Mega Heroes
-
మెగా ఫ్యామిలీకి లక్ ఫ్యాక్టర్ ఆ పేరు
-
అల్లు అరవింద్‌కు పంచ్
సాక్షి, హైదరాబాద్ ; పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు... వాటి వెనకాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రోత్సాహంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారడం తనని మీడియా ముందుకు వచ్చేలా చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఓ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలపై పలువురు సినీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. (వర్మ రిప్లై) సినీ ఇండస్ట్రీని, కొందరు నటీనటులను లక్ష్యంగా చేసుకుని డిబేట్లు నిర్వహిస్తున్న కొన్ని ఛానెళ్లను బహిష్కరించాల్సిందిగా ఆయన ప్రతిపాదన లేవనెత్తారంట. ఈ మేరకు సహకరించాలని ఆయన అక్కడున్న సినీ పెద్దలను కోరినట్లు సమాచారం. అయితే వారు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలపై శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసినప్పుడు ఖండించకుండా.. ఇప్పుడు ఆయన ఇలా కోరటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారంట. అంతేకాదు ఇంతదాకా మౌనంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలు.. ఇప్పుడు తమ దాకా విషయం వచ్చేసరికి హడావుడి చేస్తున్నారంటూ మరికొందరు ఆయన ముఖం మీదే చెప్పినట్లు భోగట్టా. ప్రస్తుతం ఈ అంశంపై ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. -
బన్నీ మాత్రం చెప్పలేదు బ్రదర్!
సాక్షి, సినిమా : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభించిన నేపథ్యంలో అభిమానులతోపాటు మెగా కాంపౌండ్ నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. చిరంజీవి తనయుడు-మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, మరో ఇద్దరు హీరోలు వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్‌లు పవన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూనే మా మద్ధతు ఉంటుందని ట్వీటర్లో ట్వీట్లు చేశారు. అయితే మెగా హీరో ట్యాగ్ లైన్‌తో చెలామణి అవుతున్న అల్లు అర్జున్ మాత్రం ఇప్పటిదాకా ఈ అంశంపై స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. ఇప్పటిదాకా పవన్‌కు విషెస్ చెప్పకపోవటం వెనుక కొందరు కారణాలను అన్వేషిస్తున్నారు. స్టైలిష్ స్టార్ బ్రదర్ అల్లు శిరీష్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. ఏది ఏమైనా సరైనోడు చిత్ర బ్లాక్ బస్టర్ ఫంక్షన్ లో పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పీకే ఫ్యాన్స్‌కు దూరమైన బన్నీ నుంచి.. ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవటం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీ వెంటే మేము #jaijanasena pic.twitter.com/PDduVqCbjf — Sai Dharam Tej (@IamSaiDharamTej) 22 January 2018 All The Best Babai, More Power To You!! #JaiJanaSena ✊🏼 pic.twitter.com/EytJWa0zho — Varun Tej (@IAmVarunTej) 22 January 2018 -
'టీడీపీ ప్రభుత్వాన్ని చూసి నటన నేర్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను అవార్డులు ప్రకటించగా కేవలం ఒక్క అల్లు అర్జున్ కు అది కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరిలో అవార్డు ప్రకటించటంపై విమర్శలు వస్తున్నాయి. చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించినా.. ఇతర హీరోలను పరిగణలోకి తీసుకోకపోవటం విమర్శలకు కారణమవుతోంది. మెగాఫ్యామిలీకి సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరించే బన్నీవాసు, అవార్డుల ఎపింకపై సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే తక్షణం చంద్రబాబు సర్కార్ వద్ద శిక్షణ తీసుకోవాలి అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. అవార్డు ప్రకటించిన మూడేళ్ల సమయంలో మెగా హీరోలు నటించిన పదిహేనుకుపైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి వీటిలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు, ధృవ, గోవిందుడు అందరివాడేలే.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు కమర్షియల్ గాను ఘనవిజయాలు సాధించాయి. కానీ ఈ సినిమాలకు గాను ఆ హీరోలకు ఏ అవార్డులు దక్కలేదు. గతంలోనూ నంది అవార్డుల ఎంపిక వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికార పార్టీ వ్యక్తులకు, జ్యూరీ సభ్యుల అనుయాయులకు మాత్రం అవార్డులు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ విమర్శలపై నంది అవార్డుల జ్యూరీ, టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఈ ఏడాదికి మెగా సినిమా లేనట్టే..?
2016 మొదట్లో వరుసగా సినిమాలు రిలీజ్ చేసిన మెగా హీరోలు ద్వితీయార్థంలో మాత్రం వెండితెరకు దూరంగా ఉంటున్నారు. సమీప భవిష్యత్తులో ఏ ఒక్క మెగా హీరో సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించటం లేదు. గత ఏడాది చివర్లో బ్రూస్ లీ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన చరణ్, తన నెక్ట్స్ సినిమాగా ఎనౌన్స్ చేసిన ధృవను ఇంత వరకు పూర్తి స్ధాయిలో సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. దీంతో ఈ ఏడాదిలో ధృవ రిలీజ్ అయ్యే అవకాశం కనిపించటం లేదు. డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ కూడా రెండు సినిమాలు ఎనౌన్స్ చేసినా.. ఏ ఒక్కటీ పట్టాలెక్కించలేదు. భారీ అంచనాల మధ్య సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ కూడా ప్రస్తుతం హాలీడే మూడ్‌లోనే ఉన్నాడు. ఇంత వరకు తన నెక్ట్స్ సినిమా ప్రారంభించలేదు. ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ అయితే సరైనోడు సినిమా తరువాత తను చేయబోయే సినిమా ఏంటో కూడా ప్రకటించలేదు. అందుకే ఈ హీరోల సినిమాలేవి 2016లో రిలీజ్ అయ్యే అవకాశమే లేదు. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమా చాలా రోజులుగా ఊరిస్తున్నా.. ఎప్పుడూ సెట్స్ మీదకెళుతుందో తెలీదు. ఒక వేళ వెంటనే షూటింగ్ స్టార్ట్ అయినా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కావటంతో రిలీజ్‌కు చాలా సమయం పడుతోంది. కాబట్టి చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కూడా ఈ ఏడాదిలో ఉండే అవకాశం లేదు. ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రం ఈ ఏడాదిలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తిక్క సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికావచ్చింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో మెగా అభిమానులను అలరించడానికి సాయి సినిమా ఒక్కటే రానుంది. -
మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..?
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. ఆడియో రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో భారీగా సందడి చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత మాత్రం స్లో అయ్యింది. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్ధాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అభిమానుల సంగతి ఎలా ఉన్న మెగాహీరోలు కూడా దీనిపై పెదవి విప్పలేదు. బయటి హీరోల సినిమాల విషయంలో కూడా యాక్టివ్‌గా కామెంట్లు చేసే అల్లు శిరీష్, సాయి ధరమ్‌తేజ్ కూడా సర్దార్ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఆడియో బాగుందటూ ట్వీట్ చేసి సరిపెట్టేసిన రామ్ చరణ్ కూడా ట్రైలర్ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. తను సినిమాల గురించి ట్వీట్ చేయనంటూనే క్షణం సినిమాను పొగిడేసిన బన్నీ కూడా ఈ సినిమా విషయంలో నోరు మెవపలేదు. మేకింగ్ వీడియో రిలీజ్ అయినప్పుడే తెగ హడావిడి చేసిన వరుణ్ తేజ్.. ఆడియో, థియట్రికల్ ట్రైలర్ల రిలీజ్ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. మరి మెగా హీరోలు బిజీగా ఉండి సర్దార్ గబ్బర్‌సింగ్‌ను పట్టించుకోలేదా..? లేక నిజంగానే ట్రైలర్ నచ్చక సైలెంట్ అయిపోయారా..? అన్న అనుమానం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కలుగుతోంది. పవన్ కళ్యాణ్ అంతా తానే అయి తెరకెక్కిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పవన్ సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.