BRO Movie
-
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్‌లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బలం ఉంటే చిన్న సినిమాలకు కూడా ప్రేక్షకులు పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవలోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ `జమాన`. పవన్‌కల్యాణ్`బ్రో` సినిమాతో సుపరిచితుడైన సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్, విఎస్ అసోసియేట్స్ పతాకాలపై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోను దర్శకుడు వెంకీ కుడుముల విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ - 'జమాన టైటిల్ ప్రోమో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమాలో నటించిన సూర్య శ్రీనివాస్, సంజయ్‌కి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాస్కర్ జక్కుల విజన్ బాగా నచ్చింది. టైటిల్ ప్రోమోలో చార్మినార్ దగ్గరి షాట్ చాలా బాగుంది. డిఓపి చక్కగా తీశారు. ఈ సినిమాకు సంబందించి ఎలాంటి సహాయం కావాలన్నా మా టీమ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ఈ సినిమా నిర్మాతలకు, చిత్ర యనిట్ కు ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'మేం అడగగానే వెంటనే మా 'జమాన' టైటిల్ ప్రోమోను విడుదల చేసిన వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్...ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా విడుదలైన మా 'జమాన' సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.. మా డైరెక్టర్ భాస్కర్ గారికి మంచి విజన్ ఉంది. నేటి యువతకు సంబందించి ఒక అద్భుతమైన కథతో ఈ చిత్రానికి తెరకెక్కించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్.' అన్నారు. దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ.. 'జమాన టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన దర్శకులు వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ లో యూత్ కి నచ్చే విధంగా 'జమాన' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఫస్ట్ మూవీ అయినా యాక్టర్స్, టెక్నీషియన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాతలకి థ్యాంక్స్..త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం.' అన్నారు. -
ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు సినిమాలు, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సినిమావాళ్లకు శుక్రవారం సెంటిమెంట్ ఎక్కువ. చాలామంది ప్రత్యేకంగా ఈరోజే చిత్రాలు విడుదల చేస్తూ ఉంటారు. ఆరోజు రెండు, మూడు సినిమాలు రిలీజవుతున్న సరే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికో, ప్రీపోన్ చేసుకోవడానికో ఇష్టపడరు. కచ్చితంగా ఫ్రైడేనే విడుదల చేస్తామంటారు. అలా ఈ రోజు(ఆగస్టు 25న) గాండీవధారి అర్జున, బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్(డబ్బింగ్) సినిమాలు థియేటర్లలో రిలీజయ్యాయి. వీటిలో గాండీవధారి అర్జునకు మిశ్రమ స్పందన లభిస్తుండగా బెదురులంక 2012, బాయ్స్ హాస్టల్ చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తోంది. థియేటర్‌కు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో కూడా కొత్త చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. డబ్బింగ్ మూవీతో కలుపుకుని నాలుగు తెలుగు సినిమాలు ఓటీటీలో ప్రత్యక్షమయ్యాయి. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్‌ల బ్రో మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అటు స్లమ్‌డాగ్ హజ్బెండ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతోంది. బేబి మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. పిజ్జా 3: ద మమ్మీ సైతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. పిజ్జా 3 మూవీ థియేటర్లలో విడుదలై కేవలం వారం రోజులు మాత్రమే అవుతోంది. తెలుగులో డబ్ అయిన ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాను జనాలు పట్టించుకోలేదు. కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో వారం రోజులకే దీన్ని ఓటీటీలోకి తెచ్చేశారు. మీరు కూడా పైవాటిలో నచ్చిన మూవీని సెలక్ట్ చేసుకుని ఎంచక్కా ఇంట్లోనే చూసేయండి.. చదవండి: వరుణ్ తేజ్ సినిమాకు షాకింగ్ టాక్.. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్.. ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ -
ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే థియేటర్లలో మహా అయితే ఓ నాలుగైదు సినిమాలు మాత్రం ప్రతి వారం వస్తుండేవి. కానీ ఓటీటీ పుణ్యమా అని ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో కొత్త మూవీస్-వెబ్ సిరీస్‌లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈసారి కూడా అలానే ఏకంగా 21 సినిమాలు రిలీజ్‌కి రెడీ అయిపోయాయి. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) అయితే ఈ లిస్టులో తెలుగు సినిమాలు తక్కువగానే ఉన్నాయి. వాటిలో బ్రో, బేబీ చిత్రాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. అదే టైంలో పలు చిన్న సినిమాలు, వెబ్ సిరీసులు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. అయితే దిగువన లిస్టులో 'స్ట్రీమింగ్ అవుతున్నాయి' అని రాసున్నవి గురువారం విడుదలైనవి అని, మిగతావన్నీ శుక్రవారం (ఆగస్టు 25) ఓటీటీల్లోకి రాబోతున్నాయని అర్థం. శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ బ్రో - తెలుగు మూవీ కిల్లర్ బుక్ క్లబ్ - ఇంగ్లీష్ సినిమా యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా - ఇంగ్లీష్ మూవీ హూ ఈజ్ ఎరిన్ కార్టర్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) రగ్నారోక్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ స్లమ్ డాగ్ హజ్బెండ్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) ద రౌండప్: నో వే ఔట్ - కొరియన్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) హాట్‌స్టార్ ఐరన్ హార్ట్ - ఇంగ్లీష్ సిరీస్ ఆఖరి సచ్ - హిందీ సిరీస్ ఆహా బేబీ - తెలుగు సినిమా జీ5 షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ - బెంగాలీ మూవీ బ్లాక్ అండ్ వైట్ - తమిళ సినిమా ఈ-విన్ పార్థుడు - తెలుగు డబ్బింగ్ సినిమా జియో సినిమా బజావో - హిందీ సిరీస్ సైనా ప్లే ఒన్నమ్ సాక్షి పరేతన్ - మలయాళ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ - ఇంగ్లీష్ సిరీస్ లయన్స్ గేట్ ప్లే ఎబౌట్ మై ఫాదర్ - ఇంగ్లీష్ సినిమా మనోరమ మ్యాక్స్ కురుక్కన్ - మలయాళ చిత్రం హోయ్ చోయ్ కుముదిని భవన్ - బెంగాలీ సినిమా ఎమ్ఎక్స్ ప్లేయర్ లాస్ట్ అండ్ ఫౌండ్ ఇన్ సింగపూర్ - హిందీ సిరీస్ (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) -
ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అందరూ ఆఫీస్, స్కూల్-కాలేజీ హడావుడిలో పడిపోయారు. వీళ్లతో పాటు సినిమా లవర్స్ ఈ వారం కొత్త సినిమాలు ఏం రాబోతున్నాయా అని వెతికేస్తున్నారు. థియేటర్లలో రిలీజయ్యే వాటిలో 'గాండీవధారి అర్జున' కాస్త ఆసక్తి కలిగిస్తోంది. దీంతో అందరి దృష్టి ఓటీటీ రిలీజులపై పడింది. అందుకు తగ్గట్లే ఈ వారం 21 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఓ రెండు మూడు మాత్రమే ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్-7' గ్రాండ్ లాంచ్‌కి డేట్ ఫిక్స్) ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాల లిస్ట్ నెట్‌ఫ్లిక్స్ లైట్ హౌస్ (జపనీస్ సిరీస్) - ఆగస్టు 22 బకీ హమా సీజన్ 2: పార్ట్ 2 (జపనీస్ సిరీస్) - ఆగస్టు 24 రగ్నారోక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 24 బ్రో (తెలుగు మూవీ) - ఆగస్టు 25 కిల్లర్ బుక్ క్లబ్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 యువర్ సో నాట్ ఇన్వైటెడ్ టూ మై బ్యాట్ మిత్వా (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 25 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆశోక (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23 ఐరన్ హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25 ఆఖరి సచ్ (హిందీ సిరీస్) - ఆగస్టు 25 ఆహా బేబీ (తెలుగు సినిమా) - ఆగస్టు 25 జీ5 షోరేర్ ఉష్ణోతోమో దిన్ ఈ (బెంగాలీ మూవీ) - ఆగస్టు 25 జియో సినిమా లఖన్ లీలా భార్గవ - హిందీ సిరీస్ - ఆగస్టు 21 బజావో (హిందీ సిరీస్) - ఆగస్టు 25 బుక్ మై షో సమ్ వేర్ ఇన్ క్వీన్స్ - ఇంగ్లీష్ సినిమా - ఆగస్టు 21 హెచ్ఆర్ ఓటీటీ మధుర మనోహర మోహం (మలయాళ చిత్రం) - ఆగస్టు 22 సైనా ప్లే పడచోనే ఇంగళు కాతోలే (మలయాళ మూవీ) - ఆగస్టు 22 ఒన్నమ్ సాక్షి పరేతన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25 ఆపిల్ ప్లస్ టీవీ ఇన్వేజన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 23 వాంటెడ్: ద ఎస్కేప్ ఆఫ్ కార్లోస్ గోస్న్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 25 లయన్స్ గేట్ ప్లే ఎబౌట్ మై ఫాదర్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 25 మనోరమ మ్యాక్స్ కురుక్కన్ (మలయాళ చిత్రం) - ఆగస్టు 25 (ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!) -
బ్రో ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రో. ప్రియ ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటించారు. తమిళ సూపర్ హిట్ మూవీ వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్. మాతృకలో సినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లు రాబట్టడంలోనూ విఫలమైంది. డైరెక్టర్ సినిమా కథను లైట్ తీసుకుని హీరోను హైలైట్ చేసేందుకే ఎక్కువ కష్టపడ్డాడని విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై స్పష్టత వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ మూవీ ఆగస్టు 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. అంటే ఈ శుక్రవారం ఓటీటీలో ల్యాండ్ అయ్యేందుకు బ్రో సిద్ధమయ్యిందన్నమాట! థియేటర్లో సినిమా చూడటం మిస్ అయినవారు, లేదంటే మరోసారి బ్రోను చూడాలనుకునేవారు ఈ ఫ్రైడే ఓటీటీలో ఎంచక్కా చూసేయండి. బ్రో సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మానందం, రోహిని, వెన్నెల కిశోర్, రాజా చెంబోలు తదితరులు ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరించాడు. #Bro Coming to Netflix on this Friday ....#BroMovie#BroOnNetflix pic.twitter.com/1lxuAawGPe — The South Movies (@TheSouthMovies1) August 20, 2023 చదవండి: సాయిధరమ్ తేజ్ రీల్ చెల్లెలు.. ఇంత అందంగా ఉందేంటి బ్రో! -
బ్రోలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?
కొంతమంది చిన్న పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రస్తుతం అలాంటి ఓ నటి యువలక్ష్మి. ‘బ్రో ’ అంటూ తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన ఆమె గురించి కొన్ని మాటలు.. యువలక్ష్మి అసలు పేరు యువశ్రీలక్ష్మి. పుదుచ్చేరిలోని కారైకాల్ ఆమె జన్మస్థలం. ఆమెకు భరతనాట్యమంటే చాలా ఇష్టం. భరతనాట్యంలో శిక్షణ పొందింది. పలు ప్రదర్శనలిచ్చి, జాతీయ అవార్డుతోపాటు ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకుంది. బీటెక్ పూర్తి చేశాక నటనపై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ‘అమ్మ కనక్కు’ సినిమాతో అడుగుపెట్టింది. ఇందులో అమలా పాల్ కుమార్తెగా నటించింది. ఆ తర్వాత సముద్రఖని దర్శకత్వం వహించిన ‘అప్పా’, శివకార్తికేయన్ ‘వెలైకరన్’, ‘అరుతుర’, ‘కాంచన–3’లో సహాయక పాత్రలు పోషించింది. ‘ఆకాశమిట్టయే’గా రీమేక్ చిత్రంతో యువలక్ష్మి మాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సముద్రఖని డైరక్ట్ చేసిన ‘వినోదాయ సితం’, తెలుగు రీమేక్ ‘బ్రో’లో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలుగా నటించి మెప్పించింది. జాకీచాన్‌కి పెద్ద ఫ్యాన్ నేను. ఆయన సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోను ఎప్పుడూ మిస్ కాను. – యువలక్ష్మి View this post on Instagram A post shared by Yuva Lakshmi (@yuvasrilakshmiofficial) చదవండి: అప్పుడు బాలనటుడు.. ఇప్పుడు హీరో అయ్యాడు! -
మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్‌పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్‌లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు! మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు. అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్‌స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) -
బాబు, పవన్ పై మంత్రి అంబటి అదిరిపోయే సెటైర్లు
-
రాజకీయాల్లో ‘సినిమా’లొద్దట.. పవన్ కొత్త పల్లవి
సాక్షి, అమరావతి: పవన్‌కళ్యాణ్ తాజాగా నటించిన ‘బ్రో’ సినిమా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబు చేసిన పలు సంచలన ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోగా, ఇక నుంచి పార్టీ నేతలెవ్వరూ సినిమాల గురించి మాట్లాడ కండంటూ హుకుం జారీ చేయడం పట్ల విస్తుపోతున్నారు. రాజకీయాల్లో సినిమా ప్రస్తావనలొద్దని చెప్పడం వెనుక కారణం ఏంటని చర్చించుకుంటున్నారు. సాధారణంగా ‘ఈ వకీల్‌సాబ్.. చెబుతున్నాడు’ అంటూ.. తాను నటించిన సినిమాలోని పా త్రలను ఉటంకిస్తూ మాట్లాడటం పరిపాటి. తన రాజకీయ ప్రసంగాల్లో ఎక్కువగా సినిమా విష యాలే ప్రస్తావిస్తూ ఉంటారు. అలాంటిది.. హఠాత్తుగా ‘సినిమాలను రాజకీయాల్లోకి తీసుకురావొద్ద’ంటూ నేతలకు బహిరంగంగా స్పష్టమైన సూచనలు చేయడం మంత్రి అంబటి లేవనెత్తిన అంశాలపై పార్టీ నాయకులు సైతం మాట్లాడకుండా ఉండడం కోసమేనని స్పష్టమవుతోంది. ఈ విధంగా తమ నోళ్లను కూడా మూయించారని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. పవన్ ఎంత తీసుకున్నాడు? ‘బ్రో’ సినిమాలో పరోక్షంగా మంత్రి అంబటిని ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించడంపై సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయాల కోసం సినిమాలు చేస్తున్నానని, రోజుకు రూ.రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటానని చెబుతున్న పవన్ కళ్యాణ్.. బ్రో సినిమాకు నిర్మాతల నుంచి ఎంత తీసుకున్నాడు?.. అసలు ఈ పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి చెప్పాలంటూ మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ఆ సినిమా వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని.. చంద్రబాబు అండ్ ముఠా అమెరికాలో చందాలు వసూలు చేసి, ఆ బ్లాక్ మనీని వైట్ చేసి పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారని ఆరోపించారు. వీటన్నింటిపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలన్న డిమాండ్‌తో అంబటి ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లి రావడం తెలిసిందే. మంత్రి అంబటి ఢిల్లీలో ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసిన అనంతరం విలేకరులతో కూడా ఇవే విషయాలు చెప్పారు. ఈ విషయాలు నిజం కాకపోతే పవన్‌కళ్యాణ్ ఎందుకు ఖండించడం లేదనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దీనిపై ఏం మాట్లాడితే ఏం బయట పడుతుందోనని పవన్ భయపడటం వల్లే ‘సినిమా’ ప్రస్తావనలు వద్దని సూచించారని జనసేనకు చెందిన ఓ నేత తెలిపారు. సినిమాలను రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికిన పవన్.. ఆ సినిమాలో అంబటిని అవమానించేలా నృత్యం ఎందుకు పెట్టించాడో సమాధానం చెప్పాల్సి ఉంటుందని రాజకీయ, సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. చదవండి పోలీసులపై జరిగిన దాడి పవన్‌కు కనిపించడం లేదా?: వెల్లంపల్లి -
ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ
-
భారీ స్కామ్.. ‘బ్రో’.. ఎంపీ విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి భేటీ
సాక్షి, ఢిల్లీ: ఎంపీ విజయసాయిరెడ్డితో ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బ్రో మూవీ లావాదేవీలపై ఆయన చర్చించారు. ఇతర ఎంపీలను కూడా మంత్రి కలవనున్నారు. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. కాగా, బ్రో సినిమా వ్యవహారంలో నూటికి నూరు శాతం అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అదో కుంభకోణమని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. నిన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాను చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేకపోతే సినిమా నిర్మాతగానీ పవన్ కళ్యాణ్‌గానీ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. వాస్తవాలు వెల్లడించేందుకు భయపడుతున్నారా? దాస్తున్నారా? అని నిలదీశారు. దాస్తున్నారంటే అందులో స్కామ్ దాగి ఉందనే అర్థమని స్పష్టం చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అమెరికాలో తన ముఠా ద్వారా వసూలు చేసిన డబ్బును నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీగా ఇప్పించారన్నారు. చదవండి: మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’ బ్రో సినిమాకు విదేశీ పెట్టుబడులు అక్రమంగా వచ్చాయని, ఇది మనీలాండరింగ్ కాదా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత? కలెక్షన్లు ఎంత? పవన్ పారితోషికం ఎంత? ఆదాయ పన్నుగా కట్టింది ఎంత? అని ప్రశ్నించారు. అత్యంత నిజాయితీపరుడినని, అపర దాన కర్ణుడినని, సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తినంటూ డైలాగ్‌లు కొట్టే పవన్ వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు. సినిమాను సినిమాలాగే చూడాలన్న సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి స్పందిస్తూ అలాంటప్పుడు సినిమాలను సినిమాలుగానే తీయండి.. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు? అని చురకలంటించారు. తనపై పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసినా అభ్యంతరం లేదన్నారు. బ్రో సినిమా వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా ‘నేను ఇవాళ రాత్రి చాలా ముఖ్యమైన అంశంపై ఢిల్లీ వెళ్తున్నా. మా పార్టీ ఎంపీలను కలుస్తా. ఢిల్లీ నుంచి వచ్చాక అన్ని వివరాలు చెబుతా’ అని అంబటి చెప్పారు. -
బ్లాక్ మనీ కథా చిత్రం..కథ అడ్డం తిరిగిందా బ్రో..
-
‘మమ్మల్ని గోకితే రిజల్ట్ ఇలానే ఉంటుంది’
సాక్షి, కృష్ణా: సాయి ధరమ్ తేజ్-పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి స్పందించారు. విజయవాడలో బుధవారం ఆయన సాక్షిటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్‌కు, హీరో సాయి ధరమ్ తేజ్‌కు.. పనిలోపనిగా పవన్‌కు ఆయన చురకలు అంటించారు. ‘‘నేను చేసినవి ఆరోపణలే అయితే.. వాస్తవాలు దాచాల్సిన అవసరం ఏముంది?. పవన్ రెమ్యునరేషన్ ఎంత? సినిమాకు పెట్టుబడి ఎంత? కలెక్షన్స్ ఎంత?. వాస్తవాలు చెప్పడానికి భయపడుతున్నాడా? లేదంటే దాస్తున్నాడా?. నిజాలు దాస్తున్నారంటే ఏదో ఉందనేగా అర్థం అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. దానకర్ణుడు, సమాజశ్రేయస్సు కోరే వ్యక్తి అని చెప్పే పవన్ ఎందుకు వాస్తవాలు దాస్తున్నాడు. తన నీతి, నిజాయితీ నిరూపించుకోవాలంటే సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్.. కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో చెప్పాల్సిన అవసరం పవన్‌కు కచ్చితంగా ఉంది అని అంబటి డిమాండ్ చేశారు. బ్రో సినిమానే ఒక స్కాం నూటికి నూరు శాతం బ్రో విషయంలో చాలా పెద్ద వ్యవహారం ఉంది. చంద్రబాబు ప్యాకేజ్ విశ్వప్రసాద్ ద్వారా అందింది. ఒక స్కామ్ మాదిరిగా ఈ ప్యాకేజ్ వ్యవహారం జరుగుతోంది. ఇదంతా వాళ్లు ఆడే గేమ్ ప్లాన్. అంకెలు చెబితే దొరికిపోతామని భయపడుతున్నారు. అందుకే చెప్పడం లేదు అని అంబటి ఆరోపించారు. మమ్మల్ని గోకితే ఇలాగే ఉంటుంది సినిమాను సినిమాలాగే చూడాలంటున్నాడు ఈ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్. సినిమాలను సినిమాగానే తీయండి. మధ్యలో మమ్మల్ని గోకడమెందుకు?. మమ్మల్ని గోకితే .. ఇలానే ఉంటుంది. నా మీద పుంఖాను పుంఖాలుగా వెబ్ సిరీస్ తీసుకోండి.. నాకేం అభ్యంతరం లేదు. అందులో సాయిధరమ్ తేజ్ , పవన్ కళ్యాణ్ ను పెట్టి.. విశ్వప్రసాద్ తో తీయించండి. పవన్ కల్యాణ్ అన్ని సినిమాల గురించి నేను పట్టించుకోలేదు. మీ సినిమాలు మీరు తీసుకుంటే ఏమీ ఉండదు. మమ్మల్ని గోకితే ఇలానే ఉంటుంది. ఇదే ఈ కథలో నీతి అని తెలిపారాయన. ఇక అంబటి ఢిల్లీ పర్యటన గురించి, దానికి బ్రో చిత్ర వివాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘ నేను ఢిల్లీ ఎందుకు వెళ్తున్నానో చెప్పను. ముఖ్యమైన అంశం మీద వెళ్తున్నా. అక్కడ మా పార్టీ ఎంపీలను కలుస్తా’’ అని సమాధానం ఇచ్చారు. -
హవాలా డబ్బుతో సినిమా? ఏంటి 'బ్రో' ఇది!
పవన్ కల్యాణ 'బ్రో'.. బాక్సాఫీస్ దగ్గర చల్లబడింది. 50, 100 కోట్ల కలెక్షన్స్ అని హడావుడి చేస్తున్నారు కానీ అదంతా ఉత్తిదే. ఎందుకంటే అంత డబ్బులు వస్తే ఒక్క పోస్టర్ అయినా రిలీజ్ చేయాలి. కానీ ఆ ఊసే లేదు. దీనిబట్టే అర్థమవుతోంది. సినిమాకు టాక్ ఫుల్.. వసూళ్లు నిల్ అని. మరోవైపు వైఎస్సార్సీపీ నాయకులు చెప్పేది వింటే.. 'బ్రో' నిర్మాణం, బడ్జెట్‌పై ఫ్యాన్స్‌కి కూడా కొత్త డౌట్స్ వస్తాయి. (ఇదీ చదవండి: సినిమాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న పవన్) ఏం జరిగింది? ఓటీటీలో రిలీజైన తమిళ సినిమా 'వినోదయ సీతం'. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉన్నప్పటికీ.. పవన్ రీమేక్ చేశాడు. తాజాగా థియేటర్లలో రిలీజ్ అయితే.. ఫ్యాన్స్‌కి తప్ప మిగతా ఎవ్వరికీ పెద్దగా నచ్చలేదు. 'బ్రో' చూసిన వాళ్లని అడిగితే.. దీనిపై మీకే క్లారిటీ వచ్చేస్తుంది! ఈ సినిమాలో అవసరం లేకున్నా శ్యాంబాబు అనే పాత్ర పెట్టి, ఏపీ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారు. దీనిపై నటుడు పృథ్వీరాజ్ అవాకులు చవాకులు పేలడం వివాదం మరింత ముదిరేలా చేసింది. అంబటి సెటైర్స్ తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి అంబటి రాంబాబు.. 'బ్రో' నిజస్వరూపం బటపెట్టారు. 'కలెక్షన్స్ పెంచుకునేందుకు దర్శకనిర్మాతలు తాపత్రాయ పడుతున్నారు. అట్టర్ ఫ్లాప్ సినిమాని అద్భుతమని చెబుతున్నారు. కలెక్షన్స్ రోజురోజుకీ దారుణంగా పడిపోతున్నాయి. సినిమాను సినిమాగా తీయాలి. పైశాచికానందం పొందాలనుకుంటే హిట్ కాదు. పవన్‌కు ఇచ్చిన రెమ్యునరేషన్ కూడా 'బ్రో'కు రాలేదు. బ్లాక్ మనీని వైట్ చేసుకునే కుట్ర ఈ మూవీ వెనుక ఉంది. ఈ మూవీ నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని ఆయన ద్వారా టీడీపీ అందజేసింది' అని అంబటి చెప్పుకొచ్చారు. అలానే 'బ్రో' నిర్మాతలకు అమెరికా నుంచి అక్రమంగా హవాలా రూపంలో డబ్బు వచ్చిందని చెబుతూ, వైసీపీ ఎంపీలతో పాటు దర్యాప్తు సంస్థలకు అంబటి ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: సీఎం బయోపిక్‌లో సేతుపతి ఫిక్స్!) డబ్బు రూటింగ్ వైసీపీ నేత రవిచంద్రారెడ్డి కూడా 'బ్రో' చిత్రంపై ఆరోపణలు చేశారు. ఈ సినిమా కోసం ఫారెన్ మనీ రూటింగ్ జరిగిందని ఆరోపించారు. నిర్మాతలు పవన్‌కు ఎంత డబ్బు ఇచ్చారనే దానిపై విచారణ జరపాలని, నిజాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈడీ జోక్యం చేసుకోవాలని అన్నారు. పై విషయాలన్నీ చూస్తుంటే.. 'బ్రో' వెనక హవాలా హస్తం ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విషయాలన్నింటిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిర్మాత రియాక్షన్ అంబటి ప్రెస్‌మీట్ తర్వాత ఓ టీవీ ఛానెల్ డిబేట్లో మాట్లాడిన 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్.. నిబంధనల ప్రకారమే పెట్టుబడులు పెట్టామని చెప్పారు. పవన్‌కి ఎంతిచ్చామో, సినిమాకు ఖర్చు చేసిన మొత్తం గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విదేశీ నిధులు ఆర్బీఐ రూల్స్ ప్రకారమే వచ్చాయని, ఏజెన్సీలు వస్తే లెక్కలు చూపిస్తామని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!) -
బ్రో సినిమా లావాదేవీలపై ఢిల్లీకి మంత్రి అంబటి
సాక్షి, విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బ్రో మూవీ లావాదేవీలపై జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ రాత్రి(బుధవారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలను కలవనున్నారు. బ్రో సినిమాకు విదేశాల నుంచి నిధుల తరలింపుపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అంతకుముందు పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. బ్రో సినిమా పెద్ద కుంభకోణమని.. అమెరికాలో బాబు ముఠా వసూలు చేసిన డబ్బుతో నిర్మాత ద్వారా పవన్‌కు ప్యాకేజీ ఇచ్చిన్నట్లు విమర్శించారు. తీసుకున్న రెమ్యునరేషన్‌కు పవన్ ఇన్కమ్ ట్యాక్స్‌కు లెక్కలు చెప్పారా అని నిలదీశారు. పవన్ శునకానందం వల్లే బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని.. ఇప్పటివరకు ఆ సినిమాకు రూ.55.26 కోట్లే వచ్చాయని తెలిపారు. తనపై వివాదం చేసి.. కలెక్షన్లు పెంచుకోవాలని చూస్తున్నారని, దమ్ముంటే రాంగోపాల్ వర్మలా రాజకీయ వ్యంగ్య చిత్రం తీసుకోవాలని సవాల్ విసిరారు. మేడిపండు లాంటి పవన్ జీవితంపై త్వరలో సినిమా తీస్తామని తెలిపారు. మహిళా లోకం మెచ్చుకునేలా క్లైమాక్స్‌లో ఆయనకు గుణపాఠం చెబుతామన్నారు.ఈ సినిమాకు ‘నిత్య పెళ్ళికొడుకు.. పెళ్ళిళ్ళు–పెటాకులు, తాళి–ఎగతాళి పేర్లు పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ కథకు సరిపోయే మంచి పేరు పెట్టిన వారికి బహుమతి ఇస్తామని పేర్కొన్నారు. చదవండి: సినిమాల కోసం రాజకీయాలను వాడుకుంటున్న పవన్.. పాపం జన సైనిక్స్! -
నేడు ఢిల్లీకి మంత్రి అంబటి...బ్రో సినిమా లావాదేవీలపై ఫిర్యాదు
-
బ్రో.. ఇది పెద్ద కుంభకోణం
సాక్షి, అమరావతి: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బ్రో కాదు.. మ్రో (మ్యారేజస్.. రిలేషన్స్.. అఫెండర్) అంటూ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యంగోక్తులు విసిరారు. బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్.. అతి పెద్ద డిజాస్టర్ అయ్యిందని.. కలెక్షన్లు పెంచుకోవడం కోసమే తనపై వివాదం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే.. దానిలో తన శత్రువుల పేర్లు పెట్టి దూషించి, పైశాచిక ఆనందం పొందాలనుకోవడం వల్లే బ్రో సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే రాంగోపాల్ వర్మలా రాజకీయ వ్యంగ్య చిత్రం తీసుకోవాలని.. కావాలంటే ఆ సినిమాకు సంబరాల రాంబాబు అని పేరు పెట్టుకోవాలని పవన్‌కు సూచించారు. తన పేరు పెట్టుకున్నందుకు డబ్బులు కూడా అడగనని తేల్చిచెప్పారు. ముసుగులో గుద్దులాటలో కమర్షియల్ సినిమా పేరుతో తనను కించపరిచేలా ఓ పాత్ర పెట్టి పవన్ కళ్యాణ్ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రి అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కూడా వెనక్కి రాదు.. వినోదయా సీతం అనే తమిళ ఓటీటీ చిత్రాన్ని తీసుకుని తెలుగులో బ్రో పేరుతో భారీ బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని విశ్వప్రసాద్ నిర్మించారు. దీనిలో పవన్ కళ్యాణ్, సాయి ధర్మతేజ్ నటించగా సముద్రఖని దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాశారు. సినిమాల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని ఆ సినిమా తీసిన వాళ్లు కల్పించారు. ఈ సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి...ఆ పాత్రను పవన్ కళ్యాణ్ దూషించి, కించపరిచేలా సృష్టించారని నేను భావిస్తున్నాను. అంతటితో ఆగకుండా దానిలో నటించిన నటులు మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు. కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి.. దానిని వివాదం చేయడం ద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా ఉందని, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. సక్సెస్ మీట్లు కూడా పెడుతున్నారు కానీ, వాస్తవంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అదొక అతి పెద్ద డిజాస్టర్ సినిమా. దాని కలెక్షన్లు చూస్తే సోమవారం వరకూ రూ. 