న్యూఢిల్లీ: యూపీఎస్సీ ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఆలిండియా టాపర్‌గా నిలిచిన కనిష్క్ కటారియా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో 55.35 శాతం మార్కులు సాధించారు. దీన్నిబట్టి యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఐఐటీ బాంబే నుంచి బీటెక్ పూర్తి చేసిన కటారియా సివిల్స్ పరీక్షలో మొత్తం 2,025 మార్కులకు గాను 1,121 (55.35 శాతం) మార్కులు సాధించగా.. అందులో రాత పరీక్షలో 942, ఇంటర్వ్యూలో 179 మార్కులు సాధించినట్లు యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది. 2వ ర్యాంకు సాధించిన అక్షత్ జైన్ 1,080 మార్కులు (53.3 శాతం) సాధించగా, రాత పరీక్షలో 882, ఇంటర్వ్యూలో 198 మార్కులు సాధించారు. ఈనెల 5న యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ 2018 పరీక్ష ఫలితాల్లో మొత్తం 759 మంది అభ్యర్థులు ఎంపికవగా అందులో 577 మంది పురుషులు, 182 మంది మహిళలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment