Konda Vishweshwar Reddy
-
త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కేవలం రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందన్నారు లోక్‌సభలో బీజేపీ విప్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారని సెటైర్లు వేశారు.కాగా, కొండా విశ్వేశ్వర రెడ్డి శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణకు గత ఆరు నెలల్లో 35వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. రాజకీయాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఎంపీల సంఖ్యకు నిధులకు సంబంధం లేదు. రాష్ట్రాల అవసరాల మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. కాంగ్రెస్ నేతలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మా ఐడియాలు కాపీ కొట్టారు అని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బడ్జెట్ బాగా లేదని వాళ్ళే అంటున్నారు.. అంటే మీ ఐడియాలు బాగాలేవా?. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 12 లక్షల ముస్లీంలు ఉంటారు. వక్ఫ్ బోర్డుకు రూ.10 లక్షల ఎకరాల భూమి ఉంది. వక్ఫ్ బోర్డు భూముల ద్వారా ఇప్పుడు కేవలం 190 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. వక్ఫ్ బోర్డు ఇష్యూపై జేపీసీ వేశారు. కమిటీలో డీకే అరుణ, ఎంపీ అసద్ ఉన్నారు. వచ్చే సెషన్లో వక్ఫ్ బోర్డ్ బిల్లు ఆమోదం పొందవచ్చు. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లింలకు లాభం జరుగుతోంది.జుంటుపల్లి ప్రాజెక్టు గేట్లు ఐదేళ్లుగా పనిచేయడం లేదు. తక్కువ ఖర్చుతో జంటుపల్లి ప్రాజెక్టు గేట్లను ప్రభుత్వం మరమ్మతు చేయించింది. లక్ష కోట్లతో మూసీ ప్రాజెక్టు కట్టడం కంటే ముందు ఎస్టీపీల నిర్మాణం, నిర్వాహణ చేయాలి. మూసీ ప్రాజెక్టు మంచిదే.. కానీ ప్రయార్టీ కాదు. త్వరలో సీఎం రేవంత్‌ను కలుస్తాను. జంట జలాశయాలపైన ఇప్పుడు 111 జీవో ఉందా?. 69 జీవో అమలు చేస్తున్నారో తెలియడం లేదు. సీఎం రేవంత్‌ను కలిసి 111 జీవోపై నివేదిక ఇస్తాను అంటూ కామెంట్స్ చేశారు. -
కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించేనో!!
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. పదవి ఖాయమే.. కానీ.. నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్‌రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఓసీకైతే కిషన్‌రెడ్డి.. బీసీకైతే ఈటల.. కిషన్‌రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్‌రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్‌కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు. క్యూలో ‘కొండా’ సైతం.. కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే. -
Chevella Lok Sabha: చేవెళ్ల బరిలో ముగ్గురు ఉద్దండులు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లోక్‌సభ స్థానాలకు ఏ క్షణమైనా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉండటంతో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు అటు రాజకీయ పారీ్టలు కూడా సన్నద్ధమయ్యాయి. జిల్లాలోని కీలకమైన చేవెళ్ల స్థానంపై అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ దృష్టి సారించాయి. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డినే మళ్లీ బరిలోకి దించనున్నట్లు ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయన పేరే దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి రోజుకో కొత్త అభ్యర్థి తెరపైకి వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డికి ఆయనకు మధ్య కొంత అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఆయనకు ఈ స్థానం దక్కకపోవచ్చనే చర్చ నడుస్తోంది. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి రెండు రోజుల క్రితం కారు దిగి హస్తం పారీ్టలో చేరడంతో ఆమెకే అవకాశం ఉంటుందన్న ప్రచారం ఊపందుకుంది. మూడు పారీ్టల నుంచి ముగ్గురు ఉద్దండులు బరిలోకి దిగనుండడంతో ఈసారి చేవెళ్ల పోరు రసవత్తరంగా మారనుంది. క్షేత్రస్థాయిలో ఆశావహులు చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్‌నగర్, కొడంగల్ నియోజకవర్గాలు మహబూబ్‌నగర్ పరిధిలో ఉండగా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్‌కర్నూల్ పరిధిలో కొనసాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం భువనగిరి పరిధిలో, ఎల్బీనగర్ నియోజకవర్గం మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో కొనసాగుతున్నాయి. 2019లో ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 12,70,687 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్‌రెడ్డికి 5,16,363 ఓట్లు (40.64 శాతం) రాగా, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 5,0,318 ఓట్లు (39. 61శాతం)వచ్చాయి. బీజేపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డికి 1,95,919 ఓట్లు (15.42 శాతం) వచ్చాయి. బీఎస్పీ సహా ఇతర పారీ్టలకు డిపాజిట్ దక్కలేదు. పోటీలో ఉన్న 20 మందికి నోటా (9,045) కంటే తక్కువ ఓట్లు పోలవడం గమనార్హం. 2024 ఫిబ్రవరి 8 నాటికి ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 29,14,124 మంది ఓటరుగా నమోదు చేసుకున్నారు. వీరిలో 14,93,369 మంది పురుషులు, 14,20,469 మంది మహిళలు ఉన్నారు. మరో 286 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా తలపడనున్నారు. ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించే నేతలంతా ఆర్థికంగా బలవంతులు కావడంతో ఎన్నికల కోసం భారీగా ఖర్చుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే వీరంతా క్షేత్రస్థాయిలో పర్యటించడంతోపాటు ఇతర పారీ్టల్లో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వల వేస్తున్నారు. వీరికి భవిష్యత్తులో పలు రాజకీయ పదవులతో పాటు నగదు, ఖరీదైన వాహనాలు ఎరగా చూపుతున్నట్లు తెలిసింది. తుది ఓటరు జాబితా వెల్లడి లోక్‌సభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు జాతీయ ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఎప్పుడు ఎన్నికలు వచి్చనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. ఈ నెల 8న జాబితా విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 3,369 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వీటి పరిధిలో 35,91,987 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో 18,50,292 మంది పురుషులు, 17,40,379 మంది మహిళలు ఉన్నారు. 449 మంది థర్డ్జెండర్లు ఉన్నారు. వీరితో పాటు 286 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, మరో 581 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 9,84,068 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 4,86,109 మంది పురుషులు, 4,97,920 మంది మహిళలు ఉన్నారు. మరో 39 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. -
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఫోన్లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీ సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా దుర్భాషలాడటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనమేరకు ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆయనో పెద్ద కబ్జాకోరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రంజిత్‌రెడ్డి ఓ పెద్ద కబ్జాకోరు. ఆయన ఫిలింనగర్‌లోని దేవాలయ భూమిని ఆక్రమించాడు. ఆయనపై కోళ్ల దాణా, గుడ్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. గోపన్‌పల్లి, నానక్‌రాంగూడలోనూ విలువైన స్థలాలను కొల్లగొట్టాడు. కేటీఆర్‌కు ఆయన ఓ బినామీ. ఐదేళ్లలో ఆయన చేవెళ్లకు చేసిందేమీ లేదు’ అని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. నగరంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ నేతలు రవికుమార్ యాదవ్, తోకల శ్రీనివాసరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎంపీగా ఆయన ధ్యాసంతా సంపాదనపైనే ఉందన్నారు. లోక్‌సభలో ఏనాడూ చేవెళ్ల ప్రజల కష్టాలను ప్రస్తావించలేదన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఏ ఒక్క రోడ్డునూ వేయించలేక పోయారని విమర్శించారు. సొంత ఫాంహౌస్‌కు ప్రభుత్వ నిధులతో రోడ్డును వేయించుకున్నారని, ప్రస్తుతం ఈ ఫాంహౌస్ అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలోని పెద్దలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చు కోకపోతే.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడని, బేషరతుగా ఆయనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికల ముందు హడావుడిగా రంగారెడ్డి–పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారని, పనులు పూర్తి కాక ముందే ప్రారంభించి రైతులను మోసం చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదన్నారు. 111 జీఓ రద్దు చేసినట్లు ప్రకటించినా.. ఇప్పటికీ కోర్టుల్లో కేసు పెండింగ్‌లోనే ఉందన్నారు. శంకర్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూంల పంపిణీలో స్థానికులకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. చేవెళ్లను మున్సిపాలిటీ చేస్తున్నట్లు ప్రకటించి, ప్రజలను తప్పుదోవ పట్టించాడని ధ్వజమెత్తారు. పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున పేదల భూములను కొల్లగొట్టారని ఆరోపించారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్ల కోసం వస్తారని ప్రశ్నించారు. -
ఎంపీ రంజిత్‌రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజీత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇద్దరు నేతలు ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకువెళ్లు అని కొండా స్పందించారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రచ్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై మాజీ ఎంపీ కోండా విశ్వేశ్వరరెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో రంజిత్‌రెడ్డిపై కొండా కంప్లైంట్ చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫిర్యాదు ఎవరు ఫోన్ చేశారో పేరు కూడా చెప్పానని అన్నారు.పెద్దల సలహా మేరకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్‌తో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడని అన్నారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏం లేదని, అతనున బీఆర్ఎస్, తాను బీజేపీ అని అన్నారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు -
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే. -
వివేక్ దారిలోనే కొండా? ఆయన వెంటే..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్‌తో చేయి కలుపుతున్నారు. మొన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి, నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్లారు. వీరి దారిలోనే బీజేపీ సీనియర్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా పయనించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు లిస్టుల్లో 53 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మూడో లిస్టు పై ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. ఇదే పని మీద స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. జనసేన తో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించే సీట్లపైనా బీజేపీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు టాక్. ఈ పొత్తులో భాగంగా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి సీటును జనసేనకు కేటాయిస్తారన్న లీకులు బయటికి వస్తున్నాయి. శేరిలింగంపల్లి సీటు విషయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. తన పార్లమెంటు నియోనజకవర్గం పరిధిలోకి వచ్చే సీటును జనసేనకు ఎలా ఇస్తారని, ఎప్పటినుంచో నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కొడుకు రవియాదవ్ కే సీటు కేటాయించాలని కొండా పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సీటును రవియాదవ్ కు ఇవ్వకపోతే తానూ బీజేపీకి రిజైన్ చేస్తానని పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం ఇలా ఉంటే కొండా పార్టీని వీడితే ఆయన బాటలోనే స్టేట్ బీజేపీ మరో టాప్ లీడర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఈటల భార్య జమునా రెడ్డి కొండాకు దగ్గరి బంధువవుతారు. రాజకీయంగా వీళ్లంతా కలిసి నడిచే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. తాజా పరిణామాలతో స్టేట్ బీజేపీ నుంచి నెక్ట్స్ ఎవరు అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఇదీ చదవండి: బీజేపీకి గడ్డం వివేక్ రాజీనామా.. కాంగ్రెస్‌లో చేరిక -
ఘనంగా కొండా విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సంగీతారెడ్డి దంపతుల కుమారుడు విశ్వజిత్, రిషికల వివాహ రిసెప్షన్ శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని బౌల్డర్‌హిల్స్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నెల 17న థాయ్‌లాండ్‌లో పెళ్లి జరగగా, శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన రిసెప్షన్‌కు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి దంపతులు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రాంచందర్‌రావు, మాజీ కేంద్ర మంత్రి సుబ్రమణ్యస్వామి, మాజీ సీఎం ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ టల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ మంత్రు లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బ్రదర్స్, ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ సినీనటులు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జీవీ కృష్ణారెడ్డి, జీవీ సంజయ్‌రెడ్డి, డాక్టర్ విజయానంద్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరై నూతన వ«ధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస) -
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇంట్లో విషాదం
సాక్షి, వికారాబాద్(రంగారెడ్డి) : చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తల్లి, స్వర్గీయ జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి జయలతాదేవి (91) శనివారం ఉదయం కన్నుమూశారు. విశ్వేశ్వర్‌రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళవారం. మాధవరెడ్డి దంపతులకు కుమారుడు విశ్వేశ్వర్‌రెడ్డి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాతృమూర్తి మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. విశ్వేశ్వర్‌రెడ్డిని ఫోన్లో పరామర్శించి సంతాపం తెలిపారు. సినీ హీరో చిరంజీవి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. కొండా నివాసానికి చేరుకుని జయలతాదేవి పార్థీవదేహానికి నివాళర్పించారు. రేపు(సోమవారం) మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చదవండి: ట్విన్ బ్రదర్స్... ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు -
‘ఈటల కోసం ప్రచారం చేస్తా’
తాండూరు టౌన్: రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అక్కడ విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూరులో విలేకరులతో మాట్లా డారు. కేసీఆర్, కేటీఆర్ కలసి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పేస్థితిలో లేరని, టీఆర్ఎస్లో కట్టుబానిసత్వం కొనసాగుతోందని అన్నారు. తండ్రీ, కొడుకులను ఎదిరించే వారిని అణచివేస్తు న్నారని, అది ఈటల వ్యవహారంతో బట్టబయలైందని పేర్కొన్నారు. తాను ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకోలేదని, టీఆర్ఎస్ను మంత్రి హరీశ్‌రావు వంటి వారికి అప్పగిస్తే మళ్లీ అందులో చేరేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో గత ఆరేళ్లుగా చివరిస్థానాల్లోనే ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై టిఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పంటలు వానలపాలై రైతులు గగ్గోలు పెడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ బడా నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘును అరెస్టు చేసి జైలుకు పంపడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. చదవండి: ఆత్మగౌరవ బావుటా ఎగురవేస్తా -
Etela: మరి ఆయనను సస్పెండ్ చేయొచ్చు కదా?: కొండా
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ భవిష్యత్‌పై చర్చ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటలతో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు సరికాదన్నారు. రాజకీయ విభేదాలు ఉంటే చర్చించుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతులను కేసీఆర్ పాటించడం లేదని మండిపడ్డారు. అదే విధంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈటలను ఇంకా ఎందుకు పార్టీలో ఉంచుకున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు సస్పెండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు. చదవండి: కమలం గూటి వైపు సంకేతాలు -
రైతులకు శుభవార్త: ఇలా చేస్తే ధాన్యం తడవదు
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా అటు మార్కెట్లలో, ఇటు కల్లాల్లో ధాన్యం తడిసిపోయి రైతన్న నష్టపోతున్న విషయం తెలిసిందే. అయితే, తక్కువ ఖర్చుతోనే రైతులు ధాన్యాన్ని కాపాడుకోవచ్చు అంటున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టార్పాలిన్, ప్లాస్టిక్ కవర్ (ష్రింక్ రాప్)లను ఓ పద్ధతి ప్రకారం ధాన్యం బస్తాల చుట్టూ చుట్టడం ద్వారా కేవలం రూ.500 ఖర్చుతో (ష్రింక్ రాప్) 100 క్వింటాళ్ల వరకు ధాన్యానికి రక్షణ లభిస్తుందని ఆయన చెబుతున్నారు. ఇందుకోసం రైతులకు సూచనలు చేస్తూ బుధవారం ఆయన విడుదల చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కింద ఒక టార్పాలిన్ వేసి, దానిపై ధాన్యం బస్తాలు ఒరవడి ప్రకారం గుట్టగా ఉంచి, దాన్ని టార్పాలిన్‌తో వచ్చేంతవరకు మూసివేసి, ఆ తర్వాత ష్రింక్ రాప్‌ను బస్తాల గుట్ట పైభాగం వరకు చుట్టి దానిపై ఓ తాపీ బుట్ట, పెద్ద బండరాయి పెట్టడం ద్వారా ధాన్యం బస్తాలు తడవకుండా కాపాడుకోవచ్చని ఈ వీడియోలో చూపించారు. టార్పాలిన్లు ఎలాగూ రైతులకు అందుబాటులో ఉంటాయి కనుక ష్రింక్ రాప్ (ప్లాస్టిక్ కవర్) కొనుక్కుంటే చాలని కొండా ఈ సందర్భంగా చెప్పారు. గ్రానైట్ రాళ్లు అందుబాటులో ఉంటే, నేరుగా ధాన్యం బస్తాలను వాటిపై పేర్చి, గుట్టను ప్లాస్టిక్ కవర్‌తో చుట్టేయవచ్చని కూడా ఆయన వీడియోలో సూచించారు. -
ఏ నిర్ణయమైనా నీ వెంటే..! ఈటలకు కొండా మద్దతు
సాక్షి, హైదరాబాద్: పొమ్మనలేక పొగబెట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. రోజురోజుకు ఈటల రాజేందర్‌కు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈటలకు కొండంత మద్దతు లభించింది. ఒకప్పుడు టీఆర్ఎస్లో కలిసి పని చేసిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటలకు మద్దతు ప్రకటించారు. ఏ నిర్ణయమైనా తీసుకో అండగా ఉంటామని విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఈటల నివాసంలో కొండా వచ్చారు. కొద్దిసేపు ఈటల రాజేందర్‌తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. అనంతరం కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటల భార్య జమున తనకు బంధువు అని తెలిపారు. ఈటల నా మిత్రుడని పేర్కొన్నారు. అయితే ఈటలతో రాజకీయాలు చర్చించలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్పుడు నిర్ణయాలు చాలాసార్లు తీసుకున్నారని ఆరోపించారు. పార్టీ నమ్ముకుని ఉంటే.. బయటకు పంపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకు నష్టం లేదని.. ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటామని ప్రకటించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఈ సమయంలోనే ఈటల రాజేందర్ బయటకు రావడంతో రాజకీయాలు మారే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిస్తే తెలంగాణ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కొండా మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: వాట్సప్ చేస్తే ఉచిత భోజనం: తెలంగాణ పోలీసుల శ్రీకారం చదవండి: జొమాటో సంచలనం: నోయిడాలో అమల్లోకి.. -
కేసీఆర్‌ను గద్దె దింపడమే నా లక్ష్యం : కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
కేసీఆర్‌ను గద్దె దింపడమే నా లక్ష్యం
హైదరాబాద్: కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీని వదిలి 10 రోజులు అవుతోందని, తాను కాంగ్రెస్‌లో ఉంటే కేసీఆర్‌కే లాభం జరుగుతుందనే బయటకు వచ్చానని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉండి కేసీఆర్‌పై గట్టిగా పోరాటం చేయలేనని వ్యాఖ్యానించారు. 10 రోజులుగా కోదండరాం, తీన్మార్ మల్లన్న, రాములునాయక్‌తో పాటు ప్రజాసంఘాల నేతలను కలిశానని, అందరినీ ఏక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. అప్పుడే కేసీఆర్‌కు దీటుగా నిలబడొచ్చని పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా రాజకీయ ఉమ్మడి కార్యాచరణ లక్ష్యంతో ముందుకెళ్తానని చెప్పారు. మూడు నెలల తర్వాత నిర్ణయం కొత్త పార్టీ పెట్టాలా, ఎవరైనా పెడితే కలవాలా, స్వతంత్రంగా ఉండాలా, బీజేపీలో చేరాలా, మళ్లీ కాంగ్రెస్‌లోనే కొనసాగాలా అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై మూడు నెలల చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. హరీశ్, ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు నాయకత్వం వహిస్తే ఆ పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓట్లు చీలడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని, మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూడటమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు. టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో కన్పించట్లేదని విశ్లేషించారు. టీఆర్ఎస్పై బీజేపీ గట్టి పోరాటం చేస్తే ఆ పార్టీలో చేరుతానని, పీసీసీ అధ్యక్షుడు మారి కాంగ్రెస్ గట్టి ఫైట్ చేస్తే మళ్లీ అందులో కొనసాగుతానని తెలిపారు. ప్రజల కోసం కొట్లాడటం తనకు ఇష్టమని, అందుకు అవసరమైతే తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లతో కలసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తెలంగాణ వచ్చాక రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ప్రజలే అందరి కంటే ఎక్కువ నష్టపోయారని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగు జలాల సాధనకు పోరాటం చేస్తానన్నారు. జీవో 111 మీద కేసీఆర్, కేటీఆర్ వెయ్యి సార్లు అబద్ధాలు ఆడారని, దీనిపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తానని కొండా చెప్పారు. -
బిగ్ షాక్: కాంగ్రెస్‌కు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్ తగిలింది. పార్టీ వీడతారని ఎప్పటి నుంచో సాగుతున్న ప్రచారానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెర దించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే మూడు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకోవడం గమనార్హం. అనంతరం బీజేపీలో చేరనున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే చేవెళ్ల టికెట్‌పై హామీ రావడంతోనే ఆయన కాంగ్రెస్‌కు బై చెప్పేశారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటు కూడా వినియోగించుకున్నారు. ఆ తెల్లారే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పని చేశారు. 2019 ఎన్నికల్లో కూడా చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి పరాజయం పొందారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాశారు. పారిశ్రామికవేత్తగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2013లో రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అనంతరం 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ సభ్యుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే 2018లో అకస్మాత్తుగా గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. కొండా కుటుంబానికి గొప్ప పలుకుబడి ఉంది. ఆయన తాత కొండా వెంకట రంగారెడ్డి. ఆయన తెలంగాణలో రజాకార్లతో పోరాడారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఆయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. కొండా దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అమెరికా పౌరసత్వం ఉండి ఎంపీగా పని చేసిన వ్యక్తిగా రికార్డులకెక్కారు. After a hectic time campaigning, I will be taking a break for a week and may not be very active on Twitter for a week or so. However I may organize a meeting with Tweeple on this Sunday. In the meantime I will leave with a thought to think about, with a tweet later today. — Konda Vishweshwar Reddy (@KVishReddy) March 15, 2021 -
ఆకట్టుకుంటున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాస్క్ డిజైన్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నుంచి రక్షణ కోసం మాస్కులు వాడుతుంటాం. అయితే చాలా మంది విభిన్నమైన మాస్కులు ధరిస్తుంటారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఎంపీలు కూడా మాస్కులు ధరించి వచ్చారు. అయితే మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించిన ప్రత్యేకమైన మాస్కు గురించి సోమవారం సభలో చర్చనీయాంశమైంది. సోమవారం రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ వినూత్నమైన మాస్క్ ధరించి సభకు వచ్చారు. అందరి దృష్టి ఆయన మాస్కుపైనే పడింది. మాస్కు గురించి అందరూ ఆరా తీశారు. దీంతో తన మిత్రుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు ఈ మాస్కును బహుమతిగా ఇచ్చారని నరేంద్ర జాదవ్ తెలిపారు. 99.97% సామర్థ్యం కలిగిన హై ఎఫీషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (హెపా) మాస్క్‌ను సానుకూల పీడనం ఆధారంగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రూపొందించారు. కరోనా సమయంలో మాస్కులతో పాటు, ఇంట్లోనే శానిటైజర్ తయారు చేసుకోవడం, కరోనా పేషంట్లకు ప్రత్యేక వెంటిలేటర్ ప్రిసెషన్ ఎయిర్ పంప్ (పీఏపీ)ను ఇంజనీర్ అయిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తయారు చేసిన విషయం తెలిసిందే. -
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, సర్వే!
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాజధానిలో రాజకీయం వేడెక్కింది. మరోసారి గ్రేటర్ పీఠం దక్కించుకోవాలని అధికార టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుండగా.. తమ ప్రభావం చూపించాలని కమలదళం కసితో ఉంది. ఇరు పార్టీలు విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే టికెట్ల విషయంలో ఆచితూచీ వ్యవహరించిన అధికార, విపక్షం.. చివరి వరకూ ఎదురుచూసి అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఇతర పార్టీలకు చెందిన అసమ్మతి నేతలను చేర్చుకుని ప్రత్యర్థులను దెబ్బకొట్టాలని వ్యూహ రచన చేస్తున్నాయి. (టీఆర్ఎస్ డివిజన్ ఇన్చార్జీల జాబితా ఇదే!) మరోవైపు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఇతర పార్టీలకు చెందిన నేతలను చేర్చుకోవడం, ప్రచారం సంగతి అలాఉంచితే.. పార్టీలో ఉన్న నేతల్ని కాపాడుకోవడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న 100 ఏళ్ల చరిత్రగల పార్టీకి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. టికెట్ పంపకాల విషయంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొత్త వివాదాలు రాజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పలువురు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. (రాజధానిలో వేడెక్కిన రాజకీయం) జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీఫారంల పంచాయతీ తారాస్థాయికి చేరకోవడంతో టీపీసీసీకి రాజీనామాల బెదిరింపులు వరుస కడుతున్నాయి. గోశామహల్ నియోజకవర్గంలో తాను టికెట్ ఇచ్చినవారికి బీఫారం ఇవ్వకపోతే... రాజీనామా చేస్తానంటున్న ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్ బెదిరింపులకు దిగారు. తన వర్గం నేతలకు సీటు కేటాయించి తీరాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. మరోవైపు కేంద్రమాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత సర్వే సత్యనారాయణ సైతం పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సీనియర్ నేతైన తనకు ఏమాత్రం గౌరవం దక్కడంలేదని, టీపీసీసీ నాయకత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీని వీడుతున్నట్లు ఇదివరకే ప్రకటించారని గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి సైతం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల ఆయన బీజేపీ పెద్దలను సైతం కలిశారని, చేరికకు లైన్‌క్లీయర్ అయ్యిందని వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన విశ్వేశ్వరరెడ్డి.. తాను బీజేపీలో చేరడంలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల్లోనూ తనకు మంచి స్నేహితులు, సన్నిహితులు ఉన్నారని, ఆ పరిచయంతోనే వారితో కలుస్తున్నాని వివరణ ఇచ్చారు. తను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని ట్విటర్ పోస్ట్ ద్వారా కొట్టిపారేశారు. I just heard a rumour.... I am joining BJP. Yes it is a just a rumour. I have lot of friends and aquaintances in all parties inuding TRS, MIM and BJP. — Konda Vishweshwar Reddy (@KVishReddy) November 20, 2020 -
నేను సోనియమ్మను మోసం చేయను: మాజీ ఎంపీ
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల నగరా మోగడంతో రాజకీయ పార్టలో హాడావుడి మొదలైంది. ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రముఖ పార్టీ నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటే ఆయా పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీలోనే ఉండాలా లేక ఇతర పార్టీలో చేరాలా అనే అయోయంలో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ భరిలో దిగే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా మాజీ ఎంపీ అంజన్ కమార్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్షితో సమావేశమ్యారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ... తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. పార్టీలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ అవన్ని సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ వేసే ముందు తనను సంప్రదించలేదని కొంత అసంతృప్తితో ఉన్నానన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని, ఒక సీటు గెలిచిన బీజేపీ, హామీలు నెరవేర్చని టీఆర్ఎస్ను ప్రజలు నమ్మరన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని, సోనియాగాంధీని మోసం చేసి వెళ్లను అన్నారు. (చదవండి: ‘గ్రేటర్’ ఎన్నికలు; కాంగ్రెస్ తొలి జాబితా ఇదే) అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావన్ మాట్లాడుతూ.. గ్రేటర్లో వేలాది మంది ప్రజలు మీసేవ కేంద్రాల వద్ద వేచి చూస్తున్న దయనీయ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. పదివేల కోసం తిండి, తిప్పలు మాని రాత్రి, పగలు తేడా లేకుండా లైన్ల్లో నిలబడుతున్నారన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిర్వాకం వల్ల ప్రజలు చివరికి చనిపోయే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్‌లు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో డబ్బులు వేసే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ పని చేయడం లేదని, ఓట్ల కోసం చిల్లర రాజకీయాలకు పాల్పడుతూ.. పేదలను బలిచేస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఏం చేస్తున్నారు.. ప్రజల వివరాలు సేకరించి డబ్బులు వేయవచ్చు కదా అని ధ్వజమెత్తారు. ప్రతీ బాధితుడిని ఆదుకోవాలని సూచించినా.. అధికార పార్టీ వినకుండా ఎన్నికల రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఎంత వరద నష్టం జరిగిందనే దానిపై సమగ్ర సమాచారం గుర్తించారా అని, ఈ విషయంలో గవర్నర్ ఉత్సవ విగ్రహంగా మారిపోయారని విమర్శించారు. వరద అవినీతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని, వరద సహాయం తీసుకురావడంలో బీజేపీ విఫలమైందని దాసోజు వ్యాఖ్యానించారు. (చదవండి: తొలి రోజు 17 మంది.. 20 నామినేషన్లు) అదే విధంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ‘అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నందున ఎవరికి టైం ఇవ్వకుండా ఎన్నికలు పెట్టేశారు. తమ పార్టీ నాయకులు బిక్షపతి యాదవ్, రవికుమార్ యాదవ్ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆయన పార్టీ మారడం వల్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బంది ఏంలేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ ప్రచారం చేస్తోంది, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే.. కాంగ్రెస్ ఉండాలి. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా పోరాడుతుంది. పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ రేపు 9 గంటలకు శేరిలింగంపల్లిలో సమావేశం నిర్వహిస్తున్నాం. శేరిలింగంపల్లిలో పది డివిజన్లలో కాంగ్రెస్ గెలుపుకు రేపటి మీటింగ్ ఉపయోగపడుతుంది. బీజేపీ అంత గట్టిగా ఉంటే.. మా పార్టీ నేతల వెంట ఎందుకు పడుతున్నారు. బీజేపీకి సరుకు లేక.. మా పార్టీ నేతల వెంటపడుతోంది. హైదరాబాద్ వరదలు వస్తే.. ఒక్క రూపాయి సహాయం చేయలేదు. 2009 కంటే మెరుగైన ఫలితాలు ఈ సారి సాధిస్తాం’ అని కొండా ధీమా వ్యక్తం చేశారు. -
కొండనెక్కిన ‘కొండ’
సాక్షి, హైదరాబాద్ : కొండ కొండనెక్కడం ఏంటనుకుంటున్నారా? అవునండి నిజమే, వయసుతో సంబంధం లేకుండా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఓ సాహసం చేశారు. సంక్షిష్టమైన దారులతో, ఒళ్లు గగుర్పొడిచేలా ఏటవాలుగా ఉండే మార్గాలతో ఆద్యంతం ప్రమాదకరంగా ఉండే అత్యంత కఠినమైన కలావంతిన్ దర్గ్‌పై విజయవంతంగా ట్రెక్కింగ్ చేశారు. మహారాష్ట్రాలో రాయిఘడ్ జిల్లాలోని కలావంతిన్ దర్గ్‌పై ట్రెక్కింగ్ చేసిన ఫోటోలను కొండా విశ్వేశ్వరరెడ్డి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దారులు భయంకరంగా ఉన్నా, శారీరకంగా అలసిపోయినా, ఈ ట్రెక్కింగ్ మంచి అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కొండనెక్కాలంటే.. కొండంత ధైర్యం ఉండాలంటూ నెటిజన్లు విశ్వేశ్వరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పశ్చిమ కనుమల్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ కొండపై ట్రెక్కింగ్‌కి వెళ్లి 2016లో హైదరాబాద్‌కి చెందిన 27 ఏళ్ల రచిత గుప్త అనే యువతి మృతిచెందారు. మరణించిన 10 రోజుల అనంతరం ఆమె మృతదేహం లభ్యమైంది. 2018లో పూణేకి చెందిన 28 ఏళ్ల చేతన్ దండే అనే ట్రెక్కర్ కొండ అంచు, ఇంకా 15 అడుగుల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందారు. -
బ్లాక్‌మనీ వెలికితీత ఏమైంది?..
సాక్షి, రంగారెడ్డి: ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న విధానాల వల్లే దేశంలో ఆర్థిక మాద్యం తలెత్తిందని చేవెళ్ల మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం లక్డీకపూల్‌లోని కలెక్టరేట్‌ని ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హాజరై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా తీరు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు ఊదరకొట్టిన ‘బ్లాక్‌మనీ వెలికతీత’ ఏమైందని ప్రశ్నించారు. జీఎస్టీని అసంబద్ధంగా అమలు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు పరిపాలించడం ఏమాత్రం చేతకాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం నియంతలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు. డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హడావుడిగా పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. ఆ తర్వాత నిధులు విడుదల చేయడాన్ని విస్మరించారని విమర్శించారు. బిల్లులు రాక కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని అన్నారు. ఏ పథకమూ సక్రమంగా కొనసాగడం లేదన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిధులు లేకపోవడం.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందనడానికి నిదర్శమన్నారు. సీఎం కేసీఆర్ పతనం జిల్లా నుంచే మొదలవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అనంతరం తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారిణి ఉషారాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శులు అమరేందర్ రెడ్డి, జానకిరాం, శివకుమార్, ఉదయ్‌మోహన్‌రెడ్డి, బాబర్‌ఖాన్, అధికార ప్రతినిధి సిద్దేశ్వర్, ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వినోద్, దేపభాస్కర్‌రెడ్డి, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు రియాజ్, శంకర్, సంజయ్ యాదవ్, గోపాల్ రెడ్డి, ఖలీద్, చిగురింత నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేకేతో భేటీ అయిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని సోమవారం ప్రకటించిన టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావుతో ఆయన నివాసంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్న కేకే విడుదల చేసిన లేఖతో ఆయన్ను కలిశాను. ఆర్టీసీ సమస్యను అర్థం చేసుకొని మంచి మనసుతో ఆయన స్పందించారు. సమ్మె వల్ల అందరికీ నష్టమే. టీఆర్ఎస్కు కూడా రాజకీయంగా మైనస్సే. కానీ సీఎం మాత్రం మొండిగా ఉంటున్నారు. ఆయనకు పోలీస్‌శాఖ ఒక్కటే ఉంటే సరిపోతుందనుకుంటున్నారు. అయితే సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తేనే చర్చలు జరుపుతామని కేకే చెప్పార’ని కొండా వెల్లడించారు. -
రెండో అత్యంత ధనికుడు కొండా
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోటీ చేసిన అభ్యర్థుల్లో అత్యంత ధనికుడిగా బిహార్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి ఆర్.కె.శర్మ నిలవగా.. రెండో అత్యంత ధనికుడిగా చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నిలిచారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రత్యర్థి రంజిత్‌రెడ్డి దేశంలో అత్యధిక వార్షిక ఆదాయం పొందుతున్న వారిలో మూడో వ్యక్తిగా నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా లోక్‌సభ బరిలో నిలిచిన 8,049 అభ్యర్థుల నుంచి 7,928 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారŠమ్స్ (ఏడీఆర్) సంస్థలు ఈమేరకు సోమవారం ఒక నివేదిక వెల్లడించాయి. నేరచరితలోనూ తక్కువేంకాదు.. - 19 శాతం (1,500) మంది అభ్యర్థులు నేర చరిత్రను కలిగి ఉన్నారు. 2014లో ఈ సంఖ్య 1,404 (17 శాతం)గా ఉంది. 2009లో ఇది 1,158 (15 శాతం). - 13 శాతం (1,070) మంది అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు కలిగి ఉన్నారు. రేప్, హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు తదితర తీవ్రమైన కేసులు ఉన్నవారి సంఖ్య 2014లో 11 శాతంగా, 2009లో 8 శాతంగా ఉంది. - 56 మంది అభ్యర్థులు తమకు కేసుల్లో శిక్షపడినట్టుగా వెల్లడించారు. - 55 మంది అభ్యర్థులపై హత్య సంబంధిత కేసులు నమోదై ఉన్నాయి. 184 మందిపై హత్యాయత్నం కేసులు నమోదై ఉన్నాయి. - 126 మంది అభ్యర్థులపై మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. - 47 మందిపై కిడ్నాప్ కేసులున్నాయి. - 95 మంది విద్వేష ప్రసంగాలతో (హేట్ స్పీచ్) కేసులు నమోదైన వారు ఉన్నారు. - బీజేపీ అభ్యర్థుల్లో 40 శాతం (175 మంది), కాంగ్రెస్ అభ్యర్థుల్లో 39 శాతం (164), బీఎస్పీ అభ్యర్థుల్లో 22 శాతం (85), సీపీఐ(ఎం) అభ్యర్థుల్లో 58 శాతం (40 మంది), స్వతంత్రుల్లో 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదై ఉన్నాయి. - రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా చూస్తే డామన్ అండ్ డయ్యూలో అత్యధికంగా 50 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదవగా.. అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో 7 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కేసులు నమోదైన అభ్యర్థులు ఉన్న రాష్ట్రాల్లో తదుపరి స్థానాల్లో దాద్రానగేర్ హవేలీ (36 శాతం), లక్షద్వీప్ (33 శా తం), కేరళ (32శాతం), బిహార్ (26 శాతం), మహారాష్ట్ర (26 శాతం), గోవా (25 శాతం), యూపీ (23 శాతం), జార్ఖండ్ (23 శాతం), ఆంధ్రప్రదేశ్ (21 శాతం) నిలిచాయి. తెలంగాణ 26వ స్థానంలో నిలిచింది. ఇక్కడ 12 శాతం అభ్యర్థులపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక స్థితిగతులు ఇలా... - లోక్‌సభకు పోటీచేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 2009లో 16 శాతం కోటీశ్వరులు ఉండగా, 2014లో ఆ సంఖ్య 27 శాతానికి పెరిగింది. 2019లో ఆ సంఖ్య 29 శాతానికి పెరిగింది. - రాష్ట్రాల వారీగా చూస్తే అరుణాచల్‌ప్రదేశ్‌లో 83 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. మేఘాలయ (78 శాతం), మిజోరం (67 శాతం), నాగాలాండ్, డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, గోవాల్లో 50 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. జమ్మూకశ్మీర్‌లో 48 శాతం, హిమాచల్‌లో 47 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం అభ్యర్థులు కోటీశ్వరులే. చివరి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇక్కడ 18 శాతం మంది మాత్రమే కోటీశ్వరులు. - 2019 లోక్‌సభ అభ్యర్థుల సగటు ఆస్తులు రూ. 4.14 కోట్లు. - పార్టీలవారీగా అభ్యర్థుల ఆస్తులు చూస్తే బీజేపీ అభ్యర్థు ల సగటు ఆస్తి రూ. 13.37 కోట్లు గా ఉంది. కాం గ్రెస్ అభ్యర్థుల సగటు రూ. 19.92 కోట్లుగా, బీఎస్పీ సగటు రూ. 3.86 కోట్లుగా ఉంది. సీపీఎం రూ. 1.28 కోట్లుగా, స్వతంత్రుల సగటు రూ. 1.25 కోట్లుగా ఉంది. - 2019 అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులు కలిగిన తొలి మూడు స్థానాల్లో బిహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి స్వతంత్రుడిగా పోటీ చేస్తున్న రమేష్‌కుమార్ శర్మ రూ. 1,107 కోట్ల ఆస్తులతో తొలిస్థానంలో నిలిచారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి lokరూ.895 కోట్ల ఆస్తులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నకుల్‌నాథ్ రూ. 660 కోట్లతో మూడోస్థానంలో నిలిచారు. - 60 మంది అభ్యర్థులు తమకు ఆస్తులేమీ లేవని ప్రకటించారు. - 756 మంది అభ్యర్థుల ఆస్తులు రూ. లక్ష లోపు ఉన్నాయి. అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన వారిలో కింది నుంచి తమిళనాడులోని మాయిలాదుతురై నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రాజేశ్, రాజా తమ ఆస్తులను రూ. 100లుగా చూపగా, కేరళలోని వయనాడ్ నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన శ్రీజిత్ రూ. 120గా చూపారు. - మొత్తం అభ్యర్థుల్లో 10 శాతం మంది తమ పాన్ కార్డు వివరాలు వెల్లడించలేదు. విద్యార్హతలు.. 44 శాతం అభ్యర్థుల విద్యార్హత ఐదో తరగతి నుంచి 12వ తరగతి మధ్య ఉండగా.. 48 శాతం మంది అభ్యర్థులు పట్టుభద్రులు, ఆపై అర్హతగా కలిగి ఉన్నారు. 253 మంది అభ్యర్థులు తాము అక్షరాస్యులమని ప్రకటించగా, 163 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులమని ప్రకటించారు. టాప్–3 తెలుగువారే అత్యధిక వార్షిక ఆదాయం (ఇన్‌కంటాక్స్ రిటర్న్‌ల్లో చూపిన మేరకు) ప్రకటించిన వారిలో తొలి ముగ్గురు తెలుగువారే. టీడీపీకి చెందిన గల్లా జయదేవ్, బీద మస్తాన్‌రావు వరుసగా ఒకటి, రెండో స్థానాల్లో నిలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. భార్య, పిల్లల వార్షికాదాయంతో కలిపి గల్లా జయదేవ్ రూ.43 కోట్లు, బీద మస్తాన్‌రావు రూ. 34 కోట్లు, రంజిత్‌రెడ్డి రూ. 33 కోట్లుగా చూపారు.