మూడు జిల్లాల్లో కలిపి 28.40 శాతం నమోదు
డిగ్రీలో పడిపోతున్న విద్యాప్రమాణాలు
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనూ అదేతీరు
కేయూ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరంలో కేవలం 28.40 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించడం ఆందో ళన కలిగిస్తుంది. కేయూ చరిత్రలోనే ఇంత తక్కువ ఫలితాలు రావడమనేది ఇదే తొలిసారి అని తెలుస్తోంది. చివరి సంవత్సరం పరీక్షలకు 44,506 మంది విద్యార్థులు హాజరై తే కేవలం 12,641మందే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 33.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఈ సారి 5.57శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక మొ దటి, రెండు, చివరి సంవత్సరాల్లో కలిపి 1,55,273 మంది విద్యార్థులకు 39,456 మం ది(25.41శాతం) ఉత్తీర్ణత సాధించడం గమనా ర్హం. బీఏ కోర్సులోనైతే వరంగల్ జిల్లాలో 17.19శాతం, బీఎస్సీలో 27.50 శాతం, బీకాం లో 31.87 శాతమే ఉత్తీర్ణత న మోదైంది. సాధించారు. డిగ్రీ విద్యలో ఇంత తక్కువ ఫలి తాలు రావటం అనేది కాకతీయ యూనివర్సి టీ చరిత్రలో ఇది తొలిసారిగా అని తెలుస్తోంది.
అర్హులైన అధ్యాపకులు ఉన్నా...
కేయూ పరిధిలో డిగ్రీ ఫలితాలను పరిశీలిస్తే డిగ్రీ విద్యలో విద్యాప్రమాణాలు పడిపోయిన ట్లుగా భావించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం ఆం దోళన కలిగిస్తుంది. యూనివర్సిటీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 305 డిగ్రీ కళాశాలలు ఉండగా.. వరంగల్ జిల్లాలో 14 ప్రభుత్వ, సు మారు 90నుంచి 100వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళా శాలల్లో ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయించడం లేదు. ఏదో విధంగా ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణత సాధించినా థియరీలో ఉత్తీర్ణత ఆశించనంతగా ఉండడం లేదు. ప్రైవేట్ కళాశాలల బాధ్యులు తాయిలాలు చూపి, తరగతులకు రాకున్నా పర్వాలేదని చెబుతూ విద్యార్థులను చేర్చుకుం టున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడం తో విద్యార్థులు పలువురు కాపీయింగ్‌పై ఆధారపడుతున్నట్లు చెబుతున్నారు.
ఈ ఏడా ది మూడు జిల్లాల్లో కలిపి 1300 మందికి పైగా విద్యార్థులు డిబార్ కావడానికి దీనికి నిదర్శ నంగా చెప్పుకోవచ్చు. కేవలం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్‌సమెంట్ కోసమే అన్నట్లుగా డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయనే విమ ర్శలున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విషయానికొస్తే ఎంఫిల్, పీహెచ్‌డీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు ఉన్నా ఆశించిన ఫలితా లు రాకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉన్నత విద్య ఆర్‌జేడీగా ఇన్‌చార్జీలు ఉండడంతో కళాశాలలపై పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వె త్తున సాగిన మూడేళ్లలో తరగతులు సక్రమం గా జరగకపోయినా పర్వాలేదనే విధంగా ఫలితాలు వచ్చాయి.
అలాంటిది ఈ ఏడాది ఫలి తాలు దిగజారిపోవడంపై పలువురు ఆం దోళన వ్యక్తం చేశారు. పదో తరగతిలో 95శా తం, ఇంటర్‌లో 49 నుంచి 75 శాతం వరకు ఫలితాలు వచ్చినా.. డిగ్రీలో 35 శాతం దాట కపోవడంపై యూ నివర్సిటీ అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచి చాయిస్ బేస్డ్ సిస్టమ్ సెమిస్టర్ విధానాన్ని అమలుచేయను న్నారు. అయితే, విద్యాప్రమాణాలు ఇప్పటిలా ఉంటే ఈ విధానం ఏ మేరకు సత్ఫలి తాలని స్తుందో వేచి చూడాల్సిందే.