Passing
-
‘ప్రత్యేక’ విద్యార్థులకు పాస్‌మార్కులు 10
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. 4 నుంచి ఎస్జీటీలకు శిక్షణ ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్‌లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. -
పేదల హక్కులు కాపాడండి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన హక్కులు, అధికారాలను దేశంలోని ప్రతి పేదకు దక్కేలా చట్టాన్ని అమలు చేయాలని యువ ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశం చేశారు. బ్రిటిష్ చట్టాలను మార్చి ప్రజల రక్షణే ధ్యేయంగా నూతన ఆశయాలు, విశ్వాసాలతో ఐపీసీ, సీఆరీ్పసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లలో కీలక మార్పులు తెస్తున్నట్లు చెప్పారు. అతిత్వరలో రానున్న ఈ నూతన చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉందన్నారు. బాధ్యతాయుత పోలీసింగ్ నుంచి ఒక అడుగు ముందుకేసి సానుకూల పోలీసింగ్ వైపు అడుగులు వేయాలని సూచించారు. స్థానిక భాష, ఆచార వ్యవహారాలను తెలుసుకుంటేనే యువ ఐపీఎస్‌లు సుదీర్ఘ సరీ్వస్‌లో ప్రజలకు మరింత దగ్గర అవుతారని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో నిర్వహించిన 75వ రెగ్యులర్ రిక్రూటీ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన 155 మంది ఐపీఎస్‌లు, రాయల్ భూటాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్‌కు చెందిన 20 మంది విదేశీ కేడెట్ల దీక్షాంత్ పరేడ్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువ ఐపీఎస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపాలి ‘మరో 25 ఏళ్లలో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుపుకోనుంది. అప్పటికి 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకొని మీరు ఉన్నత స్థానాల్లో ఉండటమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారత్‌ను నంబర్ వన్‌గా నిలపడంలోనూ మీ శ్రమ తప్పక ఉంటుందని విశ్వసిస్తున్నా. దేశ అంతర్గత భద్రత, దేశ ప్రగతిలోనూ మీరు కీలకపాత్ర పోషించాలని ఆశిస్తున్నా’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆకాంక్షించారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా గత 75 ఏళ్లలో సుశిక్షితులైన ఎందరో ఐపీఎస్‌లు దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారన్నారు. 75వ రెగ్యులర్ బ్యాచ్‌లోని 155 మంది ఐపీఎస్‌లలో 32 మంది మహిళా ఐపీఎస్‌లు ఉండటం మహిళా సాధికారతకు అద్దం పడుతోందని.. ఇది శుభశూచకమని అమిత్ షా చెప్పారు. కొత్త సవాళ్లకు సిద్ధం కావాలి.. ఇటీవల కాలంలో పెరిగిన సైబర్ నేరాలు, అంతర్గత భద్రత ముప్పు, అంతర్జాతీయ ఆర్థిక నేరాలు, హవాలా, క్రిప్టోకరెన్సీతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, డ్రగ్స్ రవాణా వంటి నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఐపీఎస్‌లు మరింత సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు ఎప్పుడూ రెండు అడుగులు ముందే ఉండేలా సాంకేతికంగా పోలీసింగ్ బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ మాట్లాడుతూ యువ ఐపీఎస్‌లు చట్టాన్ని నిష్పాక్షికంగా అమలు చేయడంతోపాటు మానవతా విలువలతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యంతోనే అన్నీ.. ఫిట్‌రైజ్ 75 ప్రారంభంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా ఉల్లాసంగా ఉంటామని, పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేయగలుగుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఫిట్నెస్ సాధించేందుకు తాను నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు. దీక్షాంత్ పరేడ్ అనంతరం ఎన్పీఏ ఆవరణలో ఫిట్‌రైజ్–75ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. యోగా, ధ్యానం, శారీరక శ్రమ మానసిక ధృఢత్వాన్ని, ఆలోచన శక్తిని పెంచుతుందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే దేశం ప్రగతి మార్గంలో పయనిస్తుందన్నారు. -
అరే ఏం యాక్ట్ చేశాయి మేకలు...అందర్నీ బకరాలు చేశాయిగా!
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫన్నీగా ఉండే వైరల్ వీడియో. అందరికీ మేకలు ఎలా ఉంటాయో తెలుసు. ఐతే ఈ వీడియోలో కొన్ని మేకలు చాల మాత్రం భలే చేశాయి. అవన్న ఒక చోట గడ్డి మేస్తు ఉన్నాయి. ఇంతలో అటుగా ఒక పార్సిల్ ట్రక్కు వస్తుంది. ఆ తర్వాత ఉన్నటుండి మేకలన్ని కింద పడిపోతాయి. వాస్తవానికి ఆ ట్రక్కు వాటి పక్క నుంచి వెళ్తుందే తప్ప వాటిని ఢీ కొట్టలేదు. ఈ మేకలు మాత్రం ఆ ట్రక్కు రావడమే తరువాయి ఒకేసారి అన్ని మేకలు చనిపోయినట్టుగా కింద పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. నెటిజన్లు ఆ మేకలు చూసి ఫిదా అవుతూ... పొట్ట చెక్కలయ్యేలా నవ్వే సన్నివేశం అంటూ కామెంట్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. Fainting Goats Meet UPS Truck 😆🐐🚚#viralhog #faintinggoats #pets #humor pic.twitter.com/cxqLWZZKjx — ViralHog (@ViralHog) October 19, 2022 (చదవండి: బిడ్డ కోసం తల్లి చేసిన పోరాటం ఇది.. తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ) -
దూసుకొస్తోన్న భారీ గ్రహశకలం..! భూమిని ఢీ కొట్టనుందా..! నాసా ఏమంటుంది..?
2021 ఎన్వై1 అనే గ్రహశకలం భూమి వైపుగా దూసుకువస్తోంది. ఈ గ్రహశకలం ఈ నెల సెప్టెంబర్ 22 న భూమికి అత్యంత సమీప దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ వెల్లడించింది. 2021 ఎన్వై1 అత్యంత ప్రమాదం కల్గించే గ్రహశకలంగా నాసా గుర్తించింది. ఈ గ్రహశకలం భూమి నుంచి 1,498,113 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించనున్నట్లు నాసా అంచనావేసింది. ప్రస్తుతం ఈ గ్రహశకలం గంటకు 33660 కిలోమీటర్ల వేగంతో భూమి వైపుగా దూసుకువస్తోంది. చదవండి: ఖగోళం ఖాతాలో మరో అద్భుతం.. చుక్కల దృశ్యాల్ని చూసి తీరాల్సిందే 2021 ఎన్వై1 గ్రహశకలం స్కూలు బస్సు పరిమాణంలో ఉందని నాసా వెల్లడించింది. ఈ గ్రహశకలాన్ని అపోలో క్లాస్ ఆస్టరాయిడ్‌గా నాసా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. నాసా శాస్త్రవేత్తలు ఈ ఆస్టరాయిడ్ పరిమాణం సుమారు 0.127 కిమీ నుంచి 0.284 కిమీ వ్యాసంతో ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం గ్రహశకల గమనాన్ని నాసా జేపీఎల్ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఆస్టరాయిడ్ ప్రయాణిస్తోన్న నిర్ణీత కక్ష్యను సిములేషన్ ద్వారా నాసా పర్యవేక్షిస్తుంది. ఈ ఆస్టరాయిడ్ సూర్యుని చుట్టూ తిరిగి రావాడానికి సుమారు 1400 రోజులు పట్టనుంది. ఈ గ్రహశకలం మరో శతాబ్దం తరువాత భూమికి మరింత చేరువలో వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. 2021 ఎన్వై1 గ్రహశకల గమనాన్ని 2021 జూన్ 12 నుంచి నాసా పర్యవేక్షిస్తుంది. కాగా ఈ గ్రహశకలం నుంచి భూమికి ప్రమాదం లేనప్పటికీ, అత్యంత ప్రమాదకర గ్రహశకల కేటాగిరీలో ఈ ఆస్టరాయిడ్‌ను నాసా వర్గీకరించింది. చదవండి : ఆకాశంలో ఒక్కసారిగా పేలిపోయిన రాకెట్....! -
ఎంత రాసినా సున్నా మార్కులే!
= ఎస్కేయూ డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో వైచిత్రి = మొదటి, రెండో సంవత్సరంలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత = అయినా ఫైనలియర్లో సున్నా మార్కులే = మూల్యాంకనం తీరుపై విద్యార్థుల విస్మయం = రెక్టార్ పర్యవేక్షణలో పునఃపరిశీలన ఎస్కేయూ : ►అనంతపురం నగరానికి చెందిన రామాంజినేయులు ఎస్కేయూకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదివాడు. బీఎస్సీ మొదటి సంవత్సరంలో 69 శాతం, రెండో ఏడాది 72శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఫైనలియర్లో మాత్రం స్టాటిస్టిక్స్‌లో కేవలం రెండు మార్కులు వచ్చాయి. పరీక్ష బాగా రాశానని, కావాలంటే జవాబుపత్రం చూడాలని అతను అంటున్నాడు. ►ఇదే కళాశాలలో చదివిన బి.ఆంజనేయులు (బీఎస్సీ – స్టాటిస్టిక్స్) మొదటి, రెండో సంవత్సరం 69 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఫైనలియర్లో మాత్రం మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. స్టాటిస్టిక్స్‌లో ఏడు మార్కులే వచ్చాయి. ఇతనికి బ్యాంకుఉద్యోగం వచ్చింది. ఫైనలియర్లో ఫెయిల్ కావడంతో ఉద్యోగం చేజారే ప్రమాదముంది. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేస్తే ఫలితాలు ప్రకటించడానికి రెండు నెలలు పడుతుంది. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదంటూ ఆంజనేయులు వాపోతున్నాడు. వీరిద్దరే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో సింహభాగం విద్యార్థులకు సున్నా మార్కులు రావడం విస్మయం కలిగిస్తోంది. మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయా? లేక కంప్యూటర్లో మార్కుల నమోదు సందర్భంగా పొరపాట్లు చేశారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత రెండేళ్లుగా ఎస్కేయూ పరీక్షల విభాగం పనితీరుపై విమర్శలొస్తున్నాయి. గత ఏడాది ఇంటర్నల్ మార్కుల నమోదులో తప్పిదాలు జరగడంతో వేలాది మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో ఆ తప్పిదాలను సవరించారు. మరోవైపు ఉత్తీర్ణత బాగా తగ్గడంతో గతేడాది 15 మార్కులు అందరికీ అదనంగా కలిపి (గ్రేస్ మార్కులు) ఫలితాలు ప్రకటించారు. సిలబస్‌లో లేని ప్రశ్నలతో తంటా : 2015–16 విద్యా సంవత్సరం నుంచి ఎస్కేయూ డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం పాత పద్ధతి (వార్షిక పరీక్షలు)లోనే పరీక్షలు నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం (2017–18) నుంచి పాతపద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు. ఇకమీదట పరీక్షలన్నీ సెమిస్టర్ విధానంలోనే ఉంటాయి. ఇకపోతే ఈసారి పాతపద్ధతిలో ఫైనలియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రశ్నలు కఠినంగా ఇవ్వటంతో పాటు సిలబస్‌లో లేని వాటినీ ఇచ్చారు. దీనివల్ల మార్కులు తగ్గాయని విద్యార్థులు వాపోతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఫలితాలు సవరించాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. దీంతో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్ పర్యవేక్షణలో ఫలితాలను పునఃపరిశీలిస్తున్నారు. ఏయే సబ్జెక్టులు సమస్యాత్మకంగా ఉన్నాయో.. ఆయా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా.. మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకూ అవకాశం లేదని డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు గురువారం ఎస్కేయూ పరీక్షల విభాగాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జె.శ్రీరాములుతో వాగ్వాదానికి దిగారు. ఫస్టియర్, సెకండియర్‌లో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ఫైనలియర్లో సున్నా మార్కులు రావడం ఏమిటని ఎస్ఎఫ్ఐ నాయకుడు కొండన్న నిలదీశారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. మార్కులు తక్కువ వచ్చిన వారి వివరాలు ఇస్తే, పరిశీలించి న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు ముస్తఫా, జిల్లా సెక్రటరీ రమేష్, నాయకులు సూర్య చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గ్రేటర్ జిల్లాల్లో బాలికలదే హవా
►మూడు జిల్లాల ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా ►తొలి స్థానంలో మేడ్చల్, రెండోస్థానం రంగారెడ్డి జిల్లా ►ఫలితాలు మెరుగుపడినా.. ర్యాంకింగ్‌లో హైదరాబాద్ వెనుకంజే... సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక ఫలితాల్లో గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురకంటే అత్యధిక సంఖ్యలో పాసై హవా కొనసాగించారు. ఫస్ట్ ఇయర్లో బాలురతో పోలిస్తే మేడ్చల్ జిల్లాలోని బాలికలు అత్యధికంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించగా, రంగారెడ్డిలో 74 శాతం, హైదరాబాద్‌లో 66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సెకండ్ ఇయర్లో మేడ్చల్ 86 శాతం, రంగారెడ్డిలో 81 శాతం, హైదరాబాద్‌లో 75 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించి తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక ఉత్తీర్ణత ర్యాంకింగ్ విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన మేడ్చల్ జిల్లా అందరికంటే ఎక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి రాష్ట్రంలోనే నెంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, రంగారెడ్డి రెండో ర్యాంక్‌ను దక్కించుకుంది. ఇక హైదరాబాద్ జిల్లా ఎనిమిదో ర్యాంక్‌కు పరిమితమైంది. హైదరాబాద్‌లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం కొంత మెరుగు పడినా ర్యాంకింగ్‌లో వెనుకబడే ఉంది. మొత్తం ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్ జిల్లాలో ఫస్టియర్‌లో 57 శాతం, సెకండియర్‌లో 67 శాతం, రంగారెడ్డిలో ఫస్టియర్‌లో 69 శాతం, సెకండియర్‌లో 78 శాతం, మేడ్చల్ జిల్లాలో ఫస్టియర్‌లో 75 శాతం, సెకండియర్‌లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
ఇంటర్లో బాలికలే టాప్
⇒రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ఫస్టియర్ 4, సెకండియర్ 5వ స్థానం ⇒గత ఏడాదికంటే దిగజారిన ఇంటర్ ఫలితాలు ⇒శతశాతం సాధించిన గొలుగొండ, వేములపూడి కాలేజీలు విశాఖపట్నం : ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. బాలురకంటే పైచేయి సాధించారు. ఇటు ఫస్టియర్‌లోనే కాదు.. అటు సెకండియర్‌లోనూ తామే గ్రేట్ అని నిరూపించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 69 శాతం, ద్వితీయ సంవత్సరంలో 80 శాతం ఉత్తీర్ణతతో వీరు ముందున్నారు. గురువారం విడుదలయిన ఇంటర్ ఫలితాల్లో విద్యార్థినీ, విద్యార్థులు వెరసి ఫస్టియర్‌లో 66, సెకండియర్‌లో 78 శాతం సగటు ఉత్తీర్ణత సాధించారు. కాగా గత ఏడాది ఫస్టియర్ ఫలితాల్లో మూడో స్థానంలో ఉన్న విశాఖ ఈ సంవత్సరం నాలుగు, సెకండియర్‌లో నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి దిగజారింది. ఈ ఏడాది మొదటి సంవత్సరం పరీక్షలకు 49,933 మంది హాజరు కాగా 33,158 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో జిల్లాలోని కేడీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల 81 శాతంతో మొదటి స్థానంలోనూ, 69 శాతం ఉత్తీర్ణతతో రెండోస్థానంలో దేవరాపల్లి కళాశాలలు నిలిచాయి. జి.మాడుగుల జూనియర్ కాలేజీ 6 శాతం ఉత్తీర్ణతతో అథమం స్థానం దక్కించుకుంది. ఫస్టియర్ ఎయిడెడ్ కళాశాలల్లో 35 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధ్యమైంది. ఇందులో నగరంలోని ఏఎస్‌రాజా 49, బీవీకే కాలేజి 40 శాతంతో ప్రథమ, ద్వితీయస్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా ఏవీఎన్ కళాశాల 15 శాతం ఉత్తీర్ణతే పొందింది. ఒకేషనల్ కాలేజీ విద్యార్థులు 66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గిరిజన సంక్షేమ కాలేజీల్లో 70.68 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రభుత్వ మోడల్ కాలేజీలోల 73.6 శా తం ఉత్తీర్ణత సాధించా రు. అలాగే సాంఘిక సంక్షేమ కాలేజీల్లో 74.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లోకి వస్తే 44,966 మంది పరీక్షలు రాయగా 35,155 మంది (78 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 80 శాతం ఉత్తీర్ణతతో బాలురకంటే (76 శాతం) బాలికలు అగ్రస్థానంలో నిలిచారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 60.6 శాతం మంది పాసయ్యారు. 98 శాతం ఉత్తీర్ణతతో కేడీపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే ఎయిడెడ్ కళాశాలల్లో 50 శాతం మంది పిల్లలు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అత్యధికంగా సెయింట్ జోసెఫ్ కాలేజీ 73 శాతం ఉత్తీర్ణత పొందింది. ఒకేషనల్ కాలేజీల్లో 81 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీటిలో 98 శాతం ఉత్తీర్ణతతో పాయకరావుపేట జూనియర్ కాలేజీ అగ్రస్థానం సాధించింది. గిరిజన సంక్షేమ కళాశాలల్లో 85.6 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, 97 శాతం ఉత్తీర్ణతతో పెదబయలు కాలేజీ ప్రథమ స్థానం పొందింది. ఇక ప్రభుత్వ మోడల్ కాలేజీలు 73.6 శాతం ఉత్తీర్ణత సాధించాయి. వీటిలో వేములపూడి కాలేజీ నూరుశాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచింది. సాంఘిక సంక్షేమ కాలేజీల్లో 91.5 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ కళాశాలల్లో గొలుగొండ నూరు శాతం ఫలితాలు సాధించిన ఘనత దక్కించుకుంది. అథమ స్థానంలో.. కాగా జిల్లాలో కొన్ని కళాశాలలు అత్యల్ప ఉత్తీర్ణతతో అథమ స్థానంలో నిలిచాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జి.మాడుగుల అత్యల్పంగా 6 శాతం ఉత్తీర్ణత సాధించింది. అక్కడ 211 మంది పరీక్షలకు హాజరుకాగా కేవలం 12 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో ఏవీఎన్ కళాశాల 15 శాతం, ఒకేషనల్ కాలేజీల్లో 36 శాతంతో మధురవాడ, గిరిజన సంక్షేమ కాలేజీల్లో కొయ్యూరు 34, సాంఘిక సంక్షేమశాఖలో 35 శాతంతో కొక్కిరాపల్లి, మోడల్ కాలేజీల్లో 27 శాతంతో చీడికాడ కళాశాలలు అతి తక్కువ ఫలితాలు సాధించాయి. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అతి తక్కువగా డుంబ్రిగుడ కాలేజీలో 18 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ 116 మందికి 21 మంది పాసయ్యారు. ఎయిడెడ్ కాలేజీల్లో అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీ 27 శాతం, ఒకేషనల్‌లో అగనంపూడి 25 శాతం, గిరిజన సంక్షేమ కాలేజీల్లో కొయ్యూరు 54 శాతం, మోడల్ కాలేజీల్లో చీడికాడ 27 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. -
అవి‘నీటి’ వ్యాపారం
– గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని అక్రమంగా తరలింపు – ఎకరాకు రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్న విష్ణువర్గీయులు నేతలు – అడ్డుకోలేక పోతున్న ఎమ్మెల్యే మణిగాంధీ కోడుమూరు: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఎండుతున్న పంటలను కాపాడుతామంటూ అపర భగీరథుల్లా వ్యవహరిస్తున్న తెలుగు దేశం నేతలు తెరవెనుక అవి‘నీటి’ వ్యాపారానికి తెరతీశారు. అధికారం చేతుల్లో ఉందని తమకు పట్టున్న ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నట్లు నటిస్తూనే అక్రమ దందా నడపుతున్నారు. టీడీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. విష్ణువర్దన్రెడి.. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎల్లెల్సీ ఆయకట్టుకు నీరు వదలాలని ఇన్చార్జి మంత్రి అచ్చెన్ననాయుడుతో సిఫారస్ లేఖను తీసుకొచ్చి జిల్లా కలెక్టర్ చేత అమోదింపజేసుకున్నట్లు సమాచారం. దీంతో కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, కష్ణగిరి మండలాల్లోని 10వేల ఎకరాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని వదలాలని అధికారులకు ఆదేశాలొచ్చినట్లు తెలుస్తోంది. 10వేల ఎకరాలకు నీటిని వదిలితే గాజులదిన్నె ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 3.30 టీఎంసీల నీరు నిల్వవుంది. ఎల్లెల్సీ గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు రోజు 110 క్యూసెక్కులు, కుడి కాల్వకు 200క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. 10వేల ఎకరాలు తడిపేందుకు ఎన్ని రోజులు నీళ్లు వదలాలన్న నిబంధన కూడా విధించలేదని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ. 2 వేలు ఇవ్వాల్సిందే ఎండిపోతున్న పంటలను కాపాడాలన్న ముసుగులో గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని ఎల్లెల్సీ ఆయకట్టుకు నీటిని మళ్లించి గూడూరు సి.బెళగల్ మండలాల్లోని రైతుల నుంచి కొంతమంది విష్ణువర్గీయులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఎకరాకు రూ.2వేలు ఖరాఖండిగా వసూలు చేస్తున్నారు. కరువు కాలంలో ఇవ్వలేమని రైతులు చెబుతున్నా వినడం లేదు. డబ్బులివ్వకపోతే పొలాలకు నీటిపారుదల నిలిపేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖాళీ అవుతున్న ప్రాజెక్ట్ ఇప్పటికే పది రోజులుగా 0.5 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తాగునీటి అవసరాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నీళ్లు ఉండవు. పందికోన రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా నీరు గాజులదిన్నె ప్రాజెక్టులో ఒకటిన్నర టీఎంసీ నీటిని నిల్వవుంచాలన్న ప్రతిపాదన అటకెక్కింది. హంద్రీనీవా నీటిని గాజులదిన్నె ప్రాజెక్టుకు తరలిస్తే కొంత వరకు న్యాయం చేసినట్లవుతుంది. గూడూరు, సి.బెళగల్ ప్రాంతాల రైతులకు ఎల్లెల్సీ నీటిని విడుదల చేయించుకోవాల్సివుంది. అధికారులు, నాయకులు చేతగాక గాజులదిన్నె ప్రాజెక్టు నీటిని అక్రమంగా తరలించడంతో ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మణిగాంధీ స్పందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోతే కోడుమూరు మండలంలోకి రానివ్వమని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కష్ణ హెచ్చరిస్తున్నారు. ======================== విష్ణు వర్గీయులపై కలెక్టర్ ఫిర్యాదు కర్నూలు(అగ్రికల్చర్): ఆయకట్టుదారుల నుంచి నీటి కోసం ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి అనుచరులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయా గ్రామాల రైతులు సోమవారం ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్ ఫిర్యాదు చేశారు. మునగాల ఎత్తిపోతల పథకం కింద మునగాల, గూడూరు, ఖానాపురం, పర్ల, గుడిపాడు గ్రామాలకు చెందిన 2,300 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. మునగాల లిఫ్ట్ నుంచి నీటి విడుదల ఎల్లెల్సీ ఆధీనంలో ఉంది. తెలుగుదేశం నాయకుడు, గూడూరు ఎంపీపీ భర్త మహేశ్వరరెడ్డి ఎల్ఎల్సీ అధికారులు రాకుండ చేసి డబ్బులు ఇస్తేనే నీళ్లు అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయకట్టుకు ఎకరాకు రూ.1500, నాన్ ఆయకట్టుకు రూ.3000 ప్రకారం వసూలు చేస్తున్నారని రైతులు తీవ్రంగా ధ్వజమెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చి మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రేమట స్కీమ్ పరిధిలోను... కర్నూలు మండలం రేమట లిఫ్ట్ కింద కొత్తకోట గ్రామానికి చెందిన 700 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు. రేమట లిఫ్ట్ నుంచి ఈ భూములకు నీళ్లు ఇవ్వాలంటే దేశం నాయకులకు ముడుపులు ఇచ్చుకోవాల్సి వస్తోందని, సర్పంచు కుమారుడు వెంకటేశ్వర్లు, టీడీపీ నేతలు రాఘవరెడ్డి, గిడ్డయ్యలు ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి పేరు చెప్పి ఎకరాకు రూ.2000 వరకు వసూలు చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మామూళ్లు ఇస్తేనే పంటలకు నీళ్లు ఇస్తామని కరాకండిగా చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వినతిపత్రం ఇచ్చారు. -
కేయూ చరిత్రలోనే అతి తక్కువ ఉత్తీర్ణత
మూడు జిల్లాల్లో కలిపి 28.40 శాతం నమోదు డిగ్రీలో పడిపోతున్న విద్యాప్రమాణాలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనూ అదేతీరు కేయూ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరంలో కేవలం 28.40 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించడం ఆందో ళన కలిగిస్తుంది. కేయూ చరిత్రలోనే ఇంత తక్కువ ఫలితాలు రావడమనేది ఇదే తొలిసారి అని తెలుస్తోంది. చివరి సంవత్సరం పరీక్షలకు 44,506 మంది విద్యార్థులు హాజరై తే కేవలం 12,641మందే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 33.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఈ సారి 5.57శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక మొ దటి, రెండు, చివరి సంవత్సరాల్లో కలిపి 1,55,273 మంది విద్యార్థులకు 39,456 మం ది(25.41శాతం) ఉత్తీర్ణత సాధించడం గమనా ర్హం. బీఏ కోర్సులోనైతే వరంగల్ జిల్లాలో 17.19శాతం, బీఎస్సీలో 27.50 శాతం, బీకాం లో 31.87 శాతమే ఉత్తీర్ణత న మోదైంది. సాధించారు. డిగ్రీ విద్యలో ఇంత తక్కువ ఫలి తాలు రావటం అనేది కాకతీయ యూనివర్సి టీ చరిత్రలో ఇది తొలిసారిగా అని తెలుస్తోంది. అర్హులైన అధ్యాపకులు ఉన్నా... కేయూ పరిధిలో డిగ్రీ ఫలితాలను పరిశీలిస్తే డిగ్రీ విద్యలో విద్యాప్రమాణాలు పడిపోయిన ట్లుగా భావించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం ఆం దోళన కలిగిస్తుంది. యూనివర్సిటీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 305 డిగ్రీ కళాశాలలు ఉండగా.. వరంగల్ జిల్లాలో 14 ప్రభుత్వ, సు మారు 90నుంచి 100వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళా శాలల్లో ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయించడం లేదు. ఏదో విధంగా ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణత సాధించినా థియరీలో ఉత్తీర్ణత ఆశించనంతగా ఉండడం లేదు. ప్రైవేట్ కళాశాలల బాధ్యులు తాయిలాలు చూపి, తరగతులకు రాకున్నా పర్వాలేదని చెబుతూ విద్యార్థులను చేర్చుకుం టున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడం తో విద్యార్థులు పలువురు కాపీయింగ్‌పై ఆధారపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడా ది మూడు జిల్లాల్లో కలిపి 1300 మందికి పైగా విద్యార్థులు డిబార్ కావడానికి దీనికి నిదర్శ నంగా చెప్పుకోవచ్చు. కేవలం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్సమెంట్ కోసమే అన్నట్లుగా డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయనే విమ ర్శలున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విషయానికొస్తే ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు ఉన్నా ఆశించిన ఫలితా లు రాకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉన్నత విద్య ఆర్జేడీగా ఇన్చార్జీలు ఉండడంతో కళాశాలలపై పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వె త్తున సాగిన మూడేళ్లలో తరగతులు సక్రమం గా జరగకపోయినా పర్వాలేదనే విధంగా ఫలితాలు వచ్చాయి. అలాంటిది ఈ ఏడాది ఫలి తాలు దిగజారిపోవడంపై పలువురు ఆం దోళన వ్యక్తం చేశారు. పదో తరగతిలో 95శా తం, ఇంటర్లో 49 నుంచి 75 శాతం వరకు ఫలితాలు వచ్చినా.. డిగ్రీలో 35 శాతం దాట కపోవడంపై యూ నివర్సిటీ అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచి చాయిస్ బేస్డ్ సిస్టమ్ సెమిస్టర్ విధానాన్ని అమలుచేయను న్నారు. అయితే, విద్యాప్రమాణాలు ఇప్పటిలా ఉంటే ఈ విధానం ఏ మేరకు సత్ఫలి తాలని స్తుందో వేచి చూడాల్సిందే. -
సింహ గర్జనకు దుమ్మురేపిన దున్నలు
సియోల్: ఒక్కోసారి ఎంతటి ప్రశాంతవాతవరణమైన రణరంగాన్ని తలపించొచ్చు. ఎంత శాంతంగా ఉన్న జీవైన భయంగుప్పిట్లోకి జారుకుందంటే తనకు తెలియకుండానే ప్రమాదబారిన పడటమో ప్రమాదంలో పడేయడమో చేయొచ్చు. దక్షిణాఫ్రికాలోని ఓ పెద్ద పార్క్‌లో ఇలాగే జరిగింది. అప్పటివరకు నిర్మలంగా.. చల్లటి గాలులు.. పచ్చని చెట్ల మధ్య పీస్ఫుల్ గా కనిపించిన ఆ రహదారి ఒక్కసారిగా దుమ్మురేగింది. భయం గుప్పిట్లోకి జారుకున్న అడవి దున్నలు చేసిన హంగామాకు ఆ రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వందల దున్నల టపాటపా తమ కార్లకు ఢీకొనడమే కాకుండా.. ఆ కార్లపై నుంచి కొన్ని దూకుతూ.. కార్లను తొక్కుతూ వెళ్లడంతో సచ్చాం రా దేవుడా అనుకొని కాసేపు ఊపిరి బిగబట్టుకున్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగ్ పార్క్‌లో విశాలమైన రహదారి ఉంది. ఈ రహదారి గుండా వెళుతూ టూరిస్టులు అటవీ జంతువును సందర్శిస్తుంటారు. అందులో భాగంగానే అప్పటికే కొన్ని వాహనాలు ముందుండగా ఓ రెండు కార్లు నెమ్మదిగా వెళుతున్నాయి. ఆ రోడ్డును అడవి దున్నలు ఎంతో ప్రశాంతంగా ఒక పద్థతిగా రోడ్డు దాటుతుండటంతో కాసేపు వార్లు కార్లు నిలుపుకున్నారు. అవి దాటేసి వెళ్లగానే కార్ల వేగం పెంచారు. ఈ లోగా అడవి రారాజు సింహం అరుపు వినిపించింది. దాంతో అప్పటికే ప్రశాంతంగా రోడ్డు దాటిన దున్నలన్నీ కూడా ఒక్కసారిగా తిరిగి మరోసారి రోడ్డు దాటేందుకు మెరుపు వేగంతో దూసుకొచ్చాయి. ఆ వందల దున్నలమధ్య ఆ రెండు కార్లు చిక్కుపోయాయి. ఏదో పెద్ద బాంబు పేలితే ఎంతటి దుమ్ముధూళి రేగుతుందో ఆ దున్నల పరుగుకు అంతటి దుమ్ము రేగింది. ఎన్నో దున్నల మధ్య తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఆ కార్లను చూసిన ఇతరులు ఆ దృశ్యం చూసి గుండెలు పట్టుకున్నారు. అదృష్టవశాత్తు ఏం కాలేదు. -
అమ్మాయిలదే హవా
మొదటి సంవత్సరం.. ఫలితాలు పునరావృతం ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో అమ్మాయిలదే హవా సెకండియర్ ఫలితాల్లో రాష్ట్రంలో హైదరాబాద్‌కు మూడో స్థానం రంగారెడ్డికి తొలిస్థానం... ఇంటర్మీడియెట్ ఫలితాల్లో బాలికలు అదరగొట్టారు. జంట జిల్లాల్లో బాలురపై వారే పైచేయి సాధించారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో.. గతేడాది మాదిరిగానే బాలికలు మెరుగ్గా రాణించారు. ప్రథమ సంవత్సరంలో హైదరాబాద్ జిల్లా 56 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించింది. ఇక 69 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో రంగారెడ్డి 76 శాతం ఉత్తీర్ణతతో మరోసారి ప్రథమ స్థానం పొందింది. హైదరాబాద్ జిల్లా ఒక అడుగు వెనక్కి వేసి 63 శాతంతో మూడో స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్ జిల్లాలో ప్రథమ సంవత్సరంలో బాలికలు 65 శాతం, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72 శాతం, రంగారెడ్డిలో ప్రథమలో 73 శాతం, ద్వితీయలో 79 శాతం ఉత్తీర్ణులయ్యారు. సిటీబ్యూరో: జంట జిల్లాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో గతేడాది ఫలితాలే పునరావృతమయ్యాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు రాష్ట్రస్థాయిలో వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. రెండు జిల్లాల్లో ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ.. ముందు వరుసలో నిలబడడం శుభపరిణామం. హైదరాబాద్ జిల్లాలో 64,793 మందికి గాను 35,999 మంది (56 శాతం) విద్యార్థులు విజయం సాధించారు. ఒకేషనల్‌లో 3,232 విద్యార్థులకు 1,632 (50 శాతం) మంది పాసయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 1,08,624 విద్యార్థులు పరీక్షలు రాయగా 74,453 (69 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో 2,625కు.. 1,352 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ప్రభంజనం.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రెండు జిల్లాల్లోనూ బాలికలు మెరుగ్గా రాణించారు. హైదరాబాద్ జిల్లాలో బాలికలు 65 శాతం, బాలురు 46 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో అమ్మాయిలు 68 శాతం, అబ్బాయిలు 36 శాతం నెగ్గారు. రంగారెడ్డి జిల్లాలో బాలికలు 73 శాతం, బాలురు 65 శాతం పాసయ్యారు. ఒకేషనల్‌లో బాలికలు 61 శాతం, బాలురు 45 శాతం ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో నిరుత్సాహమే.. రెండు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నామమాత్రంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. హైదరాబాద్‌లో 33 శాతం, రంగారెడ్డి జిల్లాలో 37.72 శాతం విద్యార్థులే గట్టెక్కారు. హైదరాబాద్ జిల్లాలో 4,304 మందికి గాను. 1,416 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఏఎం ప్రభుత్వ బాలికల కళాశాలలో అధికంగా 54 మంది విద్యార్థులు నెగ్గారు. ఆ తర్వాతి స్థానాల్లో 45 శాతంతో హుస్సేనీ ఆలం, మైసారంలోని ప్రభు త్వ బాలికల కళాశాలలు నిలిచాయి. నాంపల్లిలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో అతితక్కువగా 12 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో గల కూకట్‌పల్లిలోని న్యూ గవర్నమెంట్ కళాశాలలో గ్రేటర్ పరిధిలో అత్యధికంగా 47 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. అతి తక్కువగా కుత్బుల్లాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో 59 శాతం, ఎయిడెడ్ కళాశాలల్లో 35 శాతం, రెసిడె న్షియల్ జూనియర్ కళాశాలలో 63 శాతం, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజ్‌లో 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
ఇంటర్లో బాలికలే టాప్
ద్వితీయ సంవత్సరంలో 73శాతం ఉత్తీర్ణత, 5వ స్థానం {పథమ సంవత్సరంలో 70శాతం ఉత్తీర్ణత, 4 వస్థానం {పభుత్వ కళాశాలల్లో 69.1 శాతం ఉత్తీర్ణత తిరుచానూరు: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాకు 73శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానం, ప్రధమ సంవత్సరంలో 70శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. గత ఏడాది ద్వితీయ సంవత్సర ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3శాతం ఉత్తీర్ణత సాధించింది. రాయలసీమలో చిత్తూరు జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్ఐవో) కె.మునెయ్య తెలిపారు. బాలికలదే పైచేయి గతంలోలానే ఈ ఏడాది ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మొదటి సంవత్సంలో జనరల్‌లో 42,544, ఒకేషనల్‌లో 3,140, మొత్తం 45,684మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో బాలురు జనరల్‌లో 66శాతం, ఒకేషనల్‌లో 55శాతం, బాలికలు జనరల్‌లో 75శాతం, ఒకేషనల్‌లో 71శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సంలో జనరల్‌లో 38,566, ఒకేషనల్‌లో 2,316మంది, మొత్తం 40,882మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో బాలురు జనరల్‌లో 70శాతం, ఒకేషనల్‌లో 73శాతం, బాలికలు జనరల్‌లో 77శాతం, ఒకేషనల్‌లో 78శాతం ఉత్తీర్ణత సాధించి జనరల్, ఒకేషనల్‌లో బాలికలే పైచేయి సాధించి సత్తా చాటారు. గత ఏడాది కంటే 3శాతం ఉత్తీర్ణత పెంపు గత ఏడాది సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 70శాతం ఉత్తీర్ణత రాగ, ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 73కు పెరిగిం ది. అలాగే జిల్లాలో 58ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,844మంది పరీక్ష రాయగా వీరిలో 4,487మంది పాసై, 69.1శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.1శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల హవా జిల్లాలో 58ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానాన్ని నరసింగరాయనిపేట జూనియర్ కళాశాల 97.14ఉత్తీర్ణత శాతంతో జిల్లాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే వరుసగా 96.32, 95.8శాతం ఉత్తీర్ణతతో ద్వితీయ, తృతీయ స్థానాలను కార్వేటినగరం, చిన్నగొట్టిగల్లు జూనియర్ కళాశాలలు సాధించాయి. అలాగే 23.08ఉత్తీర్ణతతో జిల్లాలో చివరి స్థానాన్ని పాపానాయుడుపేట జూనియర్ కళాశాల మూటగట్టుకుంది.సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల్లో 90శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, గిరిజన సంక్షేమ శాఖ కళాశాల్లో 93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానం, మోడల్ స్కూల్స్‌లో 67శాతంతో 6వ స్థానం, ఎయిడెడ్‌లో 51శాతంతో 3వ స్థానం సాధించింది. -
డబుల్ ధమాకా
మొదటి సంవత్సరం 81 శాతం, సీనియర్ ఇంటర్లో 84 శాతం ఉత్తీర్ణత రెండు విభాగాల్లోనూ బాలికలదే పైచేయి తొలిసారిగా రెండు ఫలితాలూ ఏకకాలంలో విడుదల జూనియర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మనమే టాప్ విజయవాడ : ఇంటర్మీడియెట్‌లో జిల్లా విద్యార్థులు డబుల్ ధమాకా సాధించారు. మంగళవారం విడుదలైన మొదటి, రెండవ సంవత్సరాల పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లాను రెండు విభాగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 81 శాతం, రెండో సంవత్సరంలో 84 శాతం ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. విద్యల రాజధానిగా వెలుగొందుతున్న జిల్లా మరోసారి ర్యాంకును పదిలం చేసుకుంది. ఉత్తీర్ణత క్రమంలో రెండు సంవత్సరాల్లో 80 శాతానికి పైబడి ఉత్తీర్ణత సాధించింది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లోనూ బాలికలో అగ్రస్థానంలో నిలిచారు. గడచిన నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది జిల్లా ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. మొదటిసారి ఏకకాలంలో... గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటి సారి ఏకకాలంలో ఇంటర్ జూనియర్, సీనియర్ పరీక్షల ఫలితాలను అధికారులు విడుదల చేశారు. గతంలో కనీసం వారం రోజుల వ్యవధిలో ఈ ఫలితాలు విడుదల చేసేవారు. ప్రస్తుతం పరీక్షా ఫలితాల్ని విజయవాడలోనే రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. గత ఏడాది జిల్లా నాలుగో స్థానంలో నిలవగా ఈ ఏడాది మొదటి స్థానం దక్కించుకోవటం విశేషం. జూనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా... జిల్లాలో ఈ ఏడాది మొత్తం 63,707 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 51,294 మంది వివిధ గ్రేడ్లలో ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 81గా ఉంది. మొదటి సంవత్సరంలో 34,095 మంది బాలురకు గాను 26,911 మంది, 29,612 మంది బాలికలకు గాను 24,383 మంది ఉత్తీర్ణులయ్యారు. 79 శాతం బాలురు, 82 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల్లో జిల్లాకు చోటు దక్కింది. సీనియర్ ఇంటర్ ఫలితాలు ఇలా... సీనియర్ ఇంటర్లో 57,448 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 48,027 మంది ఉత్తీర్ణులయ్యారు. 84 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. బాలుర విభాగంలో 30,258 మంది హాజరుకాగా 25,081 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 27,190 మందికి గాను 22,946 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర విభాగంలో 83 శాతం, బాలికల విభాగంలో 84 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలికలదే పైచేయిగా ఉంది. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 990 మార్కులతో జువ్వాది శివరామకృష్ణ, బైపీసీలో ఇంద్ర స్వరూప్ నాయక్ (991), బొజ్జా ప్రదీప్‌రెడ్డి (990), మిట్టపల్లి అలేఖ్య (989), విజయ్‌కుమార్ (989), పి.శ్రీశ్రావ్య (988) అత్యధిక మార్కులు సాధించారు. -
ఇంటర్లో మధ్యాహ్న భోజనం
గోదావరిఖని కళాశాలలో ప్రారంభం గోదావరిఖని టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కళశాల విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు. కానీ, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో సోమవారం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండాల్సి వస్తుంది. అయితే, చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నమే కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ మాధవి, అధ్యాపకులు.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించారు. ఇందు కోసం జిల్లా అధికారుల చర్చించిన ప్రిన్సిపాల్ వారి అనుమతి పొందారు. పట్టణంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల వారిని కలిశారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, సానుకూల స్పందన వచ్చింది. దాతల బియ్యం, వంట సామగ్రి ఇచ్చారు. కళాశాలలో మొత్తంగా 800 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పెరుగన్నం, చట్నీలతో వారికి భోజనం వడ్డిస్తున్నారు. -
వ్యక్తిత్వంలో విజయానికి..
సివిల్స్- 2014 పర్సనాలిటీ టెస్ట్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధిస్తే..లక్షల్లో ఉండే పోటీని తట్టుకొని మలిదశ మెయిన్స్‌కు చేరుకున్నట్లే! మెయిన్స్ మెట్టు కూడా దాటితే అభ్యర్థితో పోటీకి నిలిచిన వారు లక్షల నుంచి వేలల్లోకి తగ్గినట్లే! చివరి అడుగైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయం సాధిస్తే కల సాకారమైనట్ల్లే! సివిల్స్-2014 ఇంటర్వ్యూలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన పర్సనాలిటీ టెస్ట్‌లో విజయానికి ఉపయోగపడే మార్గాలు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మెయిన్స పరీక్షలు రాసిన అభ్యర్థులు త్వరలో వెలువడనున్న ఫలితాల కోసం ఎదురుచూస్తూ.. మరోవైపు పర్సనాలిటీ టెస్ట్‌కు సిద్ధమవుతున్నారు. రెండు దశల రాత పరీక్షలలో(సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్) విజేతలుగా నిలిచిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ పేరిట యూపీఎస్సీ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తోపాటు దాదాపు 20 కేంద్ర సర్వీసుల పోస్టుల్లో నియామకానికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ)ది కీలక పాత్ర. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇంటర్వ్యూ వరకూ.. దాదాపు సంవత్సరానికిపైగా సాగే సివిల్స్ ఎంపిక క్రతువులో విజయం సాధించేందుకు అహోరాత్రులు శ్రమించి ఇంటర్వ్యూ దశకు చేరుకుంటారు. కొంతమంది మొదటిసారే ఇంటర్వ్యూలో విజయం సాధిస్తుండగా.. మరికొందరు చివరి అటెంప్ట్‌లో కానీ గెలుపు గమ్యం చేరుకోలేకపోతున్నారు. వ్యక్తిత్వాన్ని, మానసిక పరిణితిని పరీక్షించే పర్సనాలిటీ టెస్ట్‌లో చిన్నపాటి పొరపాట్లతో అవకాశాలు చేజార్చుకుంటున్నారు. అయితే కొద్దిపాటి మెళకువలతో ఇంటర్వ్యూలో ఉత్తమంగా రాణించి కలలను సాకారం చేసుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. సానుకూల దృక్పథం: సివిల్స్ ఇంటర్వ్యూలో విజయానికి మొదటి సాధనం.. సానుకూల దృక్పథం. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు, ప్రాంతీయ మీడియంలలో చదివిన అభ్యర్థుల్లో ఆశించిన స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉండటంలేదు. మెట్రో నగరాలు, ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణులతో పోల్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఇంటర్వ్యూలో రాణించగలమా? లేదా? అనే సందేహాన్ని విడనాడాలి.ప్రిలిమ్స్‌లో లక్షల పోటీని, మెయిన్సలో వేలమందిని ఎదుర్కొని 1:2 లేదా 1:2.5 పోటీ వరకు వచ్చాం కదా.. ! అనే ఆత్మస్థైర్యం, సానుకూల వైఖరులను అలవర్చుకోవాలి. స్వతహాగా బిడియస్తులైతే ఇప్పటినుంచే బృంద చర్చల ద్వారా ఆ సమస్యను అధిగమించాలి. పర్సనాలిటీ టెస్ట్.. ఉద్దేశం: సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు అసలు పర్సనాలిటీ టెస్ట్ ఉద్దేశం ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. వాస్తవానికి యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థి భావవ్యక్తీకరణ, నిర్వహణ నైపుణ్యం, నిర్ణయాత్మక సామర్థ్యం, ఎదుటివారి అభిప్రాయాలను స్వీకరించగలిగే మనస్తత్వం, సామాజిక సమస్యలపై అవగాహన వంటి లక్షణాలను పరీక్షించడం. ముఖ్యంగా అభ్యర్థులకు భవిష్యత్తు లక్ష్యం గురించి స్పష్టత ఉండాలి. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడికల్ తదితర ప్రొఫెషనల్ కోర్సుల గ్రాడ్యుయేట్లు ఎక్కువగా సివిల్స్ వైపు వస్తున్నారు. దాంతో భవిష్యత్తు లక్ష్యం గురించి అడుగుతున్నారు. ఓ ఎంఎన్సీలో మూడేళ్లుగా పనిచేస్తూ, గతేడాది తొలి అటెంప్ట్‌లోనే ఇంటర్వ్యూ దశకు చేరుకున్న అభ్యర్థిని అడిగిన ప్రశ్న.. ‘మీరు ఎంతో పేరున్న ఇన్స్టిట్యూట్లో బీటెక్ చదివారు. ప్రస్తుతం లక్షల్లో వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వైపు రావాలనుకోవడానికి కారణం?’ ఈ ప్రశ్న కు ఆ అభ్యర్థి చెప్పిన సమాధానంతో బోర్డ్ సభ్యులు సంతృప్తి చెందలేదు. కారణం.. సివిల్ సర్వీసెస్ ద్వారా సంఘంలో హోదా లభిస్తుందని, ఉన్నత స్థానంలో ఉండొచ్చని చెప్పడమే! అయితే, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు సామాజిక అభ్యున్నతికి దోహదపడేందుకు సమున్నత మార్గంగా సివిల్ సర్వీసెస్ నిలుస్తుందనే భావం వచ్చేలా, తమ వ్యక్తిగత లక్ష్యం కూడా అదే అని బోర్డును ఒప్పించే విధంగా సమాధానం చెప్పాలి. నిర్ణయాత్మకత, సమయస్ఫూర్తి, భావవ్యక్తీకరణ: సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో రాణించేందుకు అభ్యర్థులకు ఉండాల్సిన మూడు ప్రధాన లక్షణాలు.. నిర్ణయాత్మక సామర్థ్యం, సమయస్ఫూర్తి, భావ వ్యక్తీకరణ. ప్రజలకు ప్రత్యక్షంగా సేవచేసే ఉద్యోగిగా సివిల్ సర్వెంట్‌కు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం ఎంతో అవసరం. ఉన్నతాధికారుల అనుమతి కోసం వేచి చూడకుండా నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు కూడా ఎదురవుతాయి. సరైన నిర్ణయం తీసుకోవడంతోపాటు, స్వీయ నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి అధికారులను మెప్పించే నేర్పు వంటి లక్షణాలు కూడా కలిగుండాలి. ఈ లక్షణాలు ప్రతిబింబించేలా ఇంటర్వ్యూ సమయంలో వ్యవహరించాలి. పరిపాలన, నిర్వహణకు సంబంధించి నిర్ణయాత్మక శక్తి, సమయస్ఫూర్తి సివిల్ సర్వెంట్లకు ప్రధాన లక్షణంగా నిలుస్తుంటే.. భావ వ్యక్తీకరణ సామర్థ్యం మరో కీలకమైన అవసరం. తాము చెప్పే విషయం స్పష్టంగా, సూటిగా, ఎలాంటి తడబాటు లేకుండా చెప్పగలగాలి. సంభాషణలో అభ్యర్థి మాట్లాడే పదాలు కూడా ప్రధానమే. అనవసరపు పదాడంబరాల జోలికి వెళ్లకూడదు. సరళమైన భాషలోనే తమ అభిప్రాయాలను చెప్పాలి. ఇంగ్లిష్ దినపత్రికలు లేదా వ్యాసాల్లోని పదాలను వినియోగించాలని భావించడం కూడా సరికాదు. ఎందుకంటే.. అలాంటి వ్యాసాలు లేదా ఎడిటోరియల్స్ రాసేది సంబంధిత రంగంలో నిపుణులని గుర్తించాలి. అభ్యర్థులు ‘నేర్చుకునే’ కోణంలో ఆ స్థాయిలో ముందుకు సాగడం సబబే. కానీ.. కీలకంగా నిలిచే 20 నుంచి 25 నిమిషాలు జరిగే ఇంటర్వ్యూలో ప్రయోగాలు చేయకూడదనేది నిపుణుల అభిప్రాయం. వాక్చాతుర్యం.. సమతుల్యత: ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ శైలి మారుతోంది. అభ్యర్థుల బయోడేటా, హాబీలకు సంబంధించిన ప్రశ్నలు నేరుగా అడుగుతుండగా.. మిగతా ప్రశ్నలు చర్చకు దారితీసే విధంగా ఉంటున్నాయి. గతేడాది ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి.. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే ఒక చిన్నపాటి డిబేట్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సందర్భాల్లోనే అభ్యర్థుల్లోని వాక్చాతుర్యం, చర్చించే నైపుణ్యం, ఆయా అంశాలపై వారికున్న వాస్తవ అభిప్రాయాలు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ‘మీ అభిప్రాయం ఏంటి?’ వంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పు డు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా చక్కటి వాక్పటిమతో ఆకట్టుకునే రీతిలో సమాధానం ఇవ్వాలి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు, ఆయా విభాగాల్లో అవినీతి తదితర అంశాలపై ప్రశ్నలు ఎదురైనప్పుడు మరింత సమతుల్యత పాటించాలి. నిందాపూర్వకమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదు. సమస్యను వివరిస్తూనే పరిష్కార మార్గాలను సూచించే విధంగా స్పందించాలి. అప్పుడే బోర్డ్ సభ్యుల మన్ననలు అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బయోడేటా.. డ్రస్సింగ్.. విషింగ్: పర్సనాలిటీ టెస్ట్ విషయంలో అభ్యర్థులు తమ బయోడేటాలో పేర్కొన్న అంశాలపైనా కసరత్తు చేయాలి. తద్వారా నాణ్యమైన సమాధానాలు మదిలో నిక్షిప్తం చేసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి. చాలామంది చేసే పొరపాటు ‘హాబీ’గా పేర్కొన్న అంశం గురించి లోతైన అవగాహన పెంచుకోకపోవడం! అభ్యర్థి హాబీ గురించి సుదీర్ఘ చర్చ జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. ఉదా: సినిమాలు చూడటం ఇష్టం అని పేర్కొంటే.. సినిమాల ఆవిర్భావం నుంచి ఇటీవల ఆస్కార్ విజేతల వరకు ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు. డ్రెస్సింగ్.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్.. సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరవుతున్న అభ్యర్థులు గుర్తించాల్సిన అంశమిది. కాబట్టి మొదటగా డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. హుందాతనం ఉండాలి తప్ప.. ఆడంబరం పనికిరాదు. పురుష అభ్యర్థులు లేత రంగు షర్ట్లు, ముదురు రంగు ప్యాంటులు, షూస్ ధరించడం మంచిది. సూట్ ధరించే విషయంలో ఆయా అభ్యర్థులు తమ అలవాటును బట్టి వ్యవహరించాలి. మహిళా అభ్యర్థులు చీరలు ధరించడం మంచిది. విషింగ్ అంటే.. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాక బోర్డ్ సభ్యులను పలకరించే విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సభ్యులందరినీ చూస్తూ అభివందనం చేయడంపై ప్రాక్టీస్ చేయాలి. మన సంప్రదాయం ఉట్టిపడేలా నమస్తే అని సంబోధించడం మేలు. స్వస్థలం మొదలు అన్నిటిపై అవగాహన సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ స్వస్థలం నుంచి సమకాలీన పరిణామాల వరకూ.. అన్ని అంశాలపై సమాచార సేకరణ చేసుకోవాలి. తమ స్వస్థలం చారిత్రక ప్రాశస్త్యం కలిగుంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. అదే విధంగా అభ్యర్థుల ఇంటిపేర్లు కూడా కొన్ని సందర్భాల్లో చర్చకు దారి తీస్తాయి. అదే ఇంటిపేరు కలిగిన ప్రముఖులు, వారు చేసిన సేవలు వంటి వాటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశాలుంటాయి. ఇంటర్వ్యూల శైలి విభిన్నంగా మారుతోంది. ప్రధానంగా అభ్యర్థుల్లోని పాలనాదక్షతను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఏదైనా ఒక సమస్యను ప్రస్తావించి మీరే కలెక్టర్ అయితే ఏం చేస్తారు? వంటివి. అదేవిధంగా ఇటీవల కాలంలో మన దేశం చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, వాటి ఉద్దేశాలు వంటి వాటిపైనా దృష్టిసారించాలి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం గల అభ్యర్థులు.. ఇంటర్వ్యూ అంటే ఆందోళన పోగొట్టుకోవాలి. ఏ బోర్డ్ సభ్యులైనా అభ్యర్థులకు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా వ్యవహరిస్తారు. దీన్ని గమనించి ముందుగా మానసికంగా సంసిద్ధత పొందితే పర్సనాలిటీ టెస్ట్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లక్ష్యంపై ప్రశ్నలకు స్పష్టత సివిల్స్ ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ లక్ష్యంపై స్పష్టతతో ఉండాలి. సివిల్స్ ద్వారా సమాజానికి సేవచేసే అవకాశం లభిస్తుందని ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థుల్లో నూటికి 90 శాతం మంది చెప్పే సమాధానం. అయితే ఇంటర్వ్యూ ఆసాంతం ఇదే ప్రశ్న-సమాధానంపై జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, సైన్స్ నేపథ్యం కలిగిన అభ్యర్థులు, ఇప్పటికే పలు ఎంఎన్సీల్లో మంచి హోదాల్లో లక్షల వేతనంతో పని చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ తరహా అభ్యర్థులు తమ అకడమిక్ నాలెడ్జ్‌ను పరిపాలన విభాగాల్లో అన్వయించేందుకు గల మార్గాలను తెలియజేసే విధంగా నైపుణ్యం పొందాలి. ఇంజనీరింగ్ విద్యార్థులైతే.. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలను దృష్టిలో పెట్టుకుని డిజిటలైజేషన్ ఆఫ్ ఇండియా, ఐసీటీ వంటి విధానాల ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు తమ నైపుణ్యాలు ఉపయోగపడతాయనే రీతిలో సమాధానాలు ఇవ్వాలి. ఇక వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఎదురవుతున్న మరో ప్రశ్న.. మీరు సేవే లక్ష్యంగా సివిల్స్‌వైపు రావాలనుకుంటున్నారా?ఎంపిక కాకపోతే ఏం చేస్తారు? దీనికి సమాధానం ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంపిక కాకపోయినా మరోసారి ప్రయత్నిస్తానని చెప్పడం మంచిది. అంతేతప్ప ఎంపిక కాకపోతే పూర్వ వృత్తికి వెళతాననే సమాధానాలు ప్రతికూల ప్రభావం చూపుతాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. - శ్రీరంగం శ్రీరామ్, శ్రీరామ్స్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్‌పై పట్టు సివిల్స్ ఇంటర్వ్యూ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చోటు చేసుకున్న ముఖ్య పరిణామాలు, అంతర్జాతీయ ఒప్పందాలు; పలు ప్రభుత్వ పథకాలు, వాటి ఉద్దేశం, నేపథ్యం, క్షేత్ర స్థాయిలో అమలు తీరుతెన్నులు, సమస్యలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. ఈసారి వరల్డ్ కప్ క్రికెట్ గురించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎక్కువగా ప్రాంతీయ ప్రాధాన్యత అంశాల్లో భాగంగా రెండు ప్రభుత్వాలు అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పథకాలు, అవి ఆయా రాష్ట్రాల పురోగతికి దోహదం చేసే విధానం, ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన అంశాలు (నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ తదితర)పై పరిజ్ఞానం పొందాలి. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ మంచి సర్వీస్ రావాలంటే.. సివిల్స్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేసే 20కు పైగా కేంద్ర సర్వీసుల్లో అభ్యర్థులు తమకు నచ్చిన సర్వీస్‌లో స్థానం పొందడానికి పర్సనాలిటీ టెస్ట్‌లో చూపే ప్రతిభ కీలకంగా మారుతోంది. చాలా మంది అభ్యర్థులు మెయిన్స్ రాత పరీక్షలో అధిక మార్కులు సాధించినా, ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు పొందడం వల్ల తుది జాబితాలో నిలుస్తున్నారు. కానీ తమకు నచ్చిన సర్వీస్‌కు ఎంపిక కాలేకపోతున్నారు. దీన్ని గుర్తించి మెయిన్స్‌లో బాగా రాశాం కదా? అనే ధోరణితో ఇంటర్వ్యూ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పర్సనాలిటీ టెస్ట్‌లో కూడా ఉత్తమంగా రాణించేందుకు కసరత్తు చేయాలి. ఇటీవల కాలంలో ఎథిక్స్, మోరల్ వాల్యూస్ సంబంధిత ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఒక విభాగాధిపతిగా తమ నిబద్ధత, నిజాయతీని ప్రతిబింబించే విధంగా సమాధానాలు ఇచ్చే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. ప్రస్తుత సమయంలో మాక్ ఇంటర్వ్యూలకు హాజరవడం ఎంతో మేలు చేస్తుంది. - కె.శశాంక, సివిల్స్-2012, ఆల్ ఇండియా ర్యాంకు 16 ఆ రోజు వ్యవహరించే శైలే కీలకం సివిల్స్ లక్ష్యం దిశగా ఎన్నేళ్లు కష్టపడినా.. ఇంటర్వ్యూ రోజు 25 నుంచి 30 నిమిషాలు పాటు వ్యవహరించే శైలి ఎంతో కీలకం. ఆ సమయాన్ని నిర్మాణాత్మకంగా వినియోగించుకుంటే సానుకూల ఫలితాలు అందుకోవచ్చు. తమ విషయ పరిజ్ఞానం, తమ నైపుణ్యాలను సివిల్ సర్వీసెస్ ద్వారా సమాజ సేవకు ఎలా వినియోగిస్తారో బోర్డ్ సభ్యులను మెప్పించేలా చెప్పగలగాలి. ఇందుకోసం మాక్ ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి. తమ పర్సనాలిటీ పరంగా మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా అకడమిక్ నేపథ్య సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను పునశ్చరణ చేసుకోవాలి. క్రమం తప్పకుండా దినపత్రికలు చదవాలి. - కృత్తిక జ్యోత్స్న, సివిల్స్-2013 ఆల్ ఇండియా ర్యాంకు 30 మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో విజయసాధనకు మాక్ ఇంటర్వ్యూలు, గ్రూప్ డిస్కషన్స్ మంచి ఉపకరణాలు. మాక్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు డ్రెస్ కోడ్ మొదలు కంటెంట్ పరంగా మెరుపరచుకోవాల్సిన అంశాలపై నిపుణుల సలహాలు లభిస్తాయి. గ్రూప్ డిస్కషన్స్ తో తమకు తెలియని కొత్త విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు. - జె.కీర్తి, సివిల్స్-2012 ఆల్ ఇండియా ర్యాంకు 89 సివిల్స్ ఇంటర్వ్యూ- దృష్టి సారించాల్సిన అంశాలు మేక్ ఇన్ ఇండియా స్కీం భూ సేకరణ చట్టంలో మార్పులు జనధన్ యోజన ఒబామా పర్యటన - భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం ఇన్సూరెన్స్‌లో ఎఫ్‌డీఐల పెంపు - పర్యవసానాలు అంతర్జాతీయ ఒప్పందాలు {పణాళిక సంఘం స్థానంలో నీతి అయోగ్ ఏర్పాటు- ఉద్దేశాలు అంతర్జాతీయంగా ఆయా దేశాల్లో పెరుగుతున్న అంతర్గత ఉగ్రవాదం- ఇతర దేశాలపై ప్రభావం శాసన, పరిపాలన వ్యవస్థల్లో తరచుగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి రావడానికి కారణాలు జాతీయ స్థాయి విద్యా సంస్థల విస్తరణ నిర్ణయం సివిల్స్ 2012, 2013 పర్సనాలిటీ టెస్ట్ కటాఫ్స్ 275 మార్కులకు నిర్వహించే సివిల్స్ పర్సనాలిటీ టెస్ట్‌లో 2012, 2013 కటాఫ్స్ వివరాలు.. సంవత్సరం జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ 2012 211 208 209 197 2013 236 229 210 205 సివిల్స్ - 2014 ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్: మొత్తం పోస్ట్‌లు - 1291 {పిలిమ్స్కు హాజరైంది - 4,51,602 మెయిన్స్‌కు అర్హత సాధించింది - 16,993 ఇంటర్వ్యూకు అర్హత లభించేది - సుమారు 2,500 -
ఉపాధ్యాయులూ.. బాధ్యతలు మరవొద్దు
భవానీపురం : ప్రతి ఉపాధ్యాయుడు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్ చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన కోసం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ టీచర్స్తోతుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ప్రతి ఉపాధ్యాయుడు ఎవరి బాధ్యతను వారు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు అండగా తల్లిదండ్రులు కన్నా ఉపాధ్యాయులే ఎక్కువగా ఉండి పిల్లలను ప్రోత్సహించాలని చెప్పారు. పబ్లిక్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు అయ్యేలా చదివించాలని, ఆ దిశగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమష్టి కృషి చేయాలని సూచించారు. వివిధ సబ్జెక్ట్‌లకు సంబంధించి ఉపాధ్యాయులు రానున్న పరీక్ష విధానంలో విద్యార్థులను ఏ విధంగా తయారు చేయాలి, చివరి నిమిషం అయినప్పటికీ వెనుకబడిన వారిని ప్రోత్సహించి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) జి. నాగరాజు, డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కె. దుర్గాప్రసాద్, స్కూల్స్ సూపర్వైజర్ ఎం.వి. వెంకటేశ్వరరావు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఏఏఈవో పోస్టుల్లో ‘వెయిటేజీ’
వ్యవసాయ కోర్సుల్లో పాసైనప్పటి నుంచి ఏడాదికో మార్కు కేటాయింపు మొత్తం పోస్టులో డిప్లొమా వారికి 80 శాతం సాక్షి, హైదరాబాద్: సహాయ వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఏఈవో) ఉద్యోగాల్లో అభ్యర్థులకు కోర్సుల్లో ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఆధారంగా వెయిటేజీ ఇవ్వనున్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు నిర్దేశిత వ్యవసాయ, ఉద్యాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని ‘నియామకపు కమిటీ’ నిర్ణయించింది. ఉదాహరణకు అభ్యర్థి సంబంధిత కోర్సులో 2010లో ఉత్తీర్ణత సాధిస్తే.. ఇప్పటివరకు నాలుగేళ్లుగా పరిగణించి ఏడాదికి ఒక మార్కు చొప్పున నాలుగు మార్కులు వెయిటేజీగా ఇస్తారు. ఈ పోస్టులన్నింటినీ జిల్లా స్థాయిలో మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుండడంతో.. ఆ మెరిట్‌కు ఈ వెయిటేజీని కలిపి లెక్కించి నియామకాలు చేపడతారు. ఏఏఈవో పోస్టుల భర్తీ అంశంపై ‘ఏఏఈవో నియామకపు కమిటీ’ శనివారం సమావేశమైంది. ‘వెయిటేజీ’తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముందుగా పేర్కొన్నట్లు ఏఏఈవో ఉద్యోగాలకు వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. కానీ తమకూ అవకాశం కల్పించాలని ఆయా విభాగాల్లో డిగ్రీ, పీజీ కోర్సులు చేసిన అభ్యర్థులు చేసుకున్న విన్నపంతో పాటు పలువురు అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను కమిటీ పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు ప్రకటించింది. 80 శాతం ఉద్యోగాలు డిప్లొమా వారికే: నియామకపు కమిటీ తీసుకున్న నిర్ణయాల ప్రకారం... మొత్తం 4,442 ఏఏఈవో పోస్టుల్లో 80 శాతం వ్యవసాయ, ఉద్యాన కోర్సుల్లో డిప్లొమా చేసిన అభ్యర్థులకు కేటాయిస్తారు. మిగతా 20 శాతం పోస్టులను బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. ఈ మొత్తం పోస్టుల్లో 20 శాతం (888) పోస్టులను ఉద్యాన శాఖకు కేటాయించాలని నిర్ణయించారు. -
ఓపెన్ ‘ఇంటర్’లో విశేష ప్రతిభ
సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ శ నివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో నగర విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. ఫలితాల సరళిని పరిశీలిస్తే.. నగరంలో గతేడాది కన్నా రెట్టింపు ఉత్తీర్ణత లభించింది. శివారులో కూడా ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగింది. గత ఏప్రిల్/మే నెలల్లో జరిగిన ఈ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి మొత్తం 4545మంది అభ్యర్థులు హాజరు కాగా 2385మంది( 52.48శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఉత్తీర్ణత 25.55 శాతం కన్నా తాజా ఉత్తీర్ణత 26.93 శాతం అధికం. రంగారెడ్డి జిల్లా నుంచి 8035 మంది పరీక్షలకు హాజరు కాగా, 3197మంది( 39.79శాతం) ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కన్నా స్వల్పంగా ఉత్తీర్ణత(8.4శాతం) మెరుగైంది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోరుకునే అభ్యర్థులు రీకౌంటింగ్ కోసం రూ.200, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఈనెల 25నుంచి 31వ తేదీ లోగా సమీప ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. -
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలదే పైచేయి
