సివిల్స్‌లో ర్యాంకు సాధించే వరకు సాగించాడు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నావు. కోచింగ్ తీసుకొమ్మని అడిగితే ఆడబ్బులను అనాథ ఆశ్రమాలకు, అనాథ పిల్లలకు ఇవ్వండి అని చెప్పేవాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించి సంతోషాన్ని పంచాడు. –యాదమ్మ, తల్లి పట్టలేనంత సంతోషంగా ఉంది నా కొడుకు సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్టలేనంత సంతోషంగా ఉంది. విద్యపై మక్కువతో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్న నాటి నుంచి కలెక్టర్ అవుతానని చెప్పిన మాటలను సాకారం చేశాడు. – కంటం రాములు, తండ్రి -
లక్ష్యసాధనలో పట్టునాయక్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): పట్టుదల, ప్రణాళిక ఉంటే ఏదైనా సాధించవచ్చునని తరుణ్ పట్నాయక్ నిరూపించాడు. తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో 99వ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందినా దాంతో సంతృప్తి పడకుండా రెండోసారి పట్టుదలగా ప్రయత్నించి 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా తన కలను సాకారం చేసుకున్నాడు. సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పాఠశాల స్థాయి నుంచి రాణిస్తూ ఐఏఎస్‌కు ఎంపికయ్యాడు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 33వ ర్యాంకు సాధించాడీ రాజమహేంద్రవరం యువకుడు. స్వశక్తితో.. పక్కా ప్రణాళికతో.. చదువులో రాణిస్తూ..గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేసి, కోచింగ్ సెంటర్లను ఆశ్రయించకుండా స్వశక్తితో పక్కా ప్రణాళికతో చదువుకున్నాడు. రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రాజమహేంద్రవరం రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. తల్లి శారదారాజ్యలక్ష్మి పట్నాయక్ గృహిణి. ఏకై క సంతానమైన తరుణ్ పట్నాయక్‌ను చిన్నతనం నుంచే అతను ఏ లక్ష్యం వైపు అడుగు వేసినా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో తరుణ్ ఐఐటీ చదివి ఐఏఎస్ కావాలన్న తన లక్ష్యాన్ని సాధించగలిగాడు. 1999 జనవరి 12వ తేదీన జన్మించిన తరుణ్ పట్నాయక్ ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు జస్వర్ స్కూల్లోను, 6వ నుంచి 10వ తరగతి వరకు కేకేఆర్ గౌతమ్‌స్కూల్లో, ఇంటర్ శ్రీచైతన్యలోను, గౌహతిలో ఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ 2020లో పూర్తిచేశాడు. అప్పటి నుంచి కోచింగ్ సెంటర్లను ఆశ్రయించకుండా సివిల్స్ స్వయంశక్తితో చదివాడు. గంటల తరబడి కాకుండా సిలబస్ ప్రకారం చదవడంతో పాటు ప్రాక్టీస్ చేసేవాడు. 2021 సివిల్స్ తుది ఫలితాల్లో 99వ ర్యాంకు సాధించి సిమ్లాలోని ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్లో ట్రైనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడితో ఆగకుండా మళ్లీ తన లక్ష్యాన్ని సాధించేందుకు 2022 సివిల్స్‌కు మరింతగా కష్టపడి చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయడంతో తుదిఫలితాల్లో 33వర్యాంకు సాధించి తన ఐఏఎస్ కలను సాకారం చేసుకున్నాడు. సిలబస్ ప్రకారం చదివా... గంటల తరబడి కాకుండా సిలబస్‌ను డివైడ్ చేసుకుని చదివాను. చదవడంతోపాటు ప్రాక్టీస్ ఎక్కువగా చేశాను. తొలివిడతలో ఆరు మార్కుల తేడాలో 99వ ర్యాంకు సాధించి ఐఏఎస్ సాధించలేకపోయా. ఈసారి ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో పక్కా ప్రణాళికతో చదవడంతో పాటు, ప్రాక్టీస్ చేయడంతో 33వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఐఏఎస్ కావడానికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. సిలబస్‌ను ఇష్టపడి చదవడంతో పాటు, ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఐఏఎస్ కావడంతో ప్రజలకు సేవచేసే అవకాశం దక్కింది. – తరుణ్ పట్నాయక్, 33వ ర్యాంకు, సివిల్స్, రాజమహేంద్రవరం జక్కంపూడి అభినందనలు సివిల్స్ 33వ ర్యాంకు సాధించిన తరుణ పట్నాయక్‌కు రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి ఎంతో ఘన చరిత్ర ఉందని, వివిధ రంగాల్లో ఎందరు ప్రముఖులు ఉన్నారని, తరుణ్ పట్నాయక్ సివిల్స్‌లో 33వ ర్యాంకు సాధించి ఆ కీర్తి మరింత పెంచాడని అన్నారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ శ్రీ జక్కంపూడి రామ్మోహన్రావు ఫౌండేషన్ ట్రస్టీ సభ్యులుగా విశేషమైన సేవలందిస్తున్నారని రాజా ప్రశంసించారు. చాలా ఆనందంగా ఉంది నా కుమారుడు తరుణ్ పట్నాయక్ సివిల్స్‌లో 33వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. అతి సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నేను ఎల్ఐసీలో క్లర్క్‌గా పనిచేస్తూ కుమారుడిని చదివించా. తరుణ్ చిన్నతనం నుంచే ఐఐటీ చదివి ఐఏఎస్ కావాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన లక్ష్యాన్ని తల్లిదండ్రులుగా ప్రోత్సహించాం. తొలివిడతలో రాకపోయినా రెండో విడతలో ఐఏఎస్ సాధించడంతో మా సంతోషానికి అవధులు లేవు. –రవికుమార్ పట్నాయక్, తరుణ్ తండ్రి, రాజమహేంద్రవరం -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే... సివిల్స్‌లో మెరిసిన కదిరి యువకుడు
అనంతపురం: సివిల్స్‌లో కదిరి యువకుడు బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 270వ ర్యాంకు సాధించాడు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్–2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే... జాతీయ స్థాయిలో 270 ర్యాంకుతో మెరిసిన బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి స్వగ్రామం ఓడి చెరువు మండలం బోయపల్లి కాగా, వీరి కుటుంబం ప్రస్తుతం కదిరిలో స్థిర పడింది. తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు, తండ్రి రాజశేఖరరెడ్డి విశ్రాంత జువాలజీ లెక్చరర్. హైదరాబాద్‌లో ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఉమా మహేశ్వరరెడ్డి అమెజాన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఢిల్లీలోని ‘వాజీరా’లో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. తమ కుమారుడికి సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు. -
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
-
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 50 వరకు ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, తదితర సర్వీసుల పోస్టులకు సంబంధించి మొత్తం 933 మందిని ఎంపికి చేసినట్లు తెలిపింది. జనరల్ – 345, ఈడబ్ల్యూఎస్ – 99, ఓబీసీ – 263, ఎస్సీ – 154, ఎస్టీ – 72 మంది ఎంపికయ్యారు. వీరితో పాటు కన్సాలిడేటెడ్ రిజర్వు లిస్టులో ఆయా కేటగిరీల నుంచి 178 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. మొత్తంగా 1,022 మందిని ఆయా పోస్టులకు ఎంపిక చేసినట్లు తెలిపింది. వీరిలో ఐఏఎస్‌కు 180 మంది, ఐఎఫ్ఎస్కు 38 మంది, ఐపీఎస్‌కు 200 మందిని కేటాయించారు. ఇతర కేంద్ర సర్వీసెస్‌లకు సంబంధించి గ్రూప్–ఏ కేటగిరీలో 473 మంది, గ్రూప్–బి సర్వీసెస్‌లో 131 మంది ఎంపికైనట్టు యూపీఎస్సీ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు అధిక ర్యాంకులు సివిల్స్ ఫలితాల్లో టాప్ ర్యాంకుల్లో తొలి 4 ర్యాంకులు అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. ఆలిండియా ఫస్ట్ ర్యాంకును ఇషితా కిషోర్ సాధించగా గరిమ లోహియా, నూకల ఉమా హారతి, స్మృతి మిశ్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి దాదాపు 50 మందికి ర్యాంకులు వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు 22, 33, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారు. జీవీఎస్ పవన్ దత్తా 22, తరుణ్ పట్నాయక్ 33, అజ్మీరా సంకేత్ 35, శ్రీసాయి ఆశ్రిత్ శాఖమూరి 40, హెచ్ఎస్ భావన 55, సాయి ప్రణవ్ 60, ఆవుల సాయికృష్ణకు 94వ ర్యాంకు దక్కాయి. వీరితోపాటు నిధిపాయ్ 110, అనుగు శివమారుతీరెడ్డి 132, రాళ్లపల్లి సంపత్‌కుమార్ 157, కమతం మహేశ్‌కుమార్ 200, రావుల జయసింహారెడ్డి 217, సాహిత్య 243, అంకుర్ కుమార్ 257, బొల్లం మహేశ్వర్‌రెడ్డి 270, చల్లా కళ్యాణి 285, పాలువాయి విష్ణువర్దన్‌రెడ్డి 292, సాయికృష్ణకు 293వ ర్యాంకు వచ్చాయి. 11.35 లక్షల మంది దరఖాస్తు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 11.35 లక్షల మంది దరఖాస్తు చేయగా వారిలో 5.73 లక్షల మంది (50.51 శాతం) మంది మాత్రమే గతేడాది జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యారు. వారిలో 130,90 మంది మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించారు. వీరికి సెప్టెంబర్ 16 నుంచి 25 వరకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,529 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా చివరకు 933 మంది ఎంపికయ్యారు. కాగా సివిల్స్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి 80,707 మంది హాజరయ్యారు. వారిలో 500 మంది వరకు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ఇంటర్వ్యూలకు 100 మంది వరకు ఎంపికవ్వగా వారిలో 50 మంది వరకు ర్యాంకులు సాధించగలిగారని ఆయా కోచింగ్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. ర్యాంకుల వారీగా తెలుగు రాష్ట్రాల అభ్యర్ధులు 3 ఎన్. ఉమా హారతి 22 జీవీఎస్ పవన్ దత్తా 33 తరుణ్ పట్నాయక్ మాదల 40 సాయి ఆశ్రిత్ శాఖమూరి 54 రిచా కులకర్ణి 60 మలియె శ్రీ ప్రణవ్ 78 ఉత్కర్‡్షకుమార్ 87 అయాన్ జైన్ 94 ఆవుల సాయి కృష్ణ 110 నిధి పాయ్ 132 అనుగు శివమూర్తిరెడ్డి 157 రాళ్లపల్లి వసంతకుమార్ 189 షేక్ హబీబుల్లా 217 రావ్ల జయసింహారెడ్డి 243 కాసిరాజు పవన సాయి సాహిత్య 270 బొల్లం ఉమామహేశ్వరరెడ్డి 285 చల్లా కల్యాణి 292 పలువాయి విష్ణువర్థన్‌రెడ్డి 293 గ్రంధి సాయికృష్ణ 297 షివిన్ చౌదరి 311 వీరగంధం లక్ష్మీ సునీత 313 కె.ఎన్.చందన్ జాహ్నవి 346 ఎన్.చేతన్‌రెడ్డి 384 తెప్పలపల్లి సుశ్మిత 409 ఇషాన్ అగర్వాల్ 410 డొంగ్రె రేవయ్య 414 చంద్రశేఖర్ శంకల 426 సీహెచ్. శ్రవణ్‌కుమార్‌రెడ్డి 459 చాణక్య ఉదయగిరి 464 సి.సమీరారాజా 469 బొడ్డు హేమంత్ 480 గోపీకృష్ణ. బి 510 భువన ప్రణీత్ పప్పుల 548 దామెర్ల హిమవంశీ 558 రుత్విక్ సాయి కొట్టే 559 డి.మనోజ్ 583 యర్రంశెట్టి ఉషారమణి 630 ఎస్.దీప్తి చౌహాన్ 640 తుమ్మల సాయికృష్ణారెడ్డి 742 రామ్‌దేని సాయినాధ్ 759 జి.అక్షయ్ దీపక్ 805 మన్నం సుజిత్ సంపత్ 817 సాహిల్ మీనా 846 బెండుకూరి మౌర్యతేజ్ 866 నాగుల కృపాకర్ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సివిల్స్ పరీక్షల్లో 200లోపు ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల ప్రతిభావంతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 933 మందితో కూడిన తుది జాబితాలో చోటు దక్కించుకున్న తెలుగు అభ్యర్థులందరికీ సీఎం శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కెరీర్లో ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ర్యాంకర్ల అభిప్రాయాలు దత్తా.. సత్తా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన డాక్టర్ పవన్ దత్తా సివిల్స్‌లో 22వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. దత్తా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. ఎంబీబీఎస్ చదివిన పవన్ దత్తా హైదరాబాద్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ దత్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉన్నత ఆరోగ్య సేవలు, పేద విద్యార్థులకు సాంకేతిక సేవలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని తెలిపాడు. అంబికా జైన్‌కు 25వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన లలిత్‌కుమార్ అంబికా జైన్ (25) సివిల్స్‌లో 69వ ర్యాంక్ సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనితల కుమార్తె అంబికా జైన్ అత్యుత్తమ ర్యాంకుతో మెరిసింది. అంబిక.. ఢిల్లీ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఎంఏ చేశారు. గతేడాది మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినా ఐఏఎస్ కావాలనే పట్టుదలతో ఈ ఏడాది మళ్లీ ప్రయత్నించి 69వ ర్యాంక్‌తో లక్ష్యాన్ని చేరుకున్నారు. 33వ ర్యాంకుతో మెరిసిన తరుణ్ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్ కాలనీకి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకుతో సత్తా చాటాడు. ఐఐటీ గౌహతిలో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తరుణ్ సివిల్స్‌కు సొంతంగా సిద్ధమయ్యాడు. తరుణ్ తండ్రి రవికుమార్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచ్‌లో క్లరికల్ స్టాఫ్‌గా పనిచేస్తుండగా తల్లి శారదా రాజ్యలక్ష్మి గృహిణి. తరుణ్ గౌహతి ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. సివిల్స్‌కు సొంతంగానే ప్రిపేరయ్యారు. గతేడాది 99వ ర్యాంకు సాధించిన అతడు ఈసారి 33వ ర్యాంకుతో మెరిశాడు. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని తరుణ్ తెలిపాడు. వసంత్‌కు 157వ ర్యాంకు ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన రాళ్లపల్లి వసంతకుమార్ 157వ ర్యాంకుతో మెరిశాడు. సివిల్స్ 2021 పరీక్షల్లో 170వ ర్యాంకు సాధించిన వసంతకుమార్ అప్పట్లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ సాధించాలన్న సంకల్పంతో మరోసారి ప్రయత్నం చేయగా 157వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. వసంత్ అన్న జగన్‌సాయి ప్రస్తుతం ఐఏఎస్‌కు ఎంపికై శిక్షణలో ఉన్నారు. వసంతకుమార్ తండ్రి రాళ్లపల్లి భీమేశ్వరరావు విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి అనసూయ గృహిణి. సిక్కోలు బిడ్డకు 285వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా రూరల్ మండల పరిధిలోని వప్పంగి గ్రామానికి చెందిన చల్లా కళ్యాణి 285వ ర్యాంకుతో సత్తా చాటింది. ఇప్పటికే గ్రూప్–1 పరీక్షల్లో విజయం సాధించిన ఆమె ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రెజరీ విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. పల్నాడు యువకుడికి సివిల్స్‌లో 292వ ర్యాంక్ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన పాల్వాయి విష్ణువర్ధన్‌రెడ్డి 292వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. గోవాలోని బిట్స్ పిలానీలో బీటెక్ ఈఈఈ పూర్తిచేశాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్)– 2020లో 3వ ర్యాంక్ సాధించాడు. అయితే ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. తన ఐదో ప్రయత్నంలో 292వ ర్యాంక్ సాధించి విజయకేతనం ఎగురవేశాడు. విష్ణువర్ధన్‌రెడ్డిని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తదితరులు అభినందించారు. విష్ణువర్ధన్‌రెడ్డి తండ్రి నరసింహారెడ్డి విజయవాడలో ఒక ప్రైవేటు కోచింగ్ అకాడమీ డైరెక్టర్‌గా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. లక్ష్మీ సుజితకు 311వ ర్యాంకు బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వీరగంధం లక్ష్మీసుజిత 311వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి స్థానికంగా విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన సుజిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్‌కు సిద్ధమైంది. కాగా ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా వచ్చే ఏడాది మళ్లీ సివిల్స్ రాస్తానని సుజిత తెలిపింది. ఐదో ప్రయత్నంలో విజయకేతనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బొల్లిపల్లి వినూత్న. ఆమె ఐదో ప్రయత్నంలో 462వ ర్యాంకు సాధించింది. వినూత్న తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వినూత్న కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్, రెండో ప్రయత్నంలో మెయిన్స్, మూడో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో విఫలమైంది. నాలుగో ప్రయత్నమూ నిరాశపరిచింది. అయితే పట్టు వదలకుండా ఐదోసారి విజయకేతనం ఎగురవేసింది. ఐఏఎస్ రాసే క్రమంలో గ్రూప్–1 రాసి ఇంటర్వ్యూకు ఎంపికయ్యానని.. అయితే దానికి హాజరుకానని వినూత్న వెల్లడించింది. తన లక్ష్యం ఐఏఎస్ అని స్పష్టం చేసింది. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి కుమారుడికి 469 ర్యాంకు విశాఖ స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగం ఉద్యోగి బొడ్డు సత్తిబాబు కుమారుడు హేమంత్ 469వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్స్‌కు సిద్ధమయ్యారు. ఈ ర్యాంకు ద్వారా ఐఆర్ఎస్ వస్తుందని.. మళ్లీ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని హేమంత్ తెలిపారు. నవీన్ చక్రవర్తికి 550వ ర్యాంకు పల్నాడు జిల్లా తాళ్లచెరువు గ్రామానికి చెందిన రేపూడి నవీన్ చక్రవర్తి 550వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ,లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన నవీన్ సివిల్స్‌పై ఆసక్తితో అటు మళ్లాడు. తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయిన ఆయన రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లలో ఏది వచ్చినా స్వీకరిస్తానని తెలిపాడు. కోనసీమ జిల్లా యువతికి 583వ ర్యాంక్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన యర్రంశెట్టి ఉమా శ్రీలక్ష్మీరమణి 583వ ర్యాంకుతో సత్తా చాటింది. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చదివిన ఆమె క్యాంపస్ సెలక్షన్స్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించింది. శ్రీలక్ష్మీరమణి తండ్రి యర్రంశెట్టి కాశీవిశ్వేశ్వరరావు కొబ్బరికాయల వ్యాపారి. కాగా యానాం మున్సిపల్ కమిషనర్ ద్విజ్ గోయల్ 71వ ర్యాంకు సాధించారు. గోయల్ సొంత పట్టణం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్. సంతోష్‌కు 607వ ర్యాంకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఖండ్యాం గ్రామానికి చెందిన భవిరి సంతోష్‌కుమార్ 607వ ర్యాంకు సాధించారు. ఈయన స్వగ్రామం ఖండ్యాం అయినప్పటికీ మండలంలోని అలుదు గ్రామంలో తాతయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు గతేడాది సివిల్స్‌లోనూ 607వ ర్యాంకే ఈసారి కూడా అదే ర్యాంక్ వచ్చింది. సంతోష్ తండ్రి రాజారావు విశ్రాంతి ఉపాధ్యాయుడు, తల్లి ఉమాకుమారి గృహిణి. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, హైదరాబాద్‌లోని రైల్వే కళాశాలలో డెర్మటాలజీలో పీజీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ డెర్మటాలజిస్టుగా పనిచేస్తున్నాడు. సివిల్స్ సాధించాలని ఇప్పటికే ఐదుసార్లు పరీక్ష రాయగా ఆరో ప్రయత్నంలో 607వ ర్యాంకు సాధించారు. రవికిరణ్‌కు 694వ ర్యాంకు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంకు చెందిన పుసులూరి రవికిరణ్ 694వ ర్యాంకు సాధించాడు. గతంలో ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్ఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలోని కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా మరోసారి ప్రయత్నిస్తానని రవికిరణ్ తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా యువకుడికి 805వ ర్యాంక్ సివిల్స్ తుది ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన మన్నం సుజిత్ సంపత్‌కు 805వ ర్యాంక్ లభించింది. ఈ సందర్భంగా సుజిత్ మాట్లాడుతూ ఐఏఎస్ అవ్వాలన్నదే తన కోరికన్నారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా మంచి ర్యాంక్ వచ్చిందని తెలిపారు. ఐఏఎస్ అయ్యేంతవరకు శ్రమిస్తూనే ఉంటానన్నారు. సుజిత్‌ను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ తదితరులు అభినందనలు తెలిపారు. కడప కుర్రాడికి 866వ ర్యాంకు కడప ప్రకాష్‌నగర్‌కు చెందిన నాగుల కృపాకర్ 866వ ర్యాంకు సాధించాడు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీటెక్ ఈఈఈ పూర్తి చేశాక సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. వరుసగా ఐదుసార్లు ప్రయత్నించినా విజయం సాధించలేకపోయాడు. అయినా నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 866వ ర్యాంకు సాధించాడు. తనకు ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందని కృపాకర్ తెలిపాడు. రానున్న రోజుల్లో మరింత మంచి ర్యాంకు సాధించేందుకు ప్రిపరేషన్ కొనసాగిస్తానని తెలిపాడు. -
లండన్‌లో ఉద్యోగం వదిలేసి సివిల్స్ వైపు.. థర్డ్ అటెంప్ట్‌లో ఫస్ట్ ర్యాంక్
దేశ వ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన ఇషితా కిషోర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌తో మెరిశారు. గరిమ లోహియా, ఎన్ ఉమా హారతి. స్మృతి మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులు సాధించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మాయిలే టాప్ ర్యాంకర్లుగా నిలిచారు. తొలి 25 ర్యాంకర్లలో 14 మంది మహిళలే ఉండటం విశేషం. కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని.. ఇషితా కిషోర్ ఎయిర్‌ఫోర్స్ బాల్ భారతి పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇంటర్లో కామర్స్ విభాగంతో 97 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. 2017లో ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కళాశాల నుంచి ఎకనామిక్స్ హానర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ తరువాత లండన్‌లో ఎర్నెస్ట్ అండ్ యంగ్ అనే సంస్థలో రిస్క్ అనలిస్ట్‌గా చేరారు. కానీ ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. రెండేళ్ల తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ప్రీపెర్ అయ్యేందుకు 2019లో తన ఉద్యోగాన్ని వదిలేసింది. చదవండి: ‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సివిల్స్ మీద ఆసక్తితో చేసిన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో ఇషితా ఉత్తీర్ణత సాధించలేదు. అయినా నిరాశ పడకుండా రెండోసారి ప్రయత్నించారు. ఈసారి కూడా ప్రిలిమ్స్ దాటలేకపోయారు. గతేడాది మూడోసారి సివిల్స్ పరీక్ష రాశారు. అయితే ఈసారి ప్రిలిమ్స్ గట్టెక్కడంతో తనపై తనకు నమ్మకం పెరిగింది. దీంతో మరింత కష్టపడి చదివి మెయిన్స్, ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సైనిక కుటుంబ నేపథ్యం 26 ఏళ్ల ఇషితా తండ్రి సంజయ్ కిషోర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అధికారిగా పనిచేస్తున్నారు. సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో దేశానికి సేవ చేయాలనే ఆలోచన ఆమెలో బలంగా నాటుకుంది. ‘నా కుటుంబాన్ని చూసిన ప్రతిసారీ ఈ దేశం కోసం ఏదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను పెరిగిన వాతావరణం అలాంటింది. అందుకే సివిల్స్ సర్వీసెస్‌లో చేరాను’ అని ఇషితా తెలిపారు.. కాగా ఇషితా తల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సోదరుడు న్యాయవాది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌ను ఎంచుకున్న కిషోర్ ఉత్తర ప్రదేశ్ కేడర్‌ను తొలి ప్రాధాన్యతగా సెలెక్ట్ చేసుకుంది. ఇషితా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి కూడా. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను తన ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ఎంచుకొని సివిల్స్‌కు అర్హత సాధించారు. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో విజేతలు వీళ్లే దేశానికి సేవ చేయాలని.. తన విజయంపై ఇషిత మాట్లాడుతూ.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం చాలా పెద్ద విషయమని, మొదటి ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి సేవ చేయడానికి తనకు అవకాశం లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. దీని ద్వారా దేశానికి సేవ చేయాలన్న తన కల నిజమైందని పేర్కొన్నారు. మహిళా సాధికారికత, ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పింది. యూపీఎస్సీ పరీక్షలో ఈసారి తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం ఉంది కానీ ఏకంగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఊహించలేకపోయానని తెలిపింది. సివిల్స్ కొట్టేందుకు ఎంతో కష్టపడ్డానని, రోజుకు కనీసం 8 నుంచి 9 గంటలు చదువుకునేదాన్ని అని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సానుకూల మనస్తత్వం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని పేర్కొంది. ఈ అత్యుత్తమ విజయం వెనక, తనను నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు, స్నేహితులు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. #WATCH | Ishita Kishore, who has secured 1st rank in UPSC 2022 exam, says, "One has to be disciplined and sincere to be able to achieve this." pic.twitter.com/YKziDcuZJz — ANI (@ANI) May 23, 2023 మెరిసిన తెలుగు తేజం 2022 సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజం ఉమా హారతి మెరిశారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాకు చెందిన ఉమా హారతి జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి తండ్రి వెంకటేశ్వర్లు నారాయణపేట ఎస్పీగా పనిచేస్తున్నారు. తాను ఐదో ప్రయత్నంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఉత్తమ్ ర్యాంకు సాధించానని వెల్లడించారు. విధుల్లో చేరిన తర్వాత విద్యా, వైద్యం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తానని తెలిపారు సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాల్లో మొత్తం 933 మంది అభ్యర్థులను యూపీఎస్సీ ఎంపిక చేంది. . వీరిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మంది ఉన్నారు. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మంది, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. ఇందులో జనరల్ కోటాలో 345 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 99, ఓబీసీ నుంచి 263, ఎస్సీ నుంచి 154, ఎస్టీ విభాగం నుంచి 72 మంది ఉన్నారు. -
సివిల్స్‌లో ఐశ్వర్యకు నాలుగో ర్యాంకు... అయితే ఐశ్వర్య అమ్మాయి కాదు!
న్యూఢిల్లీ: సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ పేరు చాలామందిలో అయోమయానికి కారణమైంది. తొలి మూడు ర్యాంకులూ మహిళలే కైవసం చేసుకున్న నేపథ్యంలో, పేరు చూసి ఐశ్వర్య అంటే అమ్మాయేనని చాలామంది అనుకున్నారు. పలు పత్రికల్లోనూ, వెబ్సైట్లలోనూ కూడా అలాగే వచ్చింది. తొలి నాలుగు ర్యాంకులూ అమ్మాయిలే సాధించారంటూ అవన్నీ రాసుకొచ్చాయి. సివిల్స్ నాలుగో ర్యాంకర్ ఐశ్వర్య వర్మ (ఫైల్) మహిళా సాధికారత మరో మెట్టు పైకెక్కిందంటూ వాట్సాప్, ఫేస్బుక్, ట్వీటర్లలో పోస్టులు వెల్లువెత్తాయి. దాంతో ఐశ్వర్య మహిళ కాదంటూ ఆయన కుటుంబీకులు, స్నేహితులు స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది! సోషల్ మీడియాలో ఆయన ఫొటో పెట్టి మరీ విషయం వివరించారు. పత్రికలు, సైట్లు ఇలా గందరగోళపడ్డా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం ‘ఉజ్జయినికి చెందిన పురుష అభ్యర్థి ఐశ్వర్య వర్మ నాలుగో ర్యాంకు సాధించారు’ అంటూ స్పష్టంగా పేర్కొంటూ ప్రశంసించారు. ఐశ్వర్య వర్మ ఢిల్లీలో నాలుగేళ్ల పాటు కోచింగ్ తీసుకుని, నాలుగో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు సాధించారు! చదవండి: రిటైర్మెంట్లో రికార్డు.. ఒకే రోజు 25 వేల మంది ఇంటిబాట! -
‘విజయ్’గాథ: ఎలాంటి కోచింగ్ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్ ర్యాంకు
తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్... ఏ కోచింగ్ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు. తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్ఎస్కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. తాను అందుకోలేకపోయిన సివిల్స్ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు. తాతయ్య ఉత్తరంతో బీజం.. 2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని విజయ్‌బాబు చెప్పారు. టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్ కొట్టాలంటే ఇంజినీరింగ్ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. ఐఏఎస్‌పైనే గురి.. ఇంటర్ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీని విజయ్ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. గతంలో సివిల్స్ టాపర్స్ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్లైన్లో టెస్ట్ సిరీస్‌తో ప్రాక్టీస్ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. రోజూ జాగింగ్, మెడిటేషన్ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్ఎస్ పోస్టింగ్ తీసుకున్నా ఐఏఎస్ సాధనకు మళ్లీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్ లక్ చెబుదాం. -
