ద్వితీయ సంవత్సరంలో 73శాతం ఉత్తీర్ణత, 5వ స్థానం
{పథమ సంవత్సరంలో 70శాతం ఉత్తీర్ణత, 4 వస్థానం
{పభుత్వ కళాశాలల్లో 69.1 శాతం ఉత్తీర్ణత
తిరుచానూరు: ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షా ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జిల్లాకు 73శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 5వ స్థానం, ప్రధమ సంవత్సరంలో 70శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. గత ఏడాది ద్వితీయ సంవత్సర ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 3శాతం ఉత్తీర్ణత సాధించింది. రాయలసీమలో చిత్తూరు జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి(ఆర్‌ఐవో) కె.మునెయ్య తెలిపారు.
బాలికలదే పైచేయి
గతంలోలానే ఈ ఏడాది ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది మొదటి సంవత్సంలో జనరల్‌లో 42,544, ఒకేషనల్‌లో 3,140, మొత్తం 45,684మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో బాలురు జనరల్‌లో 66శాతం, ఒకేషనల్‌లో 55శాతం, బాలికలు జనరల్‌లో 75శాతం, ఒకేషనల్‌లో 71శాతం ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సంలో జనరల్‌లో 38,566, ఒకేషనల్‌లో 2,316మంది, మొత్తం 40,882మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో బాలురు జనరల్‌లో 70శాతం, ఒకేషనల్‌లో 73శాతం, బాలికలు జనరల్‌లో 77శాతం, ఒకేషనల్‌లో 78శాతం ఉత్తీర్ణత సాధించి జనరల్, ఒకేషనల్‌లో బాలికలే పైచేయి సాధించి సత్తా చాటారు.
గత ఏడాది కంటే 3శాతం ఉత్తీర్ణత పెంపు
గత ఏడాది సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 70శాతం ఉత్తీర్ణత రాగ, ఈ ఏడాది ఉత్తీర్ణతా శాతం 73కు పెరిగిం ది. అలాగే జిల్లాలో 58ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,844మంది పరీక్ష రాయగా వీరిలో 4,487మంది పాసై, 69.1శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 9.1శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ కళాశాలల హవా
జిల్లాలో 58ప్రభుత్వ కళాశాలల్లో మొదటి స్థానాన్ని నరసింగరాయనిపేట జూనియర్ కళాశాల 97.14ఉత్తీర్ణత శాతంతో జిల్లాలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే వరుసగా 96.32, 95.8శాతం ఉత్తీర్ణతతో ద్వితీయ, తృతీయ స్థానాలను కార్వేటినగరం, చిన్నగొట్టిగల్లు జూనియర్ కళాశాలలు సాధించాయి. అలాగే 23.08ఉత్తీర్ణతతో జిల్లాలో చివరి స్థానాన్ని పాపానాయుడుపేట జూనియర్ కళాశాల మూటగట్టుకుంది.సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల్లో 90శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, గిరిజన సంక్షేమ శాఖ కళాశాల్లో 93శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానం, మోడల్ స్కూల్స్‌లో 67శాతంతో 6వ స్థానం, ఎయిడెడ్‌లో 51శాతంతో 3వ స్థానం సాధించింది.