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా బాలికలే పైచేయి సాధించారు. బాలుర కంటే అదనపు ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. పరీక్ష ఫలితాల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ రాజేశ్వరరావు గురువారం విలేకరులకు వివరించారు. జిల్లా విద్యార్థులు 87.56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఫలితాలతో పోలిస్తే ఒక శాతం అదనపు ఉత్తీర్ణత సాధించినా రాష్ట్రస్థాయిలో జిల్లా 17 నుంచి 18వ స్థానానికి దిగజారింది. ఐదేళ్ల పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నా రాష్ట్రస్థాయి ర్యాంకు మాత్రం దిగజారుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో మొత్తం 34,907 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 30,566 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 18,022 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 15,769 మంది పాసయ్యారు. జిల్లా సగటు కంటే 0.5 శాతం తక్కువగా 87.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 0.94 శాతం తక్కువగా ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 16,725 మంది బాలికలు పరీక్షకు హాజరు కాగా 14,797 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 88.16 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు కంటే 1.17 శాతం తక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. గ్రేడ్లే..గ్రేడ్లు ఈ ఏడాది గరిష్టంగా 72 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. గత ఏడాది కేవలం 30 మందికి మాత్రమే 10/10 గ్రేడ్ పాయింట్లురాగా ఈ ఏడాది అదనంగా 42 మంది సాధించారు. స్థానిక మాంటిస్సోరి హైస్కూల్ విద్యార్థులు 10/10 గ్రేడ్ పాయింట్ల సాధనలో జిల్లాలోనే అగ్రగాములుగా నిలిచారు. ఈ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించి సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో ఒకే క్యాంపస్‌లో ఐదుగురికి 10 గ్రేడ్ పాయింట్లు రావడం రికార్డని కరస్పాండెంట్ పి.ప్రకాష్‌బాబు తెలిపారు. ఎం.అనంత, పి.విష్ణుప్రియ, బి.పవన్‌కళ్యాణ్, ఏవీ భారవి, ఎన్.సుష్మాంజలిలు 10 గ్రేడ్ పాయింట్లు సాధించిన వారిలో ఉన్నారు. పలు ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రతిభ కనబరిచారు. అడ్డంకులెదురైనా.. జిల్లాలో ప్రతికూల పరిస్థితిని సైతం అధిగమించి పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారు. 2013లో సమైక్యాంధ్ర ఉద్యమంతో సుమారు రెండు నెలల పాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఆందోళన కార్యక్రమాల్లో విద్యార్థులు కూడా భాగస్వాములు కావడంతో సుమారు మూడు నెలలపాటు పాఠశాలల్లో తరగతులు అంతంత మాత్రంగానే జరిగాయి. మిగిలిన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లే మంచి ఫలితాలు సాధించగలిగామని డీఈవో రాజేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలకు సంసిద్ధులను చేశారు. డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు) ఆధ్వర్యంలో పాఠశాలలకు స్టడీ మెటీరియల్ సరఫరా చేశారు. సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ సరఫరా చేయడంతో పాటు కలెక్టర్ సూచనల మేరకు వారికి నిర్వహించిన ప్రత్యేక కౌన్సెలింగ్ కూడా ఉత్తమ ఫలితాల సాధనకు దోహదపడిందని డీఈవో వివరించారు. -
చివరి స్థానమే పదిలం
టెన్త్ ఫలితాల్లో.. హైదరాబాద్‌కు మళ్లీ 22వ స్థానమే ఒక స్థానం మెరుగైన రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ప్రతిభ చాటిన సర్కారు విద్యార్థులు సాక్షి, సిటీబ్యూరో: మొన్న ఇంటర్, నిన్న టెన్త్.. ఫలితాలేవైనా హైటెక్ జిల్లా హైదరాబాద్ మాత్రం చివరి స్థానాలతోనే సరిపెట్టుకుంటోంది. తాజాగా గురువారం విడుదలైన టెన్త్ ఫలితాల్లోనూ మరోమారు చతికిలపడింది. నాలుగేళ్లుగా హైదరాబాద్ జిల్లా చిట్టచివరి (22, 23వ ) స్థానాలకే పరిమితమవుతోంది. ఈ సారి 22వ స్థానంలో నిలిచింది. పొరుగునున్న రంగారెడ్డి జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీలేదు. గతేడాది 21వ స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఓ మెట్టెక్కి 20వ స్థానానికి చేరింది. గత మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు హైదరాబాద్ జిల్లా నుంచి 63,611 విద్యార్థులు పరీక్షలు రాయగా, 49,143 మంది(77.29%) ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లా నుంచి 82,099 మంది పరీక్షలు రా యగా, 69,535 మంది (84.70%) ఉత్తీర్ణులయ్యారు. బాలికలదే హవా.. రెండు జిల్లాల్లోనూ ఈ ఏడాది టెన్త్ ఉత్తీర్ణతను పరిశీలిస్తే.. బాలుర కంటే బాలికలే మెరుగ్గా రాణిం చారు. రంగారెడ్డి జిల్లాలో 43,239 మంది బాలురు పరీక్ష రాయగా, 36267 మంది (83.88 శాతం) పాసయ్యారు. 38,860 మంది బాలికలలో 33,268 మంది (85.61 శాతం) ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 31,353 మంది బాలురు పరీక్షలు రాయగా, 22,936 మంది (73.15 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన 32,774 మంది బాలికల్లో 26,630 మంది (81.25 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఈసారి కాస్త ఉపశమనం కలిగించే అంశం. 23 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 9.5పైగా జీపీఏ పాయింట్లు సాధించి సత్తాను చాటారు. ప్రైవేటైనా.. ప్రభుత్వ స్కూలైనా.. హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలే కాదు.. ప్రైవేటు పాఠశాలల్లోనూ ఫలితాలు అధ్వానంగానే వచ్చాయి. సకల సదుపాయాలున్న కార్పొరేట్ స్కూళ్లూ ఆశించిన మేర రాణించలేకపోయాయి. అయితే.. కనీస సదుపాయాల్లేని ప్రభుత్వ పాఠశాలల్లోనూ అవే ఫలితాలు వచ్చాయి. ఉత్తీర్ణత విషయానికొస్తే హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో గతేడాది 78.13 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ప్రస్తుతం 72 శాతానికి పడిపోయింది. 14 ప్రభుత్వ పాఠశాలలు వంద శాతం, 6 పాఠశాలలు 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని మొత్తం 184కి 22 పాఠశాలల్లో 50 శాతం లోపు ఉత్తీర్ణత నమోదైంది. ప్రయత్నించినా.. ఫలితం దక్కలేదు హైదరాబాద్ జిల్లాలో టెన్త్ ఫలితాల మెరుగుకు విద్యాశాఖ పరంగా అన్నిరకాల ప్రయత్నాలు చేశాం. ప్రత్యేక తరగతులు పెట్టాం. నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను అందజే శాం. గత మూడేళ్లలో రెండేళ్ల పాటు ఉత్తీర్ణత మెరుగైంది. ఈ ఏడాది మాత్రం ఒక శాతం తగ్గింది. ఇందుకు ప్రధాన కారణం వివిధ ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో చదివే 50 శాతం మంది విద్యార్థులు పేద వర్గాలకు చెందిన వారు కావడమే. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషిచే స్తాం. - ఎ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ డీఈవో ఆశించిన ఫలితాలే వచ్చాయి మూడేళ్లుగా రంగారెడ్డి జిల్లాలో టెన్త్ ఫలితాల్లో ఆశించిన ఫలితాలే వస్తున్నాయి. ఏటా ఉత్తీర్ణత మెరుగవుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా స్థానాల్లో మాత్రం వెనుకబాటు తప్పట్లేదు. జిల్లా వ్యాప్తంగా 562 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ పాయింట్లు వచ్చాయి. జీపీఏ పాయింట్ల సాధనలో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన హెచ్ఎంలు, సబ్జెక్టు టీచర్లను సత్కరిస్తాం. 40 శాతంలోపు ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్ని సంజాయిషీ కోరతాం. - ఎం.సోమిరెడ్డి, రంగారెడ్డి డీఈవో -
జూనియర్ ఇంటర్లో మనమే టాప్
జిల్లాలో 74 శాతం ఉత్తీర్ణత బాలురు 73 శాతం, బాలికలు 75 శాతం సాక్షి, విజయవాడ : జూనియర్ ఇంటర్ ఫలితాలలో వరుసగా పదేళ్లు అగ్రస్థానంలో నిలిచి ఇంటర్మీడియెట్‌లో ఎదురులేదని జిల్లా నిరూపించుకుంది. విద్యలవాడగా తన పేరు నిలబెట్టుకుంటూ విజయపరంపర కొనసాగించింది. సోమవారం ప్రకటించిన జూనియర్ ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రవ్యాప్త సగటు కేవలం 55.84 శాతం ఉండగా దాదాపు 20 శాతం ఎక్కువ సగటు అంటే 74 శాతం ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు ఈ ఘనత సాధించారు. గత సంవత్సరం కూడా జిల్లా విద్యార్థులు 74 శాతం ఉత్తీర్ణత పొందారు. జిల్లాలో ఈ సంవత్సరం 64,110 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 47,307 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య కూడా మూడువేలకు పైగా పెరిగింది. 34,627 మంది బాలురు పరీక్షలు రాయగా 25,109 మంది పాసై 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. 29,483 మంది బాలికలు పరీక్షలు రాయగా 22,198 మంది పాసై 75 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణతా శాతం గత ఏడాది 76 శాతం ఉండగా, ఈ ఏడాది 75 శాతంగా ఉంది. జిల్లాలో ఉత్తీర్ణతా శాతంలో బాలికలే ముందంజలో ఉన్నట్లయింది. ఒకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్షలు రాసిన 1495 మందిలో 887 మంది పాసై 55 శాతం ఉత్తీర్ణతను సాధించారు. జనరల్ కేటగిరిలో రాష్ట్రస్థాయిలో ఉత్తీర్ణతా శాతం 55.84 ఉండగా, కృష్ణాజిల్లా 74 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. కార్పొరేట్ కళాశాలలు తమ హవాను కొనసాగించాయి. శ్రీ చైతన్య విద్యార్థులు బైపీసీలో కె.సైదు భార్గవి, పీ ఆదర్ష్వర్ధన్, వీ అక్షయలు 436 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, అదే విద్యా సంస్థకు చెందిన ఎన్ కృష్ణ విక్రాంత్‌కుమార్, బీ నరశింహారెడ్డిలు ఎంపీసీలో 467/470 మార్కులు సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో తగ్గిన ఉత్తీర్ణత... ఈ సంవత్సరం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఉత్తీర్ణతా శాతం గత ఏడాదికంటే తగ్గింది. గత ఏడాది 46.1 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 37.81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ఫలితాలు మెరుగ్గా వస్తున్నప్పటికీ, ఈ ఏడాది తగ్గాయి. ఉత్తీర్ణతా శాతంలో రుద్రపాక జూనియర్ కళాశాల 87 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల 75.33 శాతంతో రెండో స్థానం సాధించింది. కంచికచర్ల జూనియర్ కళాశాల 7.69 శాతం ఫలితాలతో చివరి స్థానంలో నిలిచింది.