55.26 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. సోమవారమైతే రూ.2.40 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే.. దానిలో తన శత్రువుల పేర్లు పెట్టి దూషించి పైశాచిక ఆనందం పొందాలనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. అటువంటిది కమర్షియల్‌గా హిట్ కాదు...ప్రజలకు చేరదు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేసి దానికి మాటలు రాసి దానిలో నన్ను ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు మొత్తం కలెక్షన్లు రూ.60 నుంచి రూ.70 కోట్లు వస్తాయనుకుంటుంటే హీరో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ రూ.50 కోట్లు పైనే ఉంది. చివరికి పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ కూడా వచ్చే పరిస్థితులు లేకుండా ఈ చిత్రం ఆడుతోంది. వారాహి అమ్మ వారి శాపం.. పవన్ కల్యాణ్ చిత్రాలు ఇక ఆడవు. ఒక సారి వెనక్కి వెళ్లి చూసుకోండి. వారాహి అనే అమ్మవారి పేరును తన వాహనానికి నామకరణం చేసి.. దానిపై నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అవాకులు, చవాకులు పేలాడో అప్పుడే చెప్పా.. పవన్‌కు అమ్మ వారి శాపం తగిలిందని. పవన్ సినిమాలు ఇక ఆడవు అని. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు.. తగిన మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుందని. ఇక ఆయన సినిమాలు కూడా ఆడవు అని నిర్మాతలు తెలుసుకుంటే మంచిది. నిర్మాత విశ్వప్రసాద్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇది పొలిటికల్ మూవీనా అనేది చూసుకుని ఉండాలి. పొలిటికల్ మూవీలు కూడా అనేకం వచ్చాయి. కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కక్ష తీర్చుకోవాలని తాపత్రయ పడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సినిమా ఫ్లాఫ్ కాలేదు.. సక్సెస్ అయ్యిందంటే కలెక్షన్లు ఎంతో లెక్కలు చెప్పండి. విశ్వప్రసాద్ ద్వారా పవన్‌కు ప్యాకేజీ.. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. చంద్రబాబు ముఠా అమెరికాలో డబ్బులు వసూలు చేసి విశ్వప్రసాద్‌కి ఇస్తే... ఆ డబ్బును పవన్ కళ్యాణ్‌కు ప్యాకేజీ అందించారు. ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ రూ.66 కోట్లు తీసుకున్నారా..? లేక రూ.80 కోట్లు తీసుకున్నారా..? ఆయన తీసుకున్న పూర్తి నగదును ఇన్‌కం టాక్స్ వారికి చూపించారా.. లేదా..? నీతి, నిజాయితీ పరుడునని, చట్ట ప్రకారం నడుచుకునే సైనికుడిని అని పదే పదే చెప్పే పవన్ కల్యాణ్ దీనిలో ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు..? అనేది చెప్పాలి. దీనికి ఎంత కలెక్షన్లు వచ్చాయి.. ఈ చిత్రం ఫ్లాఫ్ కావడానికి కారణాలేమిటి అని చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం. రోజుకు రెండు కోట్లు రూపాయలు తీసుకున్నాడు. 40 రోజులు చేశాడని ఒకరు.. 23 రోజులు చేశాడని మరొకరు అన్నారు. 40 రోజులైతే రూ.80 కోట్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. విశ్వప్రసాద్ బ్లాక్ మనీని వైట్‌గా చేసి సినిమా ద్వారా పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇచ్చారు. ఇది ఒక స్కామ్. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయోచ్చు కానీ...సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే రెండూ నాశనం అవుతాయి. ఎన్టీఆర్ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఒకటీ రెండు సినిమాలు తీశారేమో కానీ సినిమాలను అయితే వదిలేశారు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు సినిమాలు తీయలేదు. పవన్‌కు సినిమాలు కావాలి..రాజకీయాలు కావాలని... రెండింటికీ న్యాయం చేయలేని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాడనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. మహిళలు మెచ్చుకునేలా పవన్‌కు గుణపాఠం మేం కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాం. ఆ కథా వస్తువేమిటో ఈ సందర్భంగా వివరిస్తున్నాను. ఒక మంచి కుటుంబ నేపథ్యం.. ఒక చిన్న కుటుంబంలో పుట్టినప్పటికీ అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి యుక్త వయసు వచ్చి..చదువు సరిగ్గా అబ్బక...బజార్ల వెంట చిల్లరగా తిరిగితూ ఏం చేయాలో అర్ధం కాకపోతే అతన్ని అన్నయ్యల వద్ద పెట్టారు. నేను అన్నయ్యల వద్ద ఉండను.. అన్నల్లో కలిసిపోతాను..రౌడీయిజం చేస్తాను.. అక్కడా ఇక్కడా గోకుతాను అనేవాడు. ఇక లాభం లేదని తన అన్నలు తమ సినిమా రంగంలోకే అతన్ని తీసుకొస్తారు. అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి అన్నయ్యల కంటే పెద్ద సెలబ్రిటీగా అతను మారిపోతాడు. ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్పడంతో అమాయక జనం ఈలలు వేస్తుంటారు. దేశం, సమాజం, మానవత్వం, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు. ఇది బయటకు కనిపించే కథ. మేడిపండు చందంగా అతని నిత్య జీవితంలోకి వస్తే అతనికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పట్టుమని రెండేళ్లు కూడా ఉండదు.. మళ్ళీ మరో పెళ్ళి.. పిల్లల్ని కంటాడు.. భార్యతో విభేదిస్తాడు. సంసారం చేస్తూనే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ స్త్రీ నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుని రెండో భార్యను పెళ్లిచేసుకుంటాడు. ఇంతటితో ఆగదు..రెండో భార్యకూ అదే జరుగుతుంది. రెండో భార్యకు ఏం జరిగిందో మూడో భార్యకూ అదే జరుగుతుంది. మూడో భార్యకు ఏం జరుగుతుందో.. నాలుగో భార్యకూ అదే జరుగుతుంది. బయటకు మాత్రం అద్భుతమైన మేకప్‌తో సంఘసంస్కర్తలా ఫోజులు పెడుతుంటాడు. క్లైమాక్స్‌లో అందరు పిల్లలు, అందరు భార్యలు కలిసి మహిళా లోకం మెచ్చుకునేలా అతడికి తగిన గుణపాఠం నేర్పుతారు. ఈ కథపై సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. ఒకరు నిత్య పెళ్లి కొడుకు అని సూచించారు.. మరొకరు పెళ్లిళ్లు–పెటాకులు సూచించారు. తాళి–ఎగతాళి అనేది కూడా పరిశీలనలో ఉంది. మూడు ముళ్లు...ఆరు పెళ్లిళ్లు కూడా పరిశీలిస్తున్నాం. బ్రో లా మ్రో(మ్యారేజెస్– రిలేషన్స్–అఫెండర్ పేరును పరిశీలిస్తున్నాం) ఆఖరుగా అయిన పెళ్లిళ్లు ఎన్నో...పోయిన చెప్పులెన్నో...అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నాం. పేర్లు, కథలో మార్పులు ఏమైనా ఉన్నా, సలహాలు సూచనలు ఎవరైనా చేయవచ్చు.. ఎందుకంటే.. బ్రోలా అట్టర్ ప్లాప్ అయితే కష్టం. శ్యాంబాబు ఎందుకు...నేరుగా రాంబాబు అనే పెట్టుకో: కథ సారాంశం ఏంటంటే సినిమాల్లో ఎవరిని పడితే వారిని గోకితే సినిమాలు సక్సెస్ కావని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. దమ్ముంటే పూర్తి పొలిటికల్ సినిమాలు తీసుకోవచ్చు..శ్యాంబాబు ఎందుకు..రాంబాబే అని నేరుగా పెట్టుకోవచ్చు. నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు. నేనేమన్నా డాన్స్ మాస్టర్నా.. మా అన్నయ్య డాన్స్‌లో ప్రావీణ్యుడా..? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి..అనవసరంగా ఎవరిని పడితే వారిని కెలకడం సమంజసం కాదని తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. -
బ్రో సినిమా కలెక్షన్స్‌పై అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
పవన్ కల్యాణ్, సాయిధర్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రో’ సినిమాపై పొలిటికల్ కామెంట్లకు కూడా దారి తీసింది. సినిమా, రాజకీయం వేరైనా బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రలో నటుడు పృథ్వీ చేసిన డ్యాన్స్‌పై పెద్ద దుమారమే రేగింది. ఇది ఏపీ మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో సంక్రాంతి పండుగకు చేసిన డ్యాన్స్‌ను పోలి ఉందని ఆయన వీరాభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘బ్రో’ సినిమా నటులు, నిర్మాతలపై ఫైర్ అయ్యారు. (ఇదీ చదవండి: బేబి ఫేమ్ 'వైష్ణవి చైతన్య' తమ్ముడు చేసినపనికి భారీ ట్రోలింగ్) ఈ వివాదంపై మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. 'నాది ఆనంద తాండవం.. నీది శునకానందం' అంటూ పవన్ కల్యాణ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తనను పోలిన పాత్రను పెట్టి, దూషించి శునకానందం పొందడం ఎందుకని ఆయన మండిపడ్డారు. తాజాగా బ్రో సినిమా కలెక్షన్స్‌పై మంత్రి అంబటి రాంబాబు తనదైన స్టైల్లో ఇలా కామెంట్ చేశారు. 'ప్రొడ్యూసర్‌కి కలెక్షన్ నిల్లు.. ప్యాకేజి స్టార్‌కి పాకెట్ ఫుల్లు !! అని కామెంట్ చేశారు. ఒక రకంగా ఇదే నిజం అని కూడా తెలుస్తుంది. (ఇదీ చదవండి: అందరి ముందు కన్నీరు పెట్టుకున్న ‘బిగ్ బాస్’ ఫేమ్ సయ్యద్ సోహైల్) 'బ్రో' సినిమాకు సెకండ్ డే నుంచి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. సినిమాకు తొలిరోజు రూ. 30.05 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే రెండో రోజు రూ. 17.05 కోట్లు, 3వ రోజు రూ. 16.9 కోట్లు, ఇక 4న సోమవారం రూ. 5 కోట్లు మాత్రమే వచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. ఇలా బ్రో సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 69.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు సమాచారం అందించాయి. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న ఏ హీరో సినిమా రిలీజైనా మొదటి రెండు, మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోతుంది. అలాంటిది పవన్ సినిమా 4రోజులు పూర్తి అయినా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టకపోవడాన్ని చూస్తే మంత్రి అంబటి రాంబాబు చెప్తుంది నిజమే కదా అంటూ.. అందుకేనేమో ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్‌ను కూడా ఇప్పటి వరకు మేకర్స్ విడుదల చేయలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రొడ్యూసర్ కి కలెక్షన్ నిల్లు ! ప్యాకేజి స్టార్ కి పాకెట్ ఫుల్లు !!@PawanKalyan @vishwaprasadtg — Ambati Rambabu (@AmbatiRambabu) July 31, 2023 -
BRO Success Meet Photos: ‘బ్రో’ మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)
-
పవన్ కళ్యాణ్ శునకానందం..
-
బ్రో సినిమా పై చింతా రాజశేఖర్ కామెంట్స్
-
బ్రో సినిమాలో తనపై వేసిన సెటైర్లపై స్పందించిన మంత్రి అంబటి
-
'BRO' Movie Success Celebrations: ‘బ్రో’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్
సాక్షి, పల్నాడు: రెండు నావల మీద ప్రయాణం కొనసాగిస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మధ్యకాలంలో తన సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. అవసరం ఉన్నాలేకున్నా.. సందర్భం కాకున్నా కొన్ని సీన్లలో ‘అక్కడ స్పేస్ తీసుకుని మరీ’ డైలాగులు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందుకుగానూ ప్రాసలు-పంచులనే నమ్ముకున్న త్రివిక్రమ్ లాంటి సోకాల్డ్ రైటర్ సేవలను ఉపయోగించుకుంటున్నాడు కూడా. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలోనూ ఫ్యాన్ మూమెంట్ పేరిట నింపిన అడ్డగోలు సరుకు విషయంలోనూ.. డోసు ఎక్కువైందనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. బ్రోలో ఓ పేరడీ సీన్ ద్వారా పొలిటికల్‌గానూ ఇప్పుడు కౌంటర్ ఎదుర్కొంటున్నాడు పవన్. ఈ ఏడాది తన నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేసి అదరగొట్టారు. అయితే ఆ సీక్వెన్స్‌ను బ్రో సినిమాలో పేరడీ పేరిట చూపించారు. లైంగిక వేధింపులతో టీటీడీ పదవి.. పరువూ రెండూ పొగొట్టుకుని మెగా కాంపౌండ్ పంచన చేరాడు నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ. అతనిపై బ్రో సినిమాలో ఆ సందర్భాన్ని ‘శ్యాంబాబు’ క్యారెక్టర్ పెట్టి చిత్రీరించారు. అయితే దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ జనసేనాని గూబ గుయ్యిమనేట్లు సమాధానం ఇచ్చారాయన. పైగా నేరుగా పవన్ కల్యాణ్‌నే ట్యాగ్ చేశారాయన. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) July 29, 2023 నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానూ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. విజయవాడలో పోలవరంపై ప్రజంటేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా. పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్నా?. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడు అంటూ సెటైర్లు గుప్పించారాయన. -
బ్రో సినిమాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ
-
బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
టాలీవుడ్ హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ బ్రో. తమిళంలో సూపర్ హిట్ సాధించిన వినోదయ సీతం చిత్రానికి ఇది రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే! మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖని ఈ సినిమాకు కూడా డైరెక్షన్ చేశాడు. తెలుగు నేటివిటికీ తగ్గట్టు చాలా మార్పులే చేశాడు. జూలై 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. డైరెక్టర్ కథను పక్కన పెట్టి పవన్‌ను హైలైట్ చేయడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఈజీగా నచ్చుతుంది కానీ అందరినీ మెప్పించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఏ సినిమా అయినా థియేటర్లో రిలీజైన కొంతకాలానికి ఓటీటీలో రావడం పక్కా! అందుకు బ్రో కూడా అతీతం కాదు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లో రిలీజైన నాలుగు వారాలకే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ లెక్కన బ్రో మూవీ కూడా ఆగస్టు నెలాఖరులో లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలో ఓటీటీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. బ్రో సినిమా విషయానికి వస్తే.. ఇందులో పవన్, సాయిధరమ్ తేజ్‌తో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం తదితరులు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, మాటలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించగా నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరించాడు. చదవండి: బిగ్‌బాస్ కీర్తి ఎంగేజ్మెంట్ ఫిక్స్ -
BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ
టైటిల్: బ్రో నటీనటులు: పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, . కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ , బ్రహ్మానందం తదితరులు నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , జీ స్టూడియోస్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ స్క్రీన్‌ప్లే, మాటలు: త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం: సముద్రఖని సంగీతం: తమన్ ఎడిటర్: నవీన్ నూలి విడుదల తేది: జులై 28, 2023 ‘బ్రో’కథేంటంటే.. మార్కండేయులు అలియాస్ మార్క్(సాయి ధరమ్ తేజ్) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. తల్లి(రోహిణి), ఇద్దరు చెల్లెలు(ప్రియా ప్రకాశ్ వారియర్, యువ లక్ష్మీ), అమెరికాలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదే తనలోకం. చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు తనే చూసుకుంటాడు. సమయాన్ని వృధా చేయకుండా ప్రతిక్షణం డబ్బు సంపాదన మీదే పెడతాడు. చివరకు తన ప్రియురాలు రమ్య(కేతిక శర్మ)తో కూడా సరదాగా గడపలేడు. అలా ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్న మార్క్ ఓ రోజు ప్రమాదానికి గురై చనిపోతాడు. అతని ఆత్మ అంధకారంలోకి వెళ్తుంది. అక్కడ ఓ వెలుగు ద్వారా టైంగాడ్ టైటాన్(పవన్ కల్యాణ్) ప్రత్యక్షమవుతాడు. తనకు చాలా బాధ్యతలు ఉన్నాయని, కొన్ని రోజులు బతికే చాన్స్ ఇవ్వమని టైటాన్‌ని వేడుకుంటాడు మార్కండేయ. టైటాన్ అతనికి 90 రోజుల సమయం ఇస్తాడు. మరి ఈ 90 రోజుల్లో మార్కండేయ తన బాధ్యతలు నెరవేర్చాడా? ఈ క్రమంలో అతను ఏం నేర్చుకున్నాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మూడేళ్ల క్రితం విడుదల విడుదలైన వినోదయ సిత్తం అనే తమిళ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. జీవితంలో ఓ వ్యక్తికి రెండో చాన్స్ వస్తే ఎలా ఉంటుంది? దానిని సద్వినియోగం చేసుకుంటాడా? ఆయన అనుకున్న పనులన్నీ జరుగుతాయా? లేదా? అనే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అయితే మాతృకకు, తెలుగు ‘బ్రో’కు చాలా వ్యత్యాసం ఉంది. పవన్ కల్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా మార్పులు చేశారు. అక్కడ రెండో చాన్స్ వయసు అయిపోయిన ఓ ముసలాయనకు వస్తే.. ఇక్కడ రెండో చాన్స్ ఓ యువకుడికి వస్తుంది. అలాగే అక్కడ టైంగాడ్ పాత్ర నిడివి చాలా తక్కువ, కానీ తెలుగులో టైంగాడ్ దాదాపు సినిమా మొత్తం ఉంటాడు. అయితే ఈ మార్పులు ఫ్యాన్స్‌ని అలరిస్తాయి కానీ సాధారణ ప్రేక్షకులను మాత్రం అంతగా ఆకట్టుకోలేవు. లుక్స్ పరంగా మాత్రం వింటేజ్ పవన్ కల్యాణ్‌ని తెరపై చూస్తారు. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే పవన్ ఎంట్రీ ఉంటుంది. ఆ తర్వాత ఎలాంటి సాగదీత లేకుండా అసలు కథ ప్రారంభమవుతుంది. సాయితేజ్ తో కలిసి పవన్ కల్యాణ్ భూమి మీదకు వచ్చకా..అక్కడ జరిగే కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఎమోషనల్ సీన్స్ సోసోగా ఉంటాయి. ప్రతిసారి పవన్‌ని ఎలివేట్ చేస్తూ చూపించడం ప్యాన్స్‌ని అలరిస్తుంది, కానీ సాధారణ ప్రేక్షకుడికి అతిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఎక్కువ శాతం పవన్ కల్యాణ్ పాత పాటలను పెట్టడం కూడా మైనస్సే. ఒకటి రెండు సన్నివేశాలు అంటే ఓకే కానీ, సినిమా మొత్తం అదే ఉంటే చూసే ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిత్రం విషయం లోను అదే జరిగింది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఫ్యాన్స్ కోసమే చేశారు. సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అయితే సాయితేజ్ పాత్ర పడే సంఘర్షణ, భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరవయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. కథ, కథనం బాగున్నప్పటికీ.. ఏదో మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో హీరో సాయి తేజ్ అయినప్పటికీ సినిమా మొత్తం పవన్ కల్యాణ్ పాత్ర ఉంటుంది. టైంగాడ్ టైటాన్‌గా పవన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై వింటేజ్ పవన్‌ను చూస్తారు. ఇక మార్క్ పాత్రకు తేజ్ న్యాయం చేశాడు. రోడ్డు ప్రమాదం తర్వాత తేజ్ బాడీలో మార్పులు వచ్చాయి. కాస్త బొద్దుగా అయ్యాడు.అది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. డ్యాన్స్ కూడా ఆకట్టుకునేలా చేయలేకపోయాడు. మార్క్ లవర్ రమ్యగా కేతికా శర్మ ఉన్నంతలో పర్వాలేదు. హీరో చెల్లెలు గాయత్రిగా ప్రియాప్రకాశ్ వారియర్ చక్కగా నటించింది. బ్రహ్మానందం ఒకే ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. హీరో తల్లిగా రోహిణి, బాస్‌గా వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్ సంగీతం జస్ట్ ఓకే. కొన్ని పాటలు బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌లో తివిక్రమ్ మార్క్ అంతగా కనిపించదు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
BRO Movie HD Wallpapers: సాయి ధరమ్ తేజ్ ‘బ్రో’ మూవీ మూవీ స్టిల్స్
-
BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగా హీరోలు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకత్వం వహించారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ కీలక హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘బ్రో’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘బ్రో’ కథేంటి? ఎలా ఉంది? దేవుడిగా పవన్ ఏమేరకు మెప్పించాడు? తదితర విషయాలను సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #bro is a powerstar film but lot of lag and many unnecessary scenes makes a below par movie thaman music stands out may be a below average fare for others and vintage papk for fans#BroTheAvatar — Gowtham (@gowthamreddy25) July 28, 2023 ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా యావరేజ్‌గా ఉందని అంటున్నారు. ఓవరాల్‌గా కథ బాగున్నప్పటికీ కొన్ని అనవసరపు సన్నివేశాలు జోడించడం వల్ల సినిమా యావరేజ్‌గా అనిపిస్తుంది. గత సినిమాలతో పోలిస్తే తమన్ సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #BRO First half review highlights:- 1) Vintage Pawan mannerisms 🤙💥 2) Total fun filled👌 3) Bromance between mama alludu👍👍 4) Taman music K**Ramp 💥🔥🔥#BroTheAvatar#BroReview#PawanaKalyan #SaiDharamTej #ketikasharma#PriyaPrakashVarrier — CinephileX (@CinephileX) July 27, 2023 ‘బ్రో’సినిమా బాగుంది. ఫస్టాఫ్ కామెడీ అదిరిపోయింది. మామఅల్లుళ్ల మధ్య బ్రోమాన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక సెకండాఫ్‌లో ఆడియెన్స్ ఎమోషల్ అయ్యే సీన్లు ఉన్నాయి.అదే సమయంలో కొన్ని సాగదీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #BroTheAvathar is just good 👍 If you are expecting mass, just leave the theatre, basically an emotional movie with few laughs. @PawanKalyan entry 💥💥 Overall it's good 👌#BroTheAvatar#BroTimeStarts #BRO For more filmy content and exclusive updates follow me❤️💙 pic.twitter.com/KbO6XtZWgO — Lokie (@LokeshD33384473) July 28, 2023 పవన్ కల్యాణ్ మేజరిజం, కామెడీతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉందట. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం అంతగా నచ్చకపోవచ్చు అంటున్నారు. ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని సన్నివేశాలను యాడ్ చేశారట. అవి సాధారణ ప్రేక్షకులను ఇబ్బందిగా అనిపిస్తాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. #BRO Strictly for PK fans ….high whistle blowing moments with PK vintage mash up songs …Rest all goes flat …again Trivikram failed to deliver an remake with unwanted emotions and unexceptional Lag in screenplay …BGM 👍🔥 2.75/5 #BroTheAvatar #BROFromJuly28th #BROreview pic.twitter.com/q7H1aZVsVX — Saideep07 (@saideep_satya77) July 27, 2023 #BroTheAvatar First half : ⭐⭐ Second half : ⭐ Overall : ⭐😀 Power"less" movie pic.twitter.com/TMIFrTir8W — Viraj_AADHF (@zooCakePaata) July 28, 2023 #BroTheAvatar First Half Review: ⭐⭐⭐½ Dialogues And Racy Screenplay 👌 Thamman BGM ❤️🔥 Interval Block is Too Good🔥🔥#PawanKalyan SDT Combo working good#BroTheAvathar #BroMovieReview #Bro pic.twitter.com/CiQ2aaAAvL — Thyview (@Thyveiw) July 27, 2023 One time watch for PK. Fun and swag when PK is on the screen. Kids liked these episodes. Wish the story was a bit better.#BRO — Anon (@AnonAndhra) July 27, 2023 #BRO -Good script which should have been executed more convincingly , a pure feast for fans with vintage @pawankalyan show in modern ultra stylish looks with reference to his old super hit songs.. #saidharamtej has done good job and all the characters involved in the movie gave — $h@shi yad@v (@shashiyadav073) July 28, 2023 Surprise Insp. ani vere location Povalsi vasthundi, Denemma life, e Tweets chusthu kurchovali eve varaku. 6:30 PM cheskunna 🥲 Missing My #BRO at Benefit shows 🔥🔥 Meeru njoy Cheyandi Cults … Updates matram pettandroi 🔥🔥#BusyBankLife🥲#BroTheAvatar @PawanKalyan pic.twitter.com/jd1K9AGYae — Srikanth_PawanKalyan 🔯 ✊ (@AlwaysPK143) July 28, 2023 First half report : Starting with rampp BGM 🔥🔥🔥BROOOOO 😉 Fans ki highs iche stuff 💥👌👌chaala kothaga undi.. But slow ga untadi..🤷♂️ Amma.. chelli.. Ramya.. BROO 😁Interval. Overall abv average 1st half 😊 @tollymasti . .#BroTheAvatar #Bro #BroReview #PawanKalyan… — Tollymasti (@tollymasti) July 27, 2023 150. #Bro (Telugu) {2.25/5} 😐#BroTheAvatar #BroReview pic.twitter.com/xgvMsqlplY — Cinema Madness 24*7 (@CinemaMadness24) July 28, 2023 Movie Review :- #BroTheAvatar Not Enough Bro...!! We Are Going With 2.5/5⭐#BroReview #BroTheAvatarReview #PawanKalyan #SaiDharamTej @PawanKalyan @IamSaiDharamTej #Bro #Review #FactInMedia pic.twitter.com/6XZjaoGKg7 — FACT IN MEDIA (@FactInMedia) July 28, 2023 First Half - భీమవరం Second Half - గాజువాక Final Report - అనంతపురం#BroTheAvatar #BroReview — నా ఇష్టం🖕 (@Infidel_KING) July 28, 2023 -
ఏంటి పవన్ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్‌లో..!
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రీమేక్ సినిమాతో తన కెరియర్ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్‌లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్‌ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. (ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది) మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్ కల్యాణ్‌కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్ తేజ్‌కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్ చిత్రాల జాబితాలో పవన్‌కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్ తేజ్‌కి ఇది మొదటి రిమేక్ మూవీగా నిలవనుంది. కోలీవుడ్ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం' సినిమాకి రీమేక్‌గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశారు. పవన్ రీమెక్ సినిమాల లిస్ట్ ఇదే 'బ్రో' సినిమాకు ముందు పవన్ నటించిన రీమేక్ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్మార్, అన్నవరం, గబ్బర్‌సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్‌సాబ్, భీమ్లానాయక్ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్‌లు కావడం విశేషం. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్లో మెప్పించినా.. మరికొన్ని మిస్ ఫైర్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం. రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్‌కు కామన్ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (ఇదీ చదవండి: అతనితో డేటింగ్లో భారత మహిళా క్రికెటర్.. ఫోటోలు వైరల్) -
'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!
'ఆచార్య' తర్వాత మెగాహీరోలు చేస్తున్న మల్టీస్టారర్ 'బ్రో'. యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, పవన్ కల్యాణ్ హీరో కంటే తక్కువ-అతిథి పాత్ర కంటే ఎక్కువ ఉండే రోల్ చేశాడు. ఈ శుక్రవారం అంటే జూలై 28న ఇది థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యాన్స్ వరకు ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. మిగతా ప్రేక్షకులు మాత్రం 'బ్రో' మీద 50-50 నమ్మకంతో ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో హీరో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పాడు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) 2021 డిసెంబరులో విడుదలైన సినిమా 'వినోదయ సీతం'. సముద్రఖని నటించి, దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. 99 నిమిషాల నిడివితో ఉన్న ఈ చిత్రం.. తెలుగులోనూ డబ్ అయింది. దీన్ని తెలుగులో 'బ్రో'గా రీమేక్ చేశారు. ఇక్కడ కాస్త డ్యూరేషన్ పెంచారు. ఒరిజినల్లో ఓ పెద్దాయన పాత్ర-సముద్రఖని ఉంటారు. ఇందులో పెద్దాయన స్థానంలో సాయితేజ్, సముద్రఖని ప్లేసులో పవన్ వచ్చారు. విడుదలకి వారం ముందు కూడా 'బ్రో'పై పెద్దగా హైప్ లేదు. దీంతో పవన్ పాత పాటని మరోసారి రీ క్రియేట్ చేశారు. 42 సెకన్లున్న ఈ వీడియోని తాజాగా రిలీజ్ చేయగా, కాస్తంత హైప్ వచ్చింది. అయితే ఈ సాంగ్ సినిమాలో ఉంటుందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఇప్పుడు వాళ్లకు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ మాత్రమే. అదే విషయాన్ని సాయిధరమ్ తేజ్.. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. దీన్నిబట్టి 'బ్రో' ఫ్యాన్స్.. ఆ పాట బిగ్ స్క్రీన్ పై కష్టమే. అంతగా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో చూసుకోండి. Promotional song ..!#BroTheAvatar #Bro pic.twitter.com/ByoLJoXEfb — ✒ త్రివిక్రమ్ ᶠᵃⁿ ✍️ (@Harinani_) July 26, 2023 (ఇదీ చదవండి: 'బేబీ' డైరెక్టర్‌కి విశ్వక్సేన్ కౌంటర్స్.. కానీ!?) -
కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
Bro Movie Trailer Launch : దేవి థియేటర్లో బ్రో ట్రైలర్ లాంఛ్ (ఫొటోలు)
-
‘బ్రో’ మూవీ ట్రైలర్
-
BRO Trailer: కనీవినీ ఎరుగని రెమ్యునరేషన్.. డైలాగులే మైనస్!
సాధారణంగా ఓ మూవీ ట్రైలర్లో ది బెస్ట్ సీన్స్‌ని మాత్రమే చూపిస్తారు. సినిమా మొత్తంలో అవే కీలకం అనేలా ట్రైలర్‌ని కట్ చేస్తారు. ఎందుకంటే ఓ ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించడంలో పాటలతో పాటు ట్రైలర్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ రెండింటిలో ‘బ్రో’మూవీ విఫలమైంది. తమన్ అందించిన పాటలపై తొలి నుంచి విమర్శలే వచ్చాయి. తమ హీరోకి సరైన పాటలు అందించలేదని పవన్ కల్యాణ్ ఫ్యాన్సే తమన్‌ను ట్రోల్ చేశారు. ఇక నిన్న విడుదలైన ట్రైలర్ కూడా ఫ్యాన్స్‌ని కాస్త నిరాశకే గురి చేసింది. పవన్ నోట ఒక్కటంటే ఒక్కటి గుర్తించుకునే డైలాగ్ ట్రైలర్లో చూపించలేదు. ‘బ్రో’సినిమా రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం`కు తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని పవన్‌తో సెట్ చేసింది అతని ‘గురువు’ త్రివిక్రమ్. ‘వినోదయ సీతం’ కథంతా మార్చేసి కమర్షియల్ టచ్ ఇచ్చి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించినా.. మిగతావన్నీ త్రివిక్రమే చూసుకున్నాడు. తొలుత మాటల కోసం సాయి మాధవ్ బుర్రా అనుకుంటే.. త్రివిక్రమే రంగంలోకి దిగి మాటలు, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇందుకుగాను రూ.15 కోట్లతో పాటు లాభాల్లో పావలా వాటాను రెమ్యునరేషన్‌గా తీసుకున్నారని టాలీవుడ్ టాక్. (చదవండి: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ) కేవలం స్క్రీన్‌ప్లే, మాటల కోసం ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇదే తొలిసారి. అయితే నిన్నటి ట్రైలర్లో మాత్రం త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ కనిపించలేదు. ట్రైలర్లోనే అలాంటి డైలాగ్స్ లేవంటే.. సినిమాలో కూడా లేనట్టే. పాటలు, ట్రైలర్ యావరేజ్‌గా ఉన్న ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే.. జులై 28వరకు ఆగాల్సిందే. -
చేసింది 6 సినిమాలు.. పాక్‌లోనూ అభిమాన సంఘాలు
ఆమె ఓ సాధారణ యువ నటి. కన్ను గీటిన ఓ వీడియో వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఫస్ట్ మూవీ రిజల్ట్ సంగతి పక్కనబెడితే పలు భాషల్లో సినిమా ఛాన్సులు కొట్టేసింది. ఇప్పటివరకు ఆరు సినిమాలు చేస్తే వాటిలో ఏదీ కూడా హిట్ అవ్వలేదు. అయితేనేం పాకిస్థాన్ లో ఆమె ఫ్యాన్స్ అసోసియేషన్స్ పెట్టారట. అవును ఈ విషయాన్ని ఆ బ్యూటీనే స్వయంగా బయటపెట్టింది. ఒక్క వీడియో దెబ్బకు కేరళకు చెందిన ప్రియా ప్రకాశ్ వారియర్.. డిగ్రీ చదువుతున్నప్పుడే 'ఒరు అదార్ లవ్' (లవర్స్ డే) అనే మలయాళ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈమె స్టైల్‌గా కన్ను కొడుతున్న వీడియో బిట్ అప్పట్లో రిలీజ్ చేస్తే, ఊహించనంత పాపులారిటీ వచ్చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ తెలుగుతోపాటు ఇతర భాషల చిత్రాల్లోనూ ఛాన్సులొచ్చాయి. (ఇదీ చదవండి: ఆ న్యూస్ చూసి చాలా బాధపడ్డాను: సుస్మిత కొణిదెల) తెలుగులో రెండే జస్ట్ ఒక్క వీడియోతో క్రేజ్ తెచ్చుకున్న ప్రియా వారియర్.. తెలుగులో నితిన్ 'చెక్', తేజా సజ్జా 'ఇష్క్' సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన గత మూడు చిత్రాలు మలయాళంవే. అవి కూడా ఏమంత చెప్పుకోద్దగ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించలేదు. ప్రస్తుతం ఈమె 'బ్రో' మూవీపైనే ఆశలు పెట్టుకుంది. పాక్‌లో ఫ్యాన్స్ బాలీవుడ్ పలువురు పాక్ సింగర్స్, నటులు ఉంటారు కానీ మన యాక్టర్స్ కి దాయాది దేశంలో పెద్దగా అభిమానులు ఉండరు. అలాంటిది ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియోకు పాక్ కుర్రాళ్లు పడిపోయారు. దీని గురించి స్వయంగా ఈ బ్యూటీనే చెప్పింది. దేనికి కనెక్ట్ కానీ పాక్ ప్రేక్షకులకు తన వీడియో తెగ నచ్చేసిందని, రోజూ మెసేజులు పెట్టేవారని, బాగా చేశావని మెచ్చుకున్నారని చెప్పింది. మీ కోసం ఇక్కడ అభిమాన సంఘాలు ఉన్నాయని వాళ్లు చెబుతుంటే నమ్మలేకపోయేదాన్నని ప్రియా వారియర్ పేర్కొంది. (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) -
బ్రో నైజాం రైట్స్ క్లోజ్.. ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన నిర్మాతలు
పవన్ కల్యాణ్ - మెగా హీరో సాయితేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కుల పంచాయతీకి శుభం కార్డు పడింది. నైజాం హక్కులను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ తీసుకుంది. పీపుల్స్ మీడియా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఇవ్వగా సముద్రఖని దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: సినిమాల్లోకి జూ.ఎన్టీఆర్ కుమారుడు.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే..?) ఈ చిత్రాన్ని నైజాం ఏరియా కోసం రూ.32 కోట్ల నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ప్రాతిపదికన మైత్రి వారు కొన్నారని తెలుస్తోంది. ఇదే నిజం అయితే.. అదనంగా జీఎస్టీ ఉంటుంది కాబట్టి నైజాంలో బ్రో సినిమా నుంచి మైత్రీ డిస్ట్రిబ్యూటర్ సంస్థకు రూ. 38 కోట్ల వరకు షేర్ రావాల్సి వుంటుంది. ఈమేరకు వస్తేనే సేఫ్ జోన్లో ఉంటారు.. లేదంటే దిల్ రాజు అంచనాలే నిజం అవుతాయి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు 'బ్రో'ని కొనేందుకు ముందుకు రాలేదు. ఆయన సుమారు రూ. 30 కోట్ల వరకు డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేశారని టాక్. నైజాం హక్కులను రూ. 35 కోట్లకు ఇవ్వాలని పీపుల్స్ మీడియా ప్రయత్నించినా ఉపయోగం లేదు. చివరకు రూ.32 కోట్లతో మైత్రి వారు డీల్ క్లోజ్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. (ఇదీ చదవండి: దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..) ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఈ నెల 28న థియేటర్లలోకి బ్రో సినిమా వస్తోంది. బ్రో మూవీ రన్ టైం విషయంలోనూ కొంతమేరకు నిరాశే కానుంది. ఈ సినిమా కేవలం 130 నిమిషాలు రన్ టైం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే నిజం అయితే పవన్ ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఎదురైనట్లే. అంటే కేవలం రెండు గంటల పది నిమిషాలతో మాత్రమే బ్రో రానున్నాడు. స్టార్ హీరోల సినిమా అంటేనే రెండున్నర గంటలకు పైగానే నిడివి ఉండేలా ప్లాన్ చేస్తారు డైరెక్టర్లు.. అలాంటిది మల్టీస్టారర్ సినిమాకు ఇలా తక్కువ రన్ టైమ్ ఉంటే మూవీపై ఎఫెక్ట్ చూపుతుందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏదేమైనా జులై 28న అసలైన బొమ్మ ఎవరికి కనిపిస్తుందో చూడాలి. -
పవన్ 'బ్రో' విషయంలో సీరియస్ అయిన థమన్..!
టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ మధ్యకాలంలో భారీగానే నెటిజన్ల నుంచి నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ఆయన నుంచి వస్తున్న మ్యూజిక్‌ను తక్కువ చేస్తూ పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్‌కల్యాణ్- సాయిధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న 'బ్రో' సినిమాలోని 'మార్కేండయ' పాట విషయంలో కూడా ఆయనకు మాటల పడటం తప్పలేదు. ఈ సాంగ్‌లో మ్యూజిక్ అంతగా ఆకట్టుకోలేదని థమన్పై ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్లు చేశారు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్ చీప్ ట్రిక్స్.. ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్) ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇలా స్పందించారు. ''బ్రో ' సినిమా కథ చాలా ప్రత్యేకమైనది. అన్ని సినిమాల్లా కాదు. అందుకే పరిధి మేరకు సంగీతం అందించాను. కానీ అది కొందరికి నచ్చింది.. మరికొందరికి నచ్చలేదు. అంతగా భారీ అంచనాలు ఫ్యాన్స్ పెట్టుకుంటే ఎలా? పెద్ద పాటలు చేయాలని నాకూ ఉంటుంది. కానీ కథలో ఆ అవకాశం ఉండాలి కదా?' అని తమన్ అసహనాన్ని వ్యక్తపరిచారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్) కొన్ని సినిమాలకు కథకు తగ్గట్టే పాటలు ఇవ్వాలని ఆయన చెప్పారు. అన్ని సినిమాల్లోనూ మాస్ పాటలను పెట్టలేమని చెప్పుకొచ్చారు. 'మార్కండేయ' పాటను ఒక ప్రొవెర్బ్ రూపంలోనే చెప్పాలి. ఇవన్నీ భారీగా అంచనాలు పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు.. దానిని ఒక ఐటెమ్ సాంగ్లా చేయలేమన్నారు. కథ ఏం కోరుకుందో సినిమాలో కూడా అదే ఇచ్చానని థమన్ చెప్పుకొచ్చారు. పి.సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమా జులై 28న విడదల కానుంది. -
ఏంటి ‘బ్రో’.. బేరం కుదర్లేదటగా!
పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్ ఎంతో హడావుడి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. దానికి రెండు కారణాలు.. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలన్నీ రీమేక్‌లు కావడం. గతంలో నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం. అందుకే పవన్ సినిమాలను ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన సినిమాలకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా సరిగా కావడం లేదు. తాజాగా పవన్ నటించిన ‘బ్రో’ని కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఈ చిత్రానికి నైజాం నుంచి దాదాపు రూ.35 కోట్లు నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ రాబట్టాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇది పవన్ గత చిత్రం భీమ్లా నాయక్ కంటే రెండు కోట్లు ఎక్కువనే చెప్పాలి. నైజాంలో ఎంతో పట్టున్న దిల్ రాజు ఇంత భారీ ధరకు ‘బ్రో’ని కొనేందుకు విముఖత చూపిస్తున్నారట. అసలే ‘బ్రో’ మూవీ రెండేళ్ల క్రితం తమిళంలో హిట్ అయిన `వినోదయ సీతం` చిత్రానికి తెలుగు రీమేక్. ఈ మధ్యకాలంలో రీమేక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టడం లేదు. (చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అందుకే దిల్‌రాజు ‘బ్రో’ విషయంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారట. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే పవన్ కల్యాణ్‌కి నైజాంలో మార్కెట్ పెరగడం లేదు. ఈ విషయంలో కూడా దిల్‌రాజు భయపడుతున్నారట. సినిమా తన చేతుల్లో నుంచి పోయినా పర్లేదు కానీ అంత భారీ మొత్తానికి కొని, కోట్లలో నష్టపోవడం ఎందుకనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ దిల్ రాజు ముందుకు రాకపోతే మైత్రీ మూవీస్ దగ్గర డిస్ట్రిబ్యూషన్ పెట్టాలనే ‘బ్రో’ నిర్మాత భావిస్తున్నారట. 'బ్రో' సినిమా విషయానికొస్తే.. రెండేళ్ల క్రితం సముద్రఖని దర్శకత్వం వహించిన `వినోదయ సీతం’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. -
ఐదుగురు ‘మెగా’ హీరోలు.. 30 రోజులు.. 4 సినిమాలు
ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ‘బ్రో’ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్ సినిమా రాబోతుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్ ఇది. మోహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న లీజ్ కాబోతుంది. ఆదికేశవ భోళా శంకర్ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్ కెరీర్లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్. ‘గాండీధారి అర్జున’ ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు. -
చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!
వేసవితో పాటు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్‌గా ఉంది. దాదాపు వచ్చినవన్నీ చిన్న సినిమాలు, వాటిలోనూ హిట్ కొట్టినవి తక్కువే. ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలు పెద్దగా లేవు. మొన్నటివరకు పరిస్థితి ఇది. కానీ రాబోయే కొన్ని నెలలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా ఉండదు. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో ఓ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'మిస్ శెట్టి' రిలీజ్ ఫిక్స్ అనుష్క శెట్టి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఇదే. కొన్నాళ్ల ముందు టీజర్ విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) మెగా బ్రదర్స్‌తో పోటీ అనుష్క 'మిస్ శెట్టి' సినిమా సోలో రిలీజ్. కానీ దీనికి వారం ముందే అంటే జూలై 28న పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ 'బ్రో' థియేటర్లలోకి వస్తుంది. దీనికి వారం తర్వాత అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' థియేటర్లలోకి వస్తుంది. అటు చిరు ఇటు పవన్ మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఫైట్ ఆసక్తి రేపుతోంది. అనుష్కకే ప్లస్ చిరు, పవన్ సినిమాలతో పోలిస్తే అనుష్క మూవీకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఎందుకంటే 'బ్రో'.. వినోదయ సీతం రీమేక్, 'భోళా శంకర్'.. వేదాళం చిత్రానికి రీమేక్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మాత్రం ఒరిజినల్ కథతోనే తీశారు. అలానే కామెడీని నమ్ముకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ సినిమా హిట్ అవుతుందా అనే ఒకటే టెన్షన్. ఒకవేళ మూడు సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇంకా ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఏం జరుగుతుందో? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) (ఇదీ చదవండి: చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!) -
ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!
పవన్ 'బ్రో' సినిమా.. టీజర్ తాజాగా రిలీజైన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు తేజ్ కూడా ఇందులో నటిస్తున్నాడు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించాడు. అంతా బాగుంది కానీ ఈ టీజర్ విషయంపై నెట్టింట్లో ట్రోల్ కూడా చేస్తున్నారు. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) అదేంటంటే.. 'బ్రో' టీజర్లో పూజా హెగ్డే గురించి. టీజర్ ప్రారంభంలో ఓ కమర్షియల్ యాడ్‌లో పూజా హెగ్డే కనిపిస్తుంది. ఆమెను యాడ్ చేయడానికే.. టీజర్‌ను లేట్‌గా రిలీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో పలువురు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఈ టీజర్లో పెట్టడానికేనా .. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి పూజను తీసేశావ్ అంటూ త్రివిక్రమ్‌పై సెట్టైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌మీడియా అంతా ఇదే చర్చ జరుగుతుంది. పూజా లేకుండా త్రివిక్రమ్ సినిమాలు అస్సలు చేయలేరని, ఎక్కడో చోట ఆమె ఉండాల్సిందే అంటూ వారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆయన అభిమానులు మాత్రం అసలే త్రివిక్రమ్‌కు పూజా లక్కీ హీరోయిన్ అంటూనే ఇదేం ట్రోలింగ్ బ్రో.. ఇకనైనా ఆపేయండని సోషల్‌మీడియాలో కోరుతున్నారు. (ఇదీ చదవండి: శృంగారం గురించి బోల్డ్ కామెంట్ చేసిన సీతారామం బ్యూటీ) -
పవన్ కల్యాణ్‌కు జ్వరమా? ఇది నిజమా?
పవన్ కల్యాణ్‌కు జ్వరం వచ్చింది. ఏకంగా 102 డిగ్రీల టెంపరేచర్ ఉంది.. అందుకే బస్సు యాత్ర వాయిదా.. ఇదీ నిన్నటి నుంచి జనసేన నాయకులు చేస్తోన్న ప్రచారం. పార్టీ కార్యకర్తలు కూడా ఇదే నమ్మారు. నిజంగానే తమ నాయకుడు అస్వస్థతకు గురయ్యారని, త్వరగా కోలుకొని బస్సుయాత్రకు రావాలని కోరుకున్నారు. కానీ తాజాగా ఓ ఫోటో చూసి మాత్రం అంతా బిత్తరపోయారు. ఇదే జ్వరమా? ఆ సాకుతో ఆడుతున్న పొలిటికల్ డ్రామానా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులుగా వారాహి వాహనంలో యాత్ర చేస్తోన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయినట్టు జనసేన నేతలు చెప్పుకొచ్చారు. మంగళవారం నుంచి ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని ప్రకటించారు. ఆ కారణంగానే రెండు రోజుల పాటు బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చి భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాల్ లో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలిపారు. కట్ చేస్తే.. హుషారుగా సినిమాకు డబ్బింగ్ చెప్తూ కనిపించాడు పవన్ కల్యాణ్. భీమవరంలోని పార్టీ కార్యాలయంలోనే తాను నటించిన తాజా చిత్రం ‘బ్రో’ టీజర్ డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సముద్రఖని తెలియజేస్తూ ట్వీట్ చేయడంలో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జ్వరం సాకుతో పవన్ కల్యాణ్ పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాడని పలువురు విమర్శిస్తున్నారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేక సాకులు చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు. డబ్బింగ్ కోసమే బస్సు యాత్రకు బ్రేక్ ఇచ్చాడని, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పలేక జ్వరమంటూ పవన్ డ్రామాలాడుతున్నారని కొంతమంది నెటిజన్స్ విమర్శిస్తున్నారు. OUR #BRO ON FIRE 🔥 MODE💪💪💪💪💪 pic.twitter.com/JPQSEordTk — P.samuthirakani (@thondankani) June 28, 2023 పవన్ డబ్బింగ్ చెబుతున్న ఫోటోలను షేర్ చేస్తూ ‘ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి బ్రో మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ నెల 29న బ్రో మూవీ టీజర్ విడుదల కావాల్సి ఉంది. కానీ టీజర్‌కు పవన్ డబ్బింగ్ బకాయి ఉంది. ఆ బకాయిని ఈ రోజు తీర్చుకున్నాడు. అయితే జ్వరం సాకుతో బస్సు యాత్రని ఆపి..డబ్బింగ్ చెప్పడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యం బాలేదు అని సైనిక్స్ కి చెప్పి BRO మూవీ కి సముద్రఖని తో కలిసి డబ్బింగ్ పూర్తి చేస్తున్న కళ్యాణ్ బాబు..ఇదీ రాజకీయాల్లో ఇతని సంకల్పం pic.twitter.com/gynKPio2ho — Amar Amar (@amarballa2) June 28, 2023 It's fun-filled entertainer 😂❤️#PawanKalyan enjoyed the teaser while in dubbing session it seems #BroTeaser | #BroTheAvatar pic.twitter.com/fxw3t7tANq — Twood VIP™ (@Twood_VIP) June 28, 2023