బాపట్ల : వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ 2016లో జరిగే రియో ఒలింపిక్స్‌కు ఎంపికైనట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆదివారం ప్రకటించింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో 85 కిలోల విభాగంలో స్వర్ణపతకాల వేటలో ఉన్న రాహుల్‌ను ఒలింపిక్స్ ఎంపిక చేయటంతోపాటు, ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు వరకు పంజాబ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
రాహుల్ ఎంపిక కావటంతో ఆయన స్వగ్రామైన బాపట్ల మండలం స్టువర్టుపురంలో సందడి వాతావరణం నెలకొంది. రాహుల్ బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ముప్పలనేని శేషగిరిరావు, ప్రిన్సిపాల్ శారానివేదిత అభినందనలు తెలిపారు. రాహుల్ తల్లిదండ్రులు మధు, నీలిమా తన బిడ్డ ఒలింపిక్స్‌లో కూడా స్వర్ణపతకాలు సాధిస్తాడని ఆశాభావం వ్యక్తంచేశారు.
రియో ఒలింపిక్స్‌కు రాహుల్ ఎంపిక
Published Mon, Feb 16 2015 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM
Advertisement
Advertisement