Sardaar Gabbar Singh
-
‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష
-
ఎన్టీఆర్ కొత్త సినిమా: లైన్లోకి పవన్ డైరెక్టర్
‘జనతా గ్యారేజ్’ సూపర్‌హిట్‌తో ఊపుమీదున్న జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురావాలని ప్లాన్ చేస్తున్న తారక్.. యువ దర్శకులకు చాన్స్ ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్ దర్శకుడిని లైన్లోకి తెచ్చినట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాను తీసిన దర్శకుడు బాబీని స్క్రిప్ట్ ప్రిపేర్ చేయమని జూనియర్ ఎన్టీఆర్ అడిగినట్టు తెలుస్తోంది. దీంతో ఎగిరి గంతేసిన బాబీ ప్రస్తుతం కథను సిద్ధం చేయడంలో తలమునకలైనట్టు చెప్తున్నారు. బాబీ కథకు తారక్ కనుక ఓకే చెప్తే.. అది బాబీ కెరీర్‌కు పెద్ద మలుపు కానుంది. ‘జనతా గ్యారేజ్’ హిట్‌తో తారక్ తన తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అసాధరణ కథతో ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది ఆయన ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు దర్శకుల కథలను విన్న తారక్ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకు తన ఆమోదం తెలుపలేదు. -
అభిమానులకు పవన్ బర్త్ డే గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతానికి పవన్ షూటింగ్లో పాల్గొనకపోయినా.. త్వరలోనే యూనిట్‌తో జాయిన్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందిస్తున్నారన్న టాక్ వినివిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం కన్ఫర్మేషన్ లేదు. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ఈ సారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
మరోసారి చాన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ వేషం దక్కడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఓ బాలీవుడ్ నటుణ్ని పిలిచి మరి ప్రతినాయక పాత్ర ఇచ్చాడు పవన్ కళ్యాణ్. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా కోసం ఉత్తరాది నటుడు శరద్ కేల్కర్‌కు అవకాశం ఇచ్చాడు పవన్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న శరద్ లుక్కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో మరోసారి ఇదే విలన్‌కు ఛాన్స్ ఇస్తున్నాడు పవర్ స్టార్. పవన్ ప్రస్తుతం, గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం మరోసారి శరద్ కేల్కర్నే విలన్‌గా తీసుకోవాలని భావిస్తున్నాడు పవన్ కళ్యాణ్. శరద్ పర్సనాలిటీ ఫ్యాక్షనిస్ట్ పాత్రకు సరిగ్గా సరిపోతుందన్న ఆలోచనలో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పూర్తిగా పంచె కట్టులోనే కనిపించనున్నాడట. గబ్బర్ సింగ్ తరువాత మరోసారి శృతిహాసన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమా మీద అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. -
కాజల్‌కు బాధ లేదట..!
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. కెరీర్ ఇక ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో రెండు భారీ చిత్రాల్లో అవకాశం వచ్చినా ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఈ అమ్మడు హీరోయిన్గా నటించిన సర్థార్ గబ్బర్‌సింగ్, బ్రహ్మోతవ్సం సినిమాలు అభిమానులను నిరాశపరచటంతో టాలీవుడ్ కాజల్ కెరీర్ మరోసారి ఇబ్బందుల్లో పడింది. అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్ తనకు బాధ కలిగించలేదని చెపుతోంది ఈ బ్యూటి. ప్రస్తుతం తన బాలీవుడ్ సినిమా దో లఫ్జోంకీ కహాని ప్రమోషన్లో బిజీగా ఉన్న కాజల్, సర్థార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాల గురించి మీడియాతో మాట్లాడింది. ఆ రెండు సినిమాలు నేను ఇష్టంగా చేశాను. పవన్ లాంటి స్టార్ హీరో సరసన తొలి సారిగా నటించటం ఆనందంగా ఉంది. బ్రహ్మోత్సవం లాంటి భారీ చిత్రాల్లో అవకాశం రావటం అరుదు. అందుకే ఆ సినిమాల్లో నటించటం ఆనందంగా ఉంది.. అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం కాజల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా మాత్రమే ఉంది. తేజ దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు కృష్ణవంశీ నక్షత్రంలో అతిథి పాత్రలో కనిపించనుంది. -
పవన్ బిజీ అవుతున్నాడు
సర్దార్ గబ్బర్‌సింగ్ రిజల్ట్‌తో షాక్ తిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అతి త్వరలో సినిమాలకు స్వస్తి పలకాలనుకుంటున్న తరుణంలో వీలైనంత త్వరగా సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలకు ఓకే చెప్పేసిన పవన్, ఆ సినిమాలకు కథలు ఫైనల్ చేయనున్నాడు. మైత్రీ మూవీస్, 14 రీల్స్, పీవీపీ లాంటి భారీ సంస్థలు క్యూలో ఉన్నా వారిని కాదని తన స్నేహితులకే సినిమాలు చేయనున్నాడు. ముందుగా ఎస్ జె సూర్య డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మరోసారి తన మిత్రుడు శరత్ మరార్ నిర్మాణంలోనే తెరకెక్కించనున్నారు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కనుంది, ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్ కోసం చేయాల్సి ఉన్నా ఇప్పుడు వారినీ కాదని త్రివిక్రమ్, శరత్ మరార్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ముందుగా మాట ఇచ్చిన ప్రకారం దాసరి నారాయణరావు నిర్మాణంలో ఓ సినిమాకు అంగీకరించాడు. తనకు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఏఎమ్ రత్నం బ్యానర్లో కూడా సినిమాకు ఓకే చెప్పాడు పవన్. ఈ నాలుగు సినిమాలతో తను ఆర్థికంగా సెటిల్ అయితే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావిస్తున్నాడు. -
తొలిరోజు కలెక్షన్లు రూ. 31 కోట్లు
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ తొలిరోజు భారీ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విడుదలైన శుక్రవారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్టు ట్రేడ్ విశ్లేషకుడు త్రినాథ్ చెప్పాడు. టాలీవుడ్లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా బహుబలి తర్వాతి స్థానంలో సర్దార్ గబ్బర్‌సింగ్ నిలిచింది. శ్రీమంతుడి చిత్రం రికార్డులను బ్రేక్ చేసింది. పవన్ కల్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాలు, బాలీవుడ్లో 2 వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. దీనికితోడు దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేశారు. కాగా తొలి రోజు రికార్డు కలెక్షన్లు వచ్చినా, రెండో రోజు శనివారం తగ్గినట్టు శ్రీనాథ్ చెప్పాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు 31 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది అద్భుతమైన ఆరంభం. అయితే డివైడ్ టాక్ కారణంగా రెండో రోజు చాలా ప్రాంతాల్లో కలెక్షన్లు తగ్గాయి' అని శ్రీనాథ్ చెప్పాడు. -
ఆయనతో... నేనే తెగ మాట్లాడేసేదాన్ని!
కాజల్ అగర్వాల్ తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయింది. ఇన్నేళ్లల్లో ఒక్క పవన్‌కల్యాణ్ తప్ప దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆడిపాడేశారు కాజల్. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో ఆ లోటు కూడా తీరిపోయిందామెకు. ఈ సందర్భంగా ఆమె సినిమా గురించి చెప్పిన విశేషాలు.... ♦ ‘మగధీర’లో రామ్‌చరణ్ పక్కన రాకుమారి మిత్రవిందగా చేయడం, మళ్లీ ‘సర్దార్...’లో కూడా రాకుమారిగా చేయడం యాదృచ్ఛికం. ‘మగధీర’ ఓ ఎపిక్ స్టోరీ. కాస్త సోషియో -ఫ్యాంటసీ నేపథ్యంలో సాగుతుంది. కానీ ఈ సినిమాలో పాత్ర మాత్రం చాలా కాంటెపరరీగా సాగుతుంది. ఇప్పటి తరానికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అందుకే ఇందులోని యువరాణి అర్షికా దేవి పాత్ర గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నా. ♦ పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ లవి పూర్తిగా రెండు విభిన్న మనస్తత్వాలు. కానీ ఇద్దరూ చాలా ప్రొఫెషనల్. రామ్‌చరణ్ చాలా ఔట్‌స్పోకెన్. గడగడా మాట్లాడేస్తారు. పవన్‌కల్యాణ్ మాత్రం కాస్త రిజర్వ్డ్. సెట్లో ఆయన మాట్లాడడం చాలా తక్కువ. నేనే ఆయనతో తెగ మాట్లాడేసేదాన్ని. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, పవన్‌కల్యాణ్ తనకు బాగా సన్నిహితులైనవారితో మాత్రం చాలా బాగా మాట్లాడతారు. ఇద్దరూ చాలా ప్రొఫెషనల్. యాక్టింగ్ వారి రక్తంలోనే ఉంది. ♦ గతంలో రామ్‌చరణ్‌తో ‘మగధీర’, ‘గోవిందుడు అందరివాడే’ చిత్రాల్లో, అల్లు అర్జున్‌తో ‘ఆర్య-2’లో నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పవన్‌కల్యాణ్‌తో నా జోడీ బాగా కుదిరిందని ప్రశంసలు వస్తున్నాయి. అయినా, కెమేరా ముందు ఇద్దరు కలసి నటిస్తూ ఉంటే, కెమిస్ట్రీ అనేది అలా కుదిరిపోవాలి అంతే. ♦ ‘సర్దార్...’ సినిమాలో కాస్ట్యూమ్స్ కాస్త నన్ను కష్టపెట్టాయి కూడా. కథ ప్రకారం ఎంతైనా రాకుమారిని కదా అందుకే బరువైన కాస్ట్యూమ్స్ వాడాల్సి వచ్చింది. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో 7 నుంచి 8 కేజీల లెహెంగా వేసుకున్నా. చిత్రీకరణ జరుగుతున్నంత సేపు చాలా ఇబ్బందిగానే అనిపించింది. కానీ పాత్ర కోసం తప్పదు కదా! ♦ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘బ్రహ్మోత్సవం’తో మళ్లీ ఈ సమ్మర్లోనే కనిపించనున్నా. ఇక హిందీలో ‘దో లఫ్జోంకీ కహానీ’ సినిమాలో అంధురాలిగా నటించాను. చెప్పాలంటే నా కెరీర్లోనే చాలెంజింగ్ రోల్ ఇది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నా. అంధురాలిగా యాక్ట్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. ముంబైలో మా ఇంటి దగ్గరలోనే ‘జేవియర్ సెంటర్ ఫర్ విజువల్లీ ఛాలెంజెడ్’ అనే స్కూల్‌కు వెళ్లి అక్కడ ఉన్న వాళ్లను గమ నించా. చాలా కష్టపడి మనసుపెట్టి చేసిన పాత్ర అది. -
సర్దార్, శ్రీమంతుడుని దాటేశాడు
భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ ఎంటర్టైనర్ సర్దార్ గబ్బర్‌సింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ పాత్రలో కనిపించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే రికార్డ్ల వేట మొదలు పెట్టింది. ముఖ్యంగా తెలుగులో సెకెండ్ బిగెస్ట్ హిట్‌గా నిలిచిన శ్రీమంతుడు రికార్డ్స్‌ను టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన ఈ సినిమా, తొలి అడుగులో అనుకున్నది సాధించింది. ఓవర్ సీస్లో భారీగా ప్రీమియర్ షోస్ ఏర్పాటు చేసి దాదాపు 42 దేశాల్లో 180కి పైగా స్క్రీన్స్‌లో సర్దార్ గబ్బర్‌సింగ్‌ను రిలీజ్ చేశారు. దీనికి తోడు సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అవ్వటంతో తొలి రోజు వసూళ్లలో సంఛలనాలు నమోదు చేసింది. ఒక్కరోజులోనే ఆరు లక్షల డాలర్లకు పైగా వసూళ్లను సాధించి బాహుబలి తరువాత తొలి రోజు అత్యథిక వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా డివైడ్ టాక్‌తో ఓపెన్ అయినా, పవర్ స్టార్ అభిమానులను మాత్రం బాగానే అలరిస్తోంది. మరో రెండు వారాల పాటు పెద్ద సినిమాలేవి రిలీజ్ లేకపోవటంతో సర్దార్ ఖాతాలో మరెన్ని రికార్డులు చేరుతాయో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
'పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలి'
హైదరాబాద్: 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమా హిందీ వెర్షన్ విషయంలో తాను చెప్పింది నిజమైందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. హిందీలో 'సర్ధార్ గబ్బర్ సింగ్' ఓపెనింగ్స్ 2 శాతమేనని, నెల రోజుల క్రితం తాను ఊహించిందే జరిగిందని ట్వీట్ చేశారు. ఈ సినిమాను హిందీలో విడుదల చేయడం పెద్ద పొరపాటు అని వర్మ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలని, తన చుట్టూ ఉన్న చెడు సలహాదారుల మాటలు వినొద్దని సలహాయిచ్చారు. 'సర్ధార్ గబ్బర్ సింగ్' సినిమాను హిందీలో విడుదల చేయాలనుకోవడం మంచి నిర్ణయం కాదని అంతకుముందు వర్మ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయంతో హిందీలో పవన్ కళ్యాణ్ కంటే ప్రభాస్ పెద్ద హీరోగా గుర్తింపు పొందుతాడని అన్నారు. పవన్ దగ్గర ఎవరైనా చురుకైన, తెలివైన వ్యక్తి ఉంటే ఈ నిర్ణయం మార్చుకోవాలని ఆయనకు సూచించాలని చెప్పారు. 'బహుబలి' మించిన సినిమాతో హిందీలోకి వెళితే బాగుంటుందని, డబ్బింగ్ సినిమాతో కాదని పవన్ కు సలహాయిచ్చారు. అభిమానుల కంటే పవన్ ను తాను ఎక్కువగా అభిమానిస్తానని వర్మ అన్నారు. ఆయనను గౌరవించే అభిమానిగా ఈ సలహా ఇస్తున్నానని చెప్పారు. SGS Hindi opening is 2% and I predicted 1 month back it is a Bahubalian mistake .PK should open his eyes to bad advisers around him — Ram Gopal Varma (@RGVzoomin) 8 April 2016 It will be bad for Pawan Kalyan if "Sardar Gabbar Singh" box office in Hindi will prove that Prabhas is bigger than P k on a National Level — Ram Gopal Varma (@RGVzoomin) 19 March 2016 -
గురూ! పండగ షురూ!
