Mega Brothers
-
ఒకే వేదిక పైకి మెగా బ్రదర్స్
మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగిదంటూ వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మెగా ఫ్యామిలీ రెడీ అవుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో తామంతా ఒక్కటే అని ప్రకటించే ప్రయత్నం కూడా చేసింది. అయితే చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు ముగ్గురు ఒకే వేదిక మీద కనిపించి చాలా కాలం అవుతుండటంతో అలాంటి మెగా ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అందుకే అభిమానుల కోరిక తీర్చడానికి త్వరలోనే మెగా బ్రదర్స్ సిద్ధం అవుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తున్న సర్థార్ గబ్బర్‌సింగ్ ఆడియో వేడుకను ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ఆడియోను భారీగా ప్లాన్ చేస్తున్న పవన్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథులుగా చిరంజీవి, నాగబాబులను ఆహ్వనించనున్నాడట. గతంలో గబ్బర్‌సింగ్ ఆడియో వేడుకలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపించారు. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా బ్రదర్స్ కలయిక కలిసొస్తుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కథ అందించిన సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. పవర్ ఫేం బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత పవన్ సోలో హీరోగా వస్తున్న సినిమా కావటంతో సర్థార్ గబ్బర్‌సింగ్‌పై అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. -
కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారం?
కాంగ్రెస్‌కు చిరు-బీజేపీకి పవన్ మెగాస్టార్ సభలు నీరుగార్చేందుకు పవర్‌స్టార్ అభిమానుల ఎత్తులు! బెంగళూరు, న్యూస్‌లైన్ : టాలీవుడ్ మెగా ఫ్యామీలి అంతర్గత పోరు కర్ణాటకలో రచ్చకెక్కనుంది. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు వేదికగా మారాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఒక్కటిగా ఉన్న కర్ణాటక మెగా ఫ్యామిలీ అభిమానులు నువ్వా.. నేనా తేల్చుకుందాం రా.. అంటూ వీధిన పడుతున్నారు. ఎన్నికల ప్రచారానికి తమ అభిమాన నటుడు వస్తే పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున కేంద్ర మంత్రి చిరంజీవి, బీజేపీ తరుఫున పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని ఇప్పటికే కర్ణాటకలో ఊహగానాలు చెలరేగాయి. ఇందుకు అభిమానుల చర్యలు బలమిస్తున్నాయి. బెంగళూరు సెంట్రల్, ఉత్తర, దక్షిణ, గ్రామీణ జిల్లా, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బళ్లారి తదితర లోక్‌సభ నియోజకవర్గాల్లో చిరంజీవి, పవన్‌కళ్యాణ్ ప్రచారం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న లక్షల మంది తెలుగు వారి ఓట్లను మెగా బ్రదర్స్ ప్రచారం ద్వారా కొల్లగొట్టేందుకు ఆయా పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి. ఇది వాస్తవమేనంటూ బహిరంగంగా ప్రచారం కూడా చేసేస్తున్నారు. కాగా, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున చిరంజీవి చేసిన ప్రచారం ఫలితం అంతంత మాత్రంగానే ఉంది. ఆయన ప్రచారం చేసిన పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నెల 8న చిక్కబళ్లాపురలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభకు మోడి హాజరుకానున్నారు. ఇదే సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారని ఆయన అభిమానాలు పేర్కొంటున్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం ద్వారా తెలుగు జాతి విభజనకు సహకరించిన వీరప్ప మొయిలీకి బుద్ధి చెప్పాలని పవర్‌స్టార్ అభిమానులు పిలుపునిస్తున్నారు. ఆంధ్రులకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చిరంజీవి చేస్తున్న ప్రయత్నాలను సైతం అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. మొత్తం మీద కర్ణాటకలో మెగా బ్రదర్స్ ప్రచారాల ‘ షో ’లకు ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి. -
అన్నయ్యతో విభేదాలు లేవు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: తనకు, తన అన్నయ్యకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ ఏర్పాటు, ఎన్నికల్లో పోటీ అంశాలపై త్వరలోనే స్పందిస్తానని ప్రకటించారు. ఈ నెల రెండో వారంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తానన్నాడు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2, ఓ మైగాడ్ రీమేక్ సినిమాల్లో బిజీగా ఉన్నట్టు వెల్లడించారు. పవన్, చిరంజీవి మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవితో దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్, నాగబాబు టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని వారిద్దరూ అప్పట్లో ఖండించారు. అయితే చిరంజీవి, పవన్ మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదని మరోసారి రుజువయింది. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన చిరు, పవన్ ఎడమొహం, పెడమొహంగా వ్యవహరించడంతో మెగా బ్రదర్స్ మధ్య దూరం కొనసాగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన అన్నయ్యతో విభేదాలు లేవని పవన్ కళ్యాణ్ నేడు ప్రకటన విడుదల చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ప్రెస్ మీట్‌తో ఆయన తెర దించనున్నారు.