parody
-
యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై కేసులో ట్విస్టు
ముంబై: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై Dhruv Rathee మహారాష్ట్ర సైబర్ పోలీసులు నమోదు చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన పేరిట ఉన్న ఆ అకౌంట్ పేరడీదని, దానితో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు అని పోలీసులు గుర్తించారు. దీంతో అకౌంట్ ఎవరది అనేది ధృవీకరణ చేసుకోవాల్సి ఉందని పోలీసులు అంటుఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి.. యూపీఎస్సీ పరీక్షకు హాజరవ్వకుండానే పాసయ్యినట్లు సంబంధిత ‘ఎక్స్’ ఖాతాలో తప్పుడు సమాచారం పోస్టు చేసినట్లు సైబర్ విభాగం వెల్లడించింది. బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపింది. అయితే తొలుత అది ధ్రువ్ రాఠీ ఖాతా అనుకున్నారంతా. అయితే ఆ ‘ఎక్స్’ అకౌంట్ బయోలో మాత్రం ‘‘ఇది ఫ్యాన్, పేరడీ ఖాతా. ధ్రువ్ రాఠీ అసలైన అకౌంట్‌తో దీనికి ఎటువంటి సంబంధం లేదు’’ అని రాసి ఉంది. దీంతో పోలీసులు ఆ అంశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. మరోవైపు ఆ ఖాతా నుంచి శనివారం మరో ట్వీట్ పోస్ట్ అయ్యింది. ‘‘సైబర్ విభాగం సూచనల మేరకు సంబంధిత పోస్టులు, వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను. వాస్తవాల గురించి తెలియక వేరొకరి ట్వీట్లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు’’ అనే సందేశం ఉంది.As directed by @MahaCyber1, I have deleted all my posts and comments on Anjali Birla, I will like to apologize as I was unaware about the facts and copied someone else' tweets and shared it.🙏🙏 pic.twitter.com/Lbr3c9oGZV— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) July 13, 2024 -
కిల్లర్ ఫీచర్స్‌తో టెస్లా ఫోన్: డైరెక్ట్ మార్స్ నుంచి కాల్స్..?
TeslaPhone: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయనున్నారు అంటూ ఒక వార్త వైరల్‌గా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కిల్లర్ ఫీచర్స్‌తో కొత్త మొబైల్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు మస్క్ (పేరడీ) పేరుతో ఉన్న ట్విటర్ ఖాతాలో టెస్లా ఫోను ఫోటోను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు చాలామందిఆశ్చర్యంలో మునిగి పోయారు. ప్రశ్నల వర్షం కరిపించడంతో ఈ ట్వీట్ సంచలనంగా మారింది. వెనుక టెస్లా పేరుతో, మోటాలిక్ లుక్‌లో ఆకర్షణీయంగా ఉండటం మరింత ఆసక్తికర చర్చకు దారి తీసింది. టెస్లా ఫోన్ వినియోగానికి ఆసక్తిగా ఉన్నారా అంటూ యూజర్లను ప్రశ్నించడంతో ముఖ్యంగా టెస్లా ఫోన్ పిక్ చూసిన కొంతమంది ట్వీపుల్ ప్రశ్నల, సందేహాలు వ్యక్తం చేశారు. నెలకు 100 డాలర్లతో స్టార్ లింక్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినియోగించే విధంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తే తాను ఆసక్తిగా ఉన్నట్లు ఒక అభిమాని ట్వీట్ చేశారు. మార్స్(అంగారక) గ్రహం నుంచి కూడా ఉపయోగించుకోవచ్చని మస్క్ తెలిపారు. అంతేకాదు ఐఫోన్ 12 మినీ కంటే మెరుగ్గా ఉంటుందని హామి ఇవ్వడం గమనార్హం. సూపర్ స్టన్నింగ్ ఫోన్ ఫోటోతోపాటు, ఇందులో ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటుందనడంతో అందరూ తప్పులో కాలేశారు. ఆనక ఇది నకిలీ(పేరడీ) ఖాతా అని తెలిసి ‘డామిట్’ అనుకున్నారు. ట్విటర్ ఐకానిక్ బర్డ్ లోగోను మార్చి 'X' గా మార్చి మస్క్ అందర్నీ ఆశ్చర్యపరిచ్చారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎక్స్‌పై తనకున్న మోజును చాటు కున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెస్లా ఫోన్ అనగానే మస్క్ (పేరడీ) పోస్ట్ నెట్టింట సంచలనంగా మారింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు పెను సంచలనంగామారుతున్నాయి. ముఖ్యంగా ఏఐ ఎంట్రీ తరువాత ఈ ప్రమాదం మరింత పెరిగింది. అందుకే సోషల్‌మీడియాలో ప్రతీ అంశానికి నిశిత పరిశీలన, ఫ్యాక్ట్‌చెక్ అనేది చాలా కీలకం. Would you use the Tesla Phone? X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2 — Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023 -
పవన్ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్
సాక్షి, పల్నాడు: రెండు నావల మీద ప్రయాణం కొనసాగిస్తున్న పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈ మధ్యకాలంలో తన సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. అవసరం ఉన్నాలేకున్నా.. సందర్భం కాకున్నా కొన్ని సీన్లలో ‘అక్కడ స్పేస్ తీసుకుని మరీ’ డైలాగులు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందుకుగానూ ప్రాసలు-పంచులనే నమ్ముకున్న త్రివిక్రమ్ లాంటి సోకాల్డ్ రైటర్ సేవలను ఉపయోగించుకుంటున్నాడు కూడా. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన బ్రో సినిమాలోనూ ఫ్యాన్ మూమెంట్ పేరిట నింపిన అడ్డగోలు సరుకు విషయంలోనూ.. డోసు ఎక్కువైందనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. బ్రోలో ఓ పేరడీ సీన్ ద్వారా పొలిటికల్‌గానూ ఇప్పుడు కౌంటర్ ఎదుర్కొంటున్నాడు పవన్. ఈ ఏడాది తన నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేసి అదరగొట్టారు. అయితే ఆ సీక్వెన్స్‌ను బ్రో సినిమాలో పేరడీ పేరిట చూపించారు. లైంగిక వేధింపులతో టీటీడీ పదవి.. పరువూ రెండూ పొగొట్టుకుని మెగా కాంపౌండ్ పంచన చేరాడు నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ. అతనిపై బ్రో సినిమాలో ఆ సందర్భాన్ని ‘శ్యాంబాబు’ క్యారెక్టర్ పెట్టి చిత్రీరించారు. అయితే దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ట్విటర్ వేదికగా చురకలు అంటించారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ జనసేనాని గూబ గుయ్యిమనేట్లు సమాధానం ఇచ్చారాయన. పైగా నేరుగా పవన్ కల్యాణ్‌నే ట్యాగ్ చేశారాయన. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !@PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) July 29, 2023 నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానూ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. విజయవాడలో పోలవరంపై ప్రజంటేషన్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘పవన్ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా. పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్ సింక్ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్ మాస్టర్నా?. అసలు రాజకీయాలకు పవన్ సింక్ అవ్వడు అంటూ సెటైర్లు గుప్పించారాయన. -
ట్విటర్లో ఇక అలాంటి వేషాలు కుదరదు
ట్విట్టర్ (ట్విటర్) కొత్త సీఈవో ఎలన్ మస్క్ సంస్కరణల్లో భాగంగా .. యూజర్లకు మరో ఝలక్ ఇచ్చారు. ప్రముఖుల, పాపులర్ పేర్లతో అకౌంట్లు క్రియేట్ చేసి.. సరదా కంటెంట్ పోస్ట్ చేసేవాళ్లను నియంత్రించాలని నిర్ణయించారు. పేరడీ అని లేబుల్ లేకుండా.. కొనసాగే అకౌంట్లపై శాశ్వతంగా వేటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వరుసగా చేసిన ట్వీట్లలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ట్విటర్లో కొందరు ఫన్నీ కంటెంట్ క్రియేషన్ పేరిట ప్రముఖలు, పాపులర్ పేర్లను ఉపయోగించి పేరడీ అకౌంట్లతో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై వాళ్లు పేరడీ అని ట్విటర్ హ్యాండిల్లో స్పష్టంగా పేర్కొనాలి. లేకుంటే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండానే ఆ ఖాతాలను శాశ్వతంగా తొలగిస్తారు. గతంలో ముందుగా హెచ్చరించిన తర్వాతే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై పేరడీరాయుళ్ల వేషాలు కుదరవని పరోక్షంగా స్పష్టం చేశారు ఎలన్ మస్క్. Going forward, any Twitter handles engaging in impersonation without clearly specifying “parody” will be permanently suspended — Elon Musk (@elonmusk) November 6, 2022 అకౌంట్ సైనప్ అయ్యే సమయంలోనే ఈ మేరకు ఇకపై షరతుల్లో ఆ విషయం స్పష్టం చేయనుంది ట్విటర్. ఇంతకు ముందులా వార్నింగ్ ఇవ్వకుండానే ఖాతాపై వేటు ఉంటుందని మస్క్ మరో ట్వీట్లో తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎలన్ మస్క్ పేరిట అదీ వెరిఫైడ్ మార్క్‌తో ఓ ప్రొఫైల్ నుంచి భోజ్‌పురి పదాలతో ట్వీట్ విపరీతంగా వైరల్ అయ్యింది. అది పేరడీ అకౌంట్ కావడంతో ట్విటర్ దానిని తొలగించింది. Any name change at all will cause temporary loss of verified checkmark — Elon Musk (@elonmusk) November 6, 2022 పేరడీ నిర్ణయం మాత్రమే కాదు.. పేరులో ఏదైనా మార్పు గనుక జరిగినా.. నష్టం తప్పదని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ‘‘ఏదైనా పేరు మార్పు తాత్కాలికంగా ధృవీకరించబడిన చెక్‌మార్క్‌ను కోల్పోతుంది’’ అని పేర్కొన్నారాయన. ఇక ట్విటర్లో నిషేధిత ఖాతాలు పునరుద్ధరణ పైనా ఎలన్ మస్క్ గతవారం ఒక స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఖాతాలు తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు ఒక పద్దతి ఉంటుందని, ట్విటర్ సైట్లో అది పూర్తి అయ్యాకే సదరు ఖాతా పునరుద్ధరణ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. Widespread verification will democratize journalism & empower the voice of the people — Elon Musk (@elonmusk) November 6, 2022 ఇక విస్తృత ధృవీకరణ ద్వారా జర్నలిజాన్ని ప్రజాస్వామ్యం చేస్తుందని, ప్రజల గొంతును శక్తివంతం చేస్తుంది ఇదీ చదవండి: హిందూ ప్రధానిగా గర్విస్తున్నా -
ట్రంప్‌ని కూడా ఇలానే పంపాల్సి వస్తుందేమో..
వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్ని అమెరికా నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అధ్యక్ష పీఠం అధిరోహించడానికి గాను 270 ఓట్లు అవసరముండగా.. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ 264 ఓట్లు సాధించి గెలుపు దిశగా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ప్రచారం మొదలైన నాటి నుంచి ట్రంప్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఓడిపోతే దేశం విడిచివెళ్లిపోతాను’.. ‘ఓడిపోయినా వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోను’ వంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే ట్రంప్ ఓటమి ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓ అమెరికన్ జర్నలిస్ట్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చూసిన వారంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో మీరు చూడండి. జర్నలిస్ట్ పియర్స్ మోర్గాన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన ఓ పేరడీ వీడియోను ట్వీట్ చేశారు. కామెడీ సెంట్రల్ అనే ఓ చానల్ 2017లో ‘ప్రెసిడెన్షియల్ డిస్ట్రాక్షన్ ఫోటో ఓప్’తో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్‌ని పోలిన ఇద్దరు వ్యక్తులు ఓ స్కూల్‌కి వెళ్లి అక్కడి పిల్లలతో కలిసి ఆడి, పాడి.. చదువుకుని అక్కడే నిద్ర పోతారు. ఇందుకు సంబంధించిన వీడియోలోని ఒక నిమిషం నిడివి ఉన్న భాగాన్ని ప్రస్తుతం మోర్గాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక దీనిలో ట్రంప్‌ని పోలిన వ్యక్తి పిల్లలతో కలిసి స్పేస్ హాప్పర్ బాల్ మీద కూర్చుని ఆడుతుంటాడు. ఇంతలో పెన్స్ వచ్చి బయలుదేరే సమయం ఆసన్నమయ్యింది అని అతడికి తెలియజేస్తాడు. దానికి ట్రంప్‌ని పోలిన వ్యక్తి 'నేను వెళ్లకూడదనుకుంటున్నాను' అంటూ పదే పదే అరుస్తాడు. దాంతో 'పెన్స్' అతనిని బంతి మీద నుంచి కింద పడేసి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. "బంతిని వేరొకరికి ఇవ్వండి" అని ‘పెన్స్’ అంటే "ట్రంప్" ఏడుస్తూ నేలమీద బోర్లా పడి కొట్టుకుంటాడు. ఈ సీన్‌ని మోర్గాన్ ప్రస్తుత అధ్యక్ష ఎన్నికలకి అన్వయించాడు. ‘ఓడిపోయిన్పటికి ట్రంప్ అధ్యక్ష పీఠం వదలడానికి ఇష్టపడడు. దాంతో ఆయనను ఇలానే బయటకు గెంటేయాల్సి వస్తుంది’ అన్నారు. (చదవండి: తలకిందులవుతున్న ట్రంప్ ఆశలు..) ఇక ఈ వీడియో చూసిన నెటిజనులు.. ‘పొట్ట చెక్కలయ్యేలా నవ్వాను. ప్రస్తుత పరిస్థితికి ఈ వీడియో సరిగ్గా సరిపోతుంది’ అని ఒకరు.. ‘సడెన్‌గా చూసి నిజంగా డొనాల్డ్ ట్రంపే అనుకున్నాను. వాస్తవ పరిస్థితి కూడా ఇలానే ఉంది’.. ‘ఫలితాల తర్వాత ట్రంప్ ఇలానే ప్రవర్తిస్తారేమో.. ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో వర్ణించడానికి మాటలు లేవు’ అని మరోకరు అన్నారు. మరోక వ్యక్తి ‘ట్రంప్‌ని కూడా వైట్‌హౌస్ నుంచి ఇలానే బలవంతంగా బయటకు పంపాల్సి వస్తుందేమో’ అంటూ కామెంట్ చేశారు. ఇక మోర్గాన్ ‘ఓడిపోవడం ట్రంప్‌కి ఇష్టముండదు. గత వారం అతడు ఇదే విషయాన్ని చెప్పాడు. ఓడిపోవడం అంటే తనకసహ్యమని.. దాన్ని ఒక పీడకలగా భావిస్తానని తెలిపారు. ఓడిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ అలాంటి పరిస్థితి ఎదురయితే.. హుందాగా ఓటమిని అంగీకరించి తప్పుకోవాలి’ అన్నారు. -
హాలీవుడ్‌కి రష్యన్ పేరడీ!
ఒకప్పుడు తెలుగు సినిమాలలో సెట్టింగ్‌లను అట్టలతో వేసేవారు. వాటికి విఠలాచారి అట్టలమోపు అనే పేరు వచ్చింది. ఐదు దశాబ్దాల తరవాత రష్యన్లు ఇప్పుడు అటువంటి అట్టలమోపులు చేస్తున్నారు! హై బడ్జెట్లో నిర్మితమైన హాలీవుడ్ చిత్రాలను లో బడ్జెట్‌తో ఇంట్లో దొరికే వస్తువులతో పేరడీ సినిమాలుగా తీస్తోంది అక్కడి ఒక నిర్మాణ సంస్థ. ‘టైటానిక్’ లాంటి ఆస్కార్ అవార్డ్ చిత్రాలను పెద్ద బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు. అయితే స్టూడియో 188 అనే ఒక రష్యన్ గ్రూప్ తక్కువ ఖర్చుతో ఆ సినిమాలను రీ మేక్ చేస్తోంది. నమ్మశక్యంగా లేదా! ఒక్కసారి యూ ట్యూబ్ తెరిచి చూడండి. మీకే అర్థమవుతుంది. అది కూడా ఎలా నిర్మించారో తెలుసా? రకరకాల వస్త్రాలు, పట్టా కత్తి, సలాడ్ ప్లేటు, కంప్యూటర్ కీ బోర్డులను ఉపయోగించారు. మాంస ఖండంతో షిప్ ఫన్నెల్ను తయారుచేశారు. టైటానిక్ చిత్రంలో జాక్, రోజ్లు షిప్ డెక్ దగ్గర నిలబడే సన్నివేశాన్ని పురుషుల లో దుస్తులతో తయారైన ఒక కీ ఇచ్చే బొమ్మతో రూపొందించారు. కెప్టెన్ మీసాలను పేస్టుతో చేశారు. ఇలా అన్నీ పనికిరాని వస్తువులనే ఉపయోగించి ఈ పేరడీ మూవీని తయారుచేశారు. ఇలా తయారైన పేరడీలు, స్పూఫ్‌లు ఇటీవల యూట్యూబ్‌లో అప్లోడ్ అవుతున్నాయి. అవన్నీ స్టూడియో 188 వారు హ్యూమర్ కోసం సృష్టించినవే. వీరి శ్రమ వృథాపోలేదు. టైటానిక్ పేరడీ వీడియోను చాలామంది చూశారు. వీరికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ గ్రూప్ అధినేత ఈవ్జినీ మఖోటిన్ ఈ పేరడీ గురించి, ‘‘మేం లో బడ్జెట్ రీమేక్ ఫార్మాట్లో ఈ పేరడీలు తీసి ఇంటర్నెట్లో జరిగిన పోటీకి పంపాం. అది కూడా డబ్బుల కోసం’ అంటున్నారు. రష్యాలో ఇంతవరకు ఇటువంటì (టైటానిక్) ప్రమాదం జరగలేదు, కనుక రష్యాలో ఇటువంటి ప్రయోగం చేయడం వల్ల రష్యాకు ఎటువంటి ఇబ్బందులు రావని భావిస్తున్నాం’’ అని చమత్కారంగా అంటున్నారు మఖోటిన్. స్టూడియో 188 వారు 2018 నుంచి వారి వీడియోలను యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేయడం ప్రారంభించారు. మొట్టమొదట ‘గార్డియన్స్ ఆఫ్ గలాక్సీ’ ట్రైలర్‌ని రష్యన్ డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు. ఆ తరవాత టెర్మినేటర్ 2ను ఇంగ్లీష్ ఆడియోట్రాక్తో పెట్టారు. దీనికి 3,60,000 వ్యూస్ వచ్చాయి. తక్కువ బడ్జెట్లో తీసిన ‘సైలర్ మూన్’ రీమేక్‌కి బాగా హిట్స్ వచ్చాయి. టెర్మినేటర్ వీడియోను రెడ్డిట్ బ్యానర్ మీద పోస్టు చేసినప్పుడు చాలామంది చూశారు. టెర్మినేటర్ 2 లో చేసిన ట్రికీ షాట్స్ వల్ల ఈ వీడియోను ఎక్కువమంది లైక్ చేశారు. ఇందులో ఈవ్జినీ మఖోటిన్ సేవియర్ సైబోర్గ్గా నటించారు. ‘శరీరం మీద రంగు వేసుకుని, చాలా గంటలు నడిచిన సీన్ కోసం నేను చాలా కష్టపడ్డాను’’ అంటారు ఈవ్జినీ మఖోటిన్. స్టూడియో 188లో నలుగురు రష్యన్లు, బెలరూషియన్కి చెందినవారు ఒకరు ఉన్నారు. ఇందులో ముగ్గురు స్క్రీన్ రైటర్లు. ‘‘మేం హాలీవుడ్ చిత్రాల మీదే ఆధారపడతాం. అప్పుడే మాకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. బాగా పాపులర్ అయిన రష్యన్ చిత్రం ఉంటే, దానిని కూడా పేరడీ చేస్తాం’ అంటున్నారు మఖోటిన్. చాలామంది ఈ షూటింగ్ చాలా ఫన్ అనుకుంటారు. కాని ఇందుకు వారు చాలా కష్టపడతామని, మూడు గంటలు షూటింగ్ చేశాక, అలసిపోయి, షూటింగు మానేద్దామనుకున్న సంఘటనలు కూడా ఉన్నాయంటారు మఖోటిన్. అత్యంత సంక్లిష్టమైన ‘ద ఫిఫ్త్ ఎలిమెంట్’, ‘ది మ్యాట్రిక్స్’ చిత్రాలను కూడా వీరు పేరడీ చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దీనిని తెలుగు యువకులు కూడా ప్రయత్నించ వచ్చేమో. ఒక్కసారి ఈ రష్యన్ల స్టూడియో 188 చిత్రాలో చూస్తే అర్థమవుతుందిగా. – డా. వైజయంతి -
పేరడీ టైటిల్‌తో కామెడీ హీరో
యంగ్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. చాలా రోజులుగా ఓ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నారు. అందుకే తనకు ఘనవిజయాన్ని అందించిన పేరడీ జానర్లోనే ఈ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పేరడీ సూత్రాన్నే ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ముందుగా ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్‌ను నిర్ణయించారన్న వార్తలు వినిపించాయి. అయితే చిత్రయూనిట్ ఆ వార్తలను ధృవీకరించలేదు. తాజాగా ఈ సినిమాకు ‘ఫన్ రాజా ఫన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన రన్ రాజా రన్ టైటిల్ స్ఫురించేలా ఉంది ఈ టైటిల్. చిత్ర శుక్లా, నందిని రాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాతో నరేష్ తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి. -
స్పూఫ్ (ఎన్) లాఫ్
పవన్‌కల్యాణ్: క్రూడాయిల్ రేటు పెరిగిందని పెట్రోల్ రేటు పెంచేశారు. ఇప్పుడు క్రూడాయిల్ రేటు తగ్గిందని పెట్రోల్ రేటు ఎంత తగ్గించారత్తా? తగ్గిన క్రూడాయిల్ రేటుకు పెట్రోల్ రేటుకు ఏమైనా సంబంధం ఉందా.? ఇది అన్యాయం కాదా.? ఇది మన అమాయకత్వమా.? లేక వాళ్ల మూర్ఖత్వమా.? ఎందుకు మనం సెలైంట్‌గా ఉండాలి?....... (ఇంకా ఉంది) ♦ బాహుబలి సినిమా కలెక్షన్స్‌పై జూ.ఎన్టీఆర్ జూ. ఎన్టీఆర్: ఆఫ్ట్రాల్ ఏంటి సార్.? ఆఫ్ట్రాల్ కాదు సార్. భారతదేశంలోనే రూ.50 కోట్లు మొదటి రోజే కలెక్ట్ చేసింది సార్. ఆఫ్ట్రాల్ కాద్సార్. 4 వేల థియేటర్లు సార్ .. రూ.130 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సార్.. 10 వేల మంది ఎంప్లాయిస్ సార్. ఒక్క మహిష్మతి రాజ్యాన్ని 20 ఎకరాల్లో 1000 మంది వర్కర్స్, వందల మంది టెక్నీషియన్స్ 200 రోజుల్లో నిర్మించారు సార్. ఆఫ్ట్రాల్ ఏంటి సార్? ..... (ఇంకా ఉంది) పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్ సీన్లో నదియాతో ఆయన డైలాగులు ఇలా ఉండవు కదా? జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి? బాహుబలి గురించి పొగుడ్తూ మాట్లాడిన ఈ సన్నివేశం ఏమిటి?.. తదితర సందేహాలు వస్తున్నాయంటే స్పూఫ్ గురించి మీకు తెలీనట్టే ఎంతో లాఫ్ మిస్ అవుతున్నట్టే. ప్రముఖులను మక్కీకి మక్కీ అనుకరిస్తూ ఆ అనుకరణకు కాస్త తనదైన చతురోక్తులు జోడిస్తే పగలబడేంత నవ్వొస్తుంది. ఆ నవ్వుల మీదనే ఆధారపడిన మిమిక్రీ ఆర్టిస్టులు సెలబ్రిటీలను అనుకరించడం నవ్వించడం, సర్వసాధారణమైన విషయమే. అయితే దీనికి తమదైన సృజన జోడిస్తున్న సరికొత్త ట్రెండ్ స్పూఫ్ ఫిల్మ్ మేకింగ్. తెలుగులో మాత్రమే విరివిగా కనిపిస్తున్న ఈ తరహా స్పూఫ్‌ల తయారీకి నగరం కేంద్రంగా మారింది. - ఎస్.సత్యబాబు అనుకరణలో కొత్త కోణం.. ఒక సినిమాలో బాగా హిట్టయిన సన్నివేశాన్ని తీసుకొని డైలాగులు తిరిగి రాసుకొని అనుకరణ కళాకారులతో దానిని రీరికార్డింగ్ చేయిస్తూ రిలీజ్ చేస్తున్నవే ఈ స్పూఫ్‌లు. ప్రస్తుతం పంచ్ డైలాగులు, సినిమాల్లో హీరోలు, హీరోయిన్లు, విలన్ల మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని సూపర్‌హిట్ సంభాషణలు జనం నోట్లో బాగా నానుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వాటినే వీటికి ఎంచుకుంటున్నారు. వీటి తయారీకి నగరంలో ప్రత్యేకంగా కొన్ని నిర్మాణ సంస్థలే పని చేస్తున్నాయంటే ఆశ్చర్యం కదూ. సూపర్ హిట్... సినిమాల్లోని హిట్ సీన్స్ తీసుకొని తమదైన రీతిలో రూపొందిస్తున్న హాస్య సన్నివేశాలకు వీక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. వీటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. వాట్సప్ ద్వారా కూడా బాగా షేర్ అవుతున్నాయి. దీంతో రూపకర్తలకు మంచి ఆదాయం వస్తోందని సమాచారం. ఇప్పటి వరకు విడుదల చేసిన వాటిలో ‘పెట్రోల్ బంక్‌కి దారేది?’ సూపర్ హిట్ అయింది. లక్షల్లో షేరింగ్‌లు సాధించింది. అలాగే పైరసీ అంశంతో జూ. ఎన్టీఆర్ రాఖీ సినిమా డైలాగ్స్‌కి పేరడీగా చేసిన స్పూఫ్కి మంచి స్పందన వచ్చింది. ‘కేవలం హాస్యంతోనే కాకుండా సందేశాత్మకమైన వాటితో కూడా వీక్షకులను ఆకట్టుకోవచ్చని పైరసీ మీద తీసిన స్పూఫ్‌తో నిరూపితమైంద’ని టాలీవుడ్ ప్రసిద్ధ అనుకరణ కళాకారుడు జితేంద్ర అన్నారు. సిటీలో రూపొందుతున్న చాలా స్పూఫ్లలో వినిపించే అనుకరణ గొంతు ఇతనిదే. ప్రచారంలోనూ.. కార్పొరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రచారానికి వీటిని వినియోగించుకుంటున్నాయి. ఇటీవలే ఒక ప్రముఖ టెలికాం సంస్థ తమ అంతర్గత పంపిణీ కోసం ఏకంగా 15 సినిమా సన్నివేశాలు తీసుకొని పలు రకాల స్పూఫ్ వీడియోలు రూపొందించింది. అదే విధంగా పెద్ద కంపెనీలు తమ ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లు, సమావేశాల్లో వినియోగించేందుకు ఈ తరహా స్పూఫ్‌లు రూపొందిస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ, వ్యాపార దృక్పథంతో తీస్తున్న సంస్థలు మాత్రం అనుమతులు పొంది పక్కాగా రూపొందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న స్పూఫ్ ఫిల్మ్ మేకింగ్ రచయితలు, అనుకరణ కళాకారులకు ఆదాయ మార్గమైంది. సందేశమూ ఉండాలి.. ఇప్పటికే దాదాపు 40 స్పూఫ్లకు నా స్వరాన్ని అందించాను. హీరోలను అనుకరించడమనేది సాధారణ విషయమే అయినా, అప్పటికే ప్రేక్షకుల్లో బాగా ఆదరణ పొందిన సన్నివేశం, సంభాషణల్లో ఇతర అంశానికి సంబంధించిన డైలాగులు జొప్పించి మెప్పించడం అంత సులభం కాదు. ఇలాంటివి కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతతో రూపొందిస్తే అటు ప్రజలకు ఉపయోగంగానూ, ఇటు హీరోల ఇమేజ్ కాపాడే విధంగానూ ఉంటాయనేది నా అభిప్రాయం. - జితేంద్ర, అనుకరణ కళాకారుడు -
పేరడీ కామెడీలో సునామీ
హిట్టయిన పాత్రలు, నిజజీవిత మనుషులను వెండితెరపై అనుకరించడంలో అగ్రశ్రేణి నటుడు - ఎమ్మెస్. ఆ సినిమాలు ఇవాళ్టికీ టీవీ చానళ్ళలో వాటి ఒరిజినల్ హీరోలనూ, గెటప్లనూ గుర్తు చేస్తూ కామెడీ పండిస్తున్నాయి. ‘ఒట్టేసి చెబుతున్నా’లో ఫ్యాక్షన్ చిత్రాల హీరోలకు పేరడీగా రెడ్డినాయుడు (రెనా) పాత్రలో నవ్వించారు. ‘బాద్షా’లో హార్రర్ చిత్రాల రివెంజ్ నాగేశ్వరరావుగా ఒక ప్రముఖ దర్శకుణ్ణి గుర్తుకు తెస్తూ, పదే పదే ట్వీట్లు చేసే పాత్రను పండించారు. ‘దుబాయ్ శీను’లో నటుడు ఫైర్‌స్టార్ సాల్మన్రాజుగా నిన్నటి తరం అగ్రహీరో ఒకరిని అనుకరిస్తూ ఆయన చేసిన గోడ మీద పిడకల స్టెప్పు, డైలాగ్ మాడ్యులేషన్ తెగ నవ్వించాయి. ‘దూకుడు’లో పోషించిన బొక్కా వెంకటరత్నం పాత్ర రిపీట్ ఆడియన్స్‌ను రప్పించింది. దాంతో ఎమ్మెస్ పేరడీ కామెడీలో స్టార్ హీరో అయ్యారు.