ఉగాదితో పాటు భారీ సినిమాల సమ్మర్ పండగ కూడా ఇవాళ్టి నుంచే! ఉగాది... కొత్త సంవత్సరానికి శుభారంభం. ఈ పండుగతో పాటు ఇవాళ్టి నుంచి తెలుగు సినీ ప్రేక్షకులకు మరో పండుగ కూడా మొదలైంది. ‘సర్దార్...’ సందడి నిజానికి, రెండు వారాల క్రితం నాగార్జున, కార్తీ మల్టీస్టారర్ ‘ఊపిరి’తోనే ఈ సమ్మర్ సినీ సీజన్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. పవన్‌కల్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజ్‌తో, సమ్మర్ సీజన్ సినిమా రిలీజ్‌ల పండుగ నిజమైన భారీ స్థాయికి చేరింది. ఇక ఇప్పటి నుంచి రెండేసి వారాల గ్యాప్‌లో ఒక్కో పెద్ద హీరో సినిమా వస్తోంది. తెలుగు, హిందీల్లో కలిపి, దేశం మొత్తం మీద రికార్డు సంఖ్యలో 2 వేలకు పైగా హాళ్లలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రిలీజవుతోంది. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా 43 దేశాల్లో జనం ముందుకు వెళుతోంది. ఇందులో 23 దేశాల్లో మొదటిసారిగా ఒక తెలుగు సినిమా రిలీజవు తోంది. అందుకే, ‘సర్దార్...’ పర్ఫెక్ట్ సినిమా పండగ హంగామానే. రెండేసి వారాల గ్యాప్‌లో... పెద్ద హీరో, పెద్దయెత్తున రిలీజ్లు కాబట్టి సహజంగానే ఎవరూ పోటీకి దిగరు. భారీ మొత్తాల్ని పణంగా ఒడ్డడం వల్ల, ఆ సొమ్మును వెనక్కి రాబట్టడానికి పెద్ద సినిమాల మధ్య ఒకటికి రెండు వారాల గ్యాప్ ఉండేలా చూసుకుం టున్నారు. అందుకే, పవన్ కల్యాణ్ వచ్చిన రెండు వారాల తర్వాతే ఏప్రిల్ 22న బోయపాటి దర్శక త్వంలో అల్లు అర్జున్ ‘సరైనోడు’గా రానున్నారు. ఇక, తమిళ హీరో విజయ్ నటిస్తున్న ‘తెరి’ అక్కడ తమిళ ఉగాదికి ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ‘దిల్’ రాజు తెలుగులో ‘పోలీసోడు’గా అందిస్తున్న ఈ సినిమాను మాత్రం ఏకకాలంలో రిలీజ్ కోసం ఇక్కడా ఏప్రిల్ 14నే విడుదల చేయాలని ఆలోచన చేస్తున్నారు. మే నెలలో... ఒకటికి మూడు తెలుగుతో పాటు మలయాళంలోనూ మాస్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్ చూసుకొని, మే 6న నెక్స్ట్ బిగ్ ఫిల్మ్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న ‘అ...ఆ...’. ఇప్పటికే 2 పాటలు మినహా షూటిం గంతా పూర్తయిన ఈ సినిమా ఆ డేట్‌కి రిలీజవడా నికి చురుగ్గా సన్నాహాలు చేసుకుంటోంది. మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’ కూడా ఇంకా షూటింగ్ హంగామాలో ఉంది. ఏప్రిల్ ఆఖరు కల్లా రిలీజని మొదట అనుకున్న ఈ సినిమా ఇప్పుడు మే నెల రెండు, మూడు వారాలకు వచ్చే సూచనలున్నట్లు కృష్ణానగర్ వర్గాల కబురు. వీటి మధ్య సందు చూసుకొని, మే నెలలోనే సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ రిలీజ్‌కు నిర్మాత ‘దిల్’ రాజు సిద్ధమవుతున్నారు. అంటే, నడి వేసవిలో ఒకటికి మూడు రిలీజులు రానున్నాయి. తెలుగునాట... తమిళ స్టార్స మాట... ఈ వేసవిలో ఇద్దరు తమిళ సూపర్స్టార్ల చిత్రాలూ రిలీజవుతున్నాయి. రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ చిత్రం ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉంది. మరోపక్క సూర్య హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న సైన్స ఫిక్షన్ థ్రిల్లర్ ‘24’ కూడా తుదిమెరుగుల్లో ఉంది. అయితే, తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, హంగామా నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రాల రిలీజ్ డేట్లు ఇంకా పక్కాగా నిర్ధారణ కాలేదు. జూన్‌లో కానీ ఇవి రిలీజ్ కావని ఒక టాక్. ఈ పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాల రిలీజ్లు అనేకం. అన్ని పండగలూ ఒకేసారి! సరిగ్గా ఇవాళ్టి నుంచే ఐ.పి.ఎల్. క్రికెట్ సీజన్ కూడా మొదలవుతోంది. అంటే అన్ని పండగలూ ఒకేసారి వచ్చేశాయన్న మాట. వెరసి, రాగల కొద్ది వారాల పాటు పిల్లలకు సెలవులు, కొత్త రిలీజ్‌ల కోలాహలం, నరాలు తెగే ఉత్కంఠ నిండిన క్రికెట్ మ్యాచ్‌ల సందడి - ఒకటే హంగామా. అందుకే, గురూ... ఇవాళ్టి నుంచే పండగ షురూ. ఈ వినోదాల విందుకు ఆర్ యూ రెడీ. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’ బ్లాక్ టికెట్లు: ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ శుక్రవారం విడుదలకానున్న క్రమంలో బ్లాక్ టికెట్ల విక్రయం జోరందుకుంది. కుషాయిగూడలోని తుళ్లూరి సినిమా టాకీస్‌పై ఎస్ఓటీ పోలీసులు గురువారం మధ్యాహ్నం ఆకస్మిక దాడి నిర్వహించారు.‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.21 వేల నగదు, ఒక బైక్, 650 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
మెగా ఫ్యాన్స్‌తో తలనొప్పి?
- సర్దార్ గబ్బర్ సింగ్ టిక్కెట్లపై నెట్ సెంటర్ల కన్ను - నకిలీ ప్రూఫ్‌లతో బుకింగ్ - బ్లాక్‌లో అమ్మేందుకు ప్రయత్నాలు - ఆందోళన చెందుతున్న అభిమానులు పాత శ్రీకాకుళం: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం టిక్కెట్లు కోసం ఇప్పటినుంచే అభిమానులు, ఫ్యాన్స్ తంటాలు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో 8వ తేదీన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంకు సంబంధించి టిక్కెట్లన్నీ ప్రధాన నెట్‌సెంటర్ల నిర్వాహకులు నకిలీ ఐటీ ప్రూఫ్‌లను జతచేస్తూ ముందుగానే ఆన్లైన్లో బ్లాక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ టిక్కెట్లను అధిక రేట్లుకు బ్లాక్‌లో విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. కొంతమంది అభిమానులతో బేరసారాలు కూడా ముమ్మరం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం శ్రీకాకుళం నగరంలో రామకృష్ణా, సరస్వతి, కిన్నెర థియేటర్లకు రానుంది. మరో 3 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని వేసేందుకు ఆయా యాజమాన్యాలు ఉత్సాహం చూపుతున్నారు. ఇదిలావుండగా అభిమానుల ఒత్తిడి మేరకు ఈ చిత్రాన్ని ఆ రోజు ఉదయం 7 గంటల షో వేసేందుకు జిల్లా యంత్రాంగానికి ప్రధాన థియేటర్ యాజమాన్యం ఓ లేఖను రాసినట్టు సమాచారం. మెగా ఫ్యాన్స్‌తో థియేటర్ల యాజమాన్యాలకు తప్పని తలనొప్పి? మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా విడుదలైనా థియేటర్ల యాజమాన్యాలకు తలనొప్పి తప్పడం లేదు. పవన్‌కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధర్మతేజ్, వరుణ్‌తేజ్ అందరి హీరోలకు ఫ్యాన్స్ అంటూ ఇప్పటికే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ మేరకు ఇదివరకే ఒక లెటర్ ప్యాడ్‌ను తయారు చేసుకొన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఏ హీరో సినిమా వచ్చినా థియేటర్ల వద్దకు వీరు వచ్చి మా హీరో సినిమాకు ఇన్ని టిక్కెట్లు కావాలంటూ యాజమాన్యాలకు లెటర్‌ను సమర్పిస్తూ హుకుం జారీ చేస్తారు. సినిమా పడిన అన్ని థియేటర్ల వద్ద ఇదే పరిస్థితి నెలకొంటుంది. అటు నెట్ సెంటర్లు, ఇటు ఫ్యాన్స్‌తో సాధారణ ప్రేక్షకులంతా సినిమా చూడలేక బ్లాక్‌ల్లోనే టిక్కెట్లు కొనుక్కోవల్సిన దుస్థితి దాపురించింది. థియేటర్ల వద్ద తక్కువగా టిక్కట్లు ఇస్తూ యాజమాన్యాలు కూడా ముఖం చాటేస్తున్నాయి. తప్పుడు ఐడీ ఫ్రూఫ్లతోనే... జెస్ట్ టిక్కెట్స్, బుక్ ఫిలిమ్, బుక్‌మైషో ద్వారా ఆన్లైన్లో సర్దార్ గబ్బర్‌సింగ్ టిక్కెట్లును నేరుగా బుక్ చేసుకోవచ్చు. ఒక ఐడీ పాస్వర్ట్తోనే బుక్ చేసుకోవల్సి ఉంది. సినిమా విడుదలకు ముందురోజే థియేటర్ల యాజమాన్యాలు ఆన్లైన్లో కొన్ని రకాల క్లాస్ టిక్కెట్లు పెడతారు. ఆయా థియేటర్లు ఆన్లైన్లో పెట్టే టిక్కెట్లను పూర్తిగా తప్పుడు ఐడీ ప్రూఫ్‌లతో నెట్‌సెంటర్ల నిర్వాహకులు బ్లాక్ చేస్తూ అమ్మేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనంతటికీ ఒక క్రియేటివ్ ఐడీ పాస్‌వర్డ్‌ని ఇప్పటికే తయారు చేసినట్టు సమాచారం. ఈ వ్యవ హారమంతా ప్రధాన నెట్ సెంటర్ల నిర్వాహకుల కనుసన్నల్లోనే సాగుతున్నట్టు భోగట్టా. దీనిపై జిల్లా యంత్రాంగం, థియేటర్ల యాజమాన్యాలు వెంటనే స్పందించి సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆన్లైన్ టిక్కెట్లతో జాగ్రత్త తప్పనిసరి ఇటీవల ఆన్లైన్ నెట్ సెంటర్ల నిర్వాహకులు తప్పుడు ఐడీ ప్రూఫ్‌లతో టిక్కెట్లు బ్లాక్ చేసి చాలా మంది అమాయకులకు కట్టబెడుతున్నారు. వారు ఎటువంటి ఐడీ ప్రూఫ్‌లు తేకుండా నేరుగా సినిమాకు వచ్చేసి థియేటర్లో తిప్పలు పడుతూ వెనుదిరిగి పోతున్నారు. - బోసుబాబు, ఎస్వీసీ థియేటర్ మేనేజర్, శ్రీకాకుళం అభిమానులకు టిక్కెట్లు ఇవ్వాలి మెగా హీరోలకు సంబంధించి ఏ హీరో సినిమా వచ్చినా ఆ హీరో ఫ్యాన్స్‌కు ముందు అవకాశం ఇవ్వాలి. తర్వాత మిగతావారికి ఇచ్చే విధంగా థియేటర్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్లో అందరికీ టిక్కెట్లు అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. - రాము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్, శ్రీకాకుళం ఫ్యాన్స్‌కు కేటాయించాలి మెగాఫ్యాన్స్తో మాకు ఎప్పుడూ తిప్పలు తప్పడం లేదు. అభిమానులకంటూ ప్రత్యేకించి ఒకటో, రెండో థియేటర్లు కేటాయిస్తే బాగుంటుంది. మెగా ఫ్యామిలీ హీరో అభిమానులంతా మాపై ఒత్తిడి తెస్తూ టిక్కెట్లు కోసం నిలువదోపిడీ చేస్తున్నారు. దీంతో సాధారణ ప్రేక్షకులకు టిక్కెట్లు ఇవ్వలేక పోతున్నాం. - చినరాజు, సరస్వతి థియేటర్ మేనేజర్, శ్రీకాకుళం -
సర్దార్ గబ్బర్‌సింగ్.. రికార్డ్ రిలీజ్
సినిమా మొదలైన దగ్గర నుంచే సంచలనాలకు తెరతీసిన సర్దార్ గబ్బర్‌సింగ్ రిలీజ్ విషయంలో కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. గతంలో మరే తెలుగు సినిమా రిలీజ్ కాని విధంగా భారీగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ ను సౌత్, నార్త్‌తో పాటు ఓవర్సీస్లో కూడా భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా అమెరికాలో తెలుగు సినిమాలు 100 థియేటర్ల లోపు రిలీజ్ అవుతాయి. కానీ సర్దార్‌ను మాత్రం ఏకంగా 188 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఓవర్సీస్ మొత్తంలో 42 దేశాల్లో 400కు పైగా థియేటర్లలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్లో కూడా ఈ సినిమాను 800 స్క్రీన్స్ మీద రిలీజ్ చేయడానికి ఈరోస్ సంస్థ ప్లాన్ చేస్తోంది. తెలుగు మార్కెట్ మరింత సంచలనంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాతో పాటు మరేమి సినిమా రిలీజ్‌కు సాహసించటం లేదు కాబట్టి 1400 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వీటికితోడు చాలా ప్రాంతాల్లో బెనిఫిట్ షోలను కూడా భారీ సంఖ్యలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ హడావిడి చూస్తుంటే తొలిరోజు వసూళ్లో సర్దార్ రికార్డుల మోత మోగించటం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. -
చిరంజీవి గారితో అలా అన్నారట!
- దర్శకుడు బాబీ ‘‘ బాబీ... ఈ సినిమాకు నువ్వు డెరైక్టర్’’ అని చెప్పగానే షాకయ్యా. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇచ్చేంత వరకూ కల లాగానే అనిపించింది’’ అని దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) అన్నారు. పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా బాబీ దర్శక త్వంలో శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘ సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ నెల 8న రిలీజ్ కానున్న సందర్భంగా బాబీ చెప్పిన విశేషాలు ♦ ఒకరోజు శరత్ మరార్ నాకు ఫోన్ చేసి, పవన్ కల్యాణ్‌ను కలుద్దామన్నారు. నాకు చాలా టెన్షన్ అనిపించింది. డెరైక్టర్‌గా కాకుండా ఆయనకు వీరాభిమానిగా వెళ్లా. అక్కడ ఫామ్ హౌస్‌లో పొలం పనుల్లో సింపుల్‌గా ఉన్న కల్యాణ్‌గారిని చూసి ఆశ్చర్యపోయాను. కలిసిన 15 నిమిషాలకే దర్శకత్వ బాధ్యతలు పెట్టారు. ♦ మొదట సంపత్ నందితో ఈ చిత్రాన్ని తీద్దామనుకున్న మాట నిజమే. కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి ఎందుకు తప్పుకున్నారో కారణాలు తెలియవు. ‘పవన్ క ల్యాణ్ నిన్ను డెరైక్షన్ చేయనిచ్చారా?’ అని చాలామంది అడిగారు. అలాంటిదేమీ లేదు. ఆయన హీరోగా కన్నా కేవలం రైటర్‌గానే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. అంతే గానీ డెరైక్షన్, ఫొటోగ్రఫీల్లో అస్సలు జోక్యం చేసుకోలేదు. నాకు, పవన్ కల్యాణ్‌గారికి షూటింగ్ టైమ్ లో వేవ్‌లెంగ్త్ సెట్ కాలేదని వస్తున్న వార్తల్లోనూ, ‘షకలక’ శంకర్‌ని ఆయన కొట్టారని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదు. ♦ నేను చిరంజీవిగారి వీరాభిమానిని. అందుకే ఈ సినిమాలో ఆయన పాటలను పెడితే బాగుంటుందని కల్యాణ్ గారు చెబితే ఎగ్జయిట్ అయ్యా. చిరంజీవిగారి హిట్ డ్యాన్స్ మూమెంట్ వీణ స్టెప్‌ను కల్యాణ్‌గారు చేయడం మెయిన్ హైలైట్. ♦ కల్యాణ్ గారితో పని చేయడం, ఆయన సినిమా చూసి విజిల్స్ చేసినంత ఈజీ కాదు. టఫ్‌గానే ఉంటుంది. కానీ ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పని చేస్తే ఆ మజాయే వేరు. ♦ కల్యాణ్‌గారు నా గురించి ‘బాబీ మంచి డెరైక్టర్ అవుతాడు. కుదిరితే నువ్వు కూడా సినిమా చేయాలి అన్నయ్యా’ అని చిరంజీవిగారితో చెప్పారట. ఈ సినిమా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా అనిపించిందో, అలా అన్నారని తెలియగానే అంతకు పదింతలు సంతోషం అనిపించింది. ఒకవేళ చిరంజీవిగారు పిలిస్తే వెంటనే సినిమా కథ రాయడం స్టార్ట్ చేస్తాను. -
‘సర్దార్ గబ్బర్ సింగ్’మూవీ స్టిల్స్
-
స్విస్‌లో... సర్దార్ రొమాన్స్!
అతనేమో రఫ్ ఆడించే పోలీసాఫీసర్... పేరు గబ్బర్‌సింగ్. గూండాలకు అతనంటే హడల్. ఎందుకంటే , ఎప్పుడెలా ఉంటాడో తెలీదు. టన్నుల కొద్దీ తిక్క. కానీ, లెక్క కూడా అందుకు తగ్గట్టే ఉంటుంది. ఎక్కడికెళ్లినా అంతే. చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాడు. తేడా వస్తే మటాషే. ఓ అమ్మాయిని కాపాడడం కోసం రతన్‌పూర్‌లో అడుగుపెడతాడు. ఆ అమ్మాయేమో అందాల సుకుమారి... కోటకు యువరాణి.... పేరు ఆర్షి. ఎంతోమంది అమ్మాయిలు వెంటపడినా పట్టించుకోని ఈ గబ్బర్‌సింగ్... ఎంతోమంది అబ్బాయిలు వెంటపడినా పట్టించుకోని ఈ చేప కళ్ల చిన్నది ప్రేమలో పడిపోతారు. ఇద్దరూ స్విట్జర్లాండ్‌లో హ్యాపీగా డ్యూయెట్ పాడుకోవడా నికి వెళిపోయారు. గబ్బర్‌సింగ్ పాత్రలో గతంలో విజృంభించిన పవన్ కల్యాణ్ ఇప్పుడీ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో కూడా తనదైన శైలిలో రెచ్చిపోనున్నారు. యువరాణిగా కాజల్ అలరించనున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్, ఈరోస్ ఎంటర్టైన్మెంట్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకాలపై శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న ఈ చిత్రం విడుదల కానుంది. ‘‘పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాం. డబ్బింగ్ ఇటీవలే పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అని నిర్మాత శరత్‌మరార్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: పవన్‌కల్యాణ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, దర్శకత్వం: బాబి. -
నేను పవన్ కల్యాణ్ అభిమానిని
ఈ వేసవిలో విడుదల కాబోయే రెండు పెద్ద చిత్రాల్లో కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. ఒకటి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, రెండోది సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘బ్రహ్మోత్సవం’. ఇవి కాకుండా తమిళ, హిందీ చిత్రాల్లో పెద్ద చిత్రాలు చేస్తున్నారీ బ్యూటీ. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ కెరీర్ గ్రాఫ్ ఏ మాత్రం పడిపోకుండా కాజల్ దూసుకుళెతున్నారు. ఆ సంగతలా ఉంచితే... ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ముందు అనీషా ఆంబ్రోస్‌ను నాయికగా అనుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాజల్‌ను తీసుకున్నారు. ఇటీవల కాజల్‌ను ఓ విలేఖరి ఈ విషయం గురించి అడిగారు. ఈ ప్రశ్నకు దర్శక-నిర్మాతలే సమాధానం చెప్పగలుగుతారని కాజల్ అగర్వాల్ అంటూ - ‘‘నేను పవన్ కల్యాణ్ అభిమానిని. ఆయన సరసన నటించే అవకాశం వస్తే చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చివరికి ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. అభిమాన హీరో, అద్భుతమైన కథ, మంచి పాత్ర, చక్కని టీమ్... ఒక సినిమా ఒప్పుకోవడానికి ఇంత కన్నా మంచి కారణాలు ఏం కావాలి?’’ అన్నారు. -
మెగా హీరోలకు సర్దార్ నచ్చలేదా..?
ప్రస్తుతం టాలీవుడ్లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. ఆడియో రిలీజ్‌కు ముందు సోషల్ మీడియాలో భారీగా సందడి చేసిన ఈ సినిమా.. ఆ తర్వాత మాత్రం స్లో అయ్యింది. ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ అభిమానులు ఆశించిన స్ధాయిలో లేదన్న టాక్ వినిపిస్తోంది. అభిమానుల సంగతి ఎలా ఉన్న మెగాహీరోలు కూడా దీనిపై పెదవి విప్పలేదు. బయటి హీరోల సినిమాల విషయంలో కూడా యాక్టివ్‌గా కామెంట్లు చేసే అల్లు శిరీష్, సాయి ధరమ్‌తేజ్ కూడా సర్దార్ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఆడియో బాగుందటూ ట్వీట్ చేసి సరిపెట్టేసిన రామ్ చరణ్ కూడా ట్రైలర్ విషయంలో ఎలాంటి కామెంట్ చేయలేదు. తను సినిమాల గురించి ట్వీట్ చేయనంటూనే క్షణం సినిమాను పొగిడేసిన బన్నీ కూడా ఈ సినిమా విషయంలో నోరు మెవపలేదు. మేకింగ్ వీడియో రిలీజ్ అయినప్పుడే తెగ హడావిడి చేసిన వరుణ్ తేజ్.. ఆడియో, థియట్రికల్ ట్రైలర్ల రిలీజ్ తరువాత ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. మరి మెగా హీరోలు బిజీగా ఉండి సర్దార్ గబ్బర్‌సింగ్‌ను పట్టించుకోలేదా..? లేక నిజంగానే ట్రైలర్ నచ్చక సైలెంట్ అయిపోయారా..? అన్న అనుమానం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా కలుగుతోంది. పవన్ కళ్యాణ్ అంతా తానే అయి తెరకెక్కిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు పవర్ ఫేం బాబీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పవన్ సరసన తొలిసారిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
అన్నయ్య చేతుల మీదుగా ఆడియో
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ 'సర్థార్ గబ్బర్ సింగ్' ఆడియో సోదరుడు చిరంజీవి చేతుల మీదుగా విడుదల అవుతుందన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 20న జరుగనున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారట. స్వయంగా పవనే వెళ్లి అన్నయ్యను ఆహ్వానించినట్లు సమాచారం. అదే నిజమైతే చానాళ్ల తర్వాత ఒకే వేదికపై మెగా స్టార్, పవర్ స్టార్లను చూసే అవకాశం కలుగుతుంది. ఇక ఫ్యాన్స్‌కైతే పండగే పండగ. కాగా ఇటీవలే రిలీజైన సర్థార్ టీజర్ సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వస్తున్న విషయం తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏదేమైనా ఆడియో వేడుకలో చిరు, పవన్ లు ఒకే వేదిక మీద కనబడితే ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు. -
పవన్ కళ్యాణ్ జోకర్, కార్టూన్: కమాల్ రషీద్
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్, టాలీవుడ్ పవర్ స్టార్ మీద నోరు పారేసుకున్నాడు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమాల్, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ ఫాలోయింగ్ ఉన్న పవన్‌ను విమర్శించి ఇక్కడకూడా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ పవర్ స్టార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశాడు కమాల్. 'పవన్ కళ్యాణ్ లాంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావొచ్చు. అసలు దక్షిణాది ప్రేక్షకులకు ఏమైంది? ఇలాంటి కార్టూన్ని వాళ్లు హీరోగా ఎలా అంగీకరిస్తున్నారు..? వాళ్ల ఛాయిస్ అస్సలు బాలేదు. పవన్ కళ్యాణ్ లాంటి జోకర్, కార్టూన్ హీరో సినిమాలు చూసే కన్నా, నేను రాజ్ పాల్ యాదవ్ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను' అంటూ కమాల్ ట్వీట్ చేశాడు. అయితే, పవన్ మీద వ్యాఖ్యలు చేసిన అతడికి.. పవన్ పూర్తిపేరు కూడా సరిగా తెలియదు. 'పవన్ కళ్యాణ్ సింగ్' అని పవన్ పేరును ప్రస్తావించాడు. ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పవన్‌ను టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తుండగా ఇప్పుడు అదే లిస్ట్‌లో కమాల్ రషీద్ ఖాన్ కూడా చేరిపోయాడు. కమాల్ ట్వీట్లపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో కమాల్ చేసిన వ్యాఖ్యలకు మరింత ప్రఛారం లభిస్తోంది. If this Lukkha Pawan Kalyan singh is also a hero then anybody in the world can be a super star. pic.twitter.com/d1CdjHyueY — KRK (@kamaalrkhan) March 17, 2016 What's wrong with South Indian ppl? How can they watch this cartoon in the films as a hero? Really very bad choice! pic.twitter.com/dd0lZ5Z2O7 — KRK (@kamaalrkhan) March 17, 2016 I will prefer to watch Rajpal Yadav film instead of the joker, the cartoon, the Maha Sada Huwa hero, Pawan Kalyan pic.twitter.com/H1VwtG89TV — KRK (@kamaalrkhan) March 17, 2016 -
సర్దార్ గబ్బర్‌సింగ్‌కు ఇద్దరు బాడీగార్డులు
ప్రస్తుతం టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఆడియోను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలో మెగా హీరో సాయి ధరమ్‌తేజ్ చేసిన ట్వీట్లు ఆసక్తి కలిగించాయి. సర్దార్కు ఇద్దరు కొత్త బాడీగార్డులు అపాయింట్ అయ్యారంటూ ట్వీట్ చేశాడు సాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా మరిన్ని వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ అభిమానులను మరింతగా ఊరించాడు. తాజాగా ఈ ట్వీట్‌పై క్లారిటీ ఇస్తూ పవన్ నడిచి వస్తుంటే తన తమ్ముడితో కలిసి సాయి ముందు నడుస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవన్ స్నేహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏప్రిల్ 8న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. Flash news for all. Two new bodyguards are appointed for Saardar. Stay tuned for more details. #SardaarkoSalaam — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 14, 2016 Sardaar's new body guards #SardaarkoSalaam pic.twitter.com/9GFvqIilo5 — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 15, 2016 -
పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త
పవన్ కల్యాణ్‌ను మళ్ళీ తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను ‘ఉగాది’ నాడు ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకోసం శరవేగంతో పనిచేస్తోంది. శరత్ మరార్, సునీల్ లుల్లాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని కె. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, పేరున్న నటీనటులతో తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్‌తో పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెగ బిజీగా ఉన్నారు. ఒకపక్క హైదరాబాద్ నడిబొడ్డున వేసిన భారీ రతన్‌పూర్ సెట్లో ఎపిసోడ్, మరోపక్క శివార్లలో సంఘీ టెంపుల్ దగ్గర అటవీప్రాంతంలో జరుగుతున్న భారీ ‘గుర్రాల మేళా’ ఎపిసోడ్, చటు క్కున ఆర్.ఎఫ్.సి.లో యాక్షన్ సీక్వెన్స్ - ఇలా రోజుకోచోట విసుగూ, విరామం లేకుండా షూటింగే. పవన్ సరసన కాజల్ అగర్వాల్ నాయిక లొకేషన్లో 100 గుర్రాలు... వెయ్యిమంది యూనిట్! తాజా విశేషం ఏమిటంటే, ఈ సినిమా కోసం ‘గుర్రాల మేళా’ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరించడం! ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 100 గుర్రాలు, 10 వింటేజ్ కార్లు, అనేక లగ్జరీ కార్లు తెప్పించారు. ఇక, గుర్రపు రౌతులు, ఆర్టిస్టులు కలిపి దాదాపు వెయ్యిమంది ఈ చిత్రీకరణలో పాలుపంచు కున్నారు. ప్రధాన తారాగణమైన 40 మంది ఈ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర గీతాలను మార్చి మధ్యకల్లా రిలీజ్ చేయనున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ చిత్రానికి హరీశ్ పాయ్ క్రియేటివ్ హెడ్. ‘‘ఉగాది నాడు సినిమా రిలీజ్ చేయడం కోసం యూనిట్ మొత్తం దాదాపు నిద్ర లేకుండా పనిచేస్తోంది. సినిమా పూర్తయ్యే వరకు నిర్విరామంగా జరిగే ఈ షెడ్యూల్లో ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్, విలన్ శరద్ కేల్కర్, అలాగే బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నర్రా శీను తదితరులందరూ పాల్గొంటున్నారు’’ అని చిత్ర వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మొత్తం మీద, భారీ సెట్లు, యూనిట్‌తో సినిమా పండగలా ఉంటుందట! అంత పండగ వాతావరణం ఉన్న సినిమా ఉగాది పండగకిరావడం కరెక్టే! -
ఒకే వేదిక పైకి మెగా బ్రదర్స్
మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిదంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తామంతా ఒక్కటే అని ప్రకటించే ప్రయత్నం కూడా చేసింది. అయితే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించి చాలా కాలం అవుతుండటంతో అలాంటి మెగా ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అభిమానుల కోరిక తీర్చడానికి త్వరలోనే మెగా బ్రదర్స్ సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న సర్థార్ గబ్బర్‌సింగ్ ఆడియో వేడుకను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ఆడియోను భారీగా ప్లాన్ చేస్తున్న పవన్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా చిరంజీవి, నాగబాబులను ఆహ్వనించనున్నాడట. గతంలో గబ్బర్‌సింగ్ ఆడియో వేడుకలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపించారు. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా బ్రదర్స్ కలయిక కలిసొస్తుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందించిన సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫేం బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావటంతో సర్థార్ గబ్బర్‌సింగ్‌పై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. -
మామ, అల్లుళ్ల సవాల్
సంక్రాంతికి బాబాయ్, అబ్బాయ్‌లు బరిలో దిగగా, సమ్మర్లో కూడా ఇలాంటి రసవత్తర పోటీకి రెడీ అవుతోంది తెలుగు వెండితెర. పండగ పూట బాలకృష్ణ, ఎన్టీఆర్‌లు ఢీ అంటే ఢీ అన్నారు. అదే జోరులో వేసవి సెలవులకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లు తలపడటానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు దాదాపు పూర్తి కావచ్చాయి. దీంతో నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఒకే సమయంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గబ్బర్‌సింగ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో నటిస్తున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా తరువాత బన్నీ కూడా గ్యాప్ తీసుకొని బోయపాటి దర్శకత్వంలో సరైనోడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లు కావటంతో ఎవరిది పైచేయి అవుతుందో, అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
రతన్‌పూర్‌లో సర్దార్
సంక్రాంతి బరిలో లేకున్నా టీజర్, కొత్త పోస్టర్లతో అభిమానులు పండగ చేసుకునేలా చేశారు పవన్ కల్యాణ్. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘గోపాల గోపాల’ తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. కే.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ‘రతన్ పూర్’ టౌన్ సెట్లో జరుగుతోంది. ఇందులో పవన్‌కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందిస్తున్నారు. -
పోలీస్ షర్ట్.. గళ్ల లుంగీ.. పవర్‌స్టార్ అదుర్స్
-
పవన్ సినిమాలో బన్నీ తనయుడు..?
సెట్స్ మీదకు రాక ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసిన సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ సమయంలో కూడా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో ఫోటోలతో సోషల్ మీడియా మోత మోగిపోతుంటే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త మెగా అభిమానులకు పండగ వాతావరణం తీసుకు వచ్చింది. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో మరో మెగా వారసుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ చిన్న బాబును కాపాడే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్లో అల్లు అర్జున్ తనయుడు అయాన్ నటిస్తున్నాడన్నదే ఇప్పుడు మెగా సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త. ఇప్పటికే బన్నీ ఫేస్ బుక్ పేజ్ మీద మంచి క్రేజ్ తెచ్చుకున్న అయాన్ త్వరలోనే వెండితెర మీద కనిపించనున్నాడన్న న్యూస్ మెగా అభిమానులను ఊరిస్తోంది. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా పవర్ స్టార్, అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం పండగ పూట ఇది తీపి కబురే అని చెప్పాలి. -
పండగ వచ్చేసింది!
జనరల్‌గా హీరోలు బైక్ మీద వెళితే.. కమెడియన్లు వెనకాల కూర్చుంటారు. కమెడియన్ బైక్ నడిపితే, హీరో అతని భుజాల మీద కూర్చునే తరహా సీన్స్ దాదాపు కనిపించవు. అందుకే, బైక్ నడుపుతున్న అలీ భుజాల మీద పవన్ కల్యాణ్ కూర్చోవడం, పక్కనే బ్రహ్మాజీ, నర్రా శ్రీను నిలబడి చిరునవ్వులు చిందిస్తూ పోజివ్వడం చూస్తుంటే వింతగానే ఉంటుంది. సినిమాలో కొత్త కొత్త కామెడీ ట్విస్టులు చాలా ఉంటాయనడానికి ఈ స్టిల్‌ని శాంపుల్‌గా చిత్రనిర్మాత శరత్ మరార్ బయటపెట్టి ఉంటారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’కి సంబంధించిన ఈ స్టిల్‌ను సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ఈ స్టిల్ అభిమానులను అలరిస్తుందని ఊహించవచ్చు. మరో రెండు రోజుల్లో రానున్న సంక్రాంతి పండగ ఇప్పుడే వచ్చేసినట్లుగా ఫ్యాన్స్ భావించినా ఆశ్చర్యపోవడానికి లేదు. హైదరాబాద్‌లోని సుమారు 5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రూపొందించిన సెట్లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి పవన్‌కల్యాణ్ కథ-స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. -
గుజరాత్లో గబ్బర్
పవన్‌కల్యాణ్ తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త షెడ్యూలు బుధవారం నుంచి గుజరాత్లో జరుగుతోంది. 25 రోజుల పాటు ఏకధాటిగా జరగనున్న ఈ కొత్త షెడ్యూల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. కథానాయిక కాజల్ అగర్వాల్ ఈ షెడ్యూల్లోనే ఎంటరవుతారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో సహా పలుచోట్ల 25 రోజుల షూటింగ్ చేశారు. బాబి దర్శక త్వంలో శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే సమ్మర్‌కు రిలీజ్ కానుందని సమాచారం. -
‘బ్రూస్లీ’ని మెచ్చిన ‘సర్దార్’
శనివారం మధ్యాహ్నం... రామ్‌చరణ్‌కి హఠాత్తుగా పవన్ కల్యాణ్ నుంచి కాల్ వచ్చింది. బాబాయ్ ఫోన్ చేసేసరికి సంబరపడిపోయి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లొకేషన్కెళ్లారు చరణ్. అక్కడకు వెళ్లగానే ‘‘బొకే ఇచ్చి బ్రూస్లీతో మంచి సక్సెస్ సాధించావ్’’ అని చరణ్‌కు క్రంగాట్స్ చెప్పారట పవన్‌కల్యాణ్. దాంతో చరణ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారట! అక్కడే బాబాయ్‌తో చాలాసేపు గడిపి వెళ్లారట చరణ్. -
పవన్ బర్త్ డేకు ప్రత్యేక కానుక
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 44వ బర్త్ డే సందర్భంగా ఆయనకు, అభిమానులకు ఓ కానుక అందించనున్నారు. పవన్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్‌ను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 2న విడుదల చేయనున్నారు. 'పవన్ బర్త్ డే కానుకగా ఓ ప్రత్యేక టీజర్‌ను రూపొందించారు. ఆయన పుట్టిన రోజున విడుదల చేస్తారు' అని చిత్ర యూనిట్ వర్గాలు తెలిపినట్టు ఓ వార్తా ఏజెన్సీ వెల్లడించింది. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయిందని, సెప్టెంబర్ 4 నుంచి జరిగే మరో షెడ్యూల్లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పాల్గొంటారని తెలిపారు. పవన్ కల్యాణ్‌తో నటించేందుకు కాజల్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశముంది. -
దేఖో దేఖో... సర్దార్ గబ్బర్‌సింగ్!
ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పవన్‌కల్యాణ్ తన తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ కొత్త లుక్ విడుదల చేసి అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేశారు. కొన్నేళ్ళ క్రితం ‘గబ్బర్‌సింగ్’గా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన పవన్‌కల్యాణ్, ఈసారి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’గా అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శరత్‌మరార్ నిర్మాణ సారథ్యంలో నార్త్ స్టార్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ‘పవర్’ ఫేమ్ కె.ఎస్. రవీంద్రనాథ్(బాబీ) ఈ చిత్రానికి దర్శకుడు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే పవన్‌కల్యాణ్ సమకూర్చారు. ‘‘పవన్‌కల్యాణ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ కథ సిద్ధం చేశారు. ఆయన స్టయిల్లో సాగే ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ చిత్రం మూడో షెడ్యూల్ ప్రారంభమవుతుంది’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, ఎడిటింగ్: గౌతంరాజు.