పోలీసులకు ఫిర్యాదు చేసిన సివిల్స్ విన్నర్
ముంబై: తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించిన 23 ఏళ్ల ఐశ్వర్య షెరాన్ పోలీసులను ఆశ్రయించారు. ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరుతో 20 నకిలీ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. తన అనుమతి లేకుండా ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకోవాలని కోలాబా పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, ఐశ్వర్య గతంలో పలు అందాల పోటీల్లో తుళక్కుమన్నారు. 2016లో ఫెమినా మిస్ ఇండియా విజేతగా నిలిచారు. అయితే, ఇప్పటి వరకు తనకు ఇన్‌స్టాలో ఎలాంటి అకౌంట్లు లేవని ఆమె చెప్పుకొచ్చారు. ఆగస్టు 5న ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో నకిలీ ఖాతాల విషయం వెలుగు చూసిందని అన్నారు. (చదవండి: బంగారం వద్దు.. రూ.2 వేలు చాలు..!) ‘మీ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో అసలైనది ఏదీ? అని జర్నలిస్టు ప్రశ్నించడంతో నాకేం అర్థం కాలేదు. ఇన్‌స్టాలో నాకు అకౌంట్ లేదని చెప్పాను. వెంటనే మా తమ్ముడు సెర్చ్ చేయగా నా పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఫేక్ ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. ఒక ఖాతాకైతే ఏకంగా 27 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. నా ఫొటోలను ఆ ఆగంతకులెవరో దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. అందుకే ఫిర్యాదు చేశాం’అని ఐశ్వర్య పేర్కొన్నారు. కాగా, ఐశ్వర్య కలాబాలో తన కుటుంబంతో కలిసి 2017 నుంచి నివసిస్తన్నారు. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్. ఇక ఐశ్వర్య ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కోలాబా సీనియర్ ఇన్స్పెక్టర్ శివాజీ ఫడ్తారే చెప్పారు. సర్విస్ ప్రొవైడర్ సాయంతో నకిలీ ఖాతాలను క్లోజ్ చేయిస్తామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. (ఐపీఎస్ టు ఐఏఎస్) -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : సివిల్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం ట్వీట్ చేశారు. ‘సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్ ట్వీట్ చేశారు. (చదవండి : సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా) కాగా, ఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాలు మంగళవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను.#CivilServicesResults — YS Jagan Mohan Reddy (@ysjagan) August 5, 2020 -
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి– భువనగిరి జిల్లాకు చెందిన పి.ధాత్రిరెడ్డి సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో అల్ ఇండియా 46వ ర్యాంకు సాధించి భేష్ అనిపించుకున్నారు. ధాత్రిరెడ్డి గతంలో సివిల్స్ రాసి 283 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఐపీఎస్ శిక్షణలో ఉన్న ఆమె మళ్లీ పట్టుదలతో సివిల్స్ రాసి ఐఏఎస్‌లో 46వ ర్యాంకును సాధించారు. యూపీఎస్సీ మంగళవారం వెల్లడించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చాటారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో ఎంపికై సివిల్స్‌లో తమ సత్తా చాటారు. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసెస్‌కు 829 మంది ఎంపిక కాగా అందులో 50 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఉన్నారు. సివిల్ సర్వీసెస్– 2019కు సంబంధించిన తుది ఫలితాలు మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసింది. ఇందులో 829 మంది అభ్యర్థులను సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. సివిల్స్‌కు ఎంపికైన వారిలో 304 మంది జనరల్ కేటగిరీలో ఎంపికయ్యారు. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూ ఎస్) కోటాలో 78 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఓబీసీ కేటగిరీలో 251, ఎస్సీ 129, ఎస్టీ కేటగిరీలో 67 మంది ఉద్యోగాలు సాధించారు. ఈ ఫలితాల్లో హరియాణాకు చెందిన ప్రదీప్‌సింగ్ ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. ఇక జతిన్ కిషోర్ రెండో ర్యాంకు, ప్రతిభా వర్మ మూడో ర్యాంకు సాధించారు. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి మల్లవరపు సూర్య తేజ 76వ ర్యాంకు, కట్టా రవితేజ 77వ ర్యాంకు, సింగారెడ్డి రిషికేశ్ రెడ్డి 95వ ర్యాంకు సాధించి టాప్ 100లో నిలిచారు. టాప్ 100 నుంచి 200లోపు ర్యాంకుల్లో మరో ఐదుగురు తెలుగు అభ్యర్థులు ఉండటం విశేషం. ఇక 200 నుంచి 300 ర్యాంకుల్లోపు మరో పది మంది సాధించారు. -
సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థుల హవా
సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ/కడప ఎడ్యుకేషన్/మైదుకూరు: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల పోస్టులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్–2019 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు విజయఢంకా మోగించారు. 100లోపు ర్యాంకుల్లో ఐదుగురు తెలుగువారున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో దాదాపు 50 మంది వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఆయా సర్వీసులకు ఎంపికయ్యారు. గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ ఉన్నా ఎక్కువ మంది తెలుగు అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. దేశవ్యాప్తంగా మొత్తం 829 మంది ఐఏఎస్, ఐపీఎస్, తదితర కేడర్ పోస్టులకు, గ్రూప్ఏ, గ్రూప్ బి సర్వీసులకు ఎంపికయ్యారు. సొంత ప్రణాళికలతోనే.. సొంతంగా ప్రిపేర్ అవుతూ ఆర్సీ రెడ్డి టెస్ట్ సిరీస్ రాశాను. సొంత ప్రణాళికను రూపొందించుకొని 76వ ర్యాంక్ సాధించా. – మల్లవరపు సూర్యతేజ, గుంటూరు, (76వ ర్యాంక్) నాలుగో ప్రయత్నంలో అత్యుత్తమ ర్యాంక్ సివిల్స్ మూడో ప్రయత్నం (2017)లో ఐఆర్ఎస్ సాధించాను. సివిల్స్ కోసం రోజూ 8 నుంచి 9 గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాను. – రుషికేశ్‌రెడ్డి, కడప (95 ర్యాంకు) మంచి సేవ చేయొచ్చనే.. నాలుగో ప్రయత్నంలో 103వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ద్వారా దేశానికి మంచి సేవ చేయవచ్చు. –సత్యసాయి కార్తీక్, కాకినాడ ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంకు మాది.. వ్యవసాయ కుటుంబం. ఐదుసార్లు సివిల్స్ రాసినా ఫలితం దక్కలేదు. నిరాశ చెందకుండా ఆరో ప్రయత్నంలో 117వ ర్యాంక్ సాధించాను. – రాహుల్‌కుమార్ రెడ్డి, పెండ్లిమర్రి, వైఎస్సార్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలోనే చదివా.. మా నాన్న.. రైతు. పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. – శివగోపాల్‌రెడ్డి, (263వ ర్యాంక్) మైదుకూరు -
‘గ్రేట్.. తొలి ప్రయత్నంలోనే సివిల్స్’
సాక్షి, కరీంనగర్: పట్టుదల, కృషి తోడుంటే ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని మరోసారి నిరూపితమైంది. ఏకాగ్రతతో చదివితే సివిల్స్ లాంటి అత్యున్నత స్థాయి పోటీ పరీక్షలకు కూడా ఎలాంటి కోచింగ్ అవసరం లేదని రుజువైంది. యూపీఎస్సీ నేడు విడుదల చేసిన 2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆలిండియా 93 వ ర్యాంకు సాధించిన ఐశ్వర్య పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరీంనగర్ ఎన్సీసీ తొమ్మిదో బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ కుమార్ కూతురే ఐశ్వర్య. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా తొలి ప్రయత్నంలోనే ఆలిండియా 93వ ర్యాంకు సాధించడం పట్ల ఆమె తండ్రి హర్షం వ్యక్తం చేశారు. (చదవండి: ఐఏఎస్‌గా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి) రాత పరీక్ష, ఇంటర్వ్యూ దేనికీ ఐశ్వర్య కోచింగ్ తీసుకోలేదని, దేశవ్యాప్తంగా ఆమె యువతకు ఆదర్శంగా నిలిచిందని అజయ్‌కుమార్ అన్నారు. చిన్న వయసులోనే సివిల్స్ సాధించిన వారి జాబితాలో ఐశర్య ఒకరని పేర్కొన్నారు. ఆమె విద్యాభ్యాసమంతా న్యూఢిల్లీలోనే సాగిందని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఐశ్వర్య ముంబైలో ఉన్నట్టు వెల్లడించారు. కాగా, ప్రతిష్టాత్మక ఇండియన్ సివిల్ సర్వీసెస్ 2019కి సంబంధించిన తుది ఫలితాలు యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 829 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఇందులో 304 జనరల్, 78 ఈబీసీ, 254 ఓబీసీ, 129 ఎస్సీ , 67 ఎస్టీ కేటగిరీకి చెందిన వారున్నారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల) -
సివిల్స్ టాపర్‌కు 55.35 శాతం మార్కులే
న్యూఢిల్లీ: యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన కనిష్క్ కటారియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 55.35 శాతం మార్కులు సాధించారు. దీన్నిబట్టి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన కటారియా సివిల్స్ పరీక్షలో మొత్తం 2,025 మార్కులకు గాను 1,121 (55.35 శాతం) మార్కులు సాధించగా.. అందులో రాత పరీక్షలో 942, ఇంటర్వ్యూలో 179 మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది. 2వ ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ 1,080 మార్కులు (53.3 శాతం) సాధించగా, రాత పరీక్షలో 882, ఇంటర్వ్యూలో 198 మార్కులు సాధించారు. ఈనెల 5న యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ 2018 పరీక్ష ఫలితాల్లో మొత్తం 759 మంది అభ్యర్థులు ఎంపికవగా అందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలున్నారు. -
సివిల్స్ టాపర్ కటారియా
న్యూఢిల్లీ: ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి, జైపూర్‌కు చెందిన కనిషక్ కటారియా సివిల్స్–2018 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. జైపూర్‌కే చెందిన అక్షత్ జైన్ రెండో ర్యాంకు సాధించారు. భోపాల్‌కు చెందిన సృష్టి జయంత్ దేశ్‌ముఖ్ మహిళల్లో తొలి స్థానం, మొత్తంమీద ఐదో ర్యాంకు దక్కించుకున్నారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన కర్నాటి వరుణ్‌రెడ్డికి 7వ ర్యాంకు దక్కింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రతిష్టాత్మక సర్వీసులకు మొత్తం 759 మంది అర్హత సాధించారని, అందులో 182 మంది మహిళలు, 36 మంది దివ్యాంగులు ఉన్నారు. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. జనరల్ కేటగిరీలో 361 మందికి, ఓబీసీ వర్గంలో 209 మందికి, ఎస్సీల్లో 128 మందికి, ఎస్టీల్లో 61 మందికి ర్యాంకులు వచ్చాయి. గత జూన్‌లో ప్రాథమిక పరీక్షకు 5 లక్షల మంది హాజరవగా, 10,468 మంది మెయిన్స్‌కు అర్హత పొందారు. 1994 మంది మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కాగా, వారికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో ముఖాముఖి నిర్వహించి తుది ఫలితాలు ప్రకటించారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లదే హవా.. ఎస్సీ వర్గానికి చెందిన టాపర్ కటారియా తన ఆప్షనల్‌గా మేథమేటిక్స్ ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివారు. ఐదో ర్యాంకర్ దేశ్‌ముఖ్ భోపాల్‌లోని రాజీవ్ గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయలో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ చేశారు. తనపై ఉన్న నమ్మకంతోనే తొలి ప్రయత్నంలోనే సివిల్స్ పరీక్షలో విజయం సాధించానని దేశ్‌ముఖ్ చెప్పారు. ఆమె తండ్రి ఇంజనీర్ కాగా, తల్లి ప్రిస్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. రెండో ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ ఐఐటీ గువాహటిలో ఇంజనీరింగ్ చదివారు. అక్షత్ తండ్రి ఐపీఎస్ అధికారి కాగా, తల్లి ఐఆర్ఎస్ అధికారిగా సేవలందిస్తున్నారు. సొంత రాష్ట్రం రాజస్తాన్‌లోనే ఐఏఎస్‌గా సేవలందించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టాప్–25లో నిలిచిన అభ్యర్థులంతా ఐఐటీలు, ఎన్ఐటీలు, బిట్స్ పిలానీ, ఎన్ఎల్యూ, డీయూ, ముంబై యూనివర్సిటీ, అన్నా వర్సిటీ లాంటి విద్యా సంస్థల్లో అభ్యసించారు. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. -
గ్రామీణ మేధస్సుకు నిరాదరణే విఘాతం
భారతీయ సివిల్ సర్వీసుల తుది ఫలితాలు వెలువడగానే అంతిమవిజేతలకు, ర్యాంకర్లకు ప్రత్యేక అభినందన సభల ఏర్పాటు, మీడియాలో వారి విజయగాథల ప్రసారం వంటి నూతన ధోరణులు చోటుచేసుకోవడం అభినందనీయమే. 2017 సివిల్ సర్వీసుల తుది ఫలితాలలో ప్రథముడిగా నిలిచిన తెలంగాణ అబ్యర్థిని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. పరీక్షలో తెలంగాణ ప్రతిష్టను నిలబెట్టినట్లే విధి నిర్వహణలో కూడా రాష్ట్ర ప్రత్యేకతను చాటాలని అతనికి సూచించారు. సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే తెలంగాణ అభ్యర్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను స్థాపించాలని, ఇంటర్వ్యూకు వెళ్లేవారికోసం నిపుణులచే శిక్షణ ఇప్పించాలని కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. అమలైతే ఇదొక ఆదర్శవంతమైన కార్యక్రమం అవుతుంది. అయితే వర్తమానంలో మన సివిల్ సర్వీసు వ్యవస్థ నడుస్తున్న వాస్తవ తీరును కూడా విశ్లేషించాలి. సివిల్ సర్వెంట్లు ఏయే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, వారేం సాధించారనే పురోగతికి సంబంధించిన సూదిమొనంత సమాచారం కూడా ప్రజలకు అందలేదు. ఉన్నతోద్యోగుల నిబ ద్ధతతో పాటు వారు వృత్తిగతంగా సాధించిన విజ యాలను కూడా ప్రజలకు తెలియచేయకపోతే సివిల్ సర్వీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో అనుమానాలు తలెత్తే అవకాశముంది. ఐఏఎస్ సాధించాలనే ప్రయత్నంలో ఒక ఐపీఎస్ ట్రెయినీ అవినీతికీ పాల్పడుతూ పరీక్షల్లో రహస్య ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడ్డ ఇటీవలి సంఘటన సివిల్ సర్వీసుల ఎంపిక నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. ఏ కొద్దిమందినో మినహాయిస్తే ఎక్కువశాతం అభ్యర్థులు ప్రోత్సాహక పరిసరాలు, వనరుల పరిపుష్టి, పరీక్ష పట్ల స్పష్టమైన అవగాహనం ఉన్నవారు మాత్రమే సివిల్ సర్వీసుల్లో విజయం సాధిస్తున్నారు. ప్రైవేట్ విద్యాలయాలు, కార్పొరేట్ కళాశాలలు, ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో చదివి, సమస్యలు బాధ్యతలు లేని ప్రేరణాత్మక వాతావరణానికి నోచుకున్న వారికి మాత్రమే సివిల్ సర్వీసుల్లో ప్రవేశం సాధ్యపడుతోంది. కానీ విజేతలవుతున్న గ్రామీణ అభ్యర్థులు చాలా కొద్దిమందే. వారు కూడా తమ ఊళ్లనుండి వసతులు లభ్యమవుతున్న ప్రదేశాలకు తరలి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సిలబస్‌లోని ప్రతి అంశానికి సంబంధించిన విస్తృత సమాచారం, అవగాహన, పరీక్షలో సమాధానాలను ప్రభావవంతంగా రాయగల నేర్పు, లక్ష్యాత్మకంగా అలవర్చుకున్న మానవీయ వ్యక్తిత్వాన్ని ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభ వంటి నైపుణ్యాలన్నీ నూరు శాతం గ్రామీణ నేపథ్యం ఉన్న అభ్యర్థుల్లో కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఐతే ప్రోత్సాహక వాతావరణ లేమి, అహగాహనా రాహిత్యం, ఆర్థిక పరిమితులు, సాధనాత్మక ప్రేరణ కొదువల కారణంగా గ్రామీణ అభ్యర్థులు ఆ ఉద్యోగాలకు నోచుకోవడం లేదు. దీంతో మన దేశంలో సివిల్ సర్వీసులకు సంబంధించి అందుబాటులో ఉన్న వసతుల తోడ్పాటుతో ఎంపికను సాధించి అవకాశాలను పొందుతున్న వారు, వసతులకు నోచుకోక అవకాశాలను కోల్పోతున్న వారనే రెండు వర్గాలు పుట్టుకొచ్చి సంఘర్షణాత్మక అగాథం ఏర్పుడుతోంది. సివిల్ సర్వీసుల్లలో ప్రవేశానికి గ్రామీణ అభ్యర్థులకు ఇవ్వాల్సిన చేయూతను ఒక మహా యజ్ఞంలా కొనసాగించాలి. 2017 సివిల్ సర్వీసుల పరీక్షలో తొలి 25 ర్యాంకులను సాధిం చివారు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, విశ్వవిద్యాల యాల్లో చదివారు. అయినప్పటికీ 9 మంది ఫిజి కల్లీ ఛాలెంజెడ్, 8 మంది విజువల్లీ ఛాలెంజ్డ్, 12 మంది వినికిడి సమస్య ఉన్న అభ్యర్థులు కూడా ఈసారి విజేతల్లో ఉన్నారనే వాస్తవం తెలిస్తే ఎవరిలోనైనా విశ్వాసం ఉబికి వస్తుంది. కాబట్టి తెలంగాణ సీఎం ప్రతిపాదించిన శిక్షణను కేవలం ఇంటర్వ్యూ అభ్యర్థులకే కాకుండా అన్ని స్థాయిల్లో ఇవ్వాలి. ప్రభుత్వం, విద్యాసంస్థలు దీక్షబూని గ్రామీణ విద్యార్థులకు కూడా సివిల్ సర్వీసుల్లో ఎంపికయ్యేలా శిక్షణ నిస్తే పరిపాలనలో పల్లెటూళ్ల ప్రతిభ మెరుస్తుంది. గ్రామీణ భారతావని పులకరిస్తుంది. వంగీపురం శ్రీనివాసాచారి, ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ (మొబైల్ : 99480 90051)