Bahubali-2
-
బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్-2!
-
బాహుబలి-2 లాగే మరో ఆసక్తికర పార్ట్-2!
డ్రగ్స్ కేసులో ఆగస్టు మొదటివారం తర్వాత మరో అంకం బాహుబలి వన్ సినిమా ముగింపు.. ఓ పెద్ద ప్రశ్నను సగటు ప్రేక్షకుడి ముందు ఉంచింది. అదే.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? ఇది రెండోపార్ట్ సినిమాపై అంతులేని ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తించింది. ఇప్పుడు అలాంటి ఆసక్తిని డ్రగ్స్ కేసు రేకెత్తించబోతుందా? ఈ కేసులో పార్ట్-1, పార్ట్-2 ఉండబోతున్నాయా? బాహుబలి వన్ - టూ మాదిరిగానే... డ్రగ్స్ కేసులో సిట్ విచారణ.. వన్ -టూ పార్టులు సాగనున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే.. డ్రగ్స్ కేసులో ఇప్పటికే 12 మందికి నోటీసులిచ్చి విచారిస్తున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ.. చార్జిషీట్ దాఖలుతో మొదటి అంకాన్ని త్వరలో ముగించనుంది. అదే సమయంలో ఈ నెల మొదటివారంలో రెండో అంకం మొదలుకానుందని తెలుస్తోంది. ఈ రెండో అంకం ఏమిటి? కొత్తగా ఎవరెవరిని విచారిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. రెండో భాగంలో మరింతమంది సినీ ప్రముఖులు, ఇతర రంగాల పెద్దలు ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే, సెకండ్ పార్ట్‌లో విచారణ ఎదుర్కొబోతున్న వాళ్ల పేర్లు బయటపెట్టొద్దంటూ ఉన్నతాధికారులపై ఒత్తిడి వస్తోందని సమాచారం. ఆగస్టులో రెండోపార్ట్ మరింత సీరియస్‌గా ఉంటుందనే సంకేతాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఇదే విషయం అందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. డ్రగ్స్ పార్ట్-2లో ఏముంటుందన్న తీవ్ర ఉత్కంఠ, ఎవరి పేర్లుంటాయనే ఆందోళన సినీ పరిశ్రమ వర్గాలను, ఇప్పటికే గుట్టుగా నోటీసులు ఎదుర్కొంటున్నవారిని వెంటాడుతోంది. కాగా, తొలి విచారణ చార్జిషీట్లో సిట్ ఎలాంటి విషయాలను పొందుపరుస్తుందనేది కూడా ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. సినిమారంగానికి చెందినవారిలో మరికొందరిని విచారణకు పిలుస్తారని ప్రచారం సాగుతోంది. ఎక్సైజ్ అధికారులు.. ఇదే విషయాన్ని చూచాయగా చెబుతున్నారు. ఆగస్టు మొదటివారం తర్వాతే వీరి విచారణ ఉంటుందని సమాచారం. ఇదే సమయంలో కమింగా విచారణను కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. కొందరు టెక్నీషియన్స్, కొందరు సినీ ప్రముఖులు.. కమింగా ద్వారా డ్రగ్స్ పొందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో పార్ట్‌లో కమింగా కీలకం కాబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ విచారణలో బయటకు వెలుగుచూడని వారు.. డ్రగ్స్ వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవైపు కమింగాను విచారిస్తూనే మరోవైపు అనుమానితులను కూడా విచారిస్తున్నట్లు తెలిసింది. విచారణ ముగియగానే సరిపోదని, దాని తర్వాత వెలువరించే చార్జిషీట్ అందరి జాతకాలు బయటపెడుతుందని ఎక్సైజ్ అధికారుల వాదన. ఇప్పటివరకు పూరి జగన్నాధ్‌ను 11 గంటలు, శ్యామ్ కె. నాయుడును 6 గంటలు, సుబ్బరాజును 13గంటలు, తరుణ్‌ను 13 గంటలు, నవదీప్‌ను 11 గంటలు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను 4గంటలు, చార్మిని 6 గంటలు, ముమైత్‌ఖాన్‌ను 6 గంటలు, రవితేజను 9 గంటలు, రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాస్‌ను 4 గంటలు సిట్ అధికారులు విచారించారు. మరోవైపు కెల్విన్, జీషన్‌ల అరెస్ట్ తర్వాత పలువురు సినీ ప్రముఖులతోపాటు మరో ప్రైవేటువ్యక్తిని విచారణకు పిలిచారు. అందరి విచారణ ముగిసిన తర్వాత ఈ కేసులో తొలి చార్జిషీట్ తీసుకురానున్నారు. ఇప్పటి దాకా విచారణకు హాజరైన వారిందరి పేర్లు చార్జిషీట్లో ఉంటాయా ? లేదా అన్నది త్వరలో స్పష్టం కానుంది. ఇప్పటి వరకు సిట్ జరిపిన విచారణలో డ్రగ్స్ సరఫరా, వినియోగానికి సంబంధించి సిట్ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా త్వరలోనే వాడకందారులతో పాటు అమ్మకందారుల గుట్టును కనిపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
బాహుబలి కంటే అదే భయానకం..
విడుదలైన మూడు వారాల్లోనే రూ.1500 కోట్ల కలెక్షన్లు సాధించి భారత సినీ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది బాహుబలి-2. నాలుగో వారం కూడా హౌస్‌ఫుల్ నడుస్తోన్న ఈ సినిమా రూ.2వేల కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని సినీ పండితుల అంచనా. ఇక మొదటి భాగం విడుదలైనప్పటి రెండో భాగం గ్లోబల్ హిట్ అయ్యేదాకా, అయిన తర్వాతకూడా దాదాపు బాహుబలిపై ఎక్కువ ట్వీట్లు చేసింది దర్శకుడు రాంగోపాల్ వర్మనే అంటే అతిశయోక్తికాదు. కొద్ది గంటల కిందటే ఎస్ఎస్ రాజమౌళిని ట్యాగ్చేస్తూ వర్మ మరో ఆసక్తికర కామెంట్ చేశారు. ‘బాహుబలి కలెక్షన్ల కంటే కూడా రాజమౌళి వినమ్రత, విధేయతలే భయానకంగా అనిపిస్తాయి’ అని వర్మ వ్యాఖ్యానించారు. ‘కట్టప్ప’ విషయంలో కన్నడ సంఘాలను సముదాయించడం దగ్గర్నుంచి బాహుబలి-2ను అభినందించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం, పైసరీకారులను పట్టుకున్న పోలీసులకు ధన్యవాదాలు తెలిపేందుకు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం తదితర చర్యలు.. ఇండియన్ మూవీ హిస్టరీలో ఆల్‌టైమ్ హిట్ కొట్టినతర్వాత కూడా రాజమౌళి డౌన్ టు ఎర్త్ అని రూడీచేస్తాయి. గతంలో ‘శివ టు వంగవీటి’ ఫంక్షన్లోనూ రాజమౌళి వినయపూరిత ప్రవర్తనపై వర్మ కామెంట్లు చేసిన సంగతి తెలిందే. Only thing more Scarier than Bahubali2 collections is @ssrajamouli 's Humility and Modesty -
మాహిష్మతిని వీడిన శివగామి ఇలా..
-
మొన్న శివగామి... ఇప్పుడు మాతంగి
‘బాహుబలి–2’లో రాజమాత శివగామిగా రమ్యకృష్ణ తప్ప మరో నటి సాటి రాలేరనే స్థాయిలో ఆమె నటనపరంగా విజృంభించారు. ఇప్పుడు మరో సినిమాలో రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని చూడబోతున్నాం. మలయాళంలో ఆమె నటించిన ఓ చిత్రం ‘మాతంగి’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. కన్నన్ తమరక్కులమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీని రమ్యకృష్ణ సోదరి వినయ్‌కృష్ణన్ తెలుగులోకి అనువదించారు. సోదరితో వెయ్యి ఎపిసోడ్స్ ‘వంశం’ సీరియల్ నిర్మించిన వినయ్‌కృష్ణన్ ఆ అనుభవంతో సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మాతంగిగా రమ్యకృష్ణ అద్భుతంగా నటించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళంలో ఘన విజయం సాధించింది. రితేష్ అందించిన నేపథ్య సంగీతం హైలైట్ అవుతుంది’’ అని వినయ్‌కృష్ణన్ తెలిపారు. -
బాహుబలి-2పై స్పందించిన పవన్ కల్యాణ్
హైదరాబాద్: భారతీయ సినీ చరిత్రలో ఆల్‌టైమ్ హిట్‌గా రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేసిన బాహుబలి-2పై ప్రపంచమంతా ప్రశంసలు కురిపిస్తోంది. ఈ సినిమా గురించి మాట్లాడని సినీ స్టార్లుగానీ, రాజకీయనేతలుగానీ లేరు! ఈ క్రమంలోనే జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ కూడా బాహుబలి-2పై తనదైన శైలిలో స్పందించారు. ఈ మేరకు పవర్ స్టార్ ఆదివారం రాత్రి వరుస ట్వీట్లు చేశారు. రూ.1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సందర్భంగా దర్శకుడు రాజమౌళి, హీరో ప్రభాస్ సహా బాహుబలి టీమ్ అందరికీ పవన్ అభినందనలు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఐదేళ్లపాటు కష్టపడిన రాజమౌళి మనందరినీ గర్వంగా తలెత్తుకునేలా చేశారు..’ అన్న పవన్ కల్యాణ్.. భవిష్యత్తులో ఆయన(రాజమౌళి) మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు రాజమౌళి.. పవన్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. (బాహుబలి 2 : 1000 కోట్ల క్లబ్లో తొలి భారతీయ సినిమా) My Heartfelt congratulations to Shri Rajmouli,Shri Prabhas &team for their stupendous success of. Bahubali and achieving the 1000 crore mark — Pawan Kalyan (@PawanKalyan) 7 May 2017 Shri Rajmouli with his years of hard work ,tenacity & dedication made alll of us proud.. I wish you many more achievements like this. — Pawan Kalyan (@PawanKalyan) 7 May 2017 Thank you very much sir... -
బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేస్తుందట!
ముంబై: భారతీయ సినిమాల్లో ఆల్ టైమ్ గ్రేట్ గా దూసుకుపోతున్న బాహుబలిపై బాలీవుడ్ రగిలిపోతున్నదని, తెలుగు సినిమాకు ఇంతటి ఖ్యాతి దక్కడాన్ని అక్కడివాళ్లు జీర్ణించుకోలేని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బాహుబలికి పోటీగా(!) ఏ సినిమాను ప్రమోట్ చేద్దామా అని అక్కడివాళ్లు ఆలోచిస్తున్న తరుణంలోనే సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్ విడుదలైంది. మే 4న విడుదలైన ’ట్యూబ్‌లైట్’ ట్రైలర్‌ను రెండు రోజుల్లోనే దాదాపు కోటి మంది వీక్షించారు. అంతే, ‘ఈ సినిమా బాహుబలి-2 రికార్డుల్ని బ్రేక్ చేయబోతోంది..’ అంటూ ప్రచారం మొదలైంది. దీన్నిబట్టి ఖాన్ త్రంయం నెలకొల్పిన ఎన్నో రికార్డుల్ని బాహుబలి చెరిపేయడంపై బాలీవుడ్ రగిలిపోతోందన్న వర్మ వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తుంది. గొప్ప సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనడంలో సందేహంలేదు. ట్యూబ్‌లైట్.. బాహుబలి-2 కంటే గొప్పసినిమా అయితే తప్పక హిట్ సాధిస్తుంది.. రికార్డులు బద్దలుకొడుతుంది. కానీ కేవలం తెలుగోడి సినిమాను తక్కువచేయడానికి మాత్రమే ఈ తరహా ప్రచారాలు చేయడంపైనే విమర్శలు వస్తున్నాయి. నమ్మకం ట్యూబ్‌లైట్ లాంటిది.. బ్లాక్ బస్టర్ ‘బజరంగీ భాయిజాన్’ తర్వాత దర్శకుడు కబీర్ ఖాన్- హీరో సల్మాన్ ఖాన్ల కాంబినేషన్లో రూపొందిన ’ట్యూబ్‌లైట్’ సినిమా ఈద్ కానుకగా జూన్ 23న విడుదల కానుంది. చిన్నాపెద్దా అందరూ అభిమానించే అమాయక వ్యక్తిగా సల్మాన్ పాత్ర ’భాయిజాన్’ను తలపించేలా ఉంది. ’నమ్మకం ఓ ట్యూబ్‌లైట్ లాంటిది.. ఆలస్యంగా వెలుగుతుంది. కానీ ఒక్కసా వెలిగాక వెలుగులు విరజిమ్ముతుంది..’ అంటూ సల్మాన్ చెప్పిన డైలాగ్ సినిమా ఎలా ఉండబోతోందని చెప్పకనే చెప్పినట్లుంది. ‘ట్యూబ్‌లైట్’ ట్రైలర్.. -
బాక్సాఫీస్ కింగ్
రాజమౌళి సృష్టించిన మాహిష్మతి సామ్రాజ్యం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కొత్త అనుభూతిని మిగిల్చింది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్, తమన్నా.. ఇలా అందరూ తమ నటనతో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమా మాత్రం ఇప్పటివరకూ మిగతా సినిమాలు సాధించిన రికార్డులను చెరిపేసింది. భారతీయ సినిమాల్లో ‘కలక్షన్ కింగ్’ అనిపించుకుంది ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’. మొదటి భాగం (‘బాహుబలి: ది బిగినింగ్) దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండో భాగం అంతకు రెండింతలు పైనే వసూలు చేస్తుందని విశ్లేషకుల అంచనా. అందుకు నిదర్శనం ఈ చిత్రం ఆరో రోజు వసూళ్లు. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లల్లో నంబర్ వన్‌గా నిలిచిన భారతీయ సినిమా ‘పీకే’ (హిందీ) రికార్డ్‌ను ‘బాహుబలి–2’ బద్దలు కొట్టింది. ‘పీకే’ మొత్తం వసూళ్లు 743 కోట్ల రూపాయలు. ‘బాహుబలి’ ఆరో రోజుకే ఆ వసూళ్లను దాటేసింది. విడుదలైన అన్ని భాషలతో కలుపుకుని ఈ చిత్రం సిక్త్స్ డేకి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 792 కోట్లు వసూలు చేసింది. మామూలుగా క్రేజీ ప్రాజెక్ట్‌కి మొదటి వారం టికెట్స్ దొరకవు. అయితే ‘బాహుబలి–2’కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. రెండో వారానికి ఎంటరవుతున్నప్పటికీ టికెట్స్ సులువుగా దొరికే పరిస్థితి లేదు. దీన్నిబట్టి భవిష్యత్ వసూళ్లను ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. పది రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు. భారతీయ సినిమాల్లో మార్కెట్ పరంగా నంబర్ వన్ స్థానం హిందీ చిత్రాలదైతే ఇప్పుడా స్థానాన్ని ‘బాహుబలి’ దక్కించుకుంది. 1,000 నుంచి 1,500 కోట్లు ఫైనల్ కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ రికార్డ్‌ని సమీప కాలంలో ఏ భారతీయ సినిమా అధిగమించలేదని అంటున్నారు. మరి.. ‘బాహుబలి’ రికార్డ్‌ను ఏ సినిమా అధిగమిస్తుందో వేచి చూడాలి. -
బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా..
హైదరాబాద్: రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న బాహుబలి-2 సినిమాను వివాదాలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. కట్టప్ప(సత్యరాజ్)కు వ్యతిరేకంగా కన్నడిగల ఆందోళన మొదలు.. ఏపీలో ఆరు షోలకు అనుమతినా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆరెకటిక కుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి-2కు వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించిన ఆరెకటిక సంఘాలు.. బాహుబలి-2లో తమ కులాన్ని కించపరిచేలా ఉన్న సీన్లను వెంటనే తొలగించాలని డిమాడ్ చేశారు. ఆరెకటిక పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ సహా పలువురు నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఏమిటి వివాదం?: శుక్రవారం విడుదలైన బాహుబలి–2 సినిమాలో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదాన్ని వాడారని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరెకటిక పోరాట సమితి ఆరోపించింది. అభ్యంతరం చెప్పాల్సిన సెన్సార్ బోర్డు సైతం కటిక చీకటి పదానికి అనుమతినివ్వడం దారుణమని మండిపడింది. దీనికి బాధ్యులైన బాహుబలి దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు రాజమౌళి, శోభు, ప్రసాద్‌లపై ఆరెకటిక పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తీవ్ర హెచ్చరికలు: బాహుబలి-2 నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే దర్శకుడు రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని, అప్పటికీ మార్పు రాకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన నిర్వహిస్తామని ఆరెకటిక పోరాట సమితి హెచ్చరించింది. న్యాయసలహా అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా నిర్ణయం తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. -
పీవీఆర్‌కు బాహుబలి-2 కిక్.. సీఈవో ఏమన్నారు?
ముంబై: భారతీయ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర సృష్టించనున్నబాహుబలి -2 స్టాక్ మార్కెట్లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ నిర్వాహక సంస్థలు పీవీఆర్, ముక్తా ఆర్ట్స్ కౌంటర్లకు బాహుబలి విజయం మాంచి కిక్ ఇచ్చింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ముక్తా ఏ2 సినిమాస్ పేరుతో ముక్తా ఆర్ట్స్ మల్లీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న ముక్తా ఆర్ట్స్ ఏకంగా 6.3 శాతం ఎగిసింది. మరో మల్టీప్లెక్స్ దిగ్గజ సంస్థ పీవీఆర్ షేరు 1.7 శాతం జంప్ చేసింది. సినిమా టికెట్లు, ఆహారం, పానీయాలు(ఫుడ్ అండ్ బెవరేజెస్) విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు ఈ కౌంటర్లలో జోష్ పెంచినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారీసంఖ్యలో 9వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన బాహుబలి-2 రికార్డులు సృష్టించడం ఖాయమని పీవీఆర్ పిక్చర్స్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా దర్శకుడు రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయినీ, ఇంతకముందెన్నడూ చూడలేదని, నమ్మశక్యం కానంత అమోఘంగా ఉన్నాయని కొనియాడారు. బాహుమలి-2కి అనూహ్యమైన స్పందన వస్తోందని.. కలెక్షన్లు ఇప్పుడే అంచనావేయడం కష్టమని కమల్ తెలిపారు. అమెరికాలో దాదాపు 30 లక్షల ముందస్తు టికెట్లు అమ్ముడుబోయినట్టు చెప్పారు. దంగల్ను మించి రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అటు బాహుబలి ట్విట్టర్ పేజీ ఇప్పటికే 2,లక్షల 45 వేలకు పైగా ఫాలోవర్లను దాటేసింది. -
బాహుబలి-2పై జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్: బాహుబలి-2 మూవీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దర్శకుడు రాజమౌళిపై ఈ యంగ్ హీరో ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత అద్భుతమైన కాన్వాస్ బాహుబలి-2 అని కొనియాడారు. బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రనే కాదు.. భారతీయ సినిమాను మరో కొత్త లెవల్‌కి తీసుకెళ్లిందంటూ అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రభాస్, రానా దగ్గబాటి, అనుష్క, రమ్య క్రిష్ణన్ తమ అద్భుతమైన నటనతో రాజమౌళి విజన్‌కు మద్దుతిచ్చారని ట్వీట్ చేశారు. రాజమౌళి కలను సాకారం చేసిన శోభు ప్రసాద్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ అందరికీ తారక్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి-2 జైత్రయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. #Baahubali2 is Indian Cinema's finest canvas. @ssrajamouli has taken not just Telugu Cinema, but Indian Cinema to a whole new level.Hats off — Jr NTR (@tarak9999) April 28, 2017 -
'బాహుబలి-2 టికెట్ల దోపిడీని ఆపండి'
హైదరాబాద్: బాహుబలి-2 ప్రదర్శిస్తున్న సినిమా థియెటర్ల వద్ద రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నియమించి టికెట్ల మాఫియాపై తక్షణ చర్యలు తీసుకొని.. సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను వీక్షించుటకు అవకాశం కల్పించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వినర్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు. 'బాహుబలి-2 సినిమా గొప్ప సాంకేతిక విలువలతో రాజహౌళితో పాటు చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నాలుగు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల భారతీయ సినిమా వైభవానికి ఒక మహోత్తర దినం. కానీ.. బ్లాక్ టికెట్ల మాఫియా మూలంగా ఈ సినిమా చూడాలనే సగటు ప్రేక్షకుడి ఆశకు గండి పడింది. అసలు ప్రేక్షకులు మేం ఎందుకు ఎక్కువ ధర చెల్లించి సినిమా చూడాలి? అని థియెటర్ యాజమాన్యంతో కొన్ని ప్రాంతాల్లో గొడవలు పడి పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో ఈ టికెట్ల మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతూ భారీ ఎత్తున ఎక్కువ ధరలకు విక్రయించడం ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజలు సహించలేక పోతున్నారు' అని కేతిరెడ్డి తెలిపారు. 'వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి బాహుబలి-2 టికెట్లు తీసుకున్నారని ప్రచార మాధ్యమాలలో తెలుపుతూ.. ప్రభుత్వం, రెవిన్యూ అధికారుల అండదండలు మాకున్నాయని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు. బాహుబలి-2 సినిమా టికెట్లను ఎక్కువ ధరకు అమ్మడం వల్ల ప్రభుత్వాని వచ్చిన లాభం ఏం లేదని, ట్యాక్స్‌ల రూపంలో వచ్చేది కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే అని అన్నారు. టికెట్ల మాఫియాను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ఈ అధిక ధరల సంస్కృతి ఇలాగే కొనసాగితే ఈ మాఫియా త్వరలో రాబోయే స్పైడర్, డీజే చిత్రాలకు కూడా ఇదే విధమైన దోపిడీని కొనసాగిస్తారని, వీరికి వెంటనే అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. -
నేడే బాహుబలి–2
తమిళసినిమా: భారతీయ సినిమాలోకం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బ్రహ్మాండమైన చిత్రం బాహుబలి–2 ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలకానుంది. కొన్ని రోజులుగా తమిళంలో మాత్రం బాహుబలి–2 చిత్రం విడుదలవుతుందా? లేదా? అనే టెన్షన్ కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తమిళ వెర్షన్ విడుదలకు నిషేధం విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. కార్తికేయన్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అందులో బాహుబలి–2 చిత్రాన్ని తమిళంలో విడుదల చేసే గో ప్రొడక్షన్స్ తమ వద్ద తీసుకున్న రుణాన్ని వడ్డీ సహా మొత్తం రూ.1.48 కోట్లు చెల్లించాలని, లేకుంటే చిత్ర విడుదలకు నిషేధం విధించాలని, అన్ని హక్కులను నిలుపుదల చేయాలని కోరాడు. ఈ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. కేసును విచారించిన న్యాయమూర్తి ఇటువంటి కారణాలతో చిత్ర విడుదలను అడ్డుకోవడం కుదరదని తీర్పు చెప్పారు. తద్వారా తమిళంలో బాహుబలి–2 విడుదలకు అడ్డంకులు తొలగాయి. ఈ నేపథ్యంలో బాహుబలి–2 చిత్రం తమిళంలో శుక్రవారం విడుదలకానుంది. -
బ్లాక్ బలి
ఏలూరు (సెంట్రల్): జిల్లావ్యాప్తంగా బాహుబలి–2 ఫీవర్ అభిమానులను ఊపేస్తోంది. జిల్లాలోని 90 శాతం ధియేటర్లలో శుక్రవారం బాహుబలి–2 విడుదల కానుంది. ఏలూరు, భీమవరంలోని అన్ని స్క్రీన్లలో సినిమా విడుదల చేయనున్నారు. మొదటిరోజే సినిమా చూడాలన్న అభిమానుల తాపత్రయాన్ని డిస్ట్రిబ్యూటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. పెంచిన ధర ప్రకారం రూ.200కు విక్రయించాలి్స న టికెట్‌ను రూ.900 నుంచి రూ.1,800 వరకు విక్రయిస్తున్నారు. భీమవరంలో రూ.3 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. బెనిఫిట్ షో క్రేజ్‌ను డిస్ట్రిబ్యూటర్లు సొమ్ములు చేసుకుంటున్నారు. 10 రోజుల పాటు ఉదయం 7.30 గంటల నుండి అర్ధరాత్రి 2.30 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించేందుకు జిల్లా అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే గురువారం రాత్రి 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. ఈ షోకు సంబంధించిన టికెట్లను ఒకరోజు ముందుగానే విక్రయించారు. టికెట్ ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోవాలి్సన సంబంధిత శాఖల అధికారులు సైతం చూసీచూడనట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. రూ.1,200 వరకు విక్రయాలు జిల్లాలో సుమారు 125 ధియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నారు. పదిరోజుల పాటు ఆరు షోలను ప్రదర్శించేందుకు, రూ.100 టికెట్‌ను రూ.200 విక్రయించేందుకు ఇప్పటికే అధికారులు అనుమతులు ఇచ్చారు. బెనిఫిట్ షోకు ఏలూ రులోని 11 థియేటర్లలో అన్ని విభా గాలకు చెందిన టికెట్లను అభిమాన సం ఘాల నాయకులు థియేటర్ యాజమాన్యం దగ్గర నుంచి వాస్తవ ధరల కంటే అధిక ధరలకు కొనుగోలు చేశారు. అధికారులు పట్టించుకోకపోవడానికి కార ణం పెద్ద ఎత్తున మాముళ్లు తీసుకోవ డమే అని సమాచారం. లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే వంకతో నగరంలోని అన్ని థియేటర్ల యాజమాన్యాల నుంచి ఓ టీడీపీ నాయకుడు పెద్ద మొత్తంలో నగదును పోలీసు అధికారులకు అందించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. -
భారతీయ సినిమా అంటే బాహుబలి అనే స్థాయికి తీసుకెళ్లాం!
‘‘ఏ దర్శకుడూ తను ఊహించినట్టు, ఊహలకు అనుగుణంగా సినిమా తీయలేడు. మనసులో ఉన్నదాన్ని వంద శాతం తెరపై ఆవిష్కరించడం అసాధ్యం. కానీ, ఓ కథకుడిగా ‘బాహుబలి’ నాకెంతో సంతృప్తి ఇచ్చింది. ఇంతకుముందు నా సినిమా కథల్లో హీరో పాత్ర మాత్రమే బలంగా ఉండేది.కానీ ఈ సినిమాలో ఒక్కటి కాదు... ఏడు పాత్రలు ఎంతో శక్తిమంతంగా ఉంటాయి. నాకు నచ్చిన హీరోయిజాన్ని తెరపై చూపించా. నా ఊహలను మాగ్జిమమ్ ఆవిష్కరించిన సినిమా ‘బాహుబలి’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్ హీరోగా ఆయన దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మించిన ‘బాహుబలి–2’ రేపు రిలీజవుతోంది. రాజమౌళి చెప్పిన సంగతులు.... ⇒ ఓ సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అందులో పాత్రలను మర్చిపోలేక పోతే అది మంచి సినిమా. ‘బాహుబలి’ విడుదలైన ఇన్ని నెలల తర్వాత కూడా ప్రేక్షకులు మాట్లాడుతున్నారంటే నాన్నగారు సృష్టించిన శక్తిమంతమైన పాత్రలే కారణం. ‘బాహుబలి’ విజయంలో సింహభాగం పాత్రలకే ఇస్తాను. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడో శుక్రవారం అందరికీ తెలుస్తుంది. సస్పెన్స్ వల్ల సినిమా ఆడదు. అందులోని డ్రామా వల్లే ఆడుతుంది. ⇒ అసలు మొదటి భాగాన్ని కట్టప్ప ప్రశ్నతో ముగించాలనుకోలేదు. సినిమాకు మంచి ముగింపు కావాలి. అందులో కన్న కొడుకును కాదని అమరేంద్ర బాహుబలిని రాజును చేస్తుంది శివగామి. ఆమె ఎందుకు చేసిందో కూడా చెబుతుంది. ప్రజలంతా బాహుబలికి జయహారతులు పట్టారు. అక్కడితో ముగిస్తే సరిపోతుందనుకున్నా. కానీ, ఫ్లా్యష్బ్యాక్లో చెప్పిన కొన్ని పాత్రలున్నాయి. వాటిని అర్ధాంతరంగా వదిలేయకూడదు. వాళ్లను సాదాసీదాగా చూపించకుండా ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నతో ముగిస్తే మంచి ట్విస్ట్ అవుతుందనుకున్నాం. అది ఆటమ్‌బాంబులా పేలుతుందని ఊహించలేదు. ⇒ మేం మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యామనుకుంటున్నారు. అలాంటిదేం లేదు. ఓ సినిమాను అసంపూర్తిగా ముగించడం మనకు కొత్త. కానీ, హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఈ పద్ధతి ఉంది. అందువల్ల, ‘బాహుబలి’ని రెండు భాగాలుగా విడుదల చేయాలనుకున్నప్పుడు నాకెలాంటి డౌట్స్ రాలేదు. నిజం చెప్పాలంటే రెండు భాగాలుగా తీయాలనుకో లేదు. షూటింగ్ మొత్తం పూర్తి కాకముందే మా దగ్గర డబ్బులు అయిపోయాయి. అప్పుడు మొదటి భాగం విడుదల చేసిన ఓ నాలుగైదు నెలలకు ‘బాహుబలి–2’ విడుదల చేయాలనుకున్నాం. ఇన్నాళ్లు పట్టింది. నా దృష్టిలో కథ వేరు, కథనం వేరు, వాణిజ్య హంగులు వేరు. దర్శకుడిగా ప్రేక్షకులకు కావలసినవన్నీ ఇవ్వడం నా బాధ్యత. ఇందులో అన్నీ ఉన్నాయి. ⇒ సీజీ వర్క్స్ వల్ల నా ప్రతి సినిమా అనుకున్న టైమ్ కంటే కాస్త ఆలస్యమవుతుంది. ‘బాహుబలి–2’కి వచ్చేసరికి సీజీ వర్క్స్ ఉన్న షాట్స్ అన్నీ గతేడాది అక్టోబర్‌లో చిత్రీకరించేశాం. మా నిర్మాత శోభు తీసుకున్న జాగ్రత్తల వల్లే ఇది సాధ్యమైంది. ఓ నెల రోజుల ముందు శోభుగారితో మరో రెండు వారాలు వాయిదా వేద్దామా? అనడిగా. ఆయన నవ్వేసి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయన్నారు. ⇒ చిన్న వయసులో ‘మాయాబజార్’ చూశా. దర్శకుణ్ణి అయ్యాక అప్పట్లోనే అంత గొప్ప సీన్లు ఎలా తీశారా? అని ఆలోచించా. రెండు నిమిషాల పాటలో పాత్రలన్నిటినీ పరిచయం చేశారు. గ్రాఫిక్స్ కూడా అద్భుతం. కేవీ రెడ్డిగారికి హ్యాట్సాఫ్. ⇒ ‘బాహుబలి’ రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పడుతుందని ముందే ఊహించి ఉంటే సినిమా చేసేవాణ్ణి కాదు. ఒక్కసారి దిగిన తర్వాత ముందుకు వెళ్లడం తప్ప వెనక్కి తిరిగి చూడటానికి ఏముంటుంది? ఓ సినిమాకు పని చేస్తున్నంత సేపూ ఓ ఉత్సాహం ఉంటుంది. పని పూర్తయిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. మరికొన్ని గంటల్లో సినిమా విడుదల కాబోతోంది. అందుకే, నాకిప్పుడు టెన్షన్‌గా ఉంది. ⇒ మా నిర్మాతలు నాపై నమ్మకంతో జీవితాలను పణంగా పెట్టి ఖర్చుపెట్టారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఏయే పనులు చేశారో అందరికీ తెలుసు. నేను నా కలను సాకారం చేసుకునే క్రమంలో వాళ్లంతా నన్ను కాపాడుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ అయితే... ‘నీ లెవల్ ఇది కాదు. నువ్వింకా చేయగలవ్’ అని ఎంతో ఎనర్జీ ఇచ్చాడు. ⇒ దర్శకుడిగా నా లక్ష్యాలను ఎప్పుడో చేరుకున్నా. మహాభారతం తీయాలనుందని చాలా రోజుల నుంచి చెబుతున్నా. కానీ, ఓ పదేళ్ల వరకూ దాన్ని టచ్ చేయను. మహాభారతం తీసేంత స్కిల్స్ నాలో లేవు. ∙బయట దేశాలవారికి తెలుగు, తమిళ, దక్షిణాది సినిమాల గురించి అస్సలు తెలీదు. భారతీయ సినిమా గురించి పెద్దగా తెలీదు. ఒకవేళ హిందీ సినిమాల గురించి తెలిసినా... షారుక్‌ఖాన్ అంటుంటారు. అటువంటి స్థాయి నుంచి భారతీయ సినిమా అంటే ‘బాహుబలి’ అనే స్థాయికి తీసుకురాగలిగాం. ఇది నాకెంతో గర్వంగా అనిపించింది. సినిమా అంత పెద్ద హిట్టయితే ఎవరికైనా గర్వం ఉంటుంది. అయితే... ఇంట్లో మా ఆవిడ, మా వదిన క్లాస్ పీకి నా గర్వానికి బ్రేకులు వేస్తారు. -
వైరల్: బాహుబలి-2 టికెట్ల కోసం అమ్రపాలి
- 350 టికెట్లు బుక్ చేయించిన వరంగల్ అర్బన్ కలెక్టర్ - సోషల్ మీడియాలో వైరల్ హన్మకొండ: విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ ప్రేక్షకులను బాహుబలి ఫీవర్ ఉర్రూతలూగిస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్లను జోరుగా కొనుగోలు చేయగా.. థియేటర్ల ముందు ప్రేక్షకులు భారీగా బారులు తీరారు. ఈ తరుణంలోనే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా ఒక్కరే 350 టికెట్లు బుక్ చేయించడం చర్చనీయంశమైంది. వరంగల్ ఆర్డీవో ద్వారా బాహుబలి-2 సినిమాటికెట్లు బుక్ చేయించారామె. ఇన్ని టికెట్లు ఎందుకు? అని ఆరా తీయగా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.. గత కొద్ది రోజులుగా వరంగల్ నగరంలో సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు, ఉద్యోగులు, ఆర్టిస్టులు అంతా కలుపుకొని సుమారు 300 మంది సుందరీకరణ పనుల్లో భాగం పంచుకుంటున్నారు. వారికి కాస్త ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతోనే కలెక్టర్ అమ్రపాలి.. అందరికీ కలిపి బాహుబలి-2 టికెట్లు బుక్ చేయించారు. హన్మకొండలోని ఏసియన్ మాల్లో 28న వారంతా ఫస్ట్ షో చూడనున్నారు. సమర్థురాలైన అధికారణిగా ప్రశంసలు పొందిన అమ్రపాలి మరోసారి ఇలా వార్తల్లో నిలిచారు. (బాహుబలి-2 తొలి రోజే రికార్డులు సృష్టించనుందా?) (ప్రతిభకు మారుపేరు అమ్రపాలి) -
బాహుబలి-2కు ఆ అనుమతి చట్టవిరుద్ధం
విజయవాడ: ఈ నెల 28న అట్టహాసంగా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న బాహుబలి-2 సినిమాపై మరో వివాదంరాజుకుంది. చరిత్రలో ఏ సినిమాకూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం బాహుబలి-2కు మాత్రమే ఆరు షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం నూటికినూరుపాళ్లు చట్టవ్యతిరేకమని, ఆరు షోలకు అనుమతినిస్తూ జారీచేసిన ఉత్తర్వులను వెంటనే రద్దుచేయాలని తెలుగు సినిమా ప్రేక్షుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రేక్షకుల సంఘం సభ్యులు సోమవారం ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాధను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. సినిమా థియేటర్లలో షోలను ప్రదర్శించాల్సిన వేళలపై చట్టంలో చాలా స్పష్టమైన అంశాలు ఉన్నాయని ప్రేక్షకుల సంఘం వాదిస్తోంది. రాత్రి 1 గంటల నుంచి ఉదయం 8 గంటలవరకు సినిమా థియేటర్లలో ప్రదర్శనలు ఉండరాదని చట్టంలో ఉండగా, అందుకు విరుద్ధంగా బాహుబలి-2కు ఆరు షోల అనుమతి ఇవ్వడం సరికాదని సంఘం పేర్కొంది. అభ్యంతరాలపై స్పందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ.. విషయాన్ని ప్రభుత్వానికి చేరవేస్తానని బదులిచ్చారు. ఒకవేళ సకాలంలో ప్రభుత్వం స్పందించకుంటే సంఘం సభ్యులు కోర్టును ఆశ్రచించే అవకాశాలున్నాయి. బాహుబలి-2కు ఆరు షోల అనుమతినిస్తూ ఏపీ సర్కార్ శనివారం జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ బాహుబలికి బంపర్ ఆఫర్! ఏపీ ప్రభుత్వం మాదిరే తెలంగాణ సర్కార్ కూడా బాహుబలి-2కు బంపర్ ఆఫర్ ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది. సోమవారం బాహుబలి నిర్మాతలు తనను కలిసివెళ్లిన అనంతరం సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నిర్మాతలు తనతోపాటు ప్రభుత్వాధికారులనూ ప్రత్యేక షోకు ఆహ్వానించారని చెప్పిన తలసాని.. షోల సంఖ్య పెంపుపైనా చర్చ జరిగినట్లు తెలిపారు. 'ఇది మన సినిమా. దీనిని తప్పకుండా ప్రోత్సహిస్తాం. ఐదు షోలకుగానీ, అవసరమైతే ఆరు షోలకు గానీ అనుమతులు ఇచ్చేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సీఎం కేసీఆర్‌కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నారు' అని తలసాని చెప్పారు. అయితే షోల పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. -
బాహుబలి-2కు లైన్‌క్లియర్..
బాహుబలి-2 చిత్ర విడుదలకు నెలకొన్న చిక్కులు సమసిపోయాయి. కొద్ది రోజులుగా ఈ చిత్ర విడుదలపై గందరగోళ పరిస్థితి నెలకొంది. సమస్య కోర్టు గుమ్మం వరకూ వెళ్లింది. వివరాల్లోకెళితే బాహుబలి ఘన విజయం తరువాత దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం బాహుబలి-2. ప్రబాస్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సృష్టికర్త రాజమౌళి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో ఏసీఈ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అందులో శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్ బాహుబలి-2 చిత్ర తమిళనాడు విడుదల హక్కులను పొందారన్నారు. ఆయన 2016లో రూ.1.18కోట్లు రుణం అడిగారని, ఆ మొత్తాన్ని తాము ప్రభుదేవా స్టూడియోస్ పేరు మీద ఇవ్వడం జరిగిందన్నారు. ఆ మొత్తాన్ని రూ.10 లక్షలు వడ్డీతో సహా బాహుబలి-2 విడుదలకు ముందు చెల్లిస్తానని సవరణన్ పిబ్రవరిలో అగ్రిమెంట్ రాసి ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు మాట మార్చిన సరవణన్ బాహుబలి-2 చిత్ర విడుదల తరువాత డబ్బు చెల్లిస్తానంటున్నారని, తమకు సొమ్ము చెల్లించేవరకు బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. బాహుబలి-2 విడుదలపై నిషేధం విధించడానికి నిరాకరించిన న్యాయమూర్తి ఈ పిటిషన్‌కు బదులు దాఖలు చేయాల్సిందిగా శ్రీ గ్రీన్ ప్రొడక్షన్ అధినేత సవరణన్కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ కేసు మంగళవారం విచారణకు రాగా ఇరు తరఫు న్యాయవాధులు కోర్టుకు హాజరై సమస్యను కోర్టు బయట పరిష్కరించుకున్నట్లు తెలియజేయడంతో విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. -
బాహుబలి–2 విడుదలకు సహకరించండి
బొమ్మనహళ్లి : కర్ణాటక, తమిళుల మధ్య ఎప్పటికీ సోదర భావం వీడ కూడదని, గతంలో బేధాభిప్రాయాలను వీడి బాహుబలి–2 చిత్రం విడుదలకు కన్నడిగులు సహకరించాలని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక గౌరవాధ్యక్షుడు రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న సమర్థనం ట్రస్టులో చిన్నారులతో కలిసి పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కావేరి నీటి పంపిణీ విషయంలో కర్ణాటకపై తమిళ నటుడు సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలను తాము కూడా ఖండిస్తున్నామని, కన్నడ భాషాభిమానులుగా తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న బాహుబలి–2ను అడ్డుకోకుండా విడుదలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అసోసియేషన్ కర్నాటక శాఖ అధ్యక్షుడు అశ్విన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు పవన్‌రెడ్డి, కార్యదర్శి, పదాధికారులు వెంకి, గిరిష్, యశ్వంత్, పెద్ద సంఖ్యలో సమర్థనం విద్యార్థులు హాజరయ్యారు. -
బాహుబలి ట్రైలర్–2 విడుదల
కాకినాడలో ప్రభాస్ అభిమానుల సందడి బాహుబలి–2 సినిమా ట్రైలర్ విడుదలతో సినీ హీరో ప్రభాస్ అభిమానులు కాకినాడలో సందడి చేశారు. మల్టిప్లెక్స్, ఆనంద్, పద్మప్రియ థియేటర్లలో గురువారం ఉదయం ఈ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ అభిమానులు ఆయా థియేటర్లవద్దకు పెద్ద ఎత్తున చేరుకొన్నారు. ప్రభాస్ టీషర్టులు ధరించి, పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ప్రభాస్ చిత్రంతో ఉన్న భారీ జెండాను ప్రదర్శించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ట్రైలర్ విడుదల చేసినట్టు దేవీ మల్టిప్లెక్స్ థియేటర్ మేనేజర్ కె.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ప్రభాస్ అభిమానుల సంఘం అధ్యక్షుడు శ్రీను ప్రభాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. – కాకినాడ కల్చరల్ -
వీఆర్‌లో కనువిందు చేయనున్న ‘బాహుబలి-2’
- ఆ చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్ - కాకినాడలో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్ ప్రదర్శన కాకినాడ రూరల్ : త్రీడీ చిత్రాల్లో మన దగ్గరకు చిత్రం వచ్చినట్లు ఉంటుందని, అదే విజువల్ రియాల్టీ (వీఆర్)లో మనమే చిత్రంలోని పాత్రల్లోకి వెళ్లి, వాటి అనుభూతిని పంచుకున్నట్లు ఉంటుందని ‘బాహుబలి-2’ చిత్రం సాంకేతిక నిపుణుడు కరుణాకరన్ చెప్పారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి–2’ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం సాంకేతిక బృందం సోమవారం నాగమల్లితోట జంక్షన్ సమీపంలోని లాల్బహుద్దూర్ నగర్ మిర్చి రెస్టారెంట్లో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరుణాకరన్ మాట్లాడుతూ చిత్రం ప్రచారంలో భాగంగా ప్రముఖ నగరాల్లో టెక్నికల్ సిబ్బంది ఆధ్వర్యంలో 56 సెకన్లతో కూడిన గ్రాఫిక్స్‌ను ప్రేక్షకులకు చూపిస్తున్నట్లు వివరించారు. మిర్చి రెస్టారెంట్ అధినేత అడ్డూరి రామకృష్ణ భాస్కరరాజు ఆహ్వానం మేరకు కాకినాడలో ఈ ప్రదర్శన జరిపామన్నారు. బాహుబలి-2 చిత్రాన్ని విజువల్ రియాల్టీలో చూడడం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుందన్నారు. చిత్రాన్ని మనం త్రీడీలో కూడా చూసే అవకాశం ఉన్నా దానికన్నా విజువల్ రియాల్టీలో చూసే విధంగా దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు వివరించారు. బాహుబలి–2 చిత్రంలో ఉపయోగించిన అత్యాధునికమైన టెక్నాలజీని ప్రతి ఒక్కరికీ చూపించేలా తమ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో150 డిగ్రీలు మించని తెరలపైనే చిత్రాలను చూడగలిగామని, రానున్న రోజుల్లో 360 డిగ్రీల్లో ఈ చిత్రాన్ని చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి థియేటర్లు తయారు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, అంతేకాక సమయం కూడా ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని అన్నారు. చిత్రం విడుదలకు ముందే 15 నిమిషాల నిడివిగల షార్టు ఫిల్మ్‌ను సెన్సార్ కెమెరా ద్వారా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 400 సెంటర్లలో బాహుబలి–2 విడుదల కానున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు విజయవాడ, గాజువాక, విశాఖపట్నం ప్రాంతాల్లో విజువల్ రియాల్టీ ఎఫెక్ట్స్‌ను ప్రదర్శించామని, ఇప్పుడు కాకినాడ, రాజమండ్రిల్లో ప్రదర్శిస్తున్నామని తెలిపారు. జంపన సత్యనారాయణరాజు, సరిపల్లి గంగరాజు, రుద్రరాజు నర్సింహరాజు, అడ్డూరి రామకృష్ణ భాస్కరరాజు ఆనంద్ థియేటర్ యజమాని ప్రదీప్‌రాజు, కృష్ణంరాజు, సాయి, బండారు భాస్కర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు. -
15 నెలలు... 33 స్టూడియోలు!
రాజమౌళి సృష్టించిన ఊహాలోకం మాహిష్మతి సామ్రాజ్యంలో మూడున్నరేళ్లు బందీగా ఉన్న ప్రభాస్‌కి కొత్త ఏడాది ప్రారంభంలో విముక్తి లభించింది. అదేనండీ... ‘బాహుబలి–2’కి గుమ్మడికాయ కొట్టేశారు కదా! ఈ నెల 6తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. కెమేరాలకు ప్యాకప్ చెప్పేశారు. అంతవరకూ బాగుంది. మరి, ముందుగా ప్రకటించినట్టు ఏప్రిల్ 28న సినిమా విడుదల చేస్తారా? లేదా? అనే డౌట్ కొందరిలో ఉంది. ఎందుకంటే... సకాలంలో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడంతో ‘బాహుబలి’ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి విడుదల చేయలేకపోయారు. ఇప్పుడూ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా? అనే డౌట్స్ రావడం సహజమే కదా! ఈ డౌట్లకు ‘బాహుబలి–2’ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ కమల్‌కణ్ణన్ ఫుల్స్టాప్ పెట్టారు. ‘‘పదిహేను నెలలుగా అల్మోస్ట్ ఇండియాలోని మేజర్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలలో ‘బాహుబలి: ద కంక్లూజన్’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 33 కంటే ఎక్కువ స్టూడియోలు ‘బాహుబలి–2’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. మా అందరి లక్ష్యం ఒక్కటే... విడుదల దిశగా దూసుకువెళ్తున్నాం’’ అని కమల్‌కణ్ణన్ పేర్కొన్నారు. దీన్నిబట్టి చెప్పిన తేదీకే సినిమా వస్తుందని ఊహించవచ్చు!! -
అందుకు టైం కలసి రావాలి
పెళ్లికి నేను తయారయ్యాను కానీ అంటున్నారు అందాల తార అనుష్క. ఈ తరం నటీమణుల్లో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల నటిగా పేరు తెచ్చుకున్న మొదటి నటి అనుష్క అని పేర్కొనవచ్చు. అరుంధతి చిత్రంలో తన అట్టహాస నటన అంత సులభంగా మర్చిపోలేం. అదే విధంగా శత్రుసేనను తన ఖడ్గంతో చీల్చి చెండాడిన వీర వనిత రుద్రమదేవిగా అభినయం గుర్తుండి పోతుంది. 35 ఏళ్ల పరువాల ఈ కాంత ఇంకా జతను నిర్ణయించుకోలేదు. అయితే త్వరలో అనుష్క ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయని, కాబోయే వరుడి ఎంపిక కూడా జరిగిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే విధంగా ఈ ఏడాది అనుష్క నటించిన ఒక్క చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఈ విషయాల గురించి ఈ యోగా సుందరి ఎలా స్పందించారో చూద్దాం. నా పెళ్లి ఎప్పుడని చాలా మంది చాలా సార్లు అడుగుతున్నారు. కొందరైతే పెళ్లి కొడుకు నిశ్చయం అయ్యాడు, బెంగళూర్‌కు చెందిన వ్యాపార వేత్తను అనుష్క వరించనుంది. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోనున్నాను అనే దుమారం రేపుతున్నారు. నిజానికి పెళ్లికి నేను తయరయ్యాను. అయితే అందుకు కాలం కలిసి రావాలిగా. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలున్నాయి. కథానాయకికి ప్రాముఖ్య ఉన్న కథా చిత్రాలనే ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. గత ఏడాది మంచి కథా చిత్రాల్లో నటించాను. బాహుబలి చిత్రంలో నా పాత్ర ప్రశంసలు అందుకుంది. ఇడుప్పళగి చిత్రం కోసం బరువు భారీగా పెంచి నటించాను. రుద్రమదేవి చిత్రం మంచి ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక ఈ ఏడాది నా చిత్రాలేవీ విడుదల కాలేదు. ఇది కాస్త నిరాశ పరచే అంశమే. అయితే వచ్చే ఏడాది వరసగా మూడు చిత్రాలు తెరపైకి రానున్నాయి. బాహుబలి–2, ఎస్–2, నమో వెంకటే«శాయ చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటించాను. ఇది సంతోషకరమైన విషయం. బాహుబలి–2లో నేను పోషించిన దేవసేన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఓం వెంకటేశాయ భక్తిరస కథా చిత్రం.ఈ చిత్రాల్లో నన్ను వైవిధ్యభరిత పాత్రల్లో చూడవచ్చు. -
బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయింది
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మంగళవారంతో బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయినట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేటితో క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. భారీ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకోనుంది. తిరిగి సెప్టెంబరు 6 వ తేదీన కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది తెలియాలంటే 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల కావాల్సిందే. Climax of @BaahubaliMovie 2 is completed as scheduled! A well deserved break for the unit till Sept 6th. https://t.co/1txMPyCCOY — Shobu Yarlagadda (@Shobu_) 30 August 2016 -
వంద కోట్ల పారితోషికమా!
భారీ చిత్రాలు కూడా ఈ రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించడం కష్టతరంగా మారింది. అలాంటిది ఒక దర్శకుడి పారితోషికం రూ.100 కోట్లు అంటే నమ్మశక్యంగా ఉందా? అయితే నమ్మాల్సిందేనంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అవును అంత పెద్ద మొత్తాన్ని పారితోషికంగా డిమాండ్ చేసిన దర్శకుడు రాజమౌళి అన్న ప్రచారం ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం బాహుబలి అన్న సంగతిని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని తలదన్నే రీతిలో బాహుబలి-2 చిత్రాన్ని తాజాగా చెక్కుతున్నారు జక్కన్న. వెండితెర అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. చిత్ర వ్యాపారం కూడా మొదలైంది. ప్రారంభం అవడమే కాదు ప్రకంపనలు పుట్టిస్తోంది. తమిళనాడు హక్కులు 45 కోట్లకు అమ్మడు పోయినట్లు సమాచారం. అదే విధంగా కేరళ వెర్షన్ హక్కులు 15 కోట్లకు విక్రయించినట్లు సినీ వర్గాల సమాచారం. ఇక ఉత్తరాది హక్కులకు 100 నుంచి 150 కోట్లు వ్యాపారం జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే దర్శకుడు రాజమౌళి తన పారితోషికంగా తమిళ్, మలయాళం, హిందీ భాషల వ్యాపారంలో 50 శాతం డిమాండ్ చేసినట్లు పరిశ్రమ వర్గాల బోగట్టా. దీన్ని బట్టి చూస్తే ఆయన పారితోషికం రూ.100 కోట్లకు చేరుతుందని టాక్. ఇదే కనుక నిజం అయితే వంద కోట్లు పారితోషికం తీసుకుంటున్న ఏకైక భారతీయ సినీ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళీనే అవుతారు.