టెన్త్ పబ్లిక్ పరీక్షల నుంచి అమలు
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది.
4 నుంచి ఎస్‌జీటీలకు శిక్షణ
ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్‌జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment