
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు.. చిత్రంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కుమారుడు విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 17న థాయ్‌లాండ్‌లో పెళ్లి జరగగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి దంపతులు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి, మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ మంత్రు లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్, ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీవీ కృష్ణారెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి, డాక్టర్ విజయానంద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వ«ధూవరులను ఆశీర్వదించారు.
చదవండి: (హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస)
Comments
Please login to add a commentAdd a comment