సివిల్‌ సర్వీసెస్ ఫలితాల్లో యాడికి విద్యార్థి ప్రతిభ | yadiki student talents in civils | Sakshi
Sakshi News home page

సివిల్‌ సర్వీసెస్ ఫలితాల్లో యాడికి విద్యార్థి ప్రతిభ

Jun 1 2017 11:10 PM | Updated on Sep 5 2017 12:34 PM

యాడికి మండలం బోగాలగట్ట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, చంద్రావతి పెద్ద కుమారుడు జగదీశ్వరరెడ్డి సివిల్స్‌-16 ఫలితాల్లో 249వ ర్యాంకు సాధించాడు.

తాడిపత్రి టౌన్‌ : యాడికి మండలం బోగాలగట్ట గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, చంద్రావతి పెద్ద కుమారుడు జగదీశ్వరరెడ్డి సివిల్స్‌-16 ఫలితాల్లో 249వ ర్యాంకు సాధించాడు. ఈయన ఒకటి నుంచి 5వ తరగతి వరకు  బోగాలగట్ట గ్రామంలో చదివాడు. 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు లేపాక్షిలోని నవోదయ కళాశాలలో చదవి ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాడు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదివాడు. అనంతరం ఎంబీఏ  పూర్తి చేశాడు. హైదరాబాదు, ఢిల్లీలోని ప్రైవేటు కళాశాలలో పార్ట్‌ టైం అధ్యాపకుడిగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. ఈ సందర్భంగా జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచి సివిల్స్‌ సాధించాలన్న బలమైన కోరికతో కష్టపడి చదివానన్నాడు. అమ్మ,నాన్న, తమ్ముడు స్నేహితుల సహకారంతో సివిల్‌ సాధించాను. లక్ష్యాన్ని సాధించడంతో చాలా ఆనందంగా ఉంది. రైతు సంక్షేమం కోసం నా వంతు కృషి చేస్తానన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement