
ఒకే వేదిక పైకి మెగా బ్రదర్స్
మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిదంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తామంతా ఒక్కటే అని ప్రకటించే ప్రయత్నం కూడా చేసింది. అయితే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లు ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించి చాలా కాలం అవుతుండటంతో అలాంటి మెగా ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అభిమానుల కోరిక తీర్చడానికి త్వరలోనే మెగా బ్రదర్స్ సిద్ధం అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న సర్థార్ గబ్బర్సింగ్ ఆడియో వేడుకను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ఆడియోను భారీగా ప్లాన్ చేస్తున్న పవన్ ఫంక్షన్కు ముఖ్య అతిథులుగా చిరంజీవి, నాగబాబులను ఆహ్వనించనున్నాడట. గతంలో గబ్బర్సింగ్ ఆడియో వేడుకలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపించారు. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా బ్రదర్స్ కలయిక కలిసొస్తుందని భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందించిన సర్థార్ గబ్బర్సింగ్ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫేం బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావటంతో సర్థార్ గబ్బర్సింగ్పై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.