
నిర్మాత అల్లు అరవింద్
సాక్షి, హైదరాబాద్ ; పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు... వాటి వెనకాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రోత్సాహంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఫిలిం ఛాంబర్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని సంఘటనలు మెగా ఫ్యామిలీకి ఇబ్బందికరంగా మారడం తనని మీడియా ముందుకు వచ్చేలా చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఓ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలపై పలువురు సినీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. (వర్మ రిప్లై) సినీ ఇండస్ట్రీని, కొందరు నటీనటులను లక్ష్యంగా చేసుకుని డిబేట్లు నిర్వహిస్తున్న కొన్ని ఛానెళ్లను బహిష్కరించాల్సిందిగా ఆయన ప్రతిపాదన లేవనెత్తారంట. ఈ మేరకు సహకరించాలని ఆయన అక్కడున్న సినీ పెద్దలను కోరినట్లు సమాచారం. అయితే వారు మాత్రం అందుకు సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది.
ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలపై శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసినప్పుడు ఖండించకుండా.. ఇప్పుడు ఆయన ఇలా కోరటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారంట. అంతేకాదు ఇంతదాకా మౌనంగా ఉన్న మెగా ఫ్యామిలీ హీరోలు.. ఇప్పుడు తమ దాకా విషయం వచ్చేసరికి హడావుడి చేస్తున్నారంటూ మరికొందరు ఆయన ముఖం మీదే చెప్పినట్లు భోగట్టా. ప్రస్తుతం ఈ అంశంపై ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment