
సర్దార్ గబ్బర్‌సింగ్‌కు ఇద్దరు బాడీగార్డులు
ప్రస్తుతం టాలీవుడ్ సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్దార్ గబ్బర్సింగ్. లాంగ్ గ్యాప్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా ఆడియోను భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
ఈ నేపథ్యంలో మెగా హీరో సాయి ధరమ్తేజ్ చేసిన ట్వీట్లు ఆసక్తి కలిగించాయి. సర్దార్‌కు ఇద్దరు కొత్త బాడీగార్డులు అపాయింట్ అయ్యారంటూ ట్వీట్ చేశాడు సాయి. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకుండా మరిన్ని వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ అభిమానులను మరింతగా ఊరించాడు. తాజాగా ఈ ట్వీట్పై క్లారిటీ ఇస్తూ పవన్ నడిచి వస్తుంటే తన తమ్ముడితో కలిసి సాయి ముందు నడుస్తున్న ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. పవన్ స్నేహితుడు శరత్ మరార్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏప్రిల్ 8న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్కు రెడీ అవుతోంది.
Flash news for all. Two new bodyguards are appointed for Saardar. Stay tuned for more details. #SardaarkoSalaam
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 14, 2016
Sardaar's new body guards #SardaarkoSalaam pic.twitter.com/9GFvqIilo5
— Sai Dharam Tej (@IamSaiDharamTej) March 15, 2016