సాక్షి, పల్నాడు: రెండు నావల మీద ప్రయాణం కొనసాగిస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మధ్యకాలంలో తన సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. అవసరం ఉన్నాలేకున్నా.. సందర్భం కాకున్నా కొన్ని సీన్లలో ‘అక్కడ స్పేస్ తీసుకుని మరీ’ డైలాగులు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందుకుగానూ ప్రాసలు-పంచులనే నమ్ముకున్న త్రివిక్రమ్ లాంటి సోకాల్డ్ రైటర్ సేవలను ఉపయోగించుకుంటున్నాడు కూడా.
ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలోనూ ఫ్యాన్ మూమెంట్ పేరిట నింపిన అడ్డగోలు సరుకు విషయంలోనూ.. డోసు ఎక్కువైందనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. బ్రోలో ఓ పేరడీ సీన్ ద్వారా పొలిటికల్‌గానూ ఇప్పుడు కౌంటర్ ఎదుర్కొంటున్నాడు పవన్.
ఈ ఏడాది తన నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేసి అదరగొట్టారు. అయితే ఆ సీక్వెన్స్‌ను బ్రో సినిమాలో పేరడీ పేరిట చూపించారు. లైంగిక వేధింపులతో టీటీడీ పదవి.. పరువూ రెండూ పొగొట్టుకుని మెగా కాంపౌండ్ పంచన చేరాడు నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ.
అతనిపై బ్రో సినిమాలో ఆ సందర్భాన్ని ‘శ్యాంబాబు’ క్యారెక్టర్ పెట్టి చిత్రీరించారు. అయితే దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ జనసేనాని గూబ గుయ్యిమనేట్లు సమాధానం ఇచ్చారాయన. పైగా నేరుగా పవన్ కల్యాణ్‌నే ట్యాగ్ చేశారాయన.
గెలిచినోడి డాన్స్ సంక్రాంతి !
— Ambati Rambabu (@AmbatiRambabu) July 29, 2023
ఓడినోడి డాన్స్ కాళరాత్రి !@PawanKalyan
నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం
బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానూ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. విజయవాడలో పోలవరంపై ప్రజంటేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా. పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్‌నా?. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడు అంటూ సెటైర్లు గుప్పించారాయన.
Comments
Please login to add a commentAdd a comment