![బాహుబలి–2 విడుదలకు సహకరించండి](/styles/webp/s3/article_images/2017/09/5/81491361416_625x300.jpg.webp?itok=SxKvE2aq)
బాహుబలి–2 విడుదలకు సహకరించండి
బొమ్మనహళ్లి : కర్ణాటక, తమిళుల మధ్య ఎప్పటికీ సోదర భావం వీడ కూడదని, గతంలో బేధాభిప్రాయాలను వీడి బాహుబలి–2 చిత్రం విడుదలకు కన్నడిగులు సహకరించాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్‌లో ఉన్న సమర్థనం ట్రస్టులో చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కావేరి నీటి పంపిణీ విషయంలో కర్ణాటకపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను తాము కూడా ఖండిస్తున్నామని, కన్నడ భాషాభిమానులుగా తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న బాహుబలి–2ను అడ్డుకోకుండా విడుదలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అసోసియేషన్ కర్నాటక శాఖ అధ్యక్షుడు అశ్విన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్‌రెడ్డి, కార్యదర్శి, పదాధికారులు వెంకి, గిరిష్, యశ్వంత్, పెద్ద సంఖ్యలో సమర్థనం విద్యార్థులు హాజరయ్యారు.