ఎన్టీఆర్‌ కొత్త సినిమా: లైన్‌లోకి పవన్‌ డైరెక్టర్‌ | Jr NTR asked director to prepare a script | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ కొత్త సినిమా: లైన్‌లోకి పవన్‌ డైరెక్టర్‌

Published Mon, Oct 31 2016 7:22 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఎన్టీఆర్‌ కొత్త సినిమా: లైన్‌లోకి పవన్‌ డైరెక్టర్‌ - Sakshi

ఎన్టీఆర్‌ కొత్త సినిమా: లైన్‌లోకి పవన్‌ డైరెక్టర్‌

‘జనతా గ్యారేజ్‌’  సూపర్‌హిట్‌తో ఊపుమీదున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ ప్రాజెక్టును ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాడు. భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకురావాలని ప్లాన్‌ చేస్తున్న తారక్‌.. యువ దర్శకులకు చాన్స్‌ ఇచ్చేందుకు సై అంటున్నారు. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్‌ దర్శకుడిని లైన్‌లోకి తెచ్చినట్టు టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

పవన్‌తో సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమాను తీసిన దర్శకుడు బాబీని స్క్రిప్ట్‌ ప్రిపేర్‌ చేయమని జూనియర్‌ ఎన్టీఆర్‌ అడిగినట్టు తెలుస్తోంది. దీంతో ఎగిరి గంతేసిన బాబీ ప్రస్తుతం కథను సిద్ధం చేయడంలో తలమునకలైనట్టు చెప్తున్నారు. బాబీ కథకు తారక్‌ కనుక ఓకే చెప్తే.. అది బాబీ కెరీర్‌కు పెద్ద మలుపు కానుంది.

‘జనతా గ్యారేజ్‌’ హిట్‌తో తారక్‌ తన తదుపరి సినిమాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అసాధరణ కథతో ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్నది ఆయన ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు దర్శకుల కథలను విన్న తారక్‌ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకు తన ఆమోదం తెలుపలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement