
ఒంట్లో బాలేకపోయినా ఓటు వేశా: జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకున్ని ఎన్నుకోవాలని జీహెచ్ ఎంసీ ఓటర్లకు జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు ఒంట్లో నలతగా ఉన్నా వచ్చి ఓటేశానని వెల్లడించారు. అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
పలువురు సినీ ప్రముఖులు కూడా ఓటు వేశారు. అక్కినేని నాగార్జున అమల, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూకట్ పల్లి డివిజన్ లో ఓటు వేశారు.