jr. ntr
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. దేవర ఆయుధ పూజ సాంగ్ లీక్..
-
ఆ హీరో తో మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుంటుంది..!
-
Jr. NTR Net Worth: ఖరీదైన కార్లు, లగ్జరీ వాచెస్, ఫ్యాన్స్ ఖుషీ!
గ్లోబల్ స్టార్, ఆస్కార్ విన్నింగ్ హీరో జూ.ఎన్టీఆర్ ఈరోజు తన 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా నందమూరి నటవారసుడి ఆస్తి, విలువైన కార్లు, ఇల్లు తదితర అంశాలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆసక్తి ఉంటుంది. ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, మెడ్రన్ వాచెస్, ప్రైవేట్ జెట్ తదితర వివరాలపై ఓ లుక్కేద్దాం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడే నందమూరి తారక రామారావు. 1991లో బాలనటుడిగా అరంగేట్రం చేసి తాతకు తగ్గమనవడిగా, జూ.ఎన్టీఆర్‌గా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. దశాబ్దాలుగా తన నటనతో సినీ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జూనియర్ ఎన్టీఆర్, మూవీ ఏదైనా బెస్ట్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకోవడం ఆయన స్పెషాల్టీ. అందుకే అభిమానులు ఆయనను టాలీవుడ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనకు మాత్రమే కాకుండా అతని సింప్లిసిటీకి కూడా పెట్టింది పేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరు. తాజాగా సెన్సేషనల్ టాలీవుడ్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్‌కి ఖరీదైన ఇల్లు, లగ్జరీ కార్లు, ఒక ప్రైవేట్ జెట్ వీటన్నింటికి మించి సూపర్ వాచ్ కలెక్షన్స్ ఉన్నాయి. రూ. 25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం, రూ. 80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. బృందావనం పేరుతో ఆరున్నర ఎకరాల వ్యవసాయభూమి కూడా ఉందని, దీనిని ఆయన లక్ష్మీ ప్రణతికి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. దీని వాల్యూ సుమారు 9 కోట్ల రూపాయలట. దీంతోపాటు బెంగుళూరులో కూడా ఆయనకు పలు ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అంతేకాదు రకరకాల వాచీలను ఇష్టపడే అతను రిచర్డ్ మిల్లే వాచ్ అంటే ఎక్కవగా లైక్ చేస్తారు. దీని ధర రూ. 4 కోట్లు. అలాగే 40MM వాట్ వాచ్ ధర రూ. 2.5 కోట్లు. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆస్కార్ రెడ్‌కార్పెట్ లుక్ అభిమానులను ఆకర్షించింది. ముఖ్యంగా తారక్ ధరించిన పాటెక్ ఫిలిప్ నాటిలస్ ట్రావెల్ టైమ్ వాచ్. దీని ధర రూ. 1. 56 కోట్ల రూపాయలు. టోటల్‌గా జూ.ఎన్టీరా్ ఆయన ఆస్తి విలువ రూ.571 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. పలు మీడియా నివేదికల ప్రకారం ఆయన నెలవారీ ఆదాయం రూ. 3 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కార్ల విషయానికి వస్తే లంబోర్ఘిని ఉరుస్ గ్రాపైట్ క్యాప్స్యూల్ని సొంతం చేసుకున్న తొలి ఇండియన్ మన జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. రూ. 2 కోట్ల రేంజ్ రోవర్ రోగ్ కారు, సుమారు 5 కోట్ల విలువైన నీరో నోక్టిస్ (బ్లాక్) ఉంది. దీని కస్టమ్ నంబర్ ప్లేట్ ధర 15 లక్షల రూపాయల కంటే ఎక్కువేనట. పోర్లే 718 కేమాన్రూ. కోటి, రూ. 2 కో ట్లబీఎండబ్ల్యూ 720 ఎన్డీ, కోటి రూపాయల మెర్సిడెస్‌బెంజ్ జీఎల్ఎస్ 350డీ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మే 20, 1983లో జన్మించారు. బాల రామాయణం చిత్రంలో తన నటనకు ఉత్తమ బాలనటుడి అవార్డును గెలుచుకోవడమే కాదు హీరోగా తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. -
‘నాటునాటు’: అంత ఎనర్జీలేదు అయినా ఓకే.. ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఇక తాజాగా ఈ మూవీలోని పాట ‘నాటునాటు’ ప్రపంచ చలన చిత్ర రంగానికి చెందిన ప్రతిష్ఠాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనిపైనే ఆనంద్ మహీంద్ర తాజాగా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘నాటు నాటు పాట తెలియని వారుండరు. ఈ వీడియోలోని ఈ రెండు పాత్రల్లో బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్- హార్డీ డ్యాన్స్‌లో ఆర్ఆర్ఆర్ హీరోల్లో కనిపించినంత ఎనర్జీ కనిపించకపోవచ్చు..కానీ పర్లేదు. ఎంజాయ్ చేయండి’ అంటూ ఆనంద్ మహీంద్ర పేర్కొనడంతో నాటునాటు మేనియా ఒక రేంజ్లో సాగుతోంది. పర్ఫెక్ట్ ఫ్రైడే అంటూ తెగ సంబరపడి పోతున్నారు. కామెడీ కింగ్స్ బ్రిటిష్-అమెరికన్ కామెడీ జంట లారెల్-హార్డీ స్టెప్పులేస్తున్న ఒక వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ‘నాటునాటు’ పాటకు వారు డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో.. అచ్చంగా ఆ పాటకు తగినట్టుగా ఉన్న ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సూపర్‌గా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ముఖ్యంగా భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా కూడా దీనిపై స్పందించారు. సంగీతం, నృత్యం, సినిమాలకు సంస్కృతి, భాష, జాతీయ, అంతర్జాతీయ అపుడు ఇపుడూ సరిహద్దులు లేవు. మూకీ సినిమాల కాలం నుండి ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది!! అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా నాటునాటు పాటకు ఇన్సిపిరేషన్‌గా ఉన్న ఈ వీడియో గత ఏడాది సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. No wonder music , dance & cinema have no boundaries of culture , language , national, international , now or from the past too !! proven world over since the time of silent movies !! — Suchitra Ella (@SuchitraElla) January 13, 2023 No one is immune from the catchiness of #NaatuNaatu. Not even inhabitants of the past..😄 L&H may not have the same energy as the #RRR duo but they’re not bad! Enjoy the #FridayFeeling pic.twitter.com/9tMSfAKux5 — anand mahindra (@anandmahindra) January 13, 2023 -
తెలుగు హీరోలతో బీజేపీ అగ్ర నేతల భేటీలు.. అందుకేనా?
దక్షిణాదిపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. సౌత్‌లో పార్టీని పటిష్టం చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే కర్ణాటకలో పాగా వేసిక కమలం పార్టీ మిగతా దక్షిణాది రాష్ట్రాల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. సంస్థాగతంగా బలపడేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. వివిధ రంగాలను చెందిన ప్రముఖులను తమవైపు తిప్పుకోవడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. వీరి భేటీపై స్థానిక నాయకులకు కూడా సమాచారం లేదంటే బీజేపీ అగ్రనాయకత్వం ఎంత ప్లాన్డ్గా ముందుకెళుతుందో అర్థమవుతుంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హీరో నితిన్‌పై సమావేశమయ్యారు. అయితే ఈ రెండు మర్యాదపూర్వక భేటీలని కమలనాథులు చెబుతున్నా.. దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందన్న వాదనలూ లేకపోలేదు. భారత మహిళల క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్‌తోనూ నడ్డా సమావేశం కావడం ఈ వాదనలకు మరింత బలాన్నిస్తోంది. ఇంకాస్త ముందుకెళితే ప్రధాని నరేంద్ర మోదీని అంబేద్కర్‌తో పోల్చి ప్రశంసించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు రాజ్యసభ సీటు దక్కింది. కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా బీజేపీ ఆశీస్సులతో పెద్దల సభలో అడుగుపెట్టారు. ఆర్ఎస్ఎస్ సమాజానికి అందిస్తున్న సేవలపై సినిమా తీస్తానని ఆయన ప్రకటించడం గమనార్హం. కళాతపస్వి కె. విశ్వనాథ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంతో బీజేపీ సర్కారు సత్కరించిన విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ప్రముఖ నటీమణులు విజయశాంతి, ఖుష్బూ ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు. (క్లిక్: హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్..) తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ స్పీడ్ పెంచింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలంటే మునుగోడులో కచ్చితంగా గెలవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో కమలం పార్టీ అగ్రనాయకులు తెలంగాణకు వరుస కడుతున్నారు. శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాలతో పాటు సినిమా ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తూ ప్రజల దృష్టి తమపై పడేలా చేసుకుంటున్నారు. బీజేపీ ఎత్తుగడలు ఏమేరకు ఫలిస్తాయో భవిష్యత్‌లో తెలుస్తుంది. (క్లిక్: కేసీఆర్‌ను ప్రజలే ఇంట్లో కూర్చోబెడతారు) -
రికార్డ్స్ సృష్టిస్తోన్న ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్
-
ఆర్ఆర్ఆర్ టీం ప్రెస్ మీట్ ఫోటోలు
-
వేసవి రేసుకు రెడీ అంటున్న స్టార్స్ వీళ్లే..
2020, 2021... ఈ రెండేళ్లు వేసవిలో సినిమా సంబరం లేకుండాపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా గతేడాది, సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది వేసవికి సినిమాలు థియేటర్లకు రాలేదు. కానీ వచ్చే ఏడాది వేసవిలో వసూళ్ల సందడి ఉంటుందని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల విడుదల ప్రకటనలు సమ్మర్‌ను టార్గెట్ చేస్తుండడమే ఇందుకు ఓ నిదర్శనం. ఇప్పటివరకూ ప్రకటించిన ప్రకారం వచ్చే వేసవి రేసుకి రెడీ అయిన స్టార్స్ ఎవరంటే... ‘బాహుబలి’ అద్భుత విజయం ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేస్తే, ‘కేజీఎఫ్’ సూపర్ హిట్టయి, అగ్ర హీరోలతో సినిమాలు చేసే దర్శకుల జాబితాలో ప్రశాంత్ నీల్ పేరును చేర్చింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియన్ మూవీ ‘సలార్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక 11 ఏళ్ల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి చేయనున్న సినిమా ప్రకటన ఇటీవల అధికారికంగా వచ్చింది. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఇంతకుముందు మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన విషయం ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత దర్శకుడు కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తామని కొరటాల ఇప్పటికే వెల్లడించారు. వీరితో పాటు ఇతర స్టార్స్ కూడా సమ్మర్ రేసులో నిలవడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. మరి... ఈ కరోనా మహమ్మారి ఇంకెన్నాళ్లు ఉంటుంది? అప్పటికి కరోనా ప్రభావం తగ్గుతుందా? కాలమే సమాధానం చెప్పాలి. -
ఉప్పెన పెద్ద విజయం సాధించాలి
‘‘ఉప్పెన’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ –‘‘ఈ కథను నేను మొదటగా చెప్పింది ఎన్టీఆర్గారికే. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి ఎలా వస్తోంది? అని అడిగేవారు. కథ విని ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ కథని చిరంజీవి, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌గార్లకు కూడా చెప్పాను. అందమైన, ఉద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది
ఈ ఏడాది చివర్లో ఉత్తరం వైపునకు పయనం కానుంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. డిసెంబరు రెండో వారంలో ఈ చిత్రబృందం నార్త్ ఇండియాకు పయనం కానుందని తెలిసింది. అక్కడ దాదాపు 25 రోజుల పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు అజయ్ దేవగన్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొంటారని సమాచారం. కీలక సన్నివేశాలను హర్యానాలో జరపడానికి ప్లాన్ చేశారు. ‘‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ మొదలై ఏడాది అవుతోంది. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయాన్ని బుధవారం ప్రకటిస్తాం’’ అని చిత్రబృందం వెల్లడించింది. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదల కానుంది. -
మగధీరుడి ఇంట్లో యమదొంగ!
సాక్షి, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క రామ్‌చరణ్‌ను పెట్టుకుని మధ్యలో ఆయన కూర్చున్న ఫొటోను ట్వీట్ చేసి ఈ మధ్య అభిమానుల్లో ఆసక్తి పెంచారు. రాజమౌళి ఓ మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని, అందులో ఎన్టీఆర్–చరణ్ హీరోలుగా నటించడానికి అంగీకరించారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా కానీ, కథపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. అయితే తాజాగా రామ్‌చరణ్ ఇంట్లో జరిగిన ఫ్రీ క్రిస్మస్ మేడుకలకు ఎన్టీఆర్ తన కుటుంబంతో హజరయ్యారు. వారితోతో పాటు యువ కథానాయకుడు శర్వానంద్, ‘అర్జున్‌రెడ్డి’ దర్శకుడు సందీప్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ ఫొటోను ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. చెర్రీ భార్య ఉపాసన విస్తరాకులతో క్రిస్మస్ చెట్టును తయారు చేశారు. ‘ఈ క్రిస్మస్ చెట్టును విస్తరాకులతో నేనే తయారు చేశా. మిస్టర్ ‘సి’తో ఉన్న వ్యక్తులను గుర్తు పట్టగలరా?’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా, చరణ్–బోయపాటి సినిమా ఇంచుమించు ఒకేసారి పూర్తవుతాయి. అప్పుడు ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. This is my #christmastree made with recyclable istaraakulu - it’s up to u to guess the ppl with Mr C 😜🧐🤪 #ramcharan #ramchanranbestie pic.twitter.com/gzTAlGFiUu — Upasana Kamineni (@upasanakonidela) December 13, 2017 -
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో క్రేజీ హీరోయిన్
సాక్షి, హైదరాబాద్ : జైలవకుశతో హిట్‌కొట్టిన తారక్ మరో చిత్రానికి సన్నద్దమౌతున్నాడు. బాబీ దర్శకత్వంలో తారక్ త్రిపాత్రాభినయం అటు అభిమానులను, ప్రేక్షకులను కట్టిపడేసింది. దసరా బరిలో నిలిచిన ఈ చిత్రం తాజాగా వందకోట్ల క్లబ్లో చేరింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. ఈ ఉత్సాహంతో తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు ఈజైలవకుశ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో భారీ తారాగణంతో ఆ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రంతో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆ తర్వాతి చిత్రం జూనియర్ ఎన్టీఆర్‌తో తీయనున్నాడు. ఇందుకోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక జోరందుకుందని సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. తారక్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో క్రేజీ హీరోయిన్ నటించబోతోందని సమాచారం. ఎవడు, ఐ చిత్రాల ద్వారా సుపరిచితమైన అమీజాక్సన్ ఇందులో హీరోయిన్గా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించడంలో సిద్దహస్తుదైన త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కుటుంబ విలువలు నేపథ్యంలో జరిగే ఓ మాస్ సినిమాను తీయబోతున్నారని తారక్ అభిమానులు ఆనందంలో ఉన్నారు. -
జూనియర్ ఎన్టీఆర్‌కు కరెక్టు మొగుడు అతనే!
బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టడంలో, కలెక్షన్లతో అదరగొట్టడంలో అతనికి అతనే సాటి. అలాంటి టాలీవుడ్ యంగ్ టైగర్‌కి ఇప్పుడు కరెక్ట్ మొగుడు వచ్చాడట. జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన మంచు మనోజ్ ఈ ముక్క చెప్పాడు. వరుస విజయాలతో ఊపుమీదున్న తారక్‌కు కరెక్ట్ మొగుడు దొరికాడని మనోజ్ తెగ ఇదవుతున్నాడు. ఇంతకీ ఆ మొగుడు ఎవరంటే.. బుజ్జీ ఎన్టీఆరే. ఇంతకు విషయమేమిటంటే.. తాజాగా మంచు మనోజ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడట. అక్కడికి వెళ్లగానే ఎన్టీఆర్ బుజ్జీ తనయుడు అభయ్ చల్లటి నీళ్ల గ్లాసుతో స్వాగతం పలుకడమే కాదు.. స్వయంగా తానే గ్లాస్ పట్టుకొని తాగించాడు కూడా. అంతే బుజ్జీ అభయ్ ప్రేమకు పొంగిపోయిన మనోజ్.. ఈ బుడ్డోడే తారక్‌కు కరెక్ట్ మొగడంటూ ఫొటో పెట్టి మరీ ట్వీట్ చేశాడు. ఈ సరదా ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. -
బాహుబలి-2పై జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్: బాహుబలి-2 మూవీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. దర్శకుడు రాజమౌళిపై ఈ యంగ్ హీరో ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత అద్భుతమైన కాన్వాస్ బాహుబలి-2 అని కొనియాడారు. బాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రనే కాదు.. భారతీయ సినిమాను మరో కొత్త లెవల్‌కి తీసుకెళ్లిందంటూ అభినందనల్లో ముంచెత్తారు. ఈ సందర్భంగా ప్రభాస్, రానా దగ్గబాటి, అనుష్క, రమ్య క్రిష్ణన్ తమ అద్భుతమైన నటనతో రాజమౌళి విజన్‌కు మద్దుతిచ్చారని ట్వీట్ చేశారు. రాజమౌళి కలను సాకారం చేసిన శోభు ప్రసాద్ సహా నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర యూనిట్ అందరికీ తారక్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి-2 జైత్రయాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. #Baahubali2 is Indian Cinema's finest canvas. @ssrajamouli has taken not just Telugu Cinema, but Indian Cinema to a whole new level.Hats off — Jr NTR (@tarak9999) April 28, 2017 -
ఒంట్లో బాలేకపోయినా ఓటు వేశా: జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని జీహెచ్ ఎంసీ ఓటర్లకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు ఒంట్లో నలతగా ఉన్నా వచ్చి ఓటేశానని వెల్లడించారు. అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు వేశారు. అక్కినేని నాగార్జున అమల, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూకట్ పల్లి డివిజన్ లో ఓటు వేశారు. -
జూ.ఎన్టీఆర్ పేరెత్తినందుకు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం నాయకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, పార్టీ తెలంగాణ నేతలు సీట్లు అమ్ముకున్నారని నగర టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణ మూర్తి బుధవారం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీని బతికించాలంటే జూ.ఎన్టీఆర్‌కు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో నైషధం వ్యవహారశైలిని పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. జూనియర్ ఎన్టీఆర్‌కు బాధ్యతలు కట్టబెట్టమని డిమాండ్ చేసిన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ నగర అధ్యక్షుడు, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రకటించారు. నైషధం సత్యనారాయణ మూర్తి రాంనగర్ డివిజన్ నుంచి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీల పేరుతో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని, ఆయన భార్య అడిక్‌మెట్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారని, దీనిని క్రమశిక్షణా చర్యగా పరిగణిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడికి సస్పెండ్ చేసే హక్కు ఎక్కడిది? పార్టీ సీనియర్ నాయకుడినైన తనను సస్పెండ్ చేసే హక్కు జిల్లా పార్టీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌కు ఎక్కడిదని నైషధం సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చిన ఆయన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణతో వాగ్వివాదానికి దిగారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగానీ, క్రమశిక్షణా సంఘం చైర్మన్ గానీ తీసుకోవలసిన సస్పెన్షన్ నిర్ణయాన్ని గోపీనాథ్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతరం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, రాజీనామా లేఖను ఎన్టీఆర్ విగ్రహంకు సమర్పించారు. -
ఫ్యాన్స్‌కు ప్రేమతో
-
రాక్‌స్టార్‌లా దుమ్మురేపిన ఎన్టీఆర్
-
కల్యాణ్ రామ్‌తో జూ.ఎన్టీఆర్
చెన్నై: నందమూరి వారసులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ కలసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. కల్యాణ్ రామ్ సొంత బ్యానర్లో జూనియర్ ఎన్టీఆర్ ఓ చిత్రంలో నటించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. 'కల్యాణ్ రామ్ బ్యానర్లో ఓ చిత్రంలో నటించేందుకు జూ.ఎన్టీఆర్ అంగీకరించారు. వచ్చే ఏడాది ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. మిగిలిన తారాగణాన్ని ఎంపిక చేయాల్సివుంది' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. కిక్, రేసుగుర్రం సినిమాలకు వంశీ రచయితగా పనిచేశారు. -
ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రుడు
చెన్నై: సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తండ్రి పాత్ర పోషించనున్నారు. పలు సినిమాల్లో ఇప్పటికే హీరోలకు తండ్రిగా నటించిన ఆయన ఈసారి ఎన్టీఆర్‌కు తండ్రిగా నటించబోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కెస్తున్న 'మా నాన్నకు ప్రేమతో' షూటింగ్ జూన్ 29 నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. ముందుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రి పాత్రని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తారని అనుకున్నారు. అయితే చివరకు ఆ పాత్ర చేసే అవకాశం రాజేంద్ర ప్రసాద్‌కి దక్కింది. తండ్రి, కొడుకుల మధ్య ఉన్న అనుబంధంపై ఈ సినిమా తెరకెక్నుంది. ఇక చిత్ర హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ కు తండ్రిగా జగపతిబాబు నెగటివ్ రోల్ చేయనున్నారు. షూటింగ్ నవంబర్ చివరికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఈ చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. -
యూకేలో స్టార్ట్ కాబోతున్న తొలి తెలుగు సినిమా
-
ఎన్టీఆర్ యాక్టింగ్ లో మార్పుకు కారణం ఏమిటి?
చెన్నై: గతంతో పోలిస్తే తెలుగు నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో చాలానే మార్పు వచ్చిందట. నటనలో మార్పుతో పాటు అతని వ్యక్తిత్వంలో కూడా మార్పులో చేసుకోవడం తనకు సృష్టంగా కనిపించిందని నటి కాజల్ అగర్వాల్ అన్నారు. ఈ జోడీలో వస్తున్న 'టెంపర్' చిత్రం ఈ శుక్రవారం విడుదల అవుతున్న నేపథ్యంలో కాజల్ మీడియాతో ముచ్చటించింది. 'ఎన్టీఆర్ గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్ తో పెళ్లికి ముందు.. తరువాత కలిసి నటించా. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లో చాలానే మార్పు వచ్చింది. పెళ్లి అయిన తరువాత ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా వ్యక్తిత్వంలో కూడా హుందాతనం కనబడుతోంది.' అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. దీనంతటికీ కారణం ఎన్టీఆర్ ఓ బిడ్డకు జన్మినవ్వడమేనేమో అన్నది. ఎన్టీఆర్ సెట్స్ లో ఎప్పుడూ కొడుకు అభయ్ రామ్ గురించే మాట్లాడుతుంటూ.. చాలా సంతోషంగా ఉంటాడని కాజల్ తెలిపింది. తండ్రి అవ్వడం అనేది మనిషిలో ఎంతటి మార్పును తీసుకొస్తుందో ఎన్టీఆర్ చూసి తెలుసుకున్నానని కాజల్ స్పష్టం చేసింది. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎన్టీఆర్
-
ప్రచారానికి పిలవాలా... వారే రావాలి !!
-
'ఎన్టీఆర్ ఫోటో లేదు కానీ.. పవన్‌ది పెడతారా..'
-
పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్!
హీరోయిజాన్ని తెరపై ఆవిష్కరించడంలో పూరి జగన్నాథ్ స్టైలే వేరు. ఏ సినిమాలో ఎలా కనిపించినా... పూరి సినిమాల్లో మాత్రం హీరోలు పెక్యులర్‌గా కనిపిస్తారు. భిన్నంగా బిహేవ్ చేస్తారు. ప్రతి టాలీవుడ్ స్టార్... పూరీతో పనిచేయడానికి ఉవ్విళ్లూరేది అందుకే. పూరి కెరీర్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో విడుదలైన సినిమా అంటే... టక్కున గుర్తొచ్చేది ‘ఆంధ్రావాలా’. విడుదలకు ముందు ఆ సినిమాకు వచ్చిన హైప్ అంతాఇంతా కాదు. నిమ్మకూరులో ఆ సినిమా ఆడియో ఫంక్షన్ నేటికీ ఓ రికార్డే. ‘సింహాద్రి’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేసిన సినిమా అవ్వడంతో... ఆ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. అయితే... ఆ స్థాయి అంచనాలను ‘ఆంధ్రావాలా’ అందుకోలేకపోయింది. ఇది పదేళ్ల నాటి మాట. అప్పట్నుంచీ విడివిడిగా తారక్, పూరి ఎన్ని విజయాలను అందుకున్నా... ఇద్దరూ కలిసి ఓ హిట్ ఇవ్వా లనే కోరిక మాత్రం కలగానే మిగిలిపోయింది. అయితే... ఆ కల నిజం చేసే పనిలో ఉన్నారు పూరి జగన్నాథ్. ‘హార్ట్ ఎటాక్’ తర్వాత పూరి చేయబోయే సినిమా ఏంటి? అనే విషయంపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఆగడు’ షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మహేశ్ పూరి జగన్నాథ్ సినిమా చేస్తారట. అయితే... ‘ఆగడు’ పూర్తవ్వడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. ఈ గ్యాప్‌లో... తారక్‌తో ఓ సినిమా చేయడానికి పూరి ప్లాన్ చేస్తున్నారని వినికిడి. సినిమాను యమ స్పీడ్‌గా పూర్తి చేసే పూరి... ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ని ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.