బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు | Banjara Hills Police Registered Case Against BRS MP Ranjith Reddy - Sakshi
Sakshi News home page

BRS MP Ranjith Reddy: బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు

Jan 24 2024 6:54 AM | Updated on Jan 24 2024 1:14 PM

- - Sakshi

హైదరాబాద్: బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని ఫోన్‌లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్‌ చేశారు.

తమ పార్టీ సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా దుర్భాషలాడటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనమేరకు ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement