ranjith reddy
-
TS : కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా..రాజకీయ నేతలు (ఫొటోలు)
-
పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
అధికారం, ఆస్తుల కోసమే ద్రోహం చేశాడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికారం, ఆస్తులను కాపాడు కోవడం కోసమే చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి పార్టీని విడిచిపెట్టి ద్రోహం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సీటు ఇచ్చి గెలిపించుకున్న తర్వాతే రంజిత్‌రెడ్డి ఎవరో ప్రపంచానికి తెలిసిందన్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో బుధవారం కేటీ ఆర్ తెలంగాణ భవన్లో భేటీ అయ్యారు. చేవెళ్ల పరిధిలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘2019లో రాజకీయాల్లోకి రంజిత్ రెడ్డి కొత్తగా వచ్చినా పార్టీ కార్యకర్తలంతా కష్టపడి ఆయనను గెలిపించారు. ఆయనకు పార్టీలో అత్యధి క ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు నియోజకవర్గంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను అని పార్టీ ఎదుట అశక్తతను వ్యక్తం చేయడంతోపాటు రాజకీయాల నుంచి తప్పుకుంటా అని రంజిత్‌రెడ్డి చెప్పారు. కానీ రంజిత్‌రెడ్డి తన సోదరి అని చెప్పుకున్న కవిత నివాసంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సోదాలు జరిపి అరెస్టు చేసిన రోజే నవ్వుకుంటూ కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడి గా మిగిలిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పార్టీ కంటే తానే ఎక్కువ అనుకుని వేరే పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తే ఫలితం ఏమైందో అందరికీ తెలుసు. పార్టీ కంటే తాను పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరు. అదే నిజమైతే దేశంలో పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులే గెలుస్తారు. సీఎం రేవంత్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి మనసులు కలిసినంత మాత్రాన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కలిసి పనిచేస్తాయని అ నుకోవడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం. చేవెళ్లలో కాంగ్రెస్‌కు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదు. పార్టీలో సొంతంగా అభ్యర్థులు లేని కాంగ్రెస్.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలుపొందడం అసాధ్యం’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 13న చేవెళ్లలో భారీ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవా రం తెలంగాణ భవన్లో జరిగిన భేటీలో సభ ఏర్పాట్లు, జన సమీకరణ తదితరాలపై కేటీఆర్ చర్చించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత బీఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నిర్ణయించారు. కాగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో ఈ నెల 29న తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. బుధవారం కేటీఆర్ అధ్యక్షతన జరిగిన భేటీలో పార్టీ చేవెళ్ల అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, ఎగ్గె మల్లేశం, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, డాక్టర్ ఆనంద్, రోహిత్‌రెడ్డితోపాటు పార్టీ నేతలు కార్తీక్ రెడ్డి, శ్రీశైల్‌రెడ్డి పాల్గొన్నారు. ట్యాపింగ్ పేరుతో డైవర్ట్ చేస్తున్నారు రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం ‘పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఒక్క సీటు కూడా గెలవదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి మల్కాజిగిరిలోనే పోటీకి దిగుదాం రమ్మంటే నోరు మెదపలేదు. దమ్ముంటే పోటీ చెయ్.. ఇప్పటికీ నేను నా సవాల్‌కు కట్టుబడే ఉన్నా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారీ డైలాగులే తప్ప విషయానికి వస్తే పారిపోయే పిరికివాడు రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య కాదు. పదేళ్ల నిజానికి (బీఆర్ఎస్), వంద రోజుల అబద్ధానికి (కాంగ్రెస్), మరో పదేళ్ల విషానికి (బీజేపీ) మధ్యన జరుగుతున్నాయి. కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారిని చూసి ఎందరో వేదన చెందుతున్నారు. నాకూ తన్నాలనే ఉంది కానీ అంతకంటే బలమైన ఓటు దెబ్బతోనే గట్టిగా జాడించి తన్నాలి. ఆరు గ్యారంటీల అమలు చేతకాక ట్యాపింగ్‌లు, స్కాములు, స్కీముల పేరిట గారడీలు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. పది లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. లంగలవి, దొంగలవి, ఒకరిద్దరు లుచ్చాగాళ్లవి ట్యాప్ చేసి ఉండొచ్చు. అది పోలీసుల పని. హీరో నాగార్జున గ్రీకువీరుడైతే, ఈయన లీకు వీరుడు. ధైర్యముంటే లీకులు బంద్ చేసి మీరు చేసిన తప్పు ఇదీ అని చెప్పు. నువ్వే ముఖ్యమంత్రివి, ఎవరిని లోపల వేస్తావో వేయ్.. అంతేకానీ లేనిపోని మాటలెందుకు’ అని కేటీఆర్ అన్నారు. ఈటల ఇంకా బీఆర్ఎస్లో ఉన్నా అనుకుంటున్నడు ‘హుజూరాబాద్, గజ్వేల్‌లో ఓడిపోయిన ఈటల రాజేందరన్న తానింకా బీఆర్ఎస్లో ఉన్నా అను కుంటున్నడు. రైతులకు రుణమాఫీ ప్రకటిస్తే ఇప్పుడు పోటీ నుంచి తప్పుకుంటా అంటున్న డు. మల్కాజిగిరిలో వేరే పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారు కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచి వెళ్లినవారే. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి’ అని కేటీఆర్ చెప్పారు. కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు తలసాని, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి జితేందర్ రెడ్డి.. రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీలోని చేరిన జితేందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి కంపెనీల బాగోతం బయటపెడుతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందర్రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారినవారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీటు ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు.. లేదంటే లేనట్లా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీటిచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచింది.. లేకుంటే మంచిది కాదు. ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా?. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పార్టీకి క్షమాపణలు చెప్పాలి. బీజేపీ తప్ప.. ఏ పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరం. ఏ రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీ, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పార్టీ మారి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేశారు. బీజేపీపై ఈ వ్యాఖ్యలు పొరపాటున వ్యాఖ్యానించారని భావిస్తున్నా. చేవెళ్ల ఎంపీతో ఉన్న వ్యాపార లావాదేదీలేంటి?. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్‌లో చేరి మల్కాజ్ గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లకు ఎంత ఖర్చు పెడాతారని చెప్పారు. మా పార్టీలో చాలారోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడంలేదు. ఈస్ట్రన్, వెస్ట్రన్, సదరన్ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలేవి?. సర్వే నంబర్ 343లో ఉన్న ప్రభుత్వ భూమిఎంత? ఎన్నిఫ్లోర్లు ఇవ్వాలి? ఎన్ని ఇచ్చారు?. కడితే ఎంత ఖర్చవుతుంది.. అమ్మితే ఎంత వస్తుంది?. గత ప్రభత్వ హయాంలో ఏం చేశారు.. ఈ ప్రభుత్వంలో డబ్బులు ఎలా చేతులు మారుతున్నాయి. అసలు ఏరకంగా మీరిద్దరూ కలసి ఎన్నికలకు కమర్షియల్ చేయాలనుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలుగా గెలిచిన ఎంపీలందరిలో ఎక్కువ లబ్ధి పొందింది వారే. భూమికి భూమి ఎక్కడా ఇవ్వలేదు.. కానీ ఆయనకు మాత్రం ఇచ్చారు. 25 ఫ్లోర్లకు అనుమతులిస్తే.. 33 ఫ్లోర్లు అయ్యాయి. పీసీసీ హోదాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో గుట్టలు కొడతారా? గుడులు మింగుతారా? ఏఐసీసీకి లేఖ రాస్తామని? చర్యలు తీసుకుంటామని, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇలా జరిగేది కాదని అన్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేస్తున్నట్లు? జితేందర్ రెడ్డి,రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? కంపెనీల ప్రయోజనాలు ఏంటి?. ఎన్నికలకు మీరు పంపిచే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తోందనే వివరాలు ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో రెండో జాబితాలో కేవలం జితేందర్ రెడ్డి కుమారుడి ఒక్కరి పేరే వచ్చింది. అప్పుడు పార్టీకి సిద్ధాంతం ఉంది.. ఇప్పుడు లేదా?. షేక్‌పేటలోని సర్వే నంబర్ 403ఒక సంచలనం. అందులో ఎలా బ్లాస్టింగ్స్ అవుతున్నాయి.. వందల కోట్ల రూపాయలు ఎలా చేతులు మారాయనే అంశాలపై విచారణ జరగాలి. వారు చేసే అడ్డగోలు దందాపై ఈడీ, ఐటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా జితేందర్‌రెడ్డి వెంట్రుక కూడా కొనలేరని వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఇప్పుడున్న స్పీకర్ గతంలో ప్రెస్‌మీట్ పెట్టి బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రూ.500 కోట్ల స్కామ్‌లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరి ఆర్థిక నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వారు పంపించే డబ్బు సంచులతోనూ అప్రమత్తంగా ఉండాలి’ అని రఘునందన్ రావు అన్నారు. -
జంపింగ్‌లు షురూ
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగిన మరుసటి రోజే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడవకుండానే ఎమ్మెల్యేలు పార్టీ మారడం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పక్షాన గెలిచిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి గానీ, శాసనసభ్యత్వానికి గానీ రాజీనామా చేయకుండానే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇక నుంచి తన రాజకీయం ఏంటో చూపిస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వక భేటీ పేరిట కలిసినప్పటికీ ఇప్పటివరకు ఎవరూ పార్టీ మారలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీలోకి, నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే రావడంతో రాజకీయం రసకందాయంలో పడిందని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఏ క్షణమైనా, ఏమైనా జరగవచ్చనే ఆలోచనతోనే ఎమ్మెల్యేలను అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందని, ఆపరేషన్ ఆకర్‡్షకు ఇక మరింత పదును పెట్టే క్రమంలో గేమ్ స్టార్ట్ చేసిందని చెబుతున్నారు. టచ్‌లో 26 మంది? ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్షాన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆ సంఖ్య 38 అయ్యింది. అయితే వీరిలో మూడింట రెండొంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు, రంగారెడ్డి నుంచి ఇద్దరు, మేడ్చల్ నుంచి ఇద్దరు, కొత్తగూడెం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వీరంతా కాంగ్రెస్‌లో చేరతారా లేక మర్యాదపూర్వకంగానే కలిశారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అదే సమయంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే తాము అండగా నిలుస్తామని తనను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు ఈ రోజే గేట్లు తెరిచానని, అవతలివైపు ఎంతమంది ఉంటారో తనకు తెలియదంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠకు తావిస్తున్నాయి. నాటి బీఆర్ఎస్ తరహాలోనే! ఓటుకు కోట్లు వ్యవహారం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమై భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం లేకుండా ఉండేందుకు అనే కారణం చూపుతూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. అయితే అప్పటి నుంచీ ఈ వ్యవహారాన్ని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతూనే ఉంది. ఒక పార్టీలో గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కూడా గతంలో పలుమార్లు నిలదీశారు. పార్టీ మారిన వారిని ఉరి తీయాలంటూ ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్న ఓ నాయకుడు మాట్లాడుతూ ‘నాడు కేసీఆర్ సూత్రాన్నే మేం పాటిస్తున్నాం. మా కోట గోడలను పదిలం చేసుకుంటున్నాం. బలంగా చుట్టూ కంచె వేసుకుంటున్నాం. పార్లమెంటు ఎన్నికల తర్వాత డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని కొందరు, మూడు నెలల తర్వాత ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని మరికొందరు చేస్తున్న వ్యాఖ్య ల వెనుక ఆంతర్యం ఏంటో అందరికీ తెలిసిందే. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లకు ఫిరాయింపుల రాజకీయం అలవాటే. మా జాగ్రత్తలో మేం ఉండకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి దూకుడు రాజకీయం చేస్తున్నారు. వాళ్ల శాసనసభాపక్షం మా పార్టీలో విలీనం అవు తుందేమో?’అని వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం, మున్షీ సమక్షంలో చేరికలు బీఆర్ఎస్కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిలు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేశ్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో, రంజిత్‌రెడ్డితో కలిసి మొత్తం ముగ్గురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టయింది. కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు: రంజిత్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రంజిత్‌రెడ్డి తన రాజీనామా లేఖను పంపారు. కాగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రంజిత్‌రెడ్డి ‘ఎక్స్’లో తెలిపారు. ఇన్ని రోజులు చేవెళ్ల ఎంపీగా తనకు సేవలు చేసే అవకాశం కల్పించిన ప్రజలకు, కేసీఆర్, కేటీఆర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. -
బీఆర్ఎస్ కు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా
-
కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్సీ సమక్షంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్‌ను దానం నాగేందర్‌కు కాంగ్రెస్ ఖరారు చేసింది. కాగా, బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గుడ్ బై చెప్పారు. ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్.. ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా
సాక్షి,రంగారెడ్డి జిల్లా: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీకి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్‌కు లేఖ పంపించిన రజింత్‌రెడ్డి.. చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీఆర్ఎస్ను ఖాళీ చేయడమే టార్గెట్‌గా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్కి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గుడ్ బై చెప్పగా, ఇప్పటికే ఉమ్మడి జిల్లాల్లోని ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు ప్రకాష్ గౌడ్, యాదయ్య కలిశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మల్కాజిగిరి, మేడ్చల్ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి ఇటీవల కలిసిన సంగతి తెలిసిందే. చేవెళ్ల పార్లమెంట్ నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పట్నం సునీతా రెడ్డిని బరిలో దింపాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు సమాచారం -
చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అస్త్రసన్యాసం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అస్త్రసన్యాసం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేదిలేదని తెగేసి చెప్పారు. దీంతో గులాబీ అధిష్టానం పునరాలోచనలో పడింది. సిట్టింగ్ ఎంపీ పోటీకి వెనుక డుగు వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. ఆఖరికి ఎన్నికల వేళ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన నియోజకవర్గ నేతల సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలుత చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధిష్టానం.. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి మరోసారి బరిలో ఉంటారని ప్రకటించింది. కొన్నాళ్లు ఆయన ప్రచారం కూడా నిర్వహించారు. అనంతరం జరిగిన పరిణామాలు ఆయనను పునరాలోచనలో పడేశాయి. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరడం.. పలువురు దిగువశ్రేణి నాయకులు కారు దిగడం.. ఆత్మరక్షణలో పడేసింది. దీనికితోడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మోదీ హవా.. బీజేపీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించడం సైతం ఆయన వెనుకడుగుకు దారితీసింది. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకోవడం.. పైకి మాత్రం మర్యాదపూర్వకమేనని చెబుతున్నా.. అంతర్గతంగా కాంగ్రెస్‌కు సహకరిస్తారనే ప్రచారం కూడా రంజిత్‌ను గందరగోళంలోకి నెట్టింది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి పోటీకి దూరంగా ఉండడమే మేలనే అభిప్రాయానికి వచ్చిన ఆయన కొన్నాళ్లుగా మౌనముద్ర దాల్చారు. ఈ పరిణామాలతో ఆత్మరక్షణలో పడ్డ బీఆర్ఎస్ హైకమాండ్ రంజిత్ వెనుకడుగుతో ప్రత్యామ్నాయంగా పలువురు పేర్లను పరిశీలించింది. మొదట మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ పేరు పరిశీలించినా ఆయన నిర్ణయంపై స్పష్టత రాకపోవడంతో మాజీ మంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పేర్లు తెరమీదికి వచ్చింది. ఆయన కూడా ఆసక్తి చూపలేదని తెలిసింది. ఆ తర్వాత జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై మొగ్గు చూపింది. ఆయన కాకపోతే కనీసం కుమారుడు వీరేశ్నైనా రంగంలోకి దించాలని గులాబీ దళపతి భావించారు. దీనిపై కాసానితో సంప్రదించిన అధిష్టానం ఎట్టకేలకు ఆయ నను పోటీకి ఒప్పించింది. ఇదే విషయాన్ని సోమ వారం జరిగిన సమావేశంలో పార్టీ నేతలకు స్పష్టం చేసింది. నిధుల కోసమే కలిశాం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడంపై కూడా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. నియోజకవర్గం అభివృద్ధి నిధుల అంశంపైనే తామంతా సీఎంను కలవాల్సి వచ్చిందని.. ఇందులో రాజకీయ కోణం లేదని వారు వివరణ ఇచ్చినట్లు సమాచారం. సమావేశంలో మాజీ మంత్రి సబితారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్ సహా యువ నేతలు కార్తీక్‌రెడ్డి, కాసాని వీరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు
హైదరాబాద్: బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఫోన్లో బెదిరింపు ధోరణితో మాట్లాడిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 20న విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్ చేశారు. తమ పార్టీ సర్పంచ్‌తో ఎందుకు మాట్లాడుతున్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా దుర్భాషలాడటంతో పాటు తీవ్ర స్థాయిలో బెదిరించారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జీడీ ఎంట్రీ చేసి న్యాయ సలహా నిమిత్తం ఫిర్యాదు కాపీని కోర్టుకు పంపించారు. కోర్టు సూచనమేరకు ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎంపీ రంజిత్‌రెడ్డిపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోలీసు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజీత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇద్దరు నేతలు ఫోన్ సంభాషణలో దుర్భాషలాడుకున్నారు. తన మనుషులను ఎలా కలుస్తారని కొండాకు ఫోన్ చేసి ఎంపీ రంజిత్ ప్రశ్నించారు. దీంతో నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వాళ్లను తీసుకువెళ్లు అని కొండా స్పందించారు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో రచ్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డిపై మాజీ ఎంపీ కోండా విశ్వేశ్వరరెడ్డి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో రంజిత్‌రెడ్డిపై కొండా కంప్లైంట్ చేశారు. ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్లో తనను దూషించాడని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫిర్యాదు ఎవరు ఫోన్ చేశారో పేరు కూడా చెప్పానని అన్నారు.పెద్దల సలహా మేరకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఫోన్‌తో దూషిస్తూ, బెదిరింపులకు దిగాడని అన్నారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏం లేదని, అతనున బీఆర్ఎస్, తాను బీజేపీ అని అన్నారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. చదవండి: జనవరి కరెంట్ బిల్లులు కట్టకండి: తెలంగాణ ప్రజలకు కేటీఆర్ పిలుపు -
‘చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు’
సాక్షి,హైదరాబాద్: తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుండి కాంగ్రెస్, బీజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. విషయం ఏంటంటే? -
దమ్మూ ధైర్యముంటే నిరూపించండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎంపీలు ఖండించారు. దమ్మూ ధైర్యముంటే కేంద్రం ఈ విషయాన్ని నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వేల కోట్ల రూపాయలు కాదు.. ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్లు బీజేపీ నిరూపిస్తే రాజీనామాలు సహా దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పార్లమెంట్‌ను తప్పుదారి పట్టించారన్న బీఆర్ఎస్ ఎంపీలు, ఆయనపై చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చామన్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలు మీడియాతో మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎలాంటి లాభం లేకపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రధాని, హోంమంత్రిని కలిసి విన్నవించారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతో నిర్మించిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో అడిగిన ప్రశ్నోత్తరాల్లోనే ఒప్పుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు, నవోదయ విద్యాలయాల మంజూరు విషయంలోనూ జరిగిన నష్టాన్ని అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో దేశం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అంతేగాక కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును మాఫీ చేయాలన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల గురించి మాట్లాడేటప్పుడు రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. -
కేసీఆర్ అప్పుడు మాటిచ్చాడు.. ఇప్పుడు నెరవేర్చాడు GO 111 రద్దుపై హర్షం వ్యక్తం చేసిన రంజిత్ రెడ్డి
-
కనులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ. రంజిత్‌రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సూసైడ్ చేసుకునేవాడినంటూ బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: 2018లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే సేవనో క్లాక్ బ్లేడ్‌తో గొంతు కుసుకుంటానని చెప్పి వార్తల్లో నిలిచిన సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్.. తాజాగా తాను సూసైడ్ చేసుకునే వాడినని కామెంట్ చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే తాను చనిపోయే వాడినని అన్నారు. ఎన్నో విధాలుగా తనకు అండగా నిలిచిన ‘నా అన్న, నా దేవుడి వెంట ఎప్పుడూ ఉంటా’.. రాజకీయాలు పక్కనపెట్టి రంజిత్ రెడ్డి కోసం పనిచేస్తానని బండ్ల గణేష్ అన్నారు. చదవండి: కాల్ గర్ల్ కోసం వెతికి వెతికి.. అడ్డంగా బుక్కయ్యాడు కాగా, కాంగ్రెస్ తరఫున 2018లో ప్రచారం చేసిన బండ్ల గణేష్.. ‘‘2018, డిసెంబర్ 11 ఉదయం 11 గంటల తర్వాత నా ఇంటికి రండి. వచ్చేటప్పుడు సేవనో క్లాక్ బ్లేడ్ తీసుకురండి. ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోతే.. బ్లేడ్‌తో నా పీక కోసుకుంటా. ఇదే నా ఛాలెంజ్. హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటారో" అంటూ బండ్ల గణేష్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మహా కూటమి ఓటమి పాలైంది. సినీ నిర్మాతగా గుర్తింపు పొందిన ఆయన.. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పాలిటిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక తాను ఏ పార్టీలోనూ చేరబోనని ప్రకటించారు. -
తెలంగాణ మెట్రో కారిడార్‌కు రూ.8,453 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: 2017 మెట్రో రైల్ పాలసీలో భాగంగా 50:50 ఈక్విటీ షేర్ పద్ధతిలో రూ.8,453 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరినట్లు కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. మెట్రోకారిడార్ సాయం ఏమైందని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదేవిధంగా రాయదుర్గం స్టేషన్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు రూ.6,105 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెట్రో ప్రాజెక్టు విషయం కూడా తమ దృష్టిలో ఉందని తెలిపారు. ఎన్‌హెచ్–65లో 6 లేన్లు అవసరం లేదు ప్రస్తుతం నందిగామ సెక్షన్లో నాలుగు లేన్లు సరిపోతాయి లోక్‌సభలో ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌ల ప్రశ్నలకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు ఇచ్చారు. ఎన్‌హెచ్-65లో 6 లేన్లు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: హైదరాబాద్–విజయవాడ ఎన్‌హెచ్-65పై నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు.. -
సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్) -
బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలంపై రాష్ట్ర ఎంపీలు బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయా లని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కే బొగ్గు బ్లాకులు కేటాయించాలని కోరారు. లోక్‌సభలో సింగరేణి అంశాన్ని ‘అత్యవసర’ అంశంగా లేవనెత్తిన ఉత్తమ్.. కల్యాణ ఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్– 3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి బ్లాకులను వేలం వేయడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఈ బొగ్గు బ్లాకులు 100 ఏళ్ల నాటి ప్రభుత్వరంగ బొగ్గు గనుల సంస్థ ఎస్సీసీఎల్కు చెందిన ప్రస్తుత బొగ్గు గనులతో కలసి ఉన్నాయన్నారు. మోదీ ప్రైవేటీక రణ చేయబోమని హామీ ఇచ్చారని, అయినా కేంద్ర ప్రభుత్వం వేలం వేసేందుకే ముందుకు వెళుతోందన్నారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ భవిష్యత్తును దెబ్బతీస్తోందని మండిపడ్డారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్‌పరం చేస్తోంది సింగరేణిని ప్రైవేటీకరించబోమని చెప్పిన ప్రధాని, ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దక్కకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి నామా మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని విమర్శించారు. సింగరేణికి సంబంధించి కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణనే తీసుకుంటుందని నామా అన్నారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని పేర్కొన్నారు. రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ, సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నప్పటికీ.. విధానపరమైన నిర్ణయాలను మాత్రం కేంద్రమే తీసుకుంటోందన్నారు. కొత్త బ్లాకులను రాష్ట్ర ప్రభు త్వానికే కేటాయించాల్సిందిగా కోరామని అన్నారు. ఆరోపణలు నిరాధారం: కేంద్ర మంత్రి జోషి సింగరేణి ప్రైవేటీకరణ అంశంపై తెలంగాణ ఎంపీల ఆరోపణలు నిరాధారమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్ర ఎంపీల ఆరోపణల నేపథ్యంలో లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. సింగరేణి కాలరీస్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51% ఉండగా, 49% వాటా కలిగిన కేంద్రం సింగరేణిని ప్రైవేటీకరణ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అయితే గనుల వేలం విష యంలో కేంద్రం.. ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం –1957 నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటోందన్నారు. తెలంగాణలో కళ్యాణఖని బ్లాక్–6, కోయగూడెం బ్లాక్–3, సత్తుపల్లి బ్లాక్–3, శ్రావణపల్లి గనుల వేలం ప్రక్రియలో సింగరేణితో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా పాల్గొనవచ్చని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లోక్‌సభలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, వెంకటేశ్ నేత అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పలు అంశాలను ప్రస్తావించారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేసి, వాటిని ఎస్సీసీఎల్కు కేటాయించాలని తెలంగాణ అభ్యర్థించినా.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న విధానం ప్రకారం బొగ్గు విక్రయానికి అన్ని కోల్ బ్లాకులను వేలం పద్ధ తిలోకి తెచ్చామన్నారు. గనుల వేలం ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్రాలకే వెళుతుందని, బొగ్గు కుంభకోణాల్లో ఉన్నవాళ్లే పారదర్శక వేలం పద్ధతిని వ్యతిరేకిస్తున్నారని మంత్రి విమర్శించారు. -
ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి?: రంజిత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే బీజేపీ నాయకులు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడుతుండటాన్ని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి తప్పుపట్టారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగానే జరుగుతోందని తెలిపారు. బీజేపీకి తొందరపాటు ఎందుకు?. ఈసీ ఎవరి చేతిలో ఉంటుంది?. ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. 'కౌంటింగ్‌కు కేంద్రం నుంచి అబ్జర్వర్ వస్తారు. వాళ్ల ఆధీనంలోనే కౌంటింగ్ జరుగుతుంది. బీజేపీ ఎన్ని డబ్బులు పంచినా, ఎంత మందు పోసినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం. బీజేపీ నాయకులు అనవసరంగా మాట్లాడుతున్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు బీజేపీ నేతలు ఆగలేరా?. ఖర్చు పెట్టి ఓడిపోతున్నామనే భయంలో ఏదేదో మాట్లాడుతున్నారని' టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. చదవండి: (Munugode Results: అందుకే ఫలితాలు ఆలస్యమవుతున్నాయి: వికాస్‌రాజ్) -
కేంద్రమే కొనాలి..
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాలనుకున్నా.. కేంద్ర వైఖరి ఏమాత్రం మారలేదని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి విమర్శించారు. అందుకే కేంద్రంతో తేల్చుకొనేలా ఢిల్లీలో దీక్ష చేపట్టామన్నారు. ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి ఏమాత్రం లేదని, కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవన్నారు. ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వరి దీక్ష ఏర్పాట్లను శనివారం టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అహంకారంతో మాట్లాడారని.. ఇటీవల పార్లమెంటును కూడా తప్పుదోవ పట్టించారని రంజిత్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. రైతుల కష్టాలను చూపేందుకే: కేకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతుల కష్టాలను చూపించడానికే ఢిల్లీలో ధర్నా చేపట్టామని ఎంపీ కె.కేశవరావు తెలిపారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ గొంతుపై కత్తిపెట్టి బాయిల్డ్ రైస్ పంపించొద్దని ఒప్పందం చేయించుకుందని ఆరోపించారు. ప్రత్యామ్నాయ పంటలు వచ్చేవరకు ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలన్నారు. ధాన్యం కొనేవరకు వదలం: నామా కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష కట్టిందని, ధాన్యం కొనే వరకు కేంద్రాన్ని వదిలే ప్రసక్తి లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎలా కాపాడుకోవాలో సీఎం కేసీఆర్‌కి తెలుసని, ధాన్యం సేకరణ కోసం చివరివరకు పోరాడుతామని చెప్పారు. రాష్ట్రప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. ఢిల్లీలో లొల్లికి రెడీ! యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 11న ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. అక్కడి తెలంగాణ భవన్లో కేసీఆర్, కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో వరి దీక్ష ప్రాంగణం ముస్తాబవుతోంది. శనివారం దీక్షాస్థలాన్ని టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, మరికొందరు రాష్ట్ర నేతలు పరిశీలించారు. వేదిక, టెంట్లు, బారికేడ్లు, సీటింగ్, భోజనం, ఇతర వసతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఢిల్లీలో ‘ఒకే దేశం.. ఒకే ధాన్యం సేకరణ’అంటూ టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన హోర్డింగులు, పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. -
దమ్ముంటే చేవెళ్ల నుంచి పోటీ చెయ్: రంజిత్‌రెడ్డి
పరిగి: ‘దమ్ముంటే రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చెయ్. నేనూ ఇక్కడి నుంచే పోటీ చేస్తా. నువ్వో నేనో తేల్చుకుందాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి సవాలు విసిరారు. వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘మన ఊరు– మన పోరు’లో రేవంత్‌రెడ్డి తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ... ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మె ల్యే మహేశ్‌రెడ్డి పరిగిలో మీడియా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘అవును నా వ్యాపారం పౌల్ట్రీ. గుడ్లు అమ్ముకుంటే తప్పేముంది. చేవెళ్ల ఏ ప్రభుత్వం హయాం లో అన్ని విధాలుగా అభ్యున్నతి సాధించిందో చర్చ చేద్దాం’ అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గొప్పగా రూపొందించారని తెలిపారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో ఉన్న రేవంత్, ఎంపీ, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కాం గ్రెస్ హయాంలో ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. దేవుని మాన్యాల కబ్జా లను నిరూపించాలన్నారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భారత విద్యార్థులకు భరోసా ఇవ్వండి: కేటీఆర్
విపత్కర పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చూడాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయని, ఉక్రెయిన్‌లోని భారతీయులను కాపాడేందుకు దౌత్య మార్గాల ద్వారా చర్యలు చేపట్టాలని కోరారు. ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటూ టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి విదేశాంగ శాఖకు లేఖ రాశారు. కాగా.. సికింద్రాబాద్ మైలార్‌గడ్డకు చెందిన మెడికో అనీల ఉక్రెయిన్‌లో చిక్కుకుందని, క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె తండ్రి మనోహర్‌బాబు మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మారావులను కలిసి విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీలో ఒకమాట.. రాష్ట్రంలో ఒకమాట
సాక్షి, న్యూఢిల్లీ: ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో రెండోరోజూ ఆందోళనను కొనసాగిం చారు. మంగళవారం సభ మొదలవగానే ధాన్యం సేకరణపై కేంద్రం విధానాన్ని తప్పుబడుతూ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, రాములు, దయాకర్, నేతకాని వెంకటేశ్ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. స్పీకర్ ఓం బిర్లా కోరినా వాళ్లు వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గం.కు ఆయన వాయిదా వేశారు. మరో రెండుసార్లు సభ వాయిదా తర్వాత మొదౖ లెనా ఎంపీల ఆందోళన చేయడంతో మాట్లాడేందుకు నామాకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. నామా మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కేంద్రం ధాన్యం కొనుగోలు చేయట్లేదు. కొనుగోళ్లపై ఢిల్లీలో ఒకమాట, రాష్ట్రంలో మరో మాట చెబుతోంది. దీనిపై ప్రకటన చేయాలి’ అని కోరారు. కేంద్రం నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను స్పీకర్ బుధవారానికి వాయిదా వేశారు. తర్వాత ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేప ట్టారు. తెలంగాణభవన్‌లో ఎంపీలు మాట్లాడారు. చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల అంశం పై మాట్లాడేందుకు కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే తన చాంబర్లో నిర్వహించిన విపక్ష పార్టీ నేతల భేటీకి 15 పార్టీల నేతలు హాజరయ్యారు. టీఆర్ఎస్ కూడా హాజరైంది. భేటీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ పక్కనే కూర్చొని ఎంపీల సస్పెన్షన్‌పై తన అభిప్రాయం చెప్పారు. సస్పెన్షన్ ఎత్తేసేలా ఒత్తిడి చేయాలన్న కాంగ్రెస్ వినతికి మద్దతిచ్చారు. తర్వాత విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలపగా కేకే హాజరయ్యారు. రాజ్యసభ మొదలయ్యాక విపక్ష సభ్యులతో కలిసి టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ కూడా చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీని, కేంద్రంలోని ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ తూర్పారపడుతున్న సమయంలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి టీఆర్ఎస్ ఆందోళనలో పాల్గొనడం ఢిల్లీలో చర్చనీయాంశమైంది. -
ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు ఆపద్బాంధవుల్లా ఆదుకున్నారు..
ఆ ముగ్గురు ప్రజాప్రతినిధులు మూడు ప్రమాద ఘటనల్లో బాధితుల పట్ల ఆపద్బాంధవులయ్యారు. బుధవారం చోటుచేసుకున్న ఆయా ఘటనల్లో క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందేలా చేశారు. హకీంపేట వద్ద మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బైక్ అదుపు తప్పి కింద పడి గాయపడ్డారు. అటుగా వస్తున్న మంత్రి కేటీఆర్.. వారిని తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి పంపించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ దంపతులు, చిన్నారి ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డారు. ఆ మార్గంలో వెళ్తున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. గాయపడిన చిన్నారికి సపర్యలు చేశారు. క్షతగాత్రులను తన కారులోనే ఆస్పత్రికి తరలించారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్తుండగా.. మల్కాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు– ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలోని ఐదుగురు గాయపడగా, రంజిత్‌రెడ్డి ఘటన స్థలానికి వెళ్లి.. ఫోన్‌చేసి అంబులెన్స్‌ను రప్పించి, క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధితులు వికారాబాద్ జిల్లా బందీపూర్‌వాసులు. -
వృద్ధ గోవులకు పింఛను
పూడూరు: గోమాత రక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామ గుండం రామలింగేశ్వరాలయాన్ని మంగళవారం సందర్శించారు. అనంతరం పూడూరుకు చెందిన 20 వృద్ధ గోవులకు రూ.500 చొప్పున పింఛను అందజేశారు. అమృంతగమయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్యానందస్వామి సౌజన్యంతో గోవుల రక్షణ కోసం యజమానికి ప్రతినెలా500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.375తో బీమా చేయించామని, ఆ గోవు మరణిస్తే రైతుకు రూ.35 వేల బీమా అందుతుందని స్పష్టం చేశారు. -
మోదీపై టీఆర్ఎస్ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్కు చెందిన చేవెళ్ల లోక్‌సభ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన తప్పల కంటే బీజేపీ ప్రభుత్వం ఘోర తప్పిదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్యూడల్‌గా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని, కరోనా వైరస్‌ను ఎదుర్కొవడంలో మోదీ సర్కార్ తీవ్రంగా విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వ తప్పిదాలను రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నిలదీస్తామని రంజిత్ రెడ్డి చెప్పారు. కాగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై ఏడాదిపూర్తి అయిన సందర్భంగా ప్రగతి నివేదన కార్యక్రమంతో ఎంపీ రంజిత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ప్రజాసేవ చేస ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నా అని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. ఈ సందర్భంగా రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వం కావాలని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో అన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. వైద్య విద్య ఉపాధి కల్పించలేక ఇంకా ఎన్నాళ్ళు దేశ ప్రజలను మోసం చేస్తారు. లాక్డౌన్ ప్రకటించే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని చేర్చే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు. కోవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ 20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు. హెలికాప్టర్ మినీ అని సీఎం కేసీఆర్ చెబితే కనీసం పట్టించుకోలేదు. మోదీ ఇన్ని సార్లు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. కానీ సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎంలోన్ పరిమితి పెంచడానికి రాష్ట్రాలకు నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలను న్యాయం చేయడం లేదు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు. వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంను నిలదీస్తాం. స్థానిక బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి కేంద్రం నుంచి తెచ్చే నిధులు గురించి కొట్లాడాలి’ అని అన్నారు. -
బడ్జెట్‌పై తెలంగాణ ఎంపీల అసహనం
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హామీలకు బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్ కారిడర్ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు. మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్లో హర్ ఘర్ జల్ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు. చెవెళ్ల ఎంపీ, రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు. -
స్నేహితులున్నవారు జీవితంలో ఓడిపోరు
సాక్షి, చేవెళ్ల: ‘స్నేహితుల విలువ వెల కట్టలేనిది. స్నేహితులు ఉన్న వారు జీవితంలో ఓడిపోరు. అది నా జీవితంలో జరిగింద’ని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆయన తన ప్రాణ స్నేహతుడి గురించి ‘సాక్షి’తో పంచుకున్నారు. నా జీవితంలో స్నేహితుడు తిరుపతిరెడ్డిది ప్రత్యేక స్థానం. డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ , తిరుపతిరెడ్డి అంటే ఒక్కటే అన్నట్లుగా మా స్నేహం గురించి అందరికీ తెలుసు. వేరువేరు కుటుంబాలుగా ఉన్నా ఇద్దరం ఒక్కటే. మా ఇద్దరి పిల్లలు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. వరంగల్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో కలిశాం. రాజేంద్రనగర్‌లోని వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ డాక్టర్లుగా విద్యాభ్యాసం చేసి 3వేల రూపాయలకు ఉద్యోగం చేశాం. కలిసి చదువుకున్నాం. కలిసి ఉద్యోగం చేశాం. కలిసి వ్యాపారం ప్రారంభించి పౌల్ట్రీ రంగంలోనే నెంబర్ వన్‌స్థానానికి ఎదిగాం. ఇప్పటికీ మేము కలిసే ఉంటున్నాం. సమయం ఉన్నప్పుడు ఫ్యామిలీలు కలిసి టూర్లకు వెళ్తాం. కలిసే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం. మా స్నేహం గురించి కేటీఆర్‌కు, ఈటల రాజేందర్ తదితర రాజకీయ ప్రముఖలకు సైతం తెలుసు. వ్యాపారం నుంచి నేను రాజకీయాల్లోకి వస్తున్న విషయం కూడా ముందుగా మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ తరువాతే నేను రజకీయాల్లోకి వచ్చాను. ఎప్పటీకీ మా స్నేహం ఇలాగే ఉంటుంది. అందుకే స్నేహితుల విలువ వెలకట్టలేనిది అన్నారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. -
రాజకీయాల్లోకి వస్తానని అనుకోలేదు
ఆయన వెటర్నరీ డాక్టర్ ఉద్యోగం చేస్తూ పౌల్ట్రీ వ్యాపారం ప్రారంభించారు. దినదినాభివృద్ధి చెందుతూ అదే వ్యాపారంలో దేశంలోనే 5వ స్థానానికి చేరుకున్నారు. ఇంటర్ నుంచి కలిసి చదువుకున్న స్నేహితుడితో వ్యాపారం ఆరంభించి అగ్రశ్రేణికి ఎదిగారు. వ్యాపారంలో బాగా రాణించి ఉన్నతంగా స్థిరపడాలనే ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఆయనే.. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి. కష్టాన్ని నమ్ముకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నానని, తమ వ్యాపారం దేశంలోనే గుర్తింపు పొందడం తృప్తినిచ్చిందని రంజిత్‌రెడ్డి చెప్పారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఏనాడూ అనుకోలేదని, పౌల్ట్రీ రంగం నుంచి పార్లమెంట్లో అడుగుపెడతానని ఊహించలేదని అన్నారు. రంజిత్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుటుంబ, వ్యాపార విశేషాలను వివరించారు. చేవెళ్ల: మా నాన్న స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని గొల్లపల్లి గ్రామం. మా తాతకు అప్పట్లో వంద ఎకరాల భూమి ఉంది. మా నాన్న రాజారెడ్డిని వ్యవసాయం చేసుకోవాలని చెబితే.. చదువుకుంటానని వరంగల్‌కు వచ్చి పాలీటెక్నిక్ చేశారు. ఇంజనీర్ ఉద్యోగం చేస్తూ వరంగల్‌లోనే స్థిరపడిపోయారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. మేము వరంగల్‌లోనే జన్మించాం. మా అమ్మానాన్నలకు నలుగురు సంతానం రాజ్యలక్ష్మీ, రవీందర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి. నేను ఇంటర్ వరకు వరంగల్‌లోనే చదువుకున్నా. ఆ తరువాత రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యునివర్సిటీలో బీవీఎస్సీ పూర్తి చేసి వెటర్నరీ డాక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. కష్టాన్ని నమ్ముకుని వ్యాపారంలో నంబర్ వన్‌గా నిలిచాం బీవీఎస్సీ పూర్తిచేసిన తరువాత స్నేహితుడు తిరుపతిరెడ్డి నేను ఇద్దరం రూ.3వేలకు ఉద్యోగం చేశాం. వరంగల్‌లో ఇంటర్ చదువుతున్నప్పటి నుంచి ఇద్దరం స్నేహితులం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసే ఉన్నాం. వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో పౌల్ట్రీ వ్యాపారం చేయాలనే ఆలోచన వచ్చింది. మేము ఇద్దరం కలిసి రూ.5లక్షల పెట్టుబడితో 1996లో వ్యాపారం ప్రారంభించాం. ఎస్ఆర్ హేచరీస్ పేరుతో ప్రారంభించిన మా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. పౌల్ట్రీ ఫీడింగ్, కోడిపిల్లల అమ్మకం రెండింట్లో దేశంలోనే టాప్ 5వ స్థానంలో నిలిచాం. 8వేల కోళ్లతో ప్రారంభించి 5లక్షల కోళ్ల వరకు పెంచాం. రోజుకు 2లక్షల చికెన్(కోళ్లు), 15లక్షల గుడ్ల ఉత్పత్తి, 35వేల టన్నుల ఫీడ్‌ను అందించే స్థాయికి మా వ్యాపారం అభివృద్ధి చెందింది. పిల్లల బాధ్యత నా భార్యదే.. 1992లో వరంగల్‌కు చెందిన సీతారెడ్డితో నాకు వివాహం జరిగింది. వ్యాపారంలో ఎంత బీజీగా ఉన్నా ఫ్యామిలీకి వీలైనంత సమయం కేటాయిస్తాం. నేను, నా స్నేహితుడు తిరుపతిరెడ్డి కుటుంబాలతో కలిసి సమయం దొరికినప్పుడల్లా విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటాం. వ్యాపారంలో బాగా రాణించి ఉన్నతంగా స్థిరపడాలనేదే లక్ష్యంగా ఉండేది. వివాహం చేసుకున్న మొదట్లో నేను, నా స్నేహితుడు ఇద్దరం రూ.3 వేలకు ఉద్యోగం చేసే వాళ్లం. మాకు వచ్చే జీతానికి ఒక్కరే సంతానం చాలు అనుకున్నాం. దీంతో నాకు, తిరుపతిరెడ్డికి మొదటి సంతానంగా కూతుళ్లు పుట్టారు. ఇక చాలు అనుకున్నాం. కానీ, వ్యాపారం ప్రారంభించిన తరువాత బాగా రాణిస్తున్న సమయంలో మరో సంతానం ఉంటే బాగుంటుందని ఆలోచించాం. ఆ తరువాత కుమారుడు రాజాఆర్యారెడ్డి జన్మించాడు. నా భార్య సీతారెడ్డి డిగ్రీ వరకు చదువుకుంది. వ్యాపారంలో నేను బీజీగా ఉంటుండడంతో పిల్లల బాధ్యత మొత్తం ఆమే చూసుకునేది. కుటుంబ నిర్వహణ మొత్తం ఆమెదే. కూతురు పూజాఆకాంక్షకు ఇటీవల వివాహం చేశాం. అల్లుడు డాక్టర్ రాజేశ్‌రెడ్డి, కూతురు పూజా ఆకాంక్ష ఇద్దరూ ఫార్మా వ్యాపారంలో ఉన్నారు. కుమారుడు రాజాఆర్యా అమెరికాలో చదువుకుంటున్నాడు. పిల్లలు సెటిల్ అవుతుండటంతో ఇప్పుడు సీతారెడ్డి సోషల్ సర్వీస్‌పై ఎక్కువగా దృష్టి సారించింది. వ్యాపారానికి పుల్‌స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి.. వ్యాపారంలో బాగా రాణించా. రూ.1200 కోట్ల టర్నోవర్ వరకు వెళ్లిన మా వ్యాపారాన్ని ఏడాది క్రితం ఓ ఇంటర్నేషనల్ కంపెనీ టేకోవర్ చేసింది. నేను చేసే పౌల్ట్రీ ఫీడ్ వ్యాపారం మొత్తం అమ్మేశాను. నా స్నేహితుడు కోడిపిల్లల వ్యాపారం చూసుకుంటున్నాడు. నేను వ్యాపారం మానేసిన తరువాత ఇప్పుడు సమయం ఉంటుందని వెళ్లి కేసీఆర్ సార్‌ను కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని అడిగా. రాజకీయాల్లోకి వచ్చిన నాకు రామన్న(కేటీఆర్) ఎంపీగా అవకాశం కల్పించారు. 2004 నుంచి మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రాంమోహన్ మేమంతా ఒక గ్రూప్‌గా ఉండేవాళ్లం. ఈటల రాజేందర్ నేను కలిసి ఉండేవాళ్లం. ఈటలకు పౌల్ట్రీ ఉండటంతో నేను డాక్టర్‌గా పనిచేసేవాడిని. దీంతో వ్యాపారంలో మంచి స్నేహితులం అయ్యాం. రాజకీయాల్లో రాజేందర్ మొత్తం వ్యవహారం నేనే చూసేవాణ్ని. బాగా కష్టపడి గెలిపించుకున్నాం. అప్పటి నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నా. బిజినెస్‌పరంగా బాగా సెటిల్ అయిన తరువాత ప్రత్యక్షంగా వచ్చేందుకు ఆలోచిద్దామని అనుకున్నా. వ్యాపారం మానేయడంతో ఇప్పుడు సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చా. నన్ను ఆదరించి గెలిపించిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తా. కేసీఆర్ సార్ ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. -
డజన్ కొత్త ముఖాలు
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల ఫలితాల్లో పన్నెండు మంది అభ్యర్థులకు అదృష్టం కలిసొచ్చింది. పోటీచేసిన తొలిసారే పార్లమెంటులో అడుగిడే అవకాశం ల భించింది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా కొత్త వారే విజయం సాధించారు. ఇందులో ముగ్గురు మాజీ మంత్రులు, నలుగురు మాజీ ఎమ్మెల్యేలున్నారు. టీఆర్ఎస్ నుంచి గెలిచినవారిలో మన్నెం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్‌నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్), బి.వెంకటేశ్ నేత (పెద్దపల్లి), పోతుగంటి రాములు (నాగర్‌కర్నూలు), డాక్టర్ రంజిత్‌రెడ్డి (చేవెళ్ల) ఉన్నారు. ఊహించ ని విధంగా పార్లమెంట్ పోరులో నిలబడ్డ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (నల్లగొండ) జయకేతనం ఎగురవేయగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), రేవంత్‌రెడ్డి (మల్కాజిగిరి) చివరి రౌండ్ వరకు ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ విజయం సాధించారు. సుదీర్ఘకాలం తర్వాత ఒంటరిగా పోటీచేసిన బీజేపీ అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. ఆ పార్టీ నలుగురు విజేతలూ మొదటిసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసినవారే కావడం విశేషం. గంగాపురం కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), సోయం బాపురావు (ఆదిలాబాద్), ధర్మపురి అరవింద్ (నిజామాబాద్), బండి సంజయ్ (కరీంనగర్) ఉన్నారు. వీరిలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రాములు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించారు. కాగా, రేవంత్, కవిత, బాపురావు, కిషన్‌రెడ్డిలు గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఐదుగురు పాతకాపులే! ఐదుగురు పాతకాపులకు ఓటర్లు మళ్లీ పట్టం కట్టారు. గతంలో ఎంపీలుగా ప్రాతినిథ్యం వహించిన వారికి మరోసారి అవకాశం కల్పించారు. అసదుద్దీన్ ఓవైసీ (హైదరాబాద్), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), పసునూరి దయాకర్ (వరంగల్), బీబీ పాటిల్ (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్)లు తాజా ఎన్నికల్లోను విజయఢంకా మోగించారు. -
ఓటర్లు ఎవరిని కరుణిస్తారో..
సాక్షి, వికారాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఓటర్లు తీర్పు చెప్పడమే మిగిలి ఉంది ఉంది. పదిహేను రోజులుగా ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థులు తమ రాజకీయ భవిష్యత్తును ప్రజల చేతిలోపెట్టి మైకులు బంద్ చేశారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం 5గంటలకు ఎన్నికల ప్రచారం ముగించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్‌షోలు నిర్వహించాయి. ఆయా పార్టీల అగ్రనేతలు తరలివచ్చి రాజకీయాన్ని వేడెక్కించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోరుగా ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే చేసే పనులను ప్రజలకు వివరించారు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని హామీలు గుప్పించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తదిరతులు వచ్చి తమ పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. 15 రోజులుగా మోతమోగిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. చివరిరోజున అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డిని గెలిపించాలంటూ కోరుతూ మహేందర్‌రెడ్డి పట్టణంలో ప్రచారం చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతుగా తాండూరులో ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బి.జనార్దన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిగిలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు చివరిరోజు గ్రామాల్లో ప్రచారం చేశారు. వ్యూహాలకు పదును... లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లపైనే భారం వేశారు. గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లు ఎవరికి మద్దతు ఇస్తారోననే ఉత్కంఠ ప్రధాన పార్టీల్లో నెలకొంది. పోలింగ్‌కు కొద్ది గంటల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గెలుపు వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతు కూడగట్టేందుకు ఎంపీ అభ్యర్థులు రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బి.జనార్దన్‌రెడ్డి తెరవెనుక జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజార్టీ ఓట్లు తమకు దక్కేలా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. ప్రలోభాలు షురూ.. ఎన్నికల సమయం ముంచుకొస్తుండటంతో ఆయా పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. గెలుపు కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.వికారాబాద్‌లోని రాజీవ్‌నగర్‌లో నిర్వహించిన పోలీసుల తనిఖీల్లో రూ.కోటియాభై లక్షల నగదు పట్టుబడటం సంచలనం రేపింది. ఈ డబ్బు పోస్టల్‌శాఖకు చెందినగా తెలిసింది. వికారాబాద్ నుంచి తాండూరుకు తరలిస్తుండగా పోలీసులు తమ డబ్బును పట్టుకున్నట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. -
చేవెళ్ళ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి - లీడర్‌తో
-
కోట్లు.. ఓట్లయ్యేనా..!
సాక్షి, తాండూరు: ఒకరేమో దేశంలో ఉన్న రాజకీయ పార్టీ నేతల్లో అందరికంటే ధనవంతుడు..మరొకరు శ్రమతో కోటీశ్వరుడు..ఇద్దరిది వ్యాపారమే.. ఒకరు సాఫ్ట్వేర్ రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మరొకరు పాల్ట్రీ పరిశ్రమ దిగ్గజం, చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి. ఇద్దరు శ్రీమంతుల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్‌లో గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటుంటే.. కేసీఆర్ చరిష్మాతో తాను విజయం సాధిస్తానని «టీఆర్ఎస్ అభ్యర్థి అంటున్నారు. ఇద్దరి రాజకీయ బలాబలాలు ఎలా ఉన్నా... ఇద్దరు శ్రీమంతుల వద్ద ఉన్న కోట్లు.. ఓట్లుగా మారుతాయా అనేది ప్రస్తుతం హట్ టాపిక్‌గా మారింది. ఎంపీగా నామినేషన్ వేసే ముందు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాదాపు రూ.800 కోట్ల ఆస్తి విలువను చూపించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి ఎన్నికల నామినేషన్ వేసే ముందు రూ.180కోట్ల ఆస్తి విలువను ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చారు. దీంతో ఇద్దరు శ్రీమంతుల మధ్య ఎన్నికల వేడి రసవత్తరంగా సాగుతోంది. ఓట్లు రాబట్టుకోవడంలో ఎవరు సఫలమవుతారు..? ఇద్దరు కోటీశ్వరుల మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఓటర్ల నుంచి ఓట్లు ఎవరు రాబట్టుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీ రంజిత్‌రెడ్డికి ప్రభుత్వ సానుకూలత బాగా పనిచేస్తుంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కుటుంబ రాజకీయ చరిత్రతో పాటు స్థానికత అనే అంశం కలిసొచ్చేలా ముందుకు వెళ్తున్నారు. స్థానికంగా మంచి వ్యక్తిగా ముద్ర పడ్డ కొండా ఓట్లను రాబట్టుకుంటారా లేకా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనంలో చతికిలా పడతారా అనేది వేచి చూడాల్సిందే. -
చేవెళ్ల ఆశాకిరణం డాక్టర్ రంజిత్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో కూడా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నారు. తమ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చిన ఆయన.. అనూహ్యంగా పది మంది కొత్త అభ్యర్థులకు స్థానం కల్పించారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఉన్నత విద్యనభ్యసించి వ్యాపారవేత్తగా ఎదిగిన ఆయన.. తన ప్రజాసేవను మరింత విస్తృతం చేసేందుకు ఎంపీగా ఆశీర్వదించాలని కోరుతున్నారు. తనకు అవకాశమిస్తే ప్రజలకు అత్యవరసరమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వలసల నివారణ, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి చేవెళ్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. చేవెళ్లలో తనకు పోటీగా బరిలో నిలిచిన అత్యంత సంపన్న అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డిపై గెలవాలంటే కారు గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు. ప్రజాసేవకు అంకితం... దాదాపు మూడున్నర దశాబ్దాలుగా చేవెళ్ల ప్రజలతో అనుబంధం పెనవేసుకున్న గడ్డం రంజిత్‌రెడ్డి సెప్టెంబరు 18, 1964లో వరంగల్‌లో జన్మించారు. తన పిల్లలకు ఉన్నత విద్యనభ్యసించాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి కుటుంబంతో సహా హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో నగరంలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్ విభాగంలో రంజిత్ రెడ్డి పీజీ పట్టా పొందారు. అనంతరం చేవెళ్లలోని అంతాపూర్ గ్రామంలోని పౌల్ట్రీఫామ్‌కు సాంకేతిక సలహాదారుగా కెరీర్ ప్రారంభించారు. బ్రీడింగ్, ఫార్మింగ్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో విశేష అనుభవం గడించిన ఆరేళ్ల తర్వాత ఎస్ఆర్ హ్యాచరీస్ అనే ప్రైవేటు సంస్థను నెలకొల్పారు. తన వ్యాపార భాగస్వామి డాక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి అనతి కాలంలోనే తన కంపెనీని చేవెళ్లలో విస్తరించి విజయపథంలో దూసుకుపోతున్నారు. ఎస్ఆర్ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ రెడ్డి..తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంటి పలు పదవులు చేపట్టారు. పౌల్ట్రీ వ్యాపారులు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ చూపుతున్నారు. కంపెనీ నిర్వహణ, సామాజిక కార్యక్రమాల ద్వారా వేలాది మందికి ఆయన ఉపాధి కల్పించి ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. చేవెళ్లతో ప్రత్యేక అనుబంధం... చేవెళ్ల తన స్వస్థలం కాకపోయినప్పటికీ తనకు, తన కుటుంబ సభ్యులకు మంచి భవిష్యత్తు అందించిన చేవెళ్ల అంటే రంజిత్‌రెడ్డికి ప్రత్యేక అభిమానం. పుట్టింది వరంగల్‌లోనే అయినా 35 ఏళ్లుగా చేవెళ్ల ప్రజల ఆత్మీయత, అనురాగాలు పొందినందు వల్ల వారితో విడదీయలేని అనుబంధం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడం, అదేవిధంగా యవతకు ఉపాధి కల్పించడం వంటి సామాజిక కార్యక్రమాలు ఆయనలోని సేవాతృష్ణకు నిదర్శనం. అదేవిధంగా ఉన్నత విద్యావంతుడైన రంజిత్ రెడ్డి.. విద్యకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలు స్థాపించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, వొకేషనల్ ట్రెయినింగ్‌ల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచి భరోసా ఇస్తున్నారు. తద్వారా అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్న రంజిత్ రెడ్డి భార్య సీతా రంజిత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం.. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికతకు ముగ్ధుడైన రంజిత్ రెడ్డి 2004లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పౌల్ట్రీ రంగ అభివృద్ధికి పాటుపడుతూ.. అదే సమయంలో సామాజిక కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రంజిత్ రెడ్డి కేసీఆర్ దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనపై నమ్మకం ఉంచి తానెంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గ ముఖ్య నేతలు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిల పూర్తి మద్దతుతో రంజిత్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. (సాక్షి అడ్వర్ట్‌టోరియల్) -
గెలిపిస్తే అభివృద్ధి చేస్తాం
సాక్షి, తాండూరు : చేవెళ్ల ఎంపీగా తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి అన్నారు. కరన్‌కోట్ గ్రామంలో మంగళవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఎత్తిపోతల పథకం కింద కృష్ణ జలాల నీళ్లు తీసుకొచ్చి వికారాబాద్, రంగారెడ్డి రైతుల కాళ్లు కడుగుతామని తెలిపారు. వికారాబాద్ ప్రజల ఆకాంక్ష మేరకు జిల్లాను చార్మినార్‌జోన్‌లో కలుపుతానని హామీ ఇచ్చారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పూర్తిగా బలహీనపడ్డాయని చెప్పారు. ఈ తరుణంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారుతారని స్పష్టంచేశారు. కేసీఆర్ హయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించి అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి తాండూరులో కాలుష్య నియంత్రణకు కృషి చేస్తానని తెలిపారు. మూడు లక్షల మోజార్టీ ఇస్తాం.. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి మూడు లక్షల మోజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డితో కలిసి కరన్‌కోట్‌లో రోడ్‌షో నిర్వహించారు. రంజిత్‌రెడ్డి కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఆయనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంపై టీఆర్ఎస్ జెండా ఎగురస్తామని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ గట్టు రాంచంద్రరావు, జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డె శ్రీను, వైస్ ఎంపీపీ శేఖర్, కరన్‌కోట్ సర్పంచ్ వీణ, నాయకులు శంకుతల, రాంలింగారెడ్డి, హేమంత్ తదితరులు ఉన్నారు. -
బాహుబలి–2 విడుదలకు సహకరించండి
బొమ్మనహళ్లి : కర్ణాటక, తమిళుల మధ్య ఎప్పటికీ సోదర భావం వీడ కూడదని, గతంలో బేధాభిప్రాయాలను వీడి బాహుబలి–2 చిత్రం విడుదలకు కన్నడిగులు సహకరించాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న సమర్థనం ట్రస్టులో చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కావేరి నీటి పంపిణీ విషయంలో కర్ణాటకపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను తాము కూడా ఖండిస్తున్నామని, కన్నడ భాషాభిమానులుగా తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న బాహుబలి–2ను అడ్డుకోకుండా విడుదలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అసోసియేషన్ కర్నాటక శాఖ అధ్యక్షుడు అశ్విన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్‌రెడ్డి, కార్యదర్శి, పదాధికారులు వెంకి, గిరిష్, యశ్వంత్, పెద్ద సంఖ్యలో సమర్థనం విద్యార్థులు హాజరయ్యారు. -
ఇద్దరు యువకులు మృతి
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్ర శివారులోని వాగులో పడి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానికంగా నివాసముంటున్న రంజిత్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వాగులోని నీటి ప్రవాహాన్ని చూడటానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. దీంతో వారిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన స్థానికులకు సోమవారం ఉదయం యువకుల మృతదేహాలు లభించాయి. -
''ఉడికించిన చికెన్‌తో బర్డ్ ఫ్లూ వైరస్ రాదు''
-
తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్య
జైపూర్ : తమ్ముడు జైలుకెళ్లాడని అన్న ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని పెగడపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుటుంది. ఏఎస్సై శ్రీనివాస్‌రావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పెగడపల్లి గ్రామానికి చెందిన చినూరి అంజిరెడ్డి, సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు. తండ్రి అంజిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెద్ద కుమారుడు రంజిత్‌రెడ్డి(24) మంచిర్యాలలో డిగ్రీ పూర్తి చేసి చెన్నైలో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రంజిత్‌రెడ్డి తమ్ముడు జైపూర్ విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్నాడు. ఇటీవల జైపూర్ విద్యుత్ ప్లాంటులో ఉద్యోగాలు ఇప్పించి డబ్బులు వసూలు చేశాడనే నెపంతో రవిపై కరీంనగర్ జిల్లా గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు రవి(22)ని రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రంజిత్‌రెడ్డి నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. మంగళవారం గోదావరిఖని కోర్టుకు పేషీ నిమిత్తం వచ్చిన రవిని తండ్రి అంజిరెడ్డి, సోదరుడు రంజిత్‌రెడ్డి కలిశారు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చిన రంజిత్‌రెడ్డి తమ్ముడు జైలుకి వెళ్లిన విషయం జీర్ణించుకోలేక మనస్తాపం చెందాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనం ద్వారా మంచిర్యాలకు తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో అక్కడి వైద్యులు కరీంనగర్‌కు రెఫర్ చేశారు. కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా 12 గంటలకు మార్గమధ్యలో మృతిచెందినట్లు వారు తెలిపారు. కొడుకా ఎంత పనిచేస్తివి.. మేము ఎవరి కోసం బతకాలి అంటూ తల్లి సరోజన కన్నీరుమున్నీరులా రోదించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపారు. -
తెలుగులో ఆషికి-2 మొదలైంది
‘‘హిందీ ‘దబాంగ్’ చిత్రాన్ని తెలుగులో ‘గబ్బర్ సింగ్’గా తీస్తే పెద్ద హిట్టయ్యింది. ఇప్పుడు ‘ఆషికి-2’ని రీమేక్ చేస్తున్నాం. అందులో పాటల్ని తెలుగులోనూ వాడుతున్నాం’’ అని నిర్మాత బండ్ల గణేశ్ చెప్పారు. సచిన్, నజియా జంటగా జయ రవీంద్ర దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేయగా, జయంత్ క్లాప్ ఇచ్చారు. రంజిత్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ -‘‘ ‘ఒరేయ్ పండు’ తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది’’ అని చెప్పారు. నజియా మాట్లాడుతూ -‘‘నేను సంజయ్‌దత్ మేనకోడల్ని. ఇంత మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. జయ రవీంద్ర, కాశీ విశ్వనాథ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి పాటలు: చంద్రబోస్, సంగీతం: అంకిత్ తివారి. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎన్. చంద్రశేఖర్, సమర్పణ: శివబాబు బండ్ల