బన్నీ మాత్రం చెప్పలేదు బ్రదర్‌! | Allu Arjun Not Wished Pawan Political Tour | Sakshi
Sakshi News home page

Published Tue, Jan 23 2018 12:25 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Allu Arjun Not Wished Pawan Political Tour - Sakshi

సాక్షి, సినిమా : సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో అభిమానులతోపాటు మెగా కాంపౌండ్‌ నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. చిరంజీవి తనయుడు-మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మరో ఇద్దరు హీరోలు వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూనే మా మద్ధతు ఉంటుందని ట్వీటర్‌లో ట్వీట్లు చేశారు. 

అయితే మెగా హీరో ట్యాగ్‌ లైన్‌తో చెలామణి అవుతున్న అల్లు అర్జున్‌ మాత్రం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించలేదు. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. ఇప్పటిదాకా పవన్‌కు విషెస్‌ చెప్పకపోవటం వెనుక కొందరు కారణాలను అన్వేషిస్తున్నారు.

స్టైలిష్‌ స్టార్‌ బ్రదర్‌ అల్లు శిరీష్‌ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఏది ఏమైనా సరైనోడు చిత్ర బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్‌ గురించి ‘చెప్పను బ్రదర్‌’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చి పీకే ఫ్యాన్స్‌కు దూరమైన బన్నీ నుంచి.. ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవటం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement