
తేజ్, విష్ణు మంచు, రిషిక
‘‘ఇండస్ట్రీలో ఓ యాక్టర్‌కి, మేకప్ మేన్‌కి ఉన్న బంధం భార్యాభర్తల్లాంటిది. నేను చిన్నప్పటి నుంచి మేకప్‌మేన్ చంద్రగారిని చూస్తున్నాను. ఓ రైటర్‌గా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సినిమా చేయటం అంత సులభం కాదు.. ఆయన మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. ‘మాధవే మధుసూదనా’ సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అని హీరో విష్ణు మంచు అన్నారు.
తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మాధవే మధుసూదనా’. బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో బొమ్మదేవర రామచంద్ర రావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను విష్ణు మంచు రిలీజ్ చేశారు. బొమ్మదేవర రామచంద్ర రావు మాట్లాడుతూ–‘‘నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన అన్నపూర్ణ స్టూడియో సంస్థకు, నాగార్జునగారికి రుణపడి ఉంటాను. మోహన్‌బాబుగారు సింగపూర్‌లో ఉండటం వల్ల ఆయన స్థానంలో విష్ణుని పంపించినందుకు కృతజ్ఞతలు’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment