అనంతపురం: సివిల్స్‌లో కదిరి యువకుడు బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి సత్తా చాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 270వ ర్యాంకు సాధించాడు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్‌సీ నిర్వహించిన సివిల్స్–2022 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే...
జాతీయ స్థాయిలో 270 ర్యాంకుతో మెరిసిన బొల్లం ఉమా మహేశ్వరరెడ్డి స్వగ్రామం ఓడి చెరువు మండలం బోయపల్లి కాగా, వీరి కుటుంబం ప్రస్తుతం కదిరిలో స్థిర పడింది. తల్లి పద్మావతి విశ్రాంత ఉపాధ్యాయురాలు, తండ్రి రాజశేఖరరెడ్డి విశ్రాంత జువాలజీ లెక్చరర్. హైదరాబాద్‌లో ఐఐటీలో బీటెక్ పూర్తి చేసిన ఉమా మహేశ్వరరెడ్డి అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే ఢిల్లీలోని ‘వాజీరా’లో సివిల్స్‌కు శిక్షణ తీసుకున్నారు. తమ కుమారుడికి సివిల్స్‌లో మంచి ర్యాంకు రావడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment