Ministry of Education
-
‘ప్రత్యేక’ విద్యార్థులకు పాస్‌మార్కులు 10
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. 4 నుంచి ఎస్జీటీలకు శిక్షణ ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్‌లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. -
ఇంత దారుణమా?!
ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థినులు గతంతో పోలిస్తే 44 శాతం పెరిగారని మొన్న జనవరిలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఘనంగా ప్రకటించింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల పిల్లలు ఎక్కువుండటం శుభసూచకమని చెప్పింది. కానీ ఆడపిల్లల భద్రత విషయంలో ఉన్నత విద్యాసంస్థలు శ్రద్ధ పెడుతున్నాయా? వాటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు ఆ సంస్థలను అప్రమత్తం చేస్తు న్నాయా? గుజరాత్‌లోని గాంధీన గర్‌లో కొలువుదీరిన గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జీఎన్‌ఎల్‌యూ) వాలకం చూస్తే ఏదీ సక్రమంగా లేదన్న సందేహం కలుగుతుంది. నిరుడు సెప్టెంబర్‌లో మీడియాలో వచ్చిన కథనాలను గుజరాత్ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి. మయీల నేతృత్వంలోని ధర్మాసనాన్ని దిగ్భ్రాంతి పరిచింది. ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సాగుతున్నలైంగిక నేరాలను కప్పిపుచ్చటానికి బాధ్యతాయుత స్థానాల్లో వున్న వారు ప్రయత్నించటం భీతి గొలుపుతున్నదని న్యాయమూర్తులు అన్నారంటే అక్కడి పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమ వుతుంది. ఈ తరహా అకృత్యాలు, వికృతాలు రాజకీయ నాయకుల అండదండలు లేకుండా సాగవు. ఒక ‘పలుకుబడిగల రాజకీయ నాయకుడు’ ఇలాంటి నేరగాళ్లకు వత్తాసుగా ఉన్నాడని ఒక విద్యార్థిని చెప్పటం గమనార్హం. డైరెక్టర్, రిజిస్ట్రార్, మరికొందరు అధ్యాపకులపై సైతం ఆరోపణలు రావటం గమనిస్తే విశ్వవిద్యాలయం తోడేళ్ల పాలయిందా అన్న సందేహం తలెత్తుతుంది. ప్రపంచీకరణకు తలుపులు బార్లా తెరిచాక దేశంలో ఉన్నత విద్యాసంస్థలు కళ్లు తేలేయటం మొదలైంది. సామాజిక శాస్త్రాల అధ్యయనం మహాపాపమని పాలకులే ప్రచారం చేయటం, విద్యార్జన అంతిమ ధ్యేయం కొలువులు సాధించటం మాత్రమేనన్న అభిప్రాయం కలిగించటం ఉన్నత విద్యాసంస్థలను క్రమేపీ దిగజార్చాయి. తాము ఈ సమాజం నుంచి వచ్చామని, తమ మేధస్సును దీని ఉన్నతికి వినియోగించాలన్న స్పృహ విద్యార్థుల్లో కరువైంది. చాలా ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు కుల, మత, ప్రాంతీయ జాడ్యాల్లో కూరుకుపోయాయి. ఆడపిల్లల హాస్టళ్లలో సైతం ర్యాగింగ్లు సాగుతుండటం, కొందరు సస్పెండవుతున్నట్టు వార్తలు రావటం యాదృచ్ఛికం కాదు. వర్తమానంలో సినిమా హీరోలూ, క్రికెటర్లూ, ప్రపంచ సంగీత దిగ్గజాలూ ఆరాధ్య దైవాలవు తున్నారు. మాదకద్రవ్యాల సంగతి సరేసరి. ఇన్ని కశ్మలాల మధ్య కూనారిల్లుతున్న విద్యాసంస్థలు రాణిస్తాయని, విద్యార్థులకు వివేకాన్నీ, విజ్ఞానాన్నీ అందిస్తాయని నమ్మటం అమాయత్వమే అవుతుంది. జీఎన్ఎల్యూలోని దారుణాలపై కనీసం అయిదేళ్లుగా ఆరోపణలు వినబడుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మారుపేర్లతో కొందరు విద్యార్థినులు తమకెదురైన చేదు అనుభవాలను ఏకరువు పెట్టిన ఉదంతాలున్నాయి. అటువంటి ఉదంతం ఆధారంగా మీడియాలో వచ్చిన కథనమే గుజరాత్ హైకోర్టును రంగంలోకి దించింది. కానీ విశ్వ విద్యాలయం ఏం చేసింది? చర్యల మాట అటుంచి... సాక్షాత్తూ హైకోర్టు ధర్మాసనమే అడిగిందన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా రిజిస్ట్రార్ బుకాయింపులకు దిగాడు. ఈ మహానుభావుడే అంతక్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టిన ఇద్దరు విద్యార్థినులను మందలించాడు. ఆఖరికి బాలికల హాస్టల్ వార్డెన్‌గా ఉన్న మహిళా ప్రొఫెసర్ సైతం వారిని భయపెట్టి ఆ పోస్టులను తొలగింపజేశారు. సంస్థ కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయన్న సాకుతోనే ఇదంతా సాగించారు. పేరుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) వుంది. ఒక మహిళా ప్రొఫెసర్ నేతృత్వంలోనే సాగుతోంది. కానీ ఆ కమిటీకి ఫిర్యాదు చేయటం దండగ అనుకున్నారో, దానిగురించి తెలియనే తెలియదో ఏ బాలికా వారికి ఫిర్యాదు చేయలేదు. కనీసం ఆ కమిటీ తనంత తానే విచారణ జరపాలి కదా... ఆ పని కూడా జరగ లేదు. తొలుత దారుణాలు తన దృష్టికొచ్చాక హైకోర్టు నియమించిన కమిటీలో ఐసీసీ చైర్‌పర్సన్‌కు కూడా చోటిచ్చారు. కానీ ఆమె గారి నిర్వాకం తెలిశాక ఆ కమిటీని రద్దుచేసి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. కనుకనే ఈ అకృత్యాలు వెలుగు లోకొచ్చాయి. విద్యార్థుల్లో జిజ్ఞాస రేకెత్తించటం, తార్కిక శక్తిని పెంచటం, స్ఫూర్తి రగల్చటం, వారిని సామా జిక మార్పులకు చోదకశక్తులుగా మార్చటం ఉన్నత విద్య లక్ష్యం. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వంటిచోట తమ పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు ఎందుకు ఆసక్తి చూపుతారు? అక్కడైతే అత్యున్నత ప్రమాణాలున్న న్యాయవిద్య అందుతుందని, ఆ విశ్వవిద్యాలయంలో నిర్వహించే సెమి నార్లు, ఇతర సదస్సులు తమ పిల్లలను ఉన్నతశ్రేణికి చేరుస్తాయని వారు ఆశిస్తారు. కానీ జరిగిందేమిటి? రేపన్నరోజున న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి సమాజంలోని దురంతాలను అంతం చేయాల్సినవారే బాధితులుగా మారారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎట్లా ఎదుర్కొనాలో తెలియని నిస్సహాయ స్థితిలో పడ్డారు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఉదంతం తర్వాత జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్భయ చట్టం వచ్చింది. విద్యాసంస్థల్లోనూ, పనిస్థలాల్లోనూ బాలికలకు, మహిళకు భద్రత కల్పించటం వ్యక్తుల, సంస్థల బాధ్యతగా ఆ చట్టం గుర్తించింది. విఫల మైన పక్షంలో కఠినంగా దండించే నిబంధనలున్నాయి. కానీ జరిగిందేమిటి? ఈ దురంతాలపై లోతుగా విచారణ జరగాలి. నేరగాళ్లకూ, వారికి తోడ్పడిన పెద్దలకూ కఠినశిక్షలు పడేలా చర్యలుండాలి. దేశంలోని ఉన్నత విద్యాసంస్థలన్నిటికీ ఆ చర్యలు ఒక హెచ్చరిక కావాలి. -
ఇంజనీరింగ్‌లో పాత ఫీజులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు కాలేజీల్లో ఈ ఏడాది ఫీజుల పెంపు లేనట్టే. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే వీలుంది. ఈ సంవత్సరం పాత ఫీజులే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ) ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. దీన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదించారు. ఈ ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే వీలుంది. 2019లో పెంచిన ఫీజులు 2022 వరకూ అమలులో ఉన్నాయి. 2022–23 నుంచి కొత్త ఫీజులు అమలు కావాల్సి ఉంది. దీనిపై ఎఫ్ఆర్సీ కసరత్తు చేసింది. కాలేజీల ఆడిట్ నివేదికలను పరిశీలించడంతోపాటు యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపింది. రూ. 35 వేలున్న కనిష్ట ఫీజును రూ. 45 వేలకు, రూ. 1.43 లక్షలున్న గరిష్ట ఫీజును రూ. 1.73 లక్షలకు పెంచాలని భావించింది. దీనిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
డిగ్రీ నచ్చేలా.. విద్యార్థులు మెచ్చేలా!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థులను సాధారణ డిగ్రీ కోర్సుల వైపు మళ్ళించడం ఎలా? డిగ్రీ చేసిన వారికి ఆశాజనకమైన భవిష్యత్ ఇవ్వడమెలా? కార్పొరేట్ స్థాయికి తీసిపోనివిధంగా ఉపాధి అవకాశాలు కల్పించడమెలా? ఇప్పుడిది దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విదేశీ పాఠ్య ప్రణాళికను సైతం మేళవించి, అదనంగా సాంకేతిక విద్య కోర్సులను జోడించిన హైబ్రిడ్ మోడల్ డిగ్రీ కోర్సుల వైపు విద్యార్థులను, కాలేజీలను మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మొత్తం మీద అదనపు హంగులు అద్ది ఆకర్షణీయంగా మారిస్తే తప్ప విద్యార్థులు డిగ్రీపై దృష్టి సారించేలా చేయలేమని అనేక సర్వేలు పేర్కొంటుండటంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి సైతం డిగ్రీని విభిన్నమైన కోర్సులతో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రక్రియ ఇప్పటికిప్పుడు ఆశించినంతగా సత్ఫలితాలివ్వకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుందని విద్యా రంగ నిపుణులు భావిస్తున్నారు, సగానికిపైగా సీట్లు ఖాళీగానే.. రాష్ట్రంలో 1080 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,68,040 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా దాదాపు 3 లక్షల మంది ఇంటర్ పాసవుతున్నారు. అంటే విద్యార్థుల సంఖ్యకు మించి దాదాపు 1.68 లక్షల సీట్లు అదనంగా ఉంటున్నాయి. మరోవైపు ఇంటర్ పాసై డిగ్రీలో చేరుతున్నవారు సగటున 2.5 లక్షలకు మించడం లేదు. ఈ ఏడాది తొలి విడత దోస్త్ (డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ) కౌన్సెలింగ్‌ను పరిశీలిస్తే 1.12 లక్షల మందికి మాత్రమే డిగ్రీ సీట్ల కేటాయింపు జరిగింది. 1.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా, 6 వేల మంది వరకు అసలు వెబ్ ఆప్షన్లే ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే ఆఖరి విడత వరకు కూడా 2.20 లక్షలకు మించి సీట్లు భర్తీ అయ్యే అవకాశం కన్పించడం లేదు. దీంతో మిగతా వారంతా ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల వైపు దృష్టి పెట్టినట్టుగానే భావించవలసి ఉంటుంది. ఉపాధి లభించే కోర్సులపైనే ఆసక్తి సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ స్టడీస్ (సెస్) అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చాలావరకు కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా, డిగ్రీ తర్వాత ఏదో ఒక ఉపాధి లభించాలని కోరుకుంటున్నారు. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కన్పిస్తోంది. పోస్టు–గ్రాడ్యుయేషన్, పరిశోధన విద్య వైపు వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక విద్యనో, డిగ్రీలో తక్షణ ఉపాధి లభించే కోర్సుల వైపో మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం సీఎస్సీ, ఇతర కంప్యూటర్ సైన్స్ కోర్సుల వైపే ఎక్కువగా వెళ్తున్నారు. డిగ్రీలో కామర్స్ వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజా దోస్త్‌లో కూడా 37 శాతం మంది విద్యార్థులు కామర్స్‌ను ఎంచుకున్నారు. ఈ విధంగా సాధారణ డిగ్రీ కోర్సులకు డిమాండ్ లేకపోవడం, తక్షణ ఉపాధి లభించే డిగ్రీలపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తుండటంతో.. డిగ్రీ కోర్సులకు అదనపు హంగులు అద్దాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉపాధి కల్పించేలా డిగ్రీ డిగ్రీని సమూలంగా మార్చి ఆశాజనకంగా తీర్చిదిద్దేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. బోధన ప్రణాళికలపై విదేశీ విశ్వవిద్యాలయాలతో సమాలోచనలు జరుగుతున్నాయి. బహుళజాతి కంపెనీలతో కలిసి, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసుకుంది. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) మూస విధానం మారితే ఆదరణ విద్యా విధానంలో మూస పద్ధతులు పూర్తిగా మారాలి. ఈ దిశగా ఉస్మానియా యూనివర్సిటీ అనేక ప్రయోగాలు చేస్తోంది. ఏ సబ్జెక్టులో డిగ్రీ చేసినా, అదే సబ్జెక్టులో పీజీ చేయాలనే నిబంధనలు సరికాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం మా రింది. దీనివల్ల డిగ్రీ కోర్సులకూ మంచి ఆదరణ లభిస్తుంది. – ప్రొఫెసర్ డి.రవీందర్ (ఉప కులపతి, ఉస్మానియా వర్సిటీ) కొత్త కాంబినేషన్లతో డిగ్రీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు కొత్త హంగులు అద్దుతున్నారు. గతంలో ఉన్న పది రకాల కాంబినేషన్ డిగ్రీ కోర్సులకు ఇప్పుడు మరిన్ని జోడించారు. బీఏలోనే 68, బీఎస్సీలో 73, బీకాంలో 13 రకాల కాంబినేషన్ కోర్సులు చేర్చా రు. బీకాంలో మారిన ట్రెండ్‌కు అనుగుణంగా కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు తీసుకొచ్చారు. బీఎస్సీ గణిత, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ వంటి కాంబినేషన్ కోర్సులు మార్కెట్ అవసరాలు తీర్చేలా ఉన్నాయి. బయోకెమెస్ట్రీ, రసాయన శాస్త్ర కోర్సులకు కాంబినేషన్‌గా కంప్యూటర్ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. కమ్యూనికేషన్ ఇంగ్లిష్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆఫీస్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను బీఏలో చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇదే తరహాలో వచ్చే ఐదేళ్ళలో మరిన్ని కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టే వీలుందని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు ఇష్టమైన డిగ్రీని దేశ, విదేశాల్లోని ఏ యూనివర్సిటీ నుంచైనా ఆన్లైన్ ద్వారా చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ విద్యార్థులు డిగ్రీ వైపు మళ్ళేందుకు తోడ్పడతాయని అధికారులు భావిస్తున్నారు. -
Performance Grading Index: గ్రేడ్–2లో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, పాఠశాలల నిర్వహణలో తెలంగాణ గ్రేడ్–2లో నిలిచింది. గత 2018–19 విద్యా సంవత్సరం కంటే 2019–20లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు.. పాఠశాలల నిర్వహణ.. పరిపాలన ఎలా ఉందన్న మూడు కేటగిరీల్లో 70 అంశాల ఆధారంగా కేంద్ర విద్యాశాఖ ప్రతి ఏటా రాష్ట్రాలకు పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) పేరుతో ర్యాంకులను కేటాయిస్తోంది. మొత్తం 1,000 పాయింట్లలో ఏయే రాష్ట్రాలు ఎన్ని పాయింట్ల స్కోర్‌ను పొందాయనే అంశాల ఆధారంగా గ్రేడింగ్‌లను ఇస్తోంది. ఇందులో భాగంగా 2019–20 విద్యా సంవత్సరంలో వివిధ రాష్ట్రాల పీజీఐ స్కోర్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఆదివారం విడుదల చేశారు. అందులో 951–1000 పీజీఐ స్కోర్ (లెవెల్–1) ఏ రాష్ట్రానికీ దక్కలేదు. తెలంగాణ 772 పాయింట్లతో గ్రేడ్–2లో నిలిచింది. టాప్ స్కోర్‌తో ఐదు రాష్ట్రాలు.. ఇక 901–950 పీజీఐ స్కోర్‌తో గ్రేడ్ 1++ (లెవెల్–2)ను ఐదు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. అందులో అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, కేరళ, పంజాబ్, తమిళనాడు నిలిచాయి. తెలంగాణతోపాటు మరో ఏడు రాష్ట్రాలు 751–800 మధ్య స్కోర్‌తో గ్రేడ్–2 (లెవెల్–5) స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 801–850 పీజీఐ స్కోర్‌తో గ్రేడ్–1ను (లెవెల్–4) సాధించింది. ఇక గ్రేడ్–5లో మేఘాలయ ఉండగా, చివరి గ్రేడ్–7లో లద్దాఖ్ ఉంది. స్కోర్ మెరుగు పరుచుకున్న తెలంగాణ పాఠశాల విద్యారంగంలో తెలంగాణ తన పీజీఐ స్కోర్‌ను కొంత మేరకు మెరుగు పరుచుకుంది. 2018–19లో 757 పాయింట్ల స్కోర్‌ను పొందగా, 2019–20లో తన స్కోర్‌ను 772 పాయింట్లకు పెంచుకుంది. 2019–20 సంవత్సరంలో తమ స్కోర్లను 0.1 నుంచి 5 శాతం వరకు 9 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పెంచుకున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉండటం విÔó షం. నాణ్యత ప్రమాణాలు, అభ్యసనలో 12వ స్థానం పాఠశాల విద్యలో నాణ్యత ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన ఫలితాల్లో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. ఇందులో 180 పాయింట్లకుగాను అత్యధికంగా 168 పాయింట్లతో రాజస్తాన్ మొదటి స్థానంలో నిలవగా, 100 పాయింట్లతో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణ 142 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచింది. యాక్సెస్ విభాగంలో మొత్తం 80 పాయింట్లకుగాను 69 పాయింట్లు సాధించింది. అదే 2018–19లో ఈ విభాగంలో 66 పాయింట్లే రాగా, ఇపుడు మూడు పాయింట్లను పెంచుకుంది. మౌలిక సదుపాయాల్లోనూ మెరుగు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు. వసతుల కల్పన విభాగంలో తెలంగాణ తన స్కోరును మెరుగుపరుచుకుంది. 2019–20లో మొత్తం 150 పాయింట్లకుగాను రాష్ట్రం 113 స్కోరు సాధించింది. అదే 2018–19లో 92 పాయింట్లే ఉన్నాయి. ఇక ఈక్విటీ కేటగిరీలో 230 పాయింట్లకుగాను 210 పాయింట్లను పొందింది. గవర్నెన్స్ ప్రాసెస్ విభాగంలో 360 పాయింట్లకు గాను రాష్ట్రం 238 పాయింట్లను సాధించింది. -
ఉండనివ్వరేల ఘనాఘనులు
అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమె నిర్ణయాలకు, నిర్దేశాలకు, చివరికి ఆదేశాలకు కూడా గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం సోమవారం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! పురుషుడు స్త్రీని అధికారంలోకి రానివ్వడా! రానివ్వక తప్పనప్పుడు ఉండనివ్వడా!. ఉండనివ్వక తప్పనప్పుడు బాధ్యతలన్నీ సగౌరవగా ఆమెపై కుమ్మరించి అధికారాలన్నీ తన దగ్గరే ఉంచేసుకుంటాడా! అధికారం లేకుండా బాధ్యతలు ఎలా నెరవేర్చడం?! స్త్రీ సాధికారత అని మాటలు చెబుతుండే.. చదువు, వివేకం గల పెద్దపెద్ద సంస్థలలో కూడా ఇంతేనా! స్త్రీ.. పేరుకేనా ‘పదవి’లో ఉండటం. అంజూ సేథ్ విషయంలోనూ ఇదే జరిగింది. పురుషాధిక్య ‘పోరు’ పడలేక ఆమె తన డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి ఐఐఎం (కలకత్తా) మెట్లు దిగి వెళ్లిపోయారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ ఐఐఎం కి తొలి మహిళా డైరెక్టర్ ఆమె. అంజూ సేథ్ వెళ్లిపోతుంటే చైర్మన్ ముఖం చాటేశారు. బోర్డ్ చూస్తూ నిలబడింది. ఫ్యాకల్టీ మౌనంగా ఉండి పోయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేడూ రేపట్లో ఏమైనా మాట్లాడుతుందేమో చూడాలి. మేనేజ్మెంట్ రంగంలో అంజూ సేథ్ అత్యంత సమర్థురాలని పేరు. ఐఐఎమ్‌కి 2018లో డైరెక్టర్‌గా వచ్చే ముందువరకు యూఎస్‌లో ఆమె పెద్ద పొజిషన్లో ఉన్నారు. ఐఐఎమ్‌లో చేరినప్పటి నుంచీ డైరెక్టర్ హోదాలో ఆమె నిర్ణయాలను చైర్మన్ రెస్పెక్ట్ చేయడం లేదని ప్రధాన ఆరోపణ. ఆమెతో అతడి సమస్య ఏంటి? ఒక నిస్సహాయురాలిలా ఈ ఉన్నత విద్యావంతురాలు ఎందుకు వెళ్లిపోవలసి వచ్చింది? గ్లాస్ సీలింగ్ ని బ్రేక్ చేసిన మహిళను అసలే నిలవనివ్వరా ఈ ఘనాఘనులు?! అరవై ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా ఐ.ఐ.ఎం. కు సుమారు రెండున్నరేళ్ల క్రితం అంజు సేథ్ డైరెక్టర్‌గా వచ్చినప్పుడు కలకత్తా ఐ.ఐ.ఎం.కు తొలి మహిళా డైరెక్టరుగా ఆమె గుర్తింపు పొందారు. అయితే డైరెక్టరుగా మాత్రం ఆమెకు గుర్తింపు గౌరవం లభించలేదన్న విషయం ఆమె రాజీనామా చేసి బయటికి వస్తున్నప్పుడు మాత్రమే ఆమెతో పాటు బయటపడింది! వర్జీనియాలోని ‘పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్’లో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండియా వచ్చి 2018 నవంబరులో కలకత్తా ఐ.ఐ.ఎం.లో డైరెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు అంజు సేథ్. అయితే తనను ఏనాడూ ఇక్కడివాళ్లు ‘లోపలి మనిషి’ చూడలేదని, ఐ.ఐ.ఎం.–సి ఛైర్మన్ శ్రీకృష్ణ కులకర్ణిని ఉద్దేశించి ఆమె ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. సిబ్బంది చెబుతున్న దానిని బట్టి కూడా డైరెక్టర్ పరిధిని అతిక్రమించి వచ్చి మరీ ఛైర్మన్ ఆమె విధులకు ఆటంకాలు కలిగించారు. అనేక కమిటీల నుంచి ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారు! నిధుల సమీకరణ కమిటీ నుంచి తప్పించారు. ఆమెకున్న నియామక అధికారాలను నామమాత్రం చేశారు. ఆమెపై క్రమశిక్షణ చర్యలకు బోర్డు సభ్యులను ప్రేరేపించారు. పైపెచ్చు తిరిగి ఆమె మీదే గత డిసెంబరులో విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శి అమిత్‌ఖేర్‌కు ఆమె పనితీరు సవ్యంగా ఉండటం లేదని, వివక్షతో కూడిన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫ్యాకల్టీ చేత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. ఇవన్నీ కూడా అంజు సేథ్ తనకై తను బయటపెట్టినవి కాదు. బోర్డు సభ్యులలో, ఫ్యాకల్టీ విభాగంలో నిజానిజాలు తెలిసినవారు మీడియాకు వెల్లడించినవి. అంజు సేథ్ కూడా కలకత్తా ఐ.ఐ.ఎం.లోనే (1978) చదివారు. 1988లో మిషిగాన్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు. 2008లో వర్జీనియా టెక్ (పంప్లిన్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) లో ప్రొఫెసర్‌గా చేరారు. తిరిగి పదేళ్ల తర్వాత ఇండియా వచ్చారు. తనొక మహిళ కాబట్టి వివక్షకు గురయ్యానని ఆమె బలంగా నమ్ముతున్నారు. -
విద్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఒకేసారి రెండు డిగ్రీలు
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థులు ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను కమిషన్ ఆమోదించింది. త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇకపై దేశంలోని విద్యా సంస్థల్లో విద్యార్థులు రెండు డిగ్రీ కోర్సులు కలిపి ఒకే విద్యా సంవత్సరంలో పూర్తి చేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతులలో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్లైన్లో దూరవిద్య(ఓఎల్‌డీ) ద్వారా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ► ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పోటీని ఎదుర్కొనేందుకు ఇది ఉపయోగపడుతుందని యూజీసీ అభిప్రాయపడింది. ► కొత్త విధానంలో విద్యార్థులు ఒకే సంస్థ లేదా వేర్వేరు సంస్థల ద్వారా ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులను అభ్యసించగలుగుతారు. ఈ మేరకు యూజీసీ అనుమతి ఇచ్చిందని ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఏకకాలంలో ద్వంద్వ డిగ్రీల కోసం వచ్చిన ప్రతిపాదనను ఇటీవల జరిగిన కమిషన్ సమావేశంలో ఆమోదించారని చెప్పారు. ► దీనికి సంబంధించి త్వరలో అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారని ఉన్నత విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ► ఏకకాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకువచ్చింది. ఈ ప్రతిపాదనను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్ చాన్స్‌లర్ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది. ► రెగ్యులర్ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్ లేదా డిస్టెన్స్ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని అభిప్రాయపడింది. ► ఈ కమిటీ నివేదికపై నిపుణులతో కూడిన చట్టబద్ధమైన అకడమిక్ కౌన్సిల్స్ అభిప్రాయం యూజీసీ కోరింది. అప్పటి కౌన్సిల్ సూచనల మేరకు బహుళ డిగ్రీ కార్యక్రమాలను యూజీసీ ఆమోదించలేదు. ► ప్రస్తుతం మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీతత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొనాలంటే పరిజ్ఞానం మరింత అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పిస్తోంది. -
రోడ్డున పడిన డీఎడ్ విద్యార్థులు
- అనుమతి లేకుండా ఉర్దూ మీడియంలో చేర్చుకున్న ఆరు కాలేజీలు - హాల్‌టికెట్లను నిరాకరించిన విద్యాశాఖ - ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు సాక్షి, హైదరాబాద్: మైనారిటీ డీఎడ్ కాలేజీ యాజమాన్యాల అత్యాశ వందలాది మంది విద్యార్థులను రోడ్డున పడేసింది. తెలుగు మీడియం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సు నిర్వహణకు మాత్రమే అనుమతి ఉన్న కాలేజీల్లో ఉర్దూ మీడియం డీఎడ్‌లో విద్యార్థులను చేర్చుకోవడం వారి పాలిట శాపంగా మారింది. కాలేజీలో ఉర్దూ మీడియంకు అనుమతి ఉందో? లేదా? తెలియని విద్యార్థులు కాలేజీల్లో చేరి చివరకు విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. 6 కాలేజీల యాజమాన్యాలు అనుమతి లేని కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడంతో ఈ నెల 17 నుంచి ప్రారంభమైన వార్షిక పరీక్షలకు వారిని విద్యా శాఖ అనుమతించలేదు. ఏటా ఇదే తంతు.. విద్యార్థుల నుంచి వేల రూపాయలు దండుకుంటున్న యాజమా న్యాలు ఏటా నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా ప్రవే శాలు చేపడుతున్నాయి. పరీక్షల సమయం రాగానే మైనారిటీ కాలేజీల్లో పిల్లలకు పరీక్షలు రాసే అవకాశం ఇవ్వరా? అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, అనుమతులు పొందడం పరిపా టిగా మారింది. 2016–17 విద్యా సంవత్సరంలోనూ ఇదే ఆలోచ నతో ప్రవేశాలు చేపట్టాయి. డైట్‌సెట్–ఏసీ కన్వీనర్, యాజమా న్యాలు కుమ్మక్కై ఈ అక్రమానికి తెరలేపినట్లు ఆరోపణలు వ్యక్త మవుతున్నాయి. అయితే ఈసారి 6 తెలుగు మీడియం మైనారిటీ కాలేజీల్లో అనుమతి లేని ఉర్దూ మీడియంలో విద్యార్థులను చేర్చు కుని అనుమతి కోసం విద్యాశాఖ చుట్టూ తిరిగారు. కానీ డైట్‌సెట్ చైర్మన్‌గా ఉన్న పాఠశాల విద్య డైరెక్టర్ అనుమతి ఇవ్వలేదు. తెలుగు మీడియంలో ఉర్దూ మీడియం విద్యార్థులను చేర్చుకో వడం నిబంధనలకు విరుద్ధమంటూ ఆరు కాలేజీల విద్యార్థుల జాబితాను ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపించలేదు. పరీక్షల విభాగం వారికి హాల్‌టికెట్లు జారీ చేయలేదు. ఆందోళనలోపడ్డ యాజమాన్యాలు ప్రభుత్వం, విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చాయి. అయితే విద్యాశాఖ దీనికి అంగీకరించలేదు. కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ఆయా కాలేజీల్లో ఉర్దూ మీడియంలో చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.