![బాహుబలి-2పై జూనియర్ ఎన్‌టీఆర్](/styles/webp/s3/article_images/2017/09/5/41493357039_625x300.jpg.webp?itok=S_xjbupt)
బాహుబలి-2పై జూనియర్ ఎన్‌టీఆర్
హైదరాబాద్: బాహుబలి-2 మూవీపై జూనియర్ ఎన్‌టీఆర్ స్పందించారు. దర్శకుడు రాజమౌళిపై ఈ యంగ్ హీరో ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత అద్భుతమైన కాన్వాస్ బాహుబలి-2 అని కొనియాడారు.
బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రనే కాదు.. భారతీయ సినిమాను మరో కొత్త లెవల్‌కి తీసుకెళ్లిందంటూ అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రభాస్, రానా దగ్గబాటి, అనుష్క, రమ్య క్రిష్ణన్ తమ అద్భుతమైన నటనతో రాజమౌళి విజన్‌కు మద్దుతిచ్చారని ట్వీట్ చేశారు. రాజమౌళి కలను సాకారం చేసిన శోభు ప్రసాద్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ అందరికీ తారక్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి-2 జైత్రయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే.
#Baahubali2 is Indian Cinema's finest canvas. @ssrajamouli has taken not just Telugu Cinema, but Indian Cinema to a whole new level.Hats off
— Jr NTR (@tarak9999) April 28, 2017