మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్‌ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్‌ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది.
(ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది)
మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్‌కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్‌కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్‌కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్‌గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు.
పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే
'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్‌మార్, అన్నవరం, గబ్బర్‌సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్‌సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్‌లు కావడం విశేషం.
(ఇదీ చదవండి: అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్)
ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్‌లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్‌కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
(ఇదీ చదవండి: అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment