మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..? | Mega Heroes did Not Respond on Sardaar Gabbar singh Trailer | Sakshi
Sakshi News home page

మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..?

Published Thu, Mar 24 2016 11:10 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..? - Sakshi

మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..?

ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్సింగ్. ఆడియో రిలీజ్కు ముందు సోషల్ మీడియాలో భారీగా సందడి చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత మాత్రం స్లో అయ్యింది. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్ధాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అభిమానుల సంగతి ఎలా ఉన్న మెగాహీరోలు కూడా దీనిపై పెదవి విప్పలేదు. బయటి హీరోల సినిమాల విషయంలో కూడా యాక్టివ్గా కామెంట్లు చేసే అల్లు శిరీష్, సాయి ధరమ్తేజ్ కూడా సర్దార్ విషయంలో సైలెంట్ అయిపోయారు.

ఆడియో బాగుందటూ ట్వీట్ చేసి సరిపెట్టేసిన రామ్ చరణ్ కూడా ట్రైలర్ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. తను సినిమాల గురించి ట్వీట్ చేయనంటూనే క్షణం సినిమాను పొగిడేసిన బన్నీ కూడా ఈ సినిమా విషయంలో నోరు మెవపలేదు. మేకింగ్ వీడియో రిలీజ్ అయినప్పుడే తెగ హడావిడి చేసిన వరుణ్ తేజ్.. ఆడియో, థియట్రికల్ ట్రైలర్ల రిలీజ్ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. మరి మెగా హీరోలు బిజీగా ఉండి సర్దార్ గబ్బర్సింగ్ను పట్టించుకోలేదా..? లేక నిజంగానే ట్రైలర్ నచ్చక సైలెంట్ అయిపోయారా..? అన్న అనుమానం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కలుగుతోంది.

పవన్ కళ్యాణ్ అంతా తానే అయి తెరకెక్కిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పవన్